16, సెప్టెంబర్ 2020, బుధవారం

శివామృతలహరి

    శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||

అవివేకంబను ఆజవంజవ మహా వ్యామోహ జాలమ్మునన్
దవిలెన్ మామక హృచ్ఛకుంతము; నిర్ధంబైన నా జన్మకున్
కవిగానైన ప్రయోజనంబు గులుగన్ గాంక్షించి వర్ణించెదన్
శివతత్త్వంబఖిలార్థ సాధకమగున్ ; శ్రీ సిద్ధలింగేశ్వరా!

భావం;(నాకు తెలిసినంత వరకు)

పక్షి ఎలాగైతే గింజలపైన ఆశ కొద్దీ వచ్చి వాలి వలలో చిక్కుకుంటుందో,
అలాగే నా హృదయమనే పక్షి కూడా,ఏదో తెలియని తనం వల్ల సంసారమనే ఒక పెద్ద మోజు కలిగించే వలలో చిక్కుకున్నది. దానివలన, అర్థం లేకుండా పోయిన నా జన్మను సార్థకం చేసుకోవాలని కోరిక కలిగి,అన్నింటినీ సాధించిపెట్టే శక్తి శివతత్వానికి ఉంది అని ఒక కవిగా,నా పద్యాలలో వర్ణించి ప్రపంచానికి చాటి చెప్తాను స్వామి! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: