16, సెప్టెంబర్ 2020, బుధవారం

శివుని అర్చించడం

ఏ నెలలో..ఏ పూలతో..శివుని అర్చించడం

శివలింగానికి కాని ఒక్క పుష్పముని రోజు సమర్పణ చేస్తే 80 లక్షల కోట్ల సంవత్సరముల వరకు
దుర్గతి సంభవించదు అని వేదవిదులచే చెప్పబడుచున్నది .

ఎవరు అయిన వ్యక్తీ తానూ స్వయముగా
పెంచి పోషించి పూయింపజేసిన చెట్ల యొక్క
పూలతో భక్తీ శ్రద్దలతో శివుని ని పూజించిన
అట్టి వారు శివసాయుజ్యము తప్పక పొందుతారు.

చెట్టు యొక్క పుష్పములు , ఆకులతో శివునికి సమర్పణ చేసిన ఆ చెట్టు కూడా పరమ పదము పొందును.

ఏవ్యక్తీ అయిన ఐదు పుష్పములతో శివుని పూజించినచో అట్టి వారికి పది అశ్వమేధలు చేసిన ఫలితము లభించును.

ఎవరు అయిన ఎనిమిది పుష్పములతో పరమ శివుని పూజ చేసిన వారు కైలాసమునకు వెళ్లుతారు .

శివ పూజ - మాసముల వారి పుష్పములు.

1) చైత్ర మాసము నందు నృత్యము ,
గీతములతో శివుని సేవించాలి ,
దర్బ పూవ్వులతో పూజ చేసిన అట్టి వారికి పలు విధములు అయిన సువర్ణములు లభించును .

2) వైశాఖ మాసము నందు శివునికి ఆవు నెయ్యితో అభిషేకము చేయించి ,, తెల్లని వర్ణము (రంగు) కలిగిన మందార పుష్పములతో పూజ చేసిన వారికి
అశ్వమేధ యాగము చేసినటువంటి ఫలము కలుగును .

3) జేష్ట్య మాసము నందు ఎల్ల వేళలయందు
శివునిని పెరుగుతో అభిషేకించి తామర పువ్వులతో పూజ చేసిన వారికి ఉత్తమ పరమ పదములు పొందును .

4) ఆషాడ మాసము నందు బహుళ చతుర్దశి తిదియ రోజు స్నానము చేసి శుచిగా తయారు అయ్యి
కొంచు అయిన గుగ్గిలము తో ధూపము ఇంట్లోఅంతా దేవుని మందిరములో కూడా వేసి
తొడిమలతో కూడి ఉన్న పుష్పములను మాల చేసి శివునికి వేసి అర్చించిన వారు బ్రహ్మ లోకమును అధిగమించి పరమ పదము పొందుతారు .

5) శ్రావణ మాసము నందు ఒంటి పూట మాత్రమె భోజనము చేసి , గన్నేరు పూలతో శివునిని అర్చించిన వారికి వెయ్యి గోవులను దానము చేసినటువంటి
ఫలము పొందును .

6) భాద్ర పద మాసము నందు ఉత్తరేణి పువ్వులతో
శివుని ని అర్చన చేసిన వారు హంస ద్వజము తో
కూడిన విమానమునండు పుణ్య పదమునకు వెళతారు.

7) అశ్వాయుజ మాసమున శివునికి జిల్లేడు పూలతో పూజించిన వారు మయూర ధ్వజము తో కూడిన విమానము నందు శివ పదమునకు చేరుదురు .

8)కార్తిక మాసము నందు శివునిని క్షీరము తో (పాల ) అభిషేకము చేసి , జాజి పువ్వులతో పూజ చేసిన వారు నిరంజనమైన శివ పదమును దర్సించుదురు.

9) మార్గశిర మాసము నందు పొగడ పూలతో శివునిని పూజించిన వారు శివుడు ఎక్కడ ఉండునో
అక్కడికి చేరుతారు .

10) పుష్య మాసము నందు ఉమ్మెత్త పువ్వులతో శివునికి పూజిస్తారో అట్టివారు పరమ పదముని పొందుతారు .

11) మాఘ మాసము నందు శివునికి బిల్వదళములతో పూజిస్తారో వారు సూర్య - చంద్రులు గల విమానము నందు వెళ్ళెదరు .

12) ఫాల్గుణ మాసము నందు శివునికి సుగంధ జలములతో అభిషేకము చేసి తుమ్మ పువ్వులతో
పూజ చేసిన వారికి ఇంద్రుని అర్ద సింహాసనము పొందుతారు .

ప్రతిదినము శివున్ని ఒక జిల్లేడు పుష్పముతో
పూజించిన వారికి పది సువర్ణ ముద్రికలను దానము చేసినంత ఫలము కలుగును.

కామెంట్‌లు లేవు: