8, అక్టోబర్ 2020, గురువారం

శివానందలహరి 56, 57_ వ శ్లోకం

 



శివానందలహరి

56 వ శ్లోకం


" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ":


అవతారిక:


సకల ప్రపంచ స్వరూపుడైన పరమేశ్వరుని శంకరులు స్తుతిస్తున్నారు.


 శ్లోకము :


             నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే

సత్యాయాది కుటుమ్బినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే ।

మాయా సృష్ట జగత్త్రయాయ సకలామ్నాయాన్త సంచారిణే

సాయం తాణ్డవ సంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే ।।56।।



తాత్పర్యము :


శాశ్వతుడునూ , బ్రహ్మ విష్ణు రుద్ర రూపములు గలవాడునూ, త్రిపుర

విజయియూ, కాత్యాయనీ మనోహరుడునూ, సత్యస్వరూపుడునూ,

మునుల మనస్సు లకు గోచరమైన చిత్ స్వరూపుడునూ , మాయవలన 

ముల్లోకములనూ కల్పింౘువాడునూ, వేదాంత వేద్యుడునూ, తాండవ

నృత్యమునందు పరమానందమును పొందువాడునూ, జటాజూటం

గలవాడునూ, మొట్టమొదటి సంసారియూ నైన శివునకు నమస్కారము.

   


            🔱 శివానందా రూపం శివం శివం 🔱


ఈ శ్లోకము ఈశ్వరుని నుతించే ఒక అద్భుత స్తోత్రము. ఈశ్వరుడు నిత్యుడు. 

సత్త్వరజస్తమో గుణ స్వరూపుడు. స్థూల సూక్ష్మ కారణ రూపములైన 

త్రిపురములను ఝయించిన వాడు. పార్వతీ తపః ఫల స్వరూపుడు. ప్రథమ

సంసారి. మునీశ్వరుల మనస్సు లకు గోచరమయ్యే చిత్స్వరూపుడు. మాయతో

మూడు లోకాలనూ సృష్టించే వాడు. వేదాంతముల యందు అనగా ఉపనిషత్తు

లలో సంచరించే వాడు. సాయంకాల నర్తనమునందు తొందర గలవాడు. 

జటాజూటము గలవాడు. ఆయనకు నమస్కారము.

[

 *దత్తభక్తుడు గా ఉండటం ఎన్నో జన్మల అదృష్టం* *శ్రీగురుదత్తాత్రేయస్వామి వారు చాలా మహిమ కలిగిన స్వామివారు. ఆయనను పూజించినవాళ్ళు* *జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తిని దత్తస్వామి ఇస్తారు. దత్తనామం పలకండి. మానవజన్మ ధన్యం చేసుకోండి* 


 *🌹🌻జయగురుదత్తా దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా ! 🙏🙏*   

        

 *🌹🌻దిగంబరా దిగంబరా అవధూతచింతన దిగంబరా !!🙏🙏🙏🙏🙏🙏*

🚩


*మిథిలానగరాన్ని పరిపాలించే జనకునికి రాజర్షి అని బిరుదు. ఆయనను గొప్ప జ్ఞానిగా అందరూ భావించి గౌరవించేవారు. అయితే ఆయనలోని జ్ఞానం ఆయన ముఖంమీద తాండవిస్తూ ఉంటుందా? అందులోనూ ఉదయం నుంచి రాత్రివరకు రకరకాల లౌకిక వ్యవహారాలలో మునిగి తేలే ఒక రాజును జ్ఞానిగా ఎలా భావించడం!.*



*జనకున్ని రాజర్షిగా, జ్ఞానిగా అందరూ ఎందుకంటున్నారో, అందులోని విశేషమేమిటో తేల్చుకుందామను కున్నాడు ఒక సాధువు. నేరుగా జనకుని ఆస్థానానికి వెళ్ళాడు.* 



*జనకుడప్పుడు మంత్రులతో మంతనాలు జరుపుతున్నాడు. ప్రజల బాగోగుల గురించి అడిగి తెలుసుకుంటున్నాడు.కప్పం చెల్లించని సామంత రాజులపై కోపం ప్రకటిస్తున్నాడు.*



*ఎతైన సింహాసనం మీద కూర్చున్న జనకునికి పరిచారకులు అటూ ఇటూ నిలబడి వింజామరలు వీస్తున్నారు. ఒకరు పాదాలు ఒత్తుతున్నారు. ఆయన కిరీటంలో పొదిగిన మణిరత్నాలు జిగేలుమంటున్నాయి. ఎటుచూసినా ఆడంబరమూ, అతిశయమే. సాధువు ఇదంతా గమనిస్తున్నాడు. అతనకీ వరస ఏమీ నచ్చలేదు. ఇతడన్నీ లౌకికవిషయాలే మాట్లాడుతున్నాడు. లౌకికమైన సిరిసంపదలతో తులదూగుతున్నాడు. ఇతడు రాజర్షీ, జ్ఞానీ ఎలా అవుతాడు? ఇతణ్ణి జ్ఞాని అన్నవాళ్ళు పరమ అజ్ఞానులు - అనుకున్నాడు.*



*సాధువు ఆస్థానంలోకి అడుగు పెడుతున్నప్పుడే అతని మీద జనకుని దృష్టి పడింది. మంత్రులతో మాట్లాడుతూనే అతనిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. అతని మనోభావాలను అంతర్దృష్టితో గమనిస్తూనే ఉన్నాడు. సాధువును తన వద్దకు పిలిపించు కున్నాడు. సాధువు వేషంలో ఉన్నావు కానీ, నువ్వు నిజమైన సాధువువి కావు అన్నాడు. సాధువు తెల్లబోయాడు. ఎప్పుడూ ఇతరులలో తప్పు లెంచే స్వభావం నీది. దానితోనే నీ సమయమంతా ఖర్చయిపోతోంది. భగవధ్యానానికి నీకు తీరికేదీ? సాధువు మరింత నివ్వెర పోయాడు. నా దృష్టిలో నువ్వు నేరస్థుడివి. రాజుగా నిన్ను శిక్షించక తప్పదు. నీకు మరణశిక్ష విధిస్తున్నాను. వారం రోజుల్లో నిన్ను ఉరితీస్తారు. సాధువు గజగజ వణికిపోతూ నిలబడ్డాడు.* 



*జనకుడు అలా ప్రకటించిన వెంటనే భటులు సాధువును తమ అదుపులోకి తీసుకున్నారు. చెరసాలకు తరలించారు. అతడికి రోజూ ఉప్పులేని కూరలు, కారం కలిపిన తీపిపదార్థాలు ఆహారంగా పెట్టమని జనకుడు సేవకులను ఆదేశించాడు. అయితే ఆ సాధువు వాటి రుచిని పట్టించుకునే స్థితిలో ఉన్నాడా? కళ్ళు మూసినా తెరచినా అతనికి ఉరికంబమే కనిపిస్తోంది. తన మెడ చుట్టూ ఉరితాడు బిగుసుకుంటున్న దృశ్యమే కళ్ళముందు కదులుతోంది.* 



*కంటిమీద కునుకే కరువైపోయింది. ఆ వారంరోజుల్లోనే అతడు మరణభయంతో, మనోవ్యధతో చిక్కి శల్యమైపోయాడు. ప్రాణాలు కళ్ళల్లోకి వచ్చేశాయి.ఏడవరోజున సాధువును ఉరి తీయడానికి సన్నాహాలు చేయమని జనకుడు ఆదేశించాడు. తను కూడా ఉరి తీసే ప్రదేశానికి వెళ్ళాడు. భటులు చెరోవైపూ చేతులు పట్టుకుని, అతికష్టంమీద అడుగులు వేస్తున్న సాధువును తీసుకొచ్చి జనకుని ముందు నిలబెట్టారు. మృత్యుభయంతో సాధువు స్పృహ కోల్పోయి కుప్ప కూలిపోయాడు.*



*కొద్దిసేపటి తర్వాత స్పృహ వచ్చింది. అప్పుడు జనకుని ఆదేశంపై సేవకులు అతనకి ఉప్పు కలిపిన పాలు ఇచ్చారు. సాధువు ఆ పాలను గడగడ తాగేశాడు. పాలు బాగున్నాయా? పంచదార సరి పోయిందా? అని ప్రశ్నించాడు జనకుడు చిరునవ్వుతో. ఎందుకడుగుతావు మహారాజా! ఈ వారంరోజులుగా పదార్థాల రుచిని గమనించే స్థితిలో ఉన్నానా నేను? నాకు ప్రతిక్షణమూ, ప్రతిచోటా ఉరికంబమే కనిపిస్తోంది, అన్నాడు సాధువు. జ్ఞానబోధకు ఇదే తగిన సమయమనుకున్నాడు జనకుడు.*



*ఈ వారం రోజులూ నువ్వు ఏం చేస్తున్నా, ఏం తింటున్నా, నీ దృష్టి చేస్తున్న వాటిమీద,తింటున్నవాటిమీద లేదు. కేవలం ఉరికంబమే నీకు కనిపించింది. అలాగే నేను రోజూ ఉదయం నుంచి రాత్రివరకూ అనేకమైన లౌకికివిధులు నిర్వర్తిస్తున్నా నా దృష్టి మాత్రం ఎల్లవేళలా పరబ్రహ్మతత్త్వం పైనే లగ్నమై ఉంటుంది.*



 *విశేష ధ్యానంతో నేనాస్థితిని సాధించాను. నేనీ ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అతీతంగా ఉండగలను. నా మనస్థితి ఎటువంటిదో ఇప్పుడైనా అర్థమైందా? ఇక ముందెప్పుడూ ఇతరుల లోపాలను ఎంచే ప్రయత్నం చేయకు. నీ బాగు నువ్వు చూసుకో. ఇతరులలో మంచినే చూడడం నేర్చుకో. తపస్సుతో , ధ్యానంతో పరమసత్యాన్ని తెలుసుకో. ప్రపంచానికి అతీతంగా ఉంటూనే ప్రపంచ క్షేమం కోసం పనిచెయ్యి.* 



*ఇక వెళ్ళు!. సాధువుకు జనకుని ఔన్నత్యం, తన అల్పత్వం అర్థమయ్యాయి. అతనికి శిరసు వంచి నమస్కరించి అక్కడినుంచి నిష్క్రమించాడు.*


🕉🌞🌎🌙🌟🚩



🍁🍁🍁🍁🍁


ద‌స‌రా ఉత్స‌వాల స‌మ‌యమిది. దుర్గ‌మ్మ‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌క్తులు పూజిస్తున్న ప‌విత్ర త‌రుణ‌మిది. ఈ స‌మ‌యంలో ఛండీ హోమం అత్యంత శ‌క్తివంత‌మైన‌ది. ఇది చేస్తే... మాత యొక్క ప్రచండ శక్తి. ఒక్క భూగ్రహమే కాకుండా విశ్వాంతరాళాలని అంటిపెట్టుకునే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆది శక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియా శక్తి, కుండలినీ శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం.

 

లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. ఆదితత్త్వాన్ని స్త్రీమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.

 

🌷చండీ హోమంలో ఉన్న మంత్రాలు ఎంతో శ‌క్తివంత‌మైన‌వి...🌷



చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రాహ్మీ, నందజా, రక్తదంతికా, శాకంబరీ, దుర్గా, భీమా, భ్రామరీ అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు. వారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కనక నిష్ఠగా చేయాల్సి ఉంటుంది.


దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. పూజ, పారాయణ, హోమం. ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు. పారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత (పది వేలు) చండీ యాగం, నియుత (లక్ష) చండీ యాగం, ప్రయుత (పది లక్షలు) చండీ యాగం                   

 

🌷చండీ పారాయణ వలన సమాజానికి జరిగే మేలు:🌷


ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది. కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫల సాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు.

 

వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట. ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, మను చండి(చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది. ఇక, శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరతాయి. లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే నియుత చండి అంటారు. ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు.

 

వీటిలో చండీ హోమం, నవ చండీ, శత చండీ యాగాలను తరచుగా, సహస్ర చండీ యాగాలను అరుదుగా చేస్తుంటారు. అయుత చండీ యాగాలను చేయడం చాలా అరుదు. చండీ యాగాల ఫ‌లితం అనూహ్యంగా ఉంటుంది.


 శ్రీ మాత్రే నమః 🙏


🍁🍁🍁🍁

 *మన కోసం-మంచి మాటలు*


_*దు:ఖం నుండి శాంతి వైపుకు...*_


*విక్రమాదిత్య మహారాజు...* ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది :


 ' నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టివుంటారు.


 కానీ వాళ్ళంతా రాజులు కాలేదు ,


 నేనే ఎందుకయ్యాను ?

 ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది ? 


' మరుసటిరోజు సభ లో పండితులముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు. 


అపుడు ఒక వృద్ధ పండితుడు '' రాజా , ఈ నగరానికి తూర్పున బయటవున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. 


ఆయనను కలవండి. 

జవాబు దొరుకుతుంది ''అన్నాడు. 


రాజు వెళ్ళాడు. అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు


అది చూసి రాజు ఆశ్చర్యపోయి ,...

 తన ప్రశ్న ఆయన ముందు పెడితే....


 ఆయన అన్నాడు : '' ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది.


 అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''


 నిరాశపడినా , 

రాజు రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు. 


రాజు ఆయన్ని చూసినపుడు , ఆ సన్యాసి మట్టి తిం టున్నాడు


రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు.


 కానీ తన ప్రశ్ననైతే అడిగాడు.


 కానీ ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి అక్కడినుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు


 రాజుకూ కోపం వచ్చినా , సన్యాసి కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు. 


వాపసు వెళుతుంటే సన్యాసి రాజుతో ఇలా అంటాడు : '' ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది ,


 అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు, వెంటనే అతన్ని కలవండి.'


 రాజుకంతా గందరగోళంగా వుంటూంది. అయినా అక్కడికెళతాడు. 


చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు. 


అపుడు ఆ అబ్బాయి అన్నాడు


 '' గత జన్మ లో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో దారితప్పివుంటారు. 


ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టుక్రింద ఆగివుంటారు.


 తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి , నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటీవాడు కోపంతో 


*'' నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా ? '' అని కసురుకొంటాడు*


*రెండవ వ్యక్తిని అడిగితే..*

 '' నీకు ఈ రొట్టె ఇస్తే నేను మట్టి తినాల్సిందే ''


 అని వెటకారంగా అంటాడు.


 మూడవ వాడు '' రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ? 


''అని నీచంగా మాట్లాడాడు. 


కానీ నాల్గవ వ్యక్తి మాత్రం '' తాతా , నీవు చాలా నీరసంగా వున్నావు. ఈ రొట్టె తిను , '' అని తాను తినబోతున్న రొట్టెను ఇచ్చేసాడు.


 ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా '' అని అన్నాడు. 


 రాజు దిగ్భ్రాంతి కి లోనయ్యాడు. 


రాజా నీ పుణ్యం వల్ల రాజుగా జన్మించావు. అనవసరమయిన మీమాంసలతో కాలం వృథా చేయక ప్రజలను కన్న తండ్రి వలె పాలించు అని చెప్పి కనులు మూసినాడు...

ఓ మంచిమాట దానం వంటిది...అందరికీ పంచండి...ప్రతిఫలంగా అది పుణ్యాన్ని అందిస్తుంది...*

*ఓ చెడ్డ మాట అప్పులాంటిది...ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది...


#మధురమీనాక్షి #అద్భుత #శబ్దసౌందర్యం

12 వ శతాబ్దంలో నిర్మించిన మధుర మీనాక్షి ఆలయ అందాలు చూడటానికే రెండు కళ్ళు చాలవు అనుకుంటే ఆ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న శబ్ద సౌందర్యం గురించి తెలుసుకుంటే మన పూర్వీకుల, శిల్పుల నైపుణ్యం, దూరదృష్టి, ఆలయ నిర్మాణాల వెనక దాగి ఉన్న రహస్యాలు ఛేదించడానికి మన తరానికి ఉన్న మిడి మిడి జ్ఞానం సరిపోదు అనిపిస్తుంది. ఈ ఆలయ శిల్పులకు, నిర్మాతలకు శిరసా ప్రణామములు 🙏🙏🙏


పురాతన తమిళులు మధురై మీనాక్షి ఆలయంలో సంగీత స్తంభాలను నిర్మించడంలో “శరీరాల కంపనం” సూత్రాలను ఉపయోగించారు. ఈ అద్భుతమైన ఆలయం యొక్క శబ్ద సౌందర్యంపై తమిళనాడులోని ENT నిపుణుల బృందం చేసిన అధ్యయనం ప్రకారం - విభిన్న సంగీత శబ్దాలను పొందటానికి శిల్పులు సరైన రకమైన రాయిని ఎన్నుకుని స్తంభాల పొడవు, వ్యాసాన్ని చాలా తెలివిగా తయారుచేశారు. ఒకే రాయిని ఉపయోగించడం ద్వారా, దాని ఆకారాన్ని తగిన విధంగా మార్చడం ద్వారా వారు దానిని సాధించగలిగారు. మధురై జనరల్ హాస్పిటల్‌లోని ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు ENT ఇన్స్టిట్యూట్ చీఫ్ డాక్టర్ ఎస్ కామేశ్వరన్ నేతృత్వంలోని వైద్య బృందంతో పాటు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సంగీత విద్వాంసులు మరియు ఆడియాలజిస్టులు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఈ పరిశోధన ప్రాజెక్టుకు తమిళనాడు ప్రభుత్వానికి చెందిన హెచ్‌ఆర్‌సిఇ నిధులు సమకూర్చింది. ఈ ఆలయం ‘శబ్ద అద్భుతం’ అని అధ్యయన బృందం అభిప్రాయపడింది. 


ఆలయంలో ఉన్న గర్భాలయంలో శబ్ద స్థాయి 40 డెసిబెల్స్ కి మించదు. ఇది మన గ్రంథాలయాల్లో ఉండే శబ్దంతో ఇది సమానం. అదే కాక ఆలయ కోనేరు, అష్టశక్తి మంటప పరిసరాల్లో కూడా శబ్ద స్థాయి ఇంచుమించు 40 డెసిబుల్స్ మాత్రమే ఉంటుంది. ఈ పరిసరాల శబ్దం ఒక వ్యక్తి దైవత్వాన్ని అనుభూతి చెందడానికి, ధ్యానం చేయదానికి సాధ్యపడుతుంది. సాయంత్రం సందర్శకులు ఎక్కువగా ఉన్న సమయంలో కూడా నమోదు చేయబడిన ధ్వని స్థాయి 70 నుండి 80 డిబి వరకు మాత్రమే ఉంది. విశేషమేమిటంటే, ఆలయంలో ఎక్కడా ప్రతిధ్వని వినిపించదు (zero echo). ప్రతిధ్వని సున్నాగా ఉండటానికి, అదే సమయంలో, మొత్తం శబ్దం నిర్దిష్ట స్థాయి 80 డిబి మించకుండా ఉండటానికి ప్రత్యేకంగా ఈ నిర్మాణం చేశారు.


ఆలయంలోని 1000 స్తంభాల మంటపం (హాల్ ఆఫ్ థౌజండ్ పిల్లర్స్ ) కూడా పరిపూర్ణ శబ్ద సాంకేతికతకు (సౌండ్ ఇంజనీరింగ్) శాస్త్రీయ ఉదాహరణ. ఈ మంటపానికి ప్రస్తుతం 985 స్తంభాలతో చాలా తక్కువ పైకప్పు ఉంది. ప్రతి స్తంభం సగటున 12 అడుగుల ఎత్తు ఉంటుంది. అన్నీ సరిగ్గా ఒకే పరిమాణం, ఒకే ఆకారం మరియు గణితశాస్త్రం ప్రకారం కచ్చితమైన స్థానాల్లో ఉంటాయి. చాలా మంది ఈ ప్రతిధ్వని లేని (ఎకో రెసిస్టెంట్) హాలులో కూర్చుని ఆలయంలోని మొత్తం కార్యకలాపాలను నిశ్శబ్దంగా వినవచ్చు. 


ఈ భారీ ఆలయాన్ని నిర్మించిన శిల్పులకు కచ్చితంగా ధ్వని యొక్క ప్రాథమిక సూత్రాల గురించి తెలిసి ఉండాలి. అపరిష్కృతమైన స్తంభాలపై ఉన్న భారీ చిహ్నాలు, బయటకు వెళ్ళే ద్వారం, చుట్టుపక్కల బహిరంగ ప్రదేశాల కేటాయింపు, అన్నీ ఈ ఆలయంలో శబ్దం స్థాయిని నిర్దేశించేలా నిర్మించారని అధ్యయన బృందం తెలిపింది.


🙏🙏🙏🙏🙏

" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ":


అవతారిక :


ఈ శ్లోకము లో సేవింౘుట యందు తాను నేర్పులేని వాడైనప్పటికీ

తనను తప్పక సంరక్షింప వలెనని‌‍ , శంకరులు, ‍ సహేతుకంగా ఈశ్వరునకు

నివేదింౘు కున్నారు.


 శ్లోకము ॥


నిత్యం స్వోదర పోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా

వ్యర్థం పర్యటనం కరోమి భవతస్సేవాం న జానే విభో ।

మజ్జన్మాన్తర పుణ్యపాక బలతస్త్వం శర్వ సర్వాన్తరః

తిష్ఠస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోఽస్మ్యహమ్ ।।57।।


ప్రభూ ! పశుపతీ ! శివా ! నా కడుపు నింపుకోవడానికి ధనాశచే నిత్యమూ

ధనము గలవారి నందరినీ ఉద్దేశించి వ్యర్థముగా తిరుగుతున్నాను. నీ

సేవను కొంచము కూడా ఎఱుగను కానీ నా పూర్వజన్మ పుణ్య పరివపాక 

ఫలముచే సర్వాంతర్యామివైన నీవు అన్నింటియందూ ఉన్న విధంగానే

 నాయందు కూడా ఉన్నావు. అందుచే నీవు నన్ను ఉపేక్షింౘడానికి వీలు

 లేదు. నేను కూడా నీకు రక్షింపదగిన వాడను అవుతున్నాను.


వివరణ :


ఈ శ్లోకము లో వాడిన సంబోధనలన్నీ సార్థకములు. ఈశ్వరుని "విభో "

అనీ, " శర్వ " అనీ, " పశుపతే " అనీ ఈ శ్లోకము లో సంబోధించారు. 

" విభో" అంటే సర్వవ్యాపకా ! అని అర్థము. ఈశ్వరుడు సర్వవ్యాపకుడై

నందున తనలో కూడా ఉంటాడని అర్థము‌ " పశుపతి " అన్నందున 

పశువునైన తనను రక్షింౘాలని అర్థము. ఇక. " శర్వ " అంటే భక్తుల 

పాపములను ధ్వంసము చేయువాడా ! అని పిలుపు. తన పాపాలను

సైతమూ మన్నించి రక్షింపుమని ప్రార్థన. శంకరులు ధనాశతో అంతటా 

తిరుగుతున్నానని చెప్పారు. " ఆశాయాః యేదాసాః , తే దాసాః సర్వ

లోకస్య ". అని చ్పుతారు. ఆశకు దాసు లయితే , వారు సర్వ లోకానికీ 

దాసులే అవుతారట.


భగవంతుని సేవయొక్క గొప్పతనాన్ని గుర్తించి నట్లయితే, అర్థముగల

వారి సేవ వ్యర్థమని తేట తెల్ల మవుతుంది.


                ". అర్థ మనర్థం భావయ నిత్యం

                   నాస్తి తతః సుఖలేశః సత్యం ". ( భజగోవింద శ్లోకం)


తాత్పర్యము :


ధనము, ఉపద్రవాలను తెచ్చి పెడుతుంది. దానివల్ల కించిత్తు కూడా 

సుఖము ఉండదనే మాట సత్యము " అని శంకరులు భజగోవింద

శ్లోకాలలో చెప్పారు.



      

            🔱 శివానందా రూపం శివం శివం 🔱

కామెంట్‌లు లేవు: