27, అక్టోబర్ 2020, మంగళవారం

బ్రహ్మ ముహూర్తంలో

 బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు నిద్ర లేవాలి 


బ్రహ్మ ముహూర్తాన్ని అక్షరాలా సృష్టికర్త కు సంబంధించిన సమయంగా భావించబడినది. ఈ విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మ కు సంబందించిన సమయాన్ని, అనగా సూర్యోదయానికి ముందు ఒకటున్నర గంటల సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా చెప్పబడినది.


ముందు రోజు రాత్రి యొక్క చివరి గంటలైన ఈ కాలాన్ని అతి పవిత్రమైన కాలంగా భావించబడుతుంది. ఈ సమయంలో అద్యయనాలకు అత్యంత అనుకూలమైన సమయంగా ఉంటుందని, ఏకాగ్రత ఎక్కువగా ఉండి, అభ్యాసాలు ఎప్పటికీ గుర్తు ఉంటాయని పెద్దలు సూచిస్తూ ఉంటారు. తద్వారా అనేకులు, సంగీత సాధనకు, విద్యాభ్యాసానికి ఈ సమయాన్ని ఎంచుకుంటూ ఉంటారు కూడా, హిందూ శాస్త్రాలు, పురాణాలు మరియు వేదాల ప్రకారం ఈ సమయం నిద్ర లేయడానికి అనువైన సమయంగా చెప్పబడుతున్నది. ఈ సమయంలో కాలుష్య కారకాలు తక్కువగా ఉండి, ప్రశాంతతకు అనువుగా ఉంటుంది. మరియ ఈ ముహూర్తం పవిత్రంగానే కాకుండా, ఆరోగ్యకర సమయంగా కూడా చెప్పబడుతున్నది. సైన్సు ప్రకారం ఈ సమయంలో ఎటువంటి రణ గొణ ధ్వనులు ఉండవు, కాలుష్యకారకాల ప్రభావం తక్కువగా ఉంటుంది, తద్వారా మనసులో ఎటువంటి కల్లోలాలు కలగవు. క్రమంగా ఈ సమయంలో ఏకాగ్రత తో అభ్యాసాలు చేయవచ్చని చెప్తుంటారు.


బ్రహ్మ ముహూర్తం:


ఈ సమయం యోగాకు, ధ్యానానికి మంచి సమయంగా , ఎటువంటి కాలుష్య జాడలు లేని తాజా ప్రాణ వాయువుతో కూడి ఉంటుంది. తద్వారా ధ్యానానికి అత్యంత అనువైన సమయంగా చెప్పబడుతున్నది. పక్షుల కిలకిలా రావాలు, రణగొణ ధ్వనులకు భిన్నంగా మానసిక ప్రశాంతతకు కారకాలుగా ఉంటాయి.


ధ్యానానికి, పూజకు, అభ్యాసానికి, యోగాకు అత్యంత పవిత్ర సమయంగా ఈ బ్రహ్మ ముహూర్తం ఉన్నది. ముఖ్యంగా ఇటువంటి వాటికి ఏకాగ్రత అత్యవసరం, తద్వారా ఈ సమయంలో వీటికి ఉపక్రమించడం వలన మంచి ఫలితాలను పొందవచ్చని సూచించడమైనది.


ఆయుర్వేదం ప్రకారం

ఆయుర్వేదం ప్రకారం శరీరంలో జీవక్రియల నియంత్రణలో మూడు రకాల దోషాలు ఉన్నాయి. అవి వాత దోషం, పిత్త దోషం, మరియు కఫ దోషం. ఈ వాత పిత్త కఫ దోషాల ప్రభావాలు ఈ బ్రహ్మ ముహూర్త సమయం నందు అత్యంత కీలకంగా ఉంటాయి. వాత దోషo గాలికి మరియు ఆకాశానికి, పిత్త దోషం అగ్నికి మరియు నీటికి , కఫ దోషo భూమి మరియు నీటికి సంబంధించి ఉంటుంది.


ఈ మూడింటి నిష్పత్తి పరిసరాలు మరియు జీవక్రియల ప్రభావాల కారణంగా మారుతూ ఉంటాయి. పరిసరాలు క్షణ క్షణంలో మార్పులను చూస్తూ ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలోని 48 నిమిషాలు మాత్రం ఎటువంటి మార్పులకు లోను కాకుండా, నిశ్చలంగా ఉంటుంది. కేవలం అందుచేతనే, ఎటువంటి సమస్యలు చుట్టుముట్టకుండా ఏకాగ్రత పెరగడానికి దోహదం చేస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు.


సూర్యోదయానికి ముందు 48 నిమిషాల ముందు, ప్రశాంత వాతావరణం నెలకొంటుంది

ఇక్కడ ఉదయం 10 గంటల వరకు కఫం తన ప్రభావాన్ని చూపిస్తుంది, తర్వాత 10 నుండి 2 వరకు పిత్త ప్రభావం, మద్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 వరకు వాత ప్రభావాలు ఉండగా ఒక్కోసారి సాయంత్రం మొత్తం కొనసాగుతాయి కూడా. సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు మరలా కఫం తన ప్రభావాన్ని చూపగా, రాత్రి 10 నుండి వేకువజామున 2 వరకు పిత్త ప్రభావం ఉంటుంది, మరియు ఉదయం 2 నుండి 6 గంటలవరకు వాతం తన ప్రభావాన్ని చూపుతుంది. కానీ సూర్యోదయానికి ముందు సమయం ఈ ప్రభావం కూడా తగ్గుముఖం పడుతుంది. ఈ సమయము నందు, సూర్యోదయానికి ముందు 48 నిమిషాల ముందు, ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఈకారణం చేతనే ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఎటువంటి దోషాలు ఈ బ్రహ్మ ముహూర్తాన పని చేయలేవు, తద్వారా జీవక్రియలకు ఎటువంటి ఆటంకం లేకుండా శరీరం మిన్నకుంటుంది. క్రమంగా ఏకాగ్రత తో చేసే ఎటువంటి పనులైనా సానుకూల ఫలితాలను అందివ్వగలవని చెప్తుంటారు.

మానసికంగా కొన్ని గుణాలు కూడా ఈ బ్రహ్మముహూర్తంలో ప్రభావితమవుతాయని తెలుసా :

మరొక నమ్మకo ప్రకారం శరీరానికి మూడు రకాల గుణాలు ఉన్నవి. సత్వ గుణం, రజో గుణం మరియు తమో గుణం. ఈ మూడు గుణాలు శరీరంలో కలిసి ఉన్నప్పటికీ, వీటి నిష్పత్తి వేరుగా ఉంటుంది. ఈ మూడింటిలో ఏదైనా ఒక గుణం క్రియాశీలంగా ఉన్నప్పుడు, మిగిలిన రెండు గుణాలు నిద్రావస్థ లో ఉంటాయి. ఈ మూడింటికి ప్రత్యేకించిన సమయం ఉంటుంది, వాటి నిష్పత్తుల ప్రకారం వాటి క్రియాశీల మరియు నిద్రాణ సమయాలు ఆధారపడి ఉంటాయి.


ఈ గుణాలు మనిషి యొక్క వ్యక్తిత్వ పోకడలకు తార్కాణాలుగా ఉంటాయి.

ఈ గుణాలు మనిషి యొక్క వ్యక్తిత్వ పోకడలకు తార్కాణాలుగా ఉంటాయి. వీటిలో సత్వ గుణం మానసిక ప్రశాంతత, మంచితనం, ఆద్యాత్మికం, ఓపిక , చింత, సహనం, సహాయం చేసే గుణం, ప్రేమ వంటి అంశాలకు సంబంధించినదిగా ఉంటుంది. రజో గుణం భౌతిక విషయాల సంబంధించిన గుణాలను కలిగి ఉంటుంది. ఇక తమో గుణం నిర్లక్ష్యానికి, అవగాహనాలేమి లక్షణాలను సూచిస్తుంది. ఈ తమో గుణం, తెలివితక్కువతనానికి నిదర్శనo గా ఉండి, క్రూరత్వపు చాయలను పెంచేలా ఉంటుంది.

ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో సత్వ గుణం ఎక్కువ క్రియాశీలంగా ఉంటుంది

ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో సత్వ గుణం ఎక్కువ క్రియాశీలంగా ఉంటుంది, తద్వారా అనేక సానుకూల అంశాలు ప్రభావితమవుతాయి. శరీరం ఈ సమయంలో మేల్కొని ఉన్నప్పుడు, సత్వ గుణo, పరిపూర్ణ సమన్వయమునకు సమయంగా కనుగొని, వ్యక్తిత్వచాయల అభివృద్దికి దోహదపడుతుంది.


కావున ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేయడం అత్యంత ముఖ్యమైన చర్యగా పేర్కొంటూ ఉంటారు.

కావున ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేయడం అత్యంత ముఖ్యమైన చర్యగా పేర్కొంటూ ఉంటారు. ఈ సమయంలో నిద్రించేవారికి, వారియొక్క అంతర్గత సానుకూల అంశాల అభివృద్దికి తోడ్పడే అవకాశాలు అంతగా ఉండవు. ఈ బ్రహ్మ ముహూర్తంలో కాకుండా మిగిలిన సమయాల్లో మిగిలిన రెండు గుణాలు క్రియాశీలంగా ఉంటాయని చెప్పబడినది. క్రమంగా వీరిలో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచే వారితో పోల్చినప్పుడు ఆలోచనా శక్తి తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. క్రమంగా కోపం, భావోద్వేగాలు కూడా అధికంగా ఉంటాయి.

ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో సత్వ గుణం ఎక్కువ క్రియాశీలంగా ఉంటుంది

ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో సత్వ గుణం ఎక్కువ క్రియాశీలంగా ఉంటుంది, తద్వారా అనేక సానుకూల అంశాలు ప్రభావితమవుతాయి. శరీరం ఈ సమయంలో మేల్కొని ఉన్నప్పుడు, సత్వ గుణo, పరిపూర్ణ సమన్వయమునకు సమయంగా కనుగొని, వ్యక్తిత్వచాయల అభివృద్దికి దోహదపడుతుంది.


కావున ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేయడం అత్యంత ముఖ్యమైన చర్యగా పేర్కొంటూ ఉంటారు.

కావున ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేయడం అత్యంత ముఖ్యమైన చర్యగా పేర్కొంటూ ఉంటారు. ఈ సమయంలో నిద్రించేవారికి, వారియొక్క అంతర్గత సానుకూల అంశాల అభివృద్దికి తోడ్పడే అవకాశాలు అంతగా ఉండవు. ఈ బ్రహ్మ ముహూర్తంలో కాకుండా మిగిలిన సమయాల్లో మిగిలిన రెండు గుణాలు క్రియాశీలంగా ఉంటాయని చెప్పబడినది. క్రమంగా వీరిలో బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచే వారితో పోల్చినప్పుడు ఆలోచనా శక్తి తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. క్రమంగా కోపం, భావోద్వేగాలు కూడా అధికంగా ఉంటాయి.

కామెంట్‌లు లేవు: