8, అక్టోబర్ 2020, గురువారం

*నముచి*



భీష్ముడు " ధర్మనందనా ! నముచిని గురించి వినిపిస్తాను. పూర్వము నముచి అనే రాక్షసుడు ఉండే వాడు. అతడికి ఉన్నసంపద అంతా పోయింది. అయినా అతడు చింతపడక ఏకాంతస్థలంలో సంతోషంగా ఉన్నాడు. అతడి వద్దకు ఇంద్రుడు వచ్చాడు. అతడి వద్దకు ఇంద్రుడు వచ్చి " దానవరాజా ! ఉన్న సంపద పోగొట్టుకుని ఆదరించే వాళ్ళులేక పేదరికంలో మగ్గుతున్నందుకు ఎంత చింతిస్తున్నావో కదా ! " అని అన్నాడు. నముచి " దేవేంద్రా ! పోయిన సంపదకొరకు చింత ఎందుకు చింతపడితే పోగొట్టుకున్నది వస్తుందా విచారించడము నిరర్ధకము కాదా ! అలారాక పోగాచింత, దుఃఖము మిగులుతాయి. ఇదంతా తెలుసు కనుక నేను పోయిన వాటి కొరకు దుఃఖించడం లేదు. దేవేంద్రా ! ముల్లోకాలనూ శాసించే వాడు ఒకడు ఉన్నాడు. నీరు పల్లముకు పారినట్లు మనము కోరుకున్నవన్నీ మన వద్దకు వస్తాయి. అయినా ఇది నాకు జరగవలసినది అందుకే ఇలా జరిగింది అనుకుంటే దిగులు, చింత, సంతోషము ఆనందము ఎందుకు వస్తాయి " అన్నాడు. మనకు ప్రాప్తము లేని దానిని మనము మన పరాక్రమముతోనూ , ధైర్యముతోనూ, వీరత్వముతోనూ, ప్రజ్ఞతోనూ, శౌర్యముతోనూ సాధించ లేము. ఈ విషయము తెలుసుకున్న బుద్ధిమంతుడు ఈ విషయం ఎరిగి లేని దానికొరకు చింతించడు. దేవేంద్రా ! మేలు కీడు అనేవి మనము కోరుకుంటే రావు వద్దంటే పోవు. కనుక వాటి కొరకు ఆరాటపడడం తగదు " అన్నాడు.

కామెంట్‌లు లేవు: