14, సెప్టెంబర్ 2020, సోమవారం

పౌరోహితునికి విగ్రహం

పౌరోహితునికి విగ్రహం పెట్టి ఆయన పై గౌరవాన్ని చాటిన పల్నాడు ప్రాంత మాచర్ల మండల కంభంపాడు గ్రామస్తులు": పూర్తి వివరాలకు ఈ కధనం చూడండి.::
మన పల్నాడు ప్రజలు మంచి చేసిన ప్రతి ఒక్కరిని గుండెల్లో దాచుకుంటారు,వారు లేకున్నా వారి జ్ఞాపకాలు తలుచుకుంటారు..సాదారణం గా మనం దేశ నాయకుల విగ్రహాలు,రాజకీయ నాయకులకు విగ్రహాలు, వైద్యులు ఇలాంటి వారి విగ్రహాలు పెట్టి గౌరవించటం చూస్తుంటాము,కాని మన మాచర్ల మండలం కంభంపాడు గ్రామ ప్రధాన బురుజు వీధి,భొడ్రాయి బజార్ లో ఒక పౌరోహితుని కి విగ్రహం పెట్టటం చూసి ఆశ్చర్యపోయి స్తానికులను అడగ్గా ఆయన పేరు జక్కేపల్లి కృష్ణమూర్తి గారు అని, డబ్బు ఆశించక పేద,ధనిక భేదం లేకుండా ఇచ్చిన సంభావణ మాత్రమే తీసుకుని అనేక వందల మంది కి వివాహాలు,ఇళ్ళ లో శుభకార్యాలు జరిపించేవారని తెలిపారు. ఒకప్పుడు బాగా స్తితి పరులని కాలక్రమేణా ఆస్తి కరిగిపోయినను ఏ నాడు డబ్బు కోసం చూడక గ్రామస్తుల కు శుభకార్యాలు జరిపేవారని ఒక్కరూపాయి మరియు ఒక్క కొబ్బరి చిప్ప ఇచ్చినా ఆనందంగా స్వీకరించేవారని అలా ఎంతోమంది పేదలకు మంచి ముహుర్తాలు నిర్ణయించి పెళ్ళిళ్ళు చేసారని తెలిపారు,ఆయన చేతుల మీదుగా వివాహాలు జరిగిన వారు నేడు సుఖ:శాంతులతో ఉన్నారని వారి లో నేను ఒకడని కొరటా వెంకటేశ్వర్లు గారు అనే ఒక 80 సంవత్సరాల వృద్దుడు తెలిపారు. కృష్ణమూర్తి గారు ఏదైనా దొంగిలింపబడిన వస్తువు లేదా తప్పిపోయిన గేదెలు తన అంజనం ద్వారా ఎటు ఉన్నాయో ఖచ్చితంగా తెలిపేవారని తెలిపారు. గ్రామ ప్రజల అందరి తో మర్యాదగా వ్యవహరిస్తూ కుల,మత భేదాలు చూపక అందరిని సమానంగా చూసేవారని అందుకే ఆయన ప్రస్తుతం లేకున్నను తమ గుండెలలోను మరియు విగ్రహం రూపం లో కూడా పదిల పరిచామని తెలిపారు,గ్రామానికి చెందిన కావూరి వంశస్తులు విగ్రహం నిర్మించినట్లు తెలిపారు. పల్నాడు ప్రాంత ప్రజల ఆప్యాయతలకు ఔన్నత్యానికి చిహ్నంగా కృష్ణమూర్తి గారి విగ్రహ నిర్మాణం చెప్పవచ్చు.

కామెంట్‌లు లేవు: