14, సెప్టెంబర్ 2020, సోమవారం

కిరణాగ్నిప్రభ

కిరణాగ్నిప్రభ చండతాండవమహాకేళీ వినోదుండగున్
హరి దేదీప్యత కడ్డుకట్టపడ నాహ్లాదాస్యలై మేఘముల్
కురియన్ క్షోణితలంబునెన్నుదురు సౌఖ్యోత్సాహయైపొంగి జీ
వరమానందమునొందు సంబరముగా వర్షమ్మె పర్వమ్మయెన్.

సింగారమొలికించు శివజటాజూటస్థ
       శివమెత్తి యాటాడు చేష్టయేమొ
అమరులన్ సేవ్యయౌ అమరాపగాదేవి
        భూదేవినేగాంచు మోదమేమొ
యాగాల యజ్ఞాలనాహ్వానమందిన
       వరుణదేవుని రాక వైభవమ్మొ
ఉడికించి ఊరించి ఉల్లాసమందించు
       నీరదమ్ములె చూపు నేర్పులేమొ

చుక్కలై చిన్కులై ధార శోభలంది
అడ్డునదుపులేనట్టి స్వేచ్ఛాయెననగ
శాత్రవులపోరువీరుని శౌర్యమనగ
 వర్షధాటిని ధాత్రియే పరవసించె.

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.
[14/09, 9:39 am] +91 89197 29199: నేటివర్షం
౼౼౼౼౼౼
తపియింపగాజేయు తపను తాపమ్మునన్
     సతమతంబడ మాన్పు సాహసమ్మొ
భుగభుగజ్జ్వాలయౌ భూమాతదాహమ్ము
     మురిపెమ్మునన్ దీర్చు పోకడేమొ
పలువిధమ్ముల గ్రంథపారాయణమ్ములన్
      ప్రజలేకమై జేయు ఫలితమేమొ
కరుణాంతరంగుండు వరుణార్ఘ్యదేవుండు
      క్ష్మాకొనర్చు సదుపకారమేమొ

గ్రహములే స్వస్థలము లందు రక్తియేమొ
ఆ మహాలయామావాస్య యాదరమ్మొ
ఉడుకుబాధయే నశియించునుత్సవముగ
వర్ష ధారల న్నెడదలే పల్లవించె.

సోమేశ్వరస్వామి శోభయేగానంగ
       కదలిరానెంచు మేఘాల వలపొ
అభిషేకమంత్రస్వరాదులే చెవిపడ్డ
        వరదు సోమేశ్వరు కరుణఝరియొ
ఏకాహనాదాలె ఇంపుగావిన్పింప
         అచ్చరల్ సల్పు నృత్యమ్ములేమొ
శివశివాయనునట్టి శివభక్తిబృందాల
          ప్రార్థనాహ్లాద సద్రక్తియేమొ

ఉరుము మెరుపుల తోడుగానుల్లసించి
ప్రకృతి పారవశ్యముచెంది భక్తిధార
తడిసి ముద్దయిపోచుండు ధర్మమట్లు
వర్షమాహ ఆనంద సద్వర్షమాయె.

(మాదిపంచారామములలో ఒకటైన గునుపూడిసోమేశ్వరక్షేత్రం. సోమవారం
పౌర్ణమిలలో విశేషోత్సవాలుజరుగుతాయి.ఆదృష్టితో వ్రాయబడినది౼2)

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

కామెంట్‌లు లేవు: