8, అక్టోబర్ 2020, గురువారం

*శ్రీ కృష్ణ శతకము


*శతకోటి భానుతేజా!*

*యతులిత సద్గుణగణాఢ్య! యంబుజనాభా!*

*రతినాథజనక! లక్ష్మీ*

*సతిహిత! ననుగావు భక్త! సన్నుత! కృష్ణా!*


నూరుకోట్ల సూర్యుల తేజస్సువంటి తేజస్సు గలవాడా, సమస్త సద్గుణములు కలిగిన గొప్పవాడా, మన్మథునికి తండ్రియైనవాడా, లక్ష్మీదేవికి ఇష్టమైనవాడా, భక్తులచేత కొనియాడిన వాడా, ఓ కృష్ణా! నన్ను కాపాడుము.


*జై శ్రీకృష్ణ*

కామెంట్‌లు లేవు: