16, సెప్టెంబర్ 2020, బుధవారం

గాయత్రం ఛందం

గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం ... ఇది ఒకటి ... రెండవది ...సర్వవేదేషుయత్పుణ్యం సర్వతీర్థేషుయత్ఫలం తత్ఫలంపురుషమాప్నోతి స్తుత్వాదేవం జనార్దనః ... జనార్దనుని స్తుతిస్తే సర్వ వేదాలు చదివిన ఫలం సర్వ తీర్థాలలో స్నానమాడిన ఫలం అని చెపుతున్నారు.. అయితే స్తుత్వాదేవం అన్నారు.. 
ఆయనను ఎలా స్తుతించాలి ... ఇది ఒక ప్రశ్న..అయితే దీనికి మనకు సమాధానం ఒక ధ్యానశ్లోకంలో కనిపిస్తుంది..
ధ్యేయస్సదాసవితృమండలమధ్యవర్తీ నారాయణసరసిజాసనసన్నివిష్టః
కేయూరవాన్మకరకుండలవాఙ్కిరీటీ హారిహిరణ్మయవపుర్ధృతశంఖచక్రః
 సవితృమండల అంటే సూర్యమండల .. మధ్యవర్తి అంటే మధ్యలో ఉన్న సూర్యనారాయణమూర్తులవారికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల, భానుమండలమధ్యస్థ అయిన శ్రీ లలితా అమ్మవారికి కూ డా అర్ఘ్యం ఇచ్చినట్లు అవుతుంది .. (గాయత్రి స్వరూపంలో ఉన్న లలితా అమ్మవారు.... ఆవిడ ప్రొద్దున గాయత్రి, మధ్యాహ్నం సావిత్రి, సాయంత్రం సరస్వతి స్వరూపంలో గోచరిస్తారు) అర్ఘ్యం ఇవ్వడంవల్ల మంచి మేధాశక్తి ఒనగూడుతుంది .... ఇదే కాకుండా మన బ్రాహ్మణులకు గౌతమ ఋషి శాపం ఉంది .... అందుకని మనము తప్పక గాయత్రి జపం చెయ్యాలి ..ఇదే కాకుండా సూర్యమండలవర్తి అయి శివభగవానులు కూదా ఉన్నారు .. ఈ విధంగా శ్రీ విష్ణు .. లలితా.. సదాశివ.. ముగ్గురికీ మనం సంధ్యావందనంలో భాగంగా అర్ఘ్యం ఇచ్చినట్లు అవుతుంది .. . సంధ్యావందనంలో ఉత్తరభాగం గాయత్రి జప ప్రక్రియ .... . గాయత్రి అమ్మవారిని ప్రతిఒక్కరినీ కాపాడమని వేడుకుంటూ ..




నమస్తే సవితృమండలవాసిని
భక్తాభీష్టనిజభయవారిణి
సకలవిద్యాజ్ఞానప్రకాశిని
వేదమాతే నమో నమః

కామెంట్‌లు లేవు: