8, అక్టోబర్ 2020, గురువారం

గుణాలు తెలిసినవాడే

 గుణిని గుణజ్ఞో రమతే నాగుణశీలస్య గుణిని పరితోషః

అలిరేతి వనాత్కమలం న దర్దురస్త్వేకవాసోఽపి.



గుణాలు తెలిసినవాడే సద్గుణవంతుని విషయంలో ఆనందం చూపుతాడు. గుణాలు లేనివానికి గుణవంతుని విషయంలో ఆదరం ఉండదు. ఎక్కడో వనంలో ఉన్న తుమ్మెద పద్మం దగ్గరకు వస్తుంది ; ఒకే చోట (చెరువులో) ఉన్నా కప్ప దాని దగ్గరికి వెళ్లదు.


శుభోదయము !

కామెంట్‌లు లేవు: