8, అక్టోబర్ 2020, గురువారం

*ధార్మికగీత - 43*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                    

                                  *****

    *శ్లో:- ఆత్మ నామ గురో ర్నామ ౹*

           *నామాతి కృపణస్య చ ౹*

           *శ్రేయస్కామో న గృహ్ణీయాత్ ౹*

           *జ్యేష్ఠా పత్య కళత్రయో: ౹౹*

                                       *****

*భా:- స్వ,పర శ్రేయస్సును, క్షేమమును నిరంతరం కోరుకొనే వారు శ్రేయస్కాములు. అలాంటి వారు 5 గురి విషయంలో పేరుతో పిలువకూడదని శాస్త్రం చెబుతోంది. 1. ఆత్మనామ:- నా పేరు "రమణ" అని చెప్పరాదు. నన్ను "రమణ" అని అంటారండి అని అనాలి. వినమ్రంగా చెప్పాలనేదే సాంప్రదాయం. 2. గురువు:- గురువు గారి విషయంలో కూడ మా గురువుగారిని " విష్ణుశర్మ" అని వ్యవహరిస్తారండి అని అనాలి. భక్తిప్రపత్తులతో చెప్పాలనేది సంస్కృతి. 3. అతి కృపణుడు :- అతి పిసినారి, కుత్సితుడు ఐన వాని పేరు కూడ సూటిగా చెప్పరాదు. వాణ్ణి " శకుని గాడు" అని నిందార్ధంలో చెప్పినా దోషం లేదు. 4. ప్రథమ సంతానాన్ని కూడ అసలు పేరుతో పిలువకూడదు. వ్యవహార నామంతోనే పిలవాలి. 5.కళత్రము:- ప్రియాతి ప్రియమైన "భార్యామణి"ని అసలు పేరుతో పిలువరాదు. అన్యోన్యానురాగానికి, ఆత్మీయతకు , అవినాభావ సాహచర్యానికి సంకేతంగా, మరో ముద్దుపేరుతో పిలుస్తూ, శత వసంతాలు సంసారాన్ని సస్యశ్యామలం చేసుకోవాల్సిందే. నేటి ఆధునిక సమాజంలో ఇవి వాస్తవానికి అమలు జరగడం కష్టమే. అయినా శాస్త్ర, ధర్మ, సంస్కృతి, సనాతన సాంప్రదాయ నిబద్ధత గల వారికి అనుసరణీయము, ఆచరణీయమై శ్రేయోదాయకము, మంగళదాయకము, సకల సంపత్ప్రదాయకము కావాలని మన ఆశ. ఆకాంక్ష. శుభాకాంక్ష.*

                                 *****

                       *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: