23, అక్టోబర్ 2020, శుక్రవారం

షష్ఠగ్రహ కూటమి

 




ఫిబ్రవరి 2021 లో ఏర్పడే షష్ఠగ్రహ కూటమి మానవ జాతి మీద అత్యంత ప్రభావం చూపనున్నదనటానికి మనకు ఇప్పటికే ప్రకృతి విలయ తాండవం చూస్తున్నాం. తరువాత ఈ షష్ట గ్రహాల యొక్క దుష్ప్రభావం పొంచి ఉన్నది.


ఈ రాబొయే ఉపద్రవం నుండి అన్ని వర్ణాల వారు ఉపశమనం పొందుటకు కల్వకొలను చిత్తరంజన్ దాస్ సంస్థ గౌరవ అధ్యక్షులు గురువుగారు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారు లోకకళ్యాణార్థం, లోక సంరక్షణార్థం తలపెట్టిన సామూహిక షష్ఠగ్రహ స్తోత్ర పారాయణం సంకల్పించారు.


ఈ కార్యక్రమము నవంబర్ 5వ తారీఖున ప్రారంభమై మార్చి 5వ తారీఖున సుసంపన్న మవుతుంది. మధ్యలో కూడా పేర్లు నమోదు కొనసాగుతుంది. మనమందరము మనకు తెలిసిన, పరిచయమున్న అన్ని వర్ణముల వారిని, (ఆడా మగా తేడా లేకుండా) నమోదు చేయించగలరు.


ఈ కార్యక్రమంలో వీలైనంత

ఎంత యెక్కువ మందిని నమోదు చేయించి వారికి వారి కుటుంబాలకు ఉపశమనం కల్పించగలిగితే అది ఒక లోకసంరక్షణ లో భాగస్వాములను చేసిన వారవుతారు గ్రహాలు అన్ని శాంతించి మానవాళికందరికీ కీడు తగిస్తుంది మరియు సంస్థ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారవుతారు.


ఈ షష్ట గ్రహా కూటమి స్తోత్ర పారాయణలో పేరు నమోదు చేసుకొనుటకు ఈ క్రింది గూగుల్ షీట్ లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.


షష్ట గ్రహా కూటమి స్తోత్ర పారాయణ కొరకు పేరు నమోదు చేసుకొనుటకు


https://docs.google.com/forms/d/e/1FAIpQLSeegRMCmyef3QAuCLe41_eltbcAwXoK-3lgqtO3QrD0LRHM3w/viewform


ఈ పై లింకు ద్వారా ఏ సామూహిక నవగ్రహా స్తోత్ర పారాయణ లో పేరు నమోదు చేసుకుని టెలిగ్రామ్ యాప్ లో మన సనాతన ధర్మ వారధి గ్రూప్ లో ప్రవేశం పొందగలరు.


ఐతే పేర్ల నమోదు ప్రక్రియ మొదలైంది. మీకు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ఆడియో, పూర్తి వివరాలు గురువు గారు చెప్పిన వీడియో మరియు అందరూ చదువ గలిగే 18 లైన్ల నవగ్రహా స్తోత్రములు టెలిగ్రామ్ యాప్ లో సనాతన ధర్మ వారధి గ్రూప్ ద్వారానే షేర్ చేయడం జరుగుతుంది.


ప్రతిరోజు (కనీసం ఒకసారి) నుంచి ఎన్నిసార్లైనా పారాయణం చేయవచ్చు. ఆ సంఖ్యను మీరు ప్రతి 30 రోజులకొకసారి గూగుల్ ఫామ్ లో అప్లోడ్ చేయగలరు. మీ శక్తికొలది ఎంత ఎక్కువ పారాయణం చేస్తే అంత మంచిది. 

కామెంట్‌లు లేవు: