8, అక్టోబర్ 2020, గురువారం

గంగాప్రవాహం


వైకుంఠు పదపద్మ వైభవంబునుదెల్ప

      హరిపాద సంభవ ధరకుజార

శివజటాజూటి కాశ్లేషభాగ్యముచాట

      మందాకినీగంగ మహికిదూక

హిమశైల శృంగాల రమణీయతలదెల్ప

       గంగోత్రిజా గంగ క్ష్మాకుజేర

అంశుమంతునిపౌత్రు నాత్మశక్తిని జూప

       భాగీరథీ గంగ వసుధ పార


భూమి సారవంతముజేయు పొలుపునడల

నిత్యమును కోవెలలగాంచు నియమవతిగ

చారు గంగా ప్రవాహ విస్తార ధార

సార కావ్యానుభావాల సౌధమాయె.


రాయప్రోలు సీతారామశర్మ, భీమవరం.

కామెంట్‌లు లేవు: