27, అక్టోబర్ 2020, మంగళవారం

ధార్మికగీత - 62*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                         *ధార్మికగీత - 62*

                                   *****

     *శ్లో:- ఋణకర్తా పితా శత్రు: ౹*

            *మాతా చ వ్యభిచారిణీ ౹*

            *భార్యా రూపవతీ శత్రు: ౹*

            *పుత్ర శ్శత్రు రపండితః ౹౹* 

                                     *****

*భా:- సంసార పోషణ, బిడ్డల విద్యా ,ఉపాధి, వివాహాది బాగోగులకోసం అప్పుల ఊబిలో కుటుంబాన్ని కూరుకుపోయేలా చేసిన "తండ్రి" భార్యాబిడ్డలకు "పరమశత్రువు" అవుతాడు. ఆర్థికవనరులు, అండదండలు,తోడూనీడా లేక కుటుంబభారము నీదడం కోసం నీతి- నియమము వీడి "వ్యభిచరిస్తున్న తల్లి" ఆ కుటుంబానికి జీవితాంతం "శత్రువే". మూడుముళ్ల బంధం, ఏడడుగుల అనుబంధం, పెళ్లినాటిప్రమాణాల నిబద్ధతతో అనుకూలవతి, "అతిలోకసుందరి" యైన "భార్యామణి" లోకానికి పూజ్యురాలైనా, "అనుమానపు పక్షి " గా పేరున్న భర్తకు మాత్రము "బద్ధశత్రువే". అతిగారాబము, స్వేచ్ఛ, మితిమీరిన డబ్బు, అవిద్య, సోమరితనము, తెలివిలేములతో, నియంత్రణ లేకుండా పెరిగిన "పుత్రరత్నము" తల్లిదండ్రులకు ఆజన్మాంతము "శత్రువే". బిడ్డలకు ఆస్తులు ఇవ్వలేకపోయినా, అప్పులు పంచరాదని. సమాజం, బంధుమిత్రుల సహకారం ఉంటే యే తల్లికి అటువంటి కష్టం రాదని, లేని పోని అనుమానాలతో పచ్చని సంసారంలో చిచ్చు పెట్టుకోకూడదని, బిడ్డలని బాధ్యతగా పెంచాలని సారాంశము*.

                                    *****

                       *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: