27, అక్టోబర్ 2020, మంగళవారం

శివామృతలహరి


శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని మరొక పద్య రత్నం;


శా||

ప్రోవన్ వైదిక ధర్మమిద్ధరను శంభో ! రమ్ము బర్వెత్తుచున్;

దావాగ్నిచ్ఛటవోలె నాస్తికము విధ్వంసంబు గావించె మా

యావిర్భూత భవాబ్ధిపోతమగు భక్త్యావేశసంపద్వనిన్

గ్రీవాంతస్థిత కాలకూట గరళా! శ్రీ సిద్ధలింగేశ్వరా !

భావం;

మండుతున్న దావాగ్ని శిఖలు ఏవిధంగా అడవులను దహించి వేస్తాయో, అదేవిధంగా నాస్తికత్వం( దైవం పట్ల నమ్మకం లేకపోవటం అనే విధానం) అగ్ని శిఖల్లాగా విస్తరించి

మాయచే ఆవిర్భవించబడిన సంసారసాగరాన్ని దాటించే నావ లాంటి భక్తి సంపద అనే వనాన్ని దహించి వేసి విధ్వంసం సృష్టిస్తున్నది.

లోకాలను నాశనం చేసే

కాలకూట గరళాన్ని మింగి, లోకాలను రక్షించినట్లు, ఈభూమి మీద సనాతనమైన వైదిక ధర్మాన్ని రక్షించటానికి పరుగున రావయ్యా ఓ శంభో శంకరా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: