20, సెప్టెంబర్ 2020, ఆదివారం

సనత్కుమారుని బోధలు*

 *భాగవతము* 

*శ్రీగురుభ్యోనమః*

🕉🌞🌎🌙🌟🚩


*సనత్కుమారుని బోధలు*

*ॐॐॐॐॐॐॐॐ*


*13. భగవత్కథలను నిత్యము పఠించుచు స్మరించుచుండవలెను.


*ఇది చాలా ముఖ్యము. దినచర్యలో భగవత్కథలను చదవడము ఒక భాగము అయిపోవాలి. దాని వలన మనలో ప్రజ్ఞ పునీతమవుతుంది. సాధకుడు తన సాధన ద్వారా కొంత ఉన్నతిని సాధించాలి. రోజుకు ఒక మిల్లీమీటరు చొప్పున పెరిగినా పరవాలేదు.*


*పడుకొనేటప్పుడు ఒక భగవత్కథ లేదా ఒక భక్తుని కధ చదవడము చిట్ట చివరి అంశముగా ఉండాలి. భాగవత పద్యాలయినా చదువుకోవచ్చు. ఇలా చదుకుంటూ ఉంటే purification అప్రయత్నముగా వస్తుంది. పంచకోశములలో బాగా శుద్ధి జరుగుతుంది.*



*భగవత్కథలతో పాటు ఋషుల కథలు గూడా చదువుకోవాలి. ఋషులందరూ భగవంతుని తత్త్వమునకు ప్రతిరూపాలు. ఋషులే లేకపోతే దైవము యొక్క స్వరూప స్వభావాలు, సృష్టికి మూలమైన వెలుగును తెలుసుకొనుట సాధ్యము కాదు. అలాగే సనక సనందనాది మహర్షుల గురించి తెలుసుకోవాలి.*



*చింతలలో ఇరుక్కుపోయిన చిత్తాన్ని భక్తుల కథల పఠనం నందు అభ్యాసము చేయిస్తే, మనలో చక్కని ప్రకాశం ఏర్పడుతూ ఉంటుంది.*


🕉🌞🌎🌙🌟🚩


*ఆచార్య సద్భోదన*

*ॐॐॐॐॐॐॐॐ*


*నిజమైన భక్తులు ఎన్నటికీ తమ మూలాధారమైన భగవంతుని ఉనికిని విస్మరించలేరు. ఒక ఆదర్శ శిష్యునిగా, ఆదర్శ భక్తునిగా మెలిగే ప్రయత్నం చేయాలి. భగవంతుని ఋణం మనం తీర్చుకోలేనిదనే సంగతిని విస్మరించరాదు. విశ్వాన్ని సృజించిన భగవంతునికీ, ఆయన వారసులైన సమస్త ప్రజానీకానికీ యావజ్జీవితం సేవ చేసినా సరిపోదు. మన జీవన విధానం ద్వారా ఆయనను మెప్పించగలిగితే అంతకన్నా భాగ్యం మరొకటి ఏమి ఉంటుంది. అలాకాక మనోవాక్కాయముల ద్వారా ఆయనను నొప్పించే విధంగా ప్రవర్తిస్తే దానిని మించిన దురదృష్టం ఉండబోదు. మన మూలాధారమైన భగవంతుని నిరంతర ధ్యానం ద్వారా అభ్యసించడంకన్నా ఉత్తమమైనది మరొకటి ఉండబోదు. ఆ స్పృహను క్షణకాలం కూడా విస్మరించరాదు. మన హృదయాన్ని అవిశ్రాంతంగా భగవదాలోచనలతో నింపివేయాలి.*


*"సర్వేజనా స్సుఖినోభవంతు"*


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: