27, అక్టోబర్ 2020, మంగళవారం

ఇష్టమైన స్థలాలు

 దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలాలు

• ఎక్కడ రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో,

• ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో,

• ఎక్కడయితే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో,

• ఎక్కడయితే దురాచారాలు, పరద్రవ్య, పరభార్యాపహరణ శీలులైనవారు ఉంటారో,

• కల్లు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతకులు ఎక్కడ ఉంటారో అలాంటి చోట మాత్రమే దరిద్ర దేవత నివాసముంటుంది.

దరిద్ర దేవతకు ఇష్టం కాని స్థలాలు.

• అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోటగానీ,

• పితృదేవతలు పూజింపబడే చోటగానీ,

• నిరంతర హోమధూమ సుగంధాలతో, వేద నాదాలతో నిండిన ఆశ్రమంలొ దరిద్రదేవత నివసించదు.

• వేదాలు ధ్వనించే, అతిథి పూజా సత్కారాలు జరిగే, యజ్ఞయాగాదులు నిర్వహించే స్థలాల్లో దరిద్రదేవత నివసించదు.

• ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్టుడు, ప్రేమగా మాట్లాడేవాడూ, గురుపూజా దురంధరుడు ఉండే స్థలాల్లో దరిద్రదేవత నివసించదు.

కామెంట్‌లు లేవు: