20, సెప్టెంబర్ 2020, ఆదివారం

*🌹 'ఆరా' ను లాకింగ్ ఎలా చేసుకోవాలి - ప్రక్రియ 🌹*


*మాస్టర్ల సందేశం*

📚. ప్రసాద్ భరద్వాజ


దేవతల ఫోటోల చుట్టూతా ఒక వెలుగు ఉంటుంది.‌ దానినే *'ఆరా'* (దివ్య ప్రకాశం) అంటారు. అలాగే ప్రతి మనిషి చుట్టూ.. జంతువు చుట్టూ.. వృక్షం చుట్టూ.. పర్వతం చుట్టూ.. ఇంటి చుట్టూ.. ఆలయం - చర్చి- మసీదు - గురుద్వారాల-మందిరాల చుట్టూ ఎంతో కొంత *'ఆరా'* ఉంటుంది.


✨. ఈ *"ఆరా"* ను మన సంకల్పంతో మనం *"Lock (లాక్)"* చేయవచ్చు! మీ చుట్టూ మీరు *"లాక్"* చేసుకోవచ్చు! 12 సంవత్సరాల లోపు మీ పిల్లల చుట్టూ మీరు *"లాక్"* చేయవచ్చు! మీ ఇంటి చుట్టూ కూడా మీరు *"ఆరా"* ను లాక్ చేయవచ్చు! ఇతరుల చుట్టూ.. ఇతర నిర్మాణాల చుట్టూ.. *"లాక్"* చేయడానికి ప్రయత్నిస్తే. మీ *"ఆరా"* లాకింగ్ వ్యర్థమవుతుంది!


✨. మీ *"ఆరా"* ను మీ సంకల్పంతో Lock చేయడానికి ముందు మీ చుట్టూ మీరు మీ నఖశిఖ పర్యంతం(తల నుండి పాదాల దాకా) ఎంతోకొంత *"ఆరా"* 

(వెలుగు) ను ఊహించండి! ఒక అడుగు నుండి10 అడుగుల వరకు మీ ఆలోచనా స్థాయితో మీ *"ఆరా"* ను మీరు మీ చుట్టూ ఊహించండి గుండ్రంగా!


✨. ఇలా మూడు సార్లు మీ *"ఆరా"* పరిధి చుట్టూ మీ మనస్సును గుండ్రంగా తిప్పండి! Clockwise అంటే.. కుడి నుండి ఎడమకు త్రిప్పండి!


✨. *"సంకల్పం:"* - 


ఈ నా ఆరా పరిధిలోకి ఏ దుష్ట వైరస్ అయినా.. కరోనా వైరస్ అయినా.. ఏ జబ్బు అయినా కూడా నా యొక్క అనుమతి లేకుండా ప్రవేశించడానికి ఏమాత్రం వీలు లేకుండా నేను నా *"ఆరా"* ను Lock లాక్ చేస్తున్నాను!


✨. అలాగే ఏ *"నిమ్న స్థాయి చైతన్యం"* కూడా నా *"ఆరా"* పరిధిలోకి ప్రవేశించకుండా నేను నా *"ఆరా"* ను Lock చేస్తున్నాను. 


✨. అయితే ఏ *"ఉన్నతస్థాయి చైతన్యం"* అయినా.. ధ్యాన- జ్ఞాన సందేశాలు అయినా.. ప్రేరణలు అయినా నా యొక్క *"ఆరా"* పరిధి లోకి ప్రవేశించడానికి నేను అనుమతి ఇస్తున్నాను!

🌹 🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు: