8, అక్టోబర్ 2020, గురువారం

శివామృతలహరి

 శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||

'కలి'కాలమ్మున పాపమెక్కువగుటన్ గౌరీమహాదేవి వ్యా

కులతం జెంది మహోగ్ర రూపమున దృక్కుల్ నేలసారించుటన్

లలితశ్యామల సస్యశోభిత విశాలంబైన విశ్వంబునన్

జెలరేగెన్ విపరీత సంఘటనముల్ శ్రీ సిద్ధలింగేశ్వరా!


భావం;

ఈ కలియుగంలో పాపం పండి పోయినందుకేమో గానీ, ఎల్లప్పుడూ కరుణారస దృక్కులు సారించే అమ్మవారు గౌరీమహా దేవి, నేడు జరుగుతున్న ఘోరాలను చూసి కలతచెంది, కోపంగా దృష్టి సారించి నందువల్లేమో, పచ్చగా కళళలాడుతూ శోభిల్ల వలసిన ఈ భూప్రపంచంలో విపరీత సంఘటనలుజరుగుతున్నాయి.

నువ్వే రక్షించు స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

... సుబ్బు శివకుమార్ చిల్లర. 

కామెంట్‌లు లేవు: