20, సెప్టెంబర్ 2020, ఆదివారం

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 113 🌹*


🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ


*🌻. మతంగ మహర్షి - 1 🌻*


జ్ఞానం:

1. పశువులు ఏం మాట్లాడుతున్నవో మనకు తెలియదు. మనం ఎంత ఘోరంగా వాటిని హింసిస్తాం? వాటి మనోభావాలకు ఒక భాషంటూపుడితే మనకు గురించి ఏం మాట్లాడతాయో ఊహించుకుంటే సరిపోతుంది. మంకు అంత తెలివిఉంది! 


2. నిష్కారణంగా ఒక కుక్కనుకొడతాం. అన్నంకోసం వచ్చింది. దానికీ ఆకలివేస్తుంది. మనకు ఆకలైతే, అన్నం వండుకుని తింటాం. ఆకలి తీర్చుకుంటాం. ఆకలి అందరికీ సమానమే! కుక్క శరీరమైనా అంతే! మనిషి శరీరం అంత్వాటిఏ! కొడితే అవికూడా తిట్టుకుంటాయి మనను. వాటి భాష అర్థమయితే మనకు తెలుస్తుంది. 


3. “ఏమిటి వీళ్ళందరూ వండు కుంటున్నారు, తింటున్నారు. నాకు అన్నం పెట్టటానికి ఏడుస్తున్నారు. పైగా కొడుతున్నారు. ఇంత అన్నం పారెయ్యకూడదా! పైగా యజ్ఞం చేస్తున్నాడట! ఊరివాళ్ళంతా చాలా గొప్పవాడిని అనుకుంటున్నారు” అని కుక్క అనుకుంటున్న భాష అర్థమయితే ఏమవుతుంది? కొంచం కూడా ఆలోచనలేదు. దాని ఆంతర్యం కనుక మనం తెలుసుకుంటే మనది ఎంత అనుచితమైన కార్యమో మనకు తెలుస్తుంది. 


4. కానీ మనం అదే తప్పుచేస్తే, మన యజ్ఞసంరక్షణ కోసం దానిని కొట్టినట్లు, మన శౌచం కాపాడుకోవటానికి కుక్కను కొట్టినట్లుగా, మనం చేసినపని పరమ ధార్మికమైనదని – లేకుంటే దనిని శిక్షించటంచేత యజ్ఞ సంరక్షణ చేసామని – అనుకుంటాం. ఇవన్నీ మన భావాలు. ఇలా మనం తెలివి ఉండికూడా చేసేటటువంటి పాపాలుంటాయి.


5. పశువులన్నీ పశువులుకావు. వాటిలో అన్నీ కేవలం జడత్వంలో ఉన్న జీవులు మాత్రమే కాదు. కొంతమంది యోగులు మళ్ళీ తపస్సు చేయాలనుకుంటే, “మనుష్య జన్మ ఎత్తితే ఏవైనా దోషాలు సంక్రమించవచ్చు.


6. కామక్రోధలోభాలతోసహా ఏదయినా జరగవచ్చు. నాకు నా జీవలక్షణము, నా యోగస్మృతి, నా ధ్యేయం, నేను ఏదికోరి ఈ తపస్సుచేస్తున్నానో అటువంటి స్థితి జీవునియందు ఉండాలి. ఈ శరీరం ఏదయినా క్షుద్రమయిన శరీరం అయినా చాలు. పక్షినైపుడతాను. 


7. ఆ శరీరంలో పాపంచేసే అవకాశంలేదు. మరొకరు పాపం చేస్తే వారి చేతిలో చచ్చిపోతాను కాని, నేను పాపం చేయను కదా! (పక్షి ఏం పాపంచేస్తుంది? పురుగులను తింటుంది. అది పాపం అని దానికి తెలియదు, దాని లక్షణం కాబట్టి. తెలిసి చేసేదే పాపం. ఆవశ్యకతలేని క్రూరకర్మ పాపం). 


8. కాబట్టి ఏం పాపం చేయనటువంటి పక్షి జన్మలో నేనుండి ఆ విశ్వనాథుని ఆలయంచుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అక్కడే ఓ మూల పడిఉండి ధ్యానం చేసుకుంటూ ఉంటే ఒక జన్మ గడుస్తుంది. 


9. ఆ జన్మలో నేను శరీరాన్ని వదిలిపెట్టి నీలో కలవాలి అని భవంతుణ్ణి ప్రార్థించి ఏరికోరి పక్షిజన్మ తెచ్చుకుంటారు కొందరు మహాత్ములు. ఈ జన్మలు, మహాత్ములగురించి మరి మనకు ఎలాగ తెలియడం అనుకుంటే, తెలియక పోయినా ఫరవాలేదు. అందరినీ సమతాదృష్టితో చూడాలి, అనవసరంగా వేటిని హింసించకూడదు అని దాని తాత్పర్యం.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు: