27, అక్టోబర్ 2020, మంగళవారం

4.2 :గృహస్థ ఆశ్రమం

 **అద్వైత వేదాంత పరిచయం**


4.2 :గృహస్థ ఆశ్రమం

  ఇది రెండో దశ, చాలా ముఖ్యమైన దశ. శాస్త్ర ప్రకారం గృహస్థ ఆశ్రమం ఒక సంస్థలాంటిది. పెళ్ళి అనే తతంగం జీవితం గడపటానికి అర్హతనిస్తుస్తుంది జీవనమే ముఖ్యం, ప్రాపంచిక సుఖాలు అనుకోకుండా దొరుకుతాయి. కాని కుటుంబ జీవనం అతి పవిత్ర మైనది వివాహ బంధము అతి పవిత్రమైనది కుటుంబ జీవనం లో భార్యాభర్తలు ఇరువురూ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవనయాత్ర కొనసాగించాలి .ఐహిక సుఖాలే ముఖ్యమైనవికావు అందుకని గృహస్థ ఆశ్రమంలో. గృహస్థ: అన్న పదం గృహే తిష్ఠతి`ఇంటిలో ఉండేవాడు అన్న పదం నుంచి గ్రహించబడిరది. ఆ భావం ఉన్నచోట, ఆ బంధం దైవ నిర్ణయంలా కనిపిస్తుంది. దైవమే ముడిపెట్టాడు విడిపోకూడదు అన్న అవగాహన ఉన్నచోటే కుటుంబం పటిష్ఠంగా నిలుస్తుంది. పటిష్టంగాఉన్న కుటుంబంలోనే, సర్దుకుపోవటం, క్షమించటం, భరించటం, నమ్మకం, ఓర్పు లాంటి మంచి లక్షణాలు అలవడుతాయి.

  కుటుంబం పటిష్టంగా ఉంటేనే మానసికంగా దృఢమైన పిల్లలు పుడతారు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే, దాని ప్రభావం పిల్లల మీద పడుతుంది. అందుకని గృహస్థ ఆశ్రమం మనకీ, మన తర్వాతి తరానికీ కూడా ముఖ్యమే.

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: