27, అక్టోబర్ 2020, మంగళవారం

ఆవు మీద వ్యాసం:

ఆవు మీద వ్యాసం:

అనగనగా రామా రావు అనే  ఒక చదువుకునే ఉత్తమ విద్యార్థి వున్నాడు. ఆటను ప్రేమారి చదువు చదువుతున్నాడు. చిన్నవాడే కానీ అతనికి ఉండాల్సిన దానికన్నా తెలివితేటలూ ఎక్కువగా వున్నాయి. కొన్నిసందరాలలో మనకు తెలివి ఎక్కువైతే ఏమవుతుందో చెప్పటానికి ప్రయత్నం. 

 తెలుగు మాస్టరుగారు పిల్లలకు వివిధ విషయాంశాలతో పాటు వ్యాస రచనకు సమందించిన విషయాలను కూడా పేర్కొన్నారు ఉదా .  ఆవు, బడి, విమానం, రైలు, మొదలగునవి. అయితే మన ఆదర్శ విద్యార్థి వాటినన్నిటిని ఒక్కసారి చూసిన తరువాత  ఆవు తనకు నచ్చింది కాబట్టి దానిని ఎంపిక చేసుకొని దాన్ని చక్కగా చదివి గుర్తుపెట్టుకున్నాడు. మనసులో పరీక్షకు వెళ్లే ముందు తన ఇష్ట దైవాన్ని పరి పరి విధాలుగా ప్రార్ధించాడు కారణం తన పరీక్షలో వ్యాసం కేవలం ఆవు  రావాలి. ఆవు మాత్రమే రావాలి.

కానీ మన ఆదర్శ విద్యార్థి మోర దేముడు ఆలకించనట్లున్నాడు ఆ పరీక్షా పేపర్లో వ్యాసానికి సంబందించిన ప్రశ్న ఒకటి కాదు రెండు వచ్చాయి. అందులో ఒక్కటికూడా ఆవు లేదు అవి ఒకటి విమానం, రెండు రైలు. అరె చచ్చిందిరా గొర్రె అని మనస్సులో అనుకున్నాడు మన ఆదర్శ మహానుభావుడు అదికూడా ఆ రెండు ప్రశ్నలు తప్పనిసరి. ఇప్పుడు ఏమిచేయాలి, ఇప్పుడు ఏమిచేయాలి ఇదే సమస్య మెదడంతా తిరుగుతున్నది. మన ఆదర్శ విద్యార్థి ఓటమిని ఒప్పుకునే రకం కాదు ఎట్లాగయినా ఆ రెండు ప్రశ్నలకు సమాధానం వ్రాయాలి అదికూడా మంచిగా అని నిర్ణయించుకున్నాడు. అతను ఆ రెండు వ్యాసాలు ఎలా వ్రాశాడో చూద్దాం. 

1) విమానం: విమానం అనగానే తానూ విమానం శబ్దం విని ఆకాశంలో పోయే విమానం గుర్తుకు వచ్చింది. వెంటనే వ్రాయటం మొదలు పెట్టాడు. 

విమానం చాలా పెద్దగా ఉంటుంది. దానిలో చాలామంది ప్రయాణించ వచ్చు. అది గాలిలో ఎగురుతుంది. అంతమటుకు చక్కగా వ్రాసాడు. ఇక ఆ పైన పెన్ను నడవటంలేదు. ఒక్కనిమిషం అటు ఇటు చూసాడు ఎవరి పేపరు వాళ్ళు వ్రాసుకుంటున్నారు. మాస్టారు తననే చూసాడు రామా రావు సిట్రియేట్ అని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏమి చేయాలి. మనసులో పరిపరి ఆలోచనలు ఎట్లాగైనా ప్రశ్నకు సమాధానం వ్రాయాలి అంతేకాదు ఇంకోటి అదే రైలు గూర్చి కూడా వ్రాయాలి. దేముడా నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు పెడతావు. దేముడిమీద కొంత సేపు భక్తి, కొంత సేపు తనకు అనుకూలించనందుకు కోపం వచ్చింది, అయినా తన దురదృష్టానికి దేముడిని అని ఏమిటి లాభం. దేముడిని అంటే కళ్ళుపోతాయి. బామ్మా అనే మాటలు గుర్తుకువచ్చాయి. . సమయం వేగంగా అయిపోతూవుంది ఏమిచేయటానికి పాలు పోవటంలేదు. ఇక్కక్షణం ఈ ప్రపంచంలో తనకన్నా నిర్భాగ్యుడు ఎవరు లేరేమో అని అనిపించింది.   ఇంతలో ఇవ్వన్నీ తరువాత చూసుకోవచ్చు ముందు ఈ గండం గడవటం ఎట్లారా భగవంతుడా.అని ఆలోచిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు తికమక పడుతున్నారు.  ఇప్పుడు తాను వున్న పరిస్థితిలో ఆదుకునే వాడేవారు.  ఇంట్లో నాన్నగారు అన్న మాటలు చెవిలో మోగుతున్నాయి అరె పరీక్షలు దగ్గరకి వస్తున్నాయి నీవి ఆ పనికిమాలిన తిరుగుళ్ళు తగ్గించి కాస్త చదువుమీద జ్యాస పెట్టు.  ఏ ఒక్క ప్రశ్న వదలకుండా అన్ని చదవాలి తెలిసిందా? నీవు నీ పనికిమాలిన బ్యాచిలాగా తయారుకాకు. ఏమి చేయటానికి తోయటంలేదు కంగారు, గాబరా, హడావిడి. ఏదో ఒకటి చేసి ఈ జవాబులు వ్రాయాలి, అది మాస్టారు చూడగానే సరిగా వుంది అని అనుకోని మంచి మార్కులు వేయాలి. ఆ పంథాలో ఆలోచనలు సాగుతున్నాయి.  ఇక ఆగలేదు అప్పుడు సమయస్పూర్తి చూపించాడు మన రామారావు. 

పెన్ను పట్టుకొని చక చకా వ్రాయటం మొదలు పెట్టాడు. అది చూసిన మాస్టారుకుడా మన రామా రావు ఇందాక పాపం సమాధానం జ్ఞ్యాపకం రాక ఆలోచించి ఉండొచ్చు. ఏమైనా రామారావు మెరిట్ స్టూడెంట్ అని అనుకున్నాడు.  . ఇంతకూ మన రామా రావు వ్రాసింది ఏమిటి చుద్దంరండి. 

విమానం గాలిలో ఎగురుతుంది దగ్గర ఇందాక ఆగడు ఇప్పుడు విమానంతోపాటు రామారావు ఆలోచనలు అదే వేగంగా పయనిస్తున్నాయి,  దాని తరువాత విమానానికి కిటికీలు ఉంటాయి,  ఆ కిటికీలనుండి చుస్తే క్రింద పచ్చిక బయళ్లుకనపడతాయి. అక్కడ బోలెడు ఆవులు ఉంటాయి ఇక్కడనుండి పెన్ను థర్డ్ గేర్లో కదులుతున్నది. 

ఆవు తెల్లగా ఉండును, ఆవుకు ఒక తోక ఉండును, ఆవుకు రెండు కొమ్ములు ఉండును, ఆవును పెంచుకొందురు, మంచిగా సాగుతున్నది జవాబు, ఆవు పాలను ఇస్తుంది.  ఆవుపాలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా ఆవుపాలు  పడతారు. ఆవు పేడ వేస్తుంది. పేడతో పిడకలు తయారుచేస్తారు. పిడకలు పొయిలో ఉపయోగిస్తారు. సంక్రాంతి రోజుల్లో ఆడవారు ఆవు పేడతో గొబ్బెమ్మలను పెడతారు. జవాబు వేగంగా సాగుతూనే వున్నది ఒక్కసారి ఫై నుండి క్రిందికి పేజీ చూసాడు తనను తానె నమ్మలేక పోయాడు పేజీ మొత్తం నిండింది అరె నేను చాలా పెద్ద వ్యాసం వ్రాసాను అని తనను తానె పొగుడుకున్నాడు . ఈ పరీక్షల్లో మొదటి ర్యాంకు నాకు రావటం ఖాయం అని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఇక్కడితో కథ అయిపోలేదు ఇక రెండో వ్యాసం అదే రైలు వ్యాసం వ్రాయాలి అది యెట్లా వ్రాశాడో చూద్దాం రండి                                                         రచన: సి. భార్గవ శర్మ 

ఇప్పుడు రామారావు మోహంలో ఎంతో దైర్యం, ఆత్మా విస్వాసం కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. ఈ పిల్లవాడికి తెలియని ప్రశ్న ఏది లేదు అని అనుకునేలా వుంది అతని ముఖ వర్చస్సు. ఇక రైలు వ్యాసం ఇలా సాగింది. 

రైల్వే స్టేషనులో రేలు వచ్చి ఆగుతుంది వెంటనే అందరు రైలు ఎక్కుతారు అది చుకు చుకు అని బయలుదేరుతుంది. రైలుకి రెండువైపులా కిటికీలు ఉంటాయి. (భగవంతుడా రైలుకి కూడా  కిటికీలు పెట్టి నన్ను రక్షించావు అని మనసులో దేముడిని తలుచుకున్నాడు) ఆ కిటికీలలోనుంచి బయటకు చుస్తే పచ్చిక బయళ్లుకనపడతాయి . అక్కడ బోలెడు ఆవులు ఉంటాయి, ఇక్కడినుండి ఆవు మొదలు  

ఆవు తెల్లగా ఉండును, ఆవుకు ఒక తోక ఉండును, ఆవుకు రెండు కొమ్ములు ఉండును, ఆవును పెంచుకొందురు, మంచిగా సాగుతున్నది జవాబు, ఆవు పాలను ఇస్తుంది.  ఆవుపాలు ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా ఆవుపాలు  పడతారు. ఆవు పేడ వేస్తుంది. పేడతో పిడకలు తయారుచేస్తారు. పిడకలు పొయిలో ఉపయోగిస్తారు. సంక్రాంతి రోజుల్లో ఆడవారు ఆవు పేడతో గొబ్బెమ్మలను పెడతారు. ఇలా సాగుతూనే వున్నది మన రామారావు జవాబు పత్రం మీద వ్యాసం.  దబదబా పేపర్లు కుట్టి బెల్ కొట్టగానే మాస్టారు చేతిలో పేపరు పెట్టి హుషారుగా వెళ్లే రామారావుని చూసి మాస్టారు ఏరా పరీక్ష ఎలా వ్రాసావు అని మెప్పుగోలుగా అడిగారు..  నేనా చాలా బాగావ్రాసాను మాస్టారు అని అన్నాడు రామారావు. 

నాలుగు రోజుల తరువాత మార్కులు చెప్పటానికి జవాబు పాత్రలని పట్టుకొని మాస్టారు క్లాసుకి వచ్చారు. పిల్లల గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి.  మార్కులు తక్కువ వస్తే మాష్టారు చేతిలో దెబ్బలు తినాలసిందే.  మాస్టారు రావటం రావటంతోటే అరై చిట్టిగా ఒక మంచి బెత్తం కోసుకొని రారా అని ఫురమాయించారు. బెత్తం అంటే పాఠాశాల ఆవరణలో పెరిగే ఒక చెట్టు కఱ్ఱ .  చిట్టిగాడి చేతిలోని బెత్తం పొడవు లావు చూసేసరికి సగం మంది మొద్దబ్బాయిల నిక్కర్లు తడిసిపోయాయి. 

మాస్టారు ఒక్కొక్క పేపరు తీసి పేరు చదివి మార్కులు చెపుతున్నారు.  ఫెయిల్ ఆయిన్ పిల్లలకు బాధిత పూజ. మాస్టారు చేతిలోని పేపర్లనే మన రామా రావు గమనిస్తున్నాడు వాడికి తన పేపరు ఏదో తెలుసు.  దానికి కారణం అందరిలాగా కాకుండా ఒక అరఅంగుళం క్రిందకు తానూ గుర్తుకు దారం కడతాడు.  అది చూడంగానే వాడి పేపరు గుర్తు పడతాడు. ఇటువంటి టెక్నీకులు రామారావు దగ్గర బోలెడు ఉన్నాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మాస్టారు తనపేపరు మీద పేరు పిలవకముందే నిలుచొని మాస్టారు దగ్గరకు వెళ్ళాడు.  అరె నేను నీపేరు పేలవలేదుగా యెట్లా తెలుసుకున్నావు అని మాస్టారు ఆశ్చర్యాన్ని ప్రకటించాడు.  నాకు తెలుసు సార్ ఆ పేపరు నాదే అని అన్నాడు.  సరేలే నీవు పాసు అయ్యావు 40 మార్కులు వచ్చాయి అని పేపరు చేతిలో పెట్టారు.  ఆ పేపరు తీసుకొని బెంచీమీదకు వెళ్లి త్వరత్వరగా తానూ వ్రాసిన వ్యాసాలను చూసాడు.  మాస్టారు 10 కి ఐదు వంతున మార్కులు ఇచ్చారు.  అమ్మయ్య నేను బతికి బయట పడ్డాను అని మనసులో అనుకునేది కాస్తా బైయటికే అనేశాడు.  మాస్టారుతో సహా మిగిలిన పిల్లలు అందరు తనవైపే చూసారు. చిన్నతనం అనిపించింది.  అందరి పేపర్లు తిరిగి తీసుకొన్నారు మాస్టారు. రామారావు తన పేపరు ఇవ్వబోతుంటే అరె నీవు ఇంట్రావెల్లో స్టాఫ్ రూముకు రారా అని పిలిచారు.  రామారావుకు వంట్లో దడదడ మొదలైయిన్ది.  మాస్టారు అందరిని వదిలి తనని మాత్రమే ఎందుకు రమ్మన్నాడు. ప్రశ్నల పరంపర. ఇంతలో ఇంటర్వెల్ బెల్ మొదగింది బింగమొహం పెట్టు కొని మన హీరో రామారావు స్టాఫు రూముకి వెళ్ళాడు. అక్కడ ఎంతోమంది మగ ఆడ టీచర్లు వున్నారు.  తెలుగు మాస్టారు వీడికోసమే చూస్తున్నారు.  ఆయన డ్రాలోంచి రామారావు పేపరు బైయటికి తీసి అరె నేను నీకు ఎన్ని వ్యాసాలు చెప్పానురా అన్నారు.  మీరు మీరు అని నసుకుతూ ఆవు, రైలు, విమానం, రేడియా తరగతి గది  ఇంకా చెపుతుంటే ఆపు అవన్నీ మీకు చెప్పగదా ?  అవునన్నట్లు తలఊపాడు రామారావు. మరి నీవు ఎన్ని చదువుకొని పరీక్షకు వచ్చావు అన్నారు.  సార్ నేను అన్నీ చదువుకున్నాను అన్నాడు రామారావు వణుకుతూ.  నిజం చెప్పు వెధవ ఈ మారు మాస్టారు మొఖంలో కోపం కనిపించింది రామారావుకి.  దేముడా దేముడా బిల్లు తొందరగా కావలి అప్పుడే తానూ అక్కడినుండి వెళ్లగలడు. భయం భయంగా మాస్టారండి మాస్టారండి మారేమోనండి నాకు అన్ని వ్యాసాలు చదువుకోవటానికి టైము దొరకలేదండి కేవలం ఆవు మీద వ్యాసం ఒక్కటే చదివానండి అన్నాడు. మాస్టారుగారు ఫక్కున నవ్వారు అది చూసి మిగిలిన టీచర్లంతా పకపకా నవ్వారు.  వాళ్లంతా ఎందుకు నవ్వుతున్నారో రామారావుకు కూడా అర్ధం కాలేదు చేసేది ఏమిలేక రామారావు కూడా చిన్నగా నవ్వాడు.                                                     రచన: సి. భార్గవ శర్మ 

     మాస్టారుగారు రామారావు వ్రాసిన  విమానం వ్యాసం పెద్దగా చదివారు అది విని టీచర్లంతా గొల్లున నవ్వారు.  చూసారా నా శిష్యుని ప్రతిభ ఇంకా వుంది రెండో వ్యాసం రైలు అని అదికూడా నవ్వారు.  మీకెవరికియినా జిందా తీలుసుమాతు కనుగొన్నది ఎవరో తెలుసా అని ప్రశ్నించారు.  ఇక్కడ అది ఎందుకు వచ్చింది అని మిగిలిన టీచర్లు అడిగారు. అప్పుడు మాస్టారు అది ఏరకంగా అయితే ఏ రోగానినయినా తగ్గిస్తుందో అదే రకంగా నా స్టూడెంట్ ఏ ప్రెశ్నకైనా జవాబు వ్రాయగలడు.  అందరు నవ్వితే రామారావుకు నామోషీ అయ్యింది.  ఇక పోరా మంచిగా చదువుకో అని మాస్టారు అంటే కత్తుల బోనులోంచి బైట పడ్డట్లయింది రామారావుకు.  అక్కడ కూర్చున్న రాధా మేడం తన మీద చేయి వేసి తలనిమిరి అరె నీకు మంచి భవిష్యత్తు వుంది నీవు రాజకీయ నాయకుడివి కాగలవు అని అన్నది. 

సమాప్తం.  రచన: సి. భార్గవ శర్మ 


కామెంట్‌లు లేవు: