23, అక్టోబర్ 2020, శుక్రవారం

ధ్యానరూపాలు

 🔔సరస్వతీ దేవి 

ధ్యానరూపాలు🔔

        🚩🦚🚩


🌺

వాగ్దేవి ...

వెన్నెల వంటి ప్రకాశంతో  వెలిగే  వదనం , శ్వేతాంబర ధారిణి , శ్వేత సుమమాలా  ధారిణి, త్రినేత్రాలు,  నెలవంకను ధరించినదై , పై రెండు చేతులలో తామర పుష్పాలు,  క్రింద రెండు చేతులలో వరదాభయ హస్తాలతో, ' భారతి ' అనే నామం  కలిగిన  దేవికి వందనం సమర్పిస్తున్నాను.


🌺

వాగీశ్వరి...


వికసిస్తున్న తామర పుష్పంలో  ఆశీనురాలై, 

హస్తాలలో  గ్రంధాలు , వ్రాసే  ఘంటం కలిగి, తామరపుష్పాలు ధరించి, కంఠాన పుష్పమాలతో 

శిరస్సున చంద్ర వంక ధరించిన భారతి మనలను ఈ జీవన సాగరాన్ని దాటించాలి..


🌺


వాగీశ్వరీదేవి మరో రూపం

శ్వేత తామరపుష్ప వాసిని ,హంసవాహినియై శ్వేత వర్ణ ప్రకాశినిగా, 

చిరునవ్వులు చిందే వదనంతో, చంద్రుని వంటి మేని  ఛాయ , శిరస్సున

నెలవంక ధరించి, వీణ, అమృత కలశం, జపమాల, వెలిగే దీపం హస్తాలలో  ధరించి 

భారతి మన భావాలని 

ప్రకాశింప చేస్తుంది. 


🌺

రుద్ర వాగీశ్వరి...

శ్వేత వర్ణం కలిగి  మేధస్సు ను కలగి,  పండ్లు, పుస్తకం ,ధరించి

వరదాభయ హస్తాలు కలిగిన సర్వాలంకారభూషితురాలైన  వాగీశ్వరికి వందనమాచరిస్తున్నాను. 


🌺

విష్ణు వాగీశ్వరి..

బంగారు మేని ఛాయ, పండ్లు, గ్రంధం, కలశం 

అభయ హస్తం ధరించి సర్వాలంకృతయైన విష్ణు వాగీశ్వరిని సేవిస్తున్నాను.


🌺

చింతామణి సరస్వతి..

వాణీ సరస్వతి..

శ్వేత వర్ణ తామరపుష్పంలో, హంసవాహినియై , శ్వేత వర్ణం తో ప్రకాశించే , శిరస్సున నెల వంక , వీణ 

అమృత కలశం, జపమాల , ప్రకాశించే జ్యోతిని హస్తాలలో ధరించి , చంద్రుని వలె ప్రకాశించే దేవిని సేవిస్తూ

దేవి అనుగ్రహాన్ని పొందుదాము.


🌺

వాగ్దేవి సరస్వతి...

శ్వేత వర్ణదేహ ఛ్ఛాయ

శ్వేత సుమ మాల ,శ్వేతవర్ణాంబరధారిణి, నెల వంకని ధరించినదై, చిరు నవ్వుతో వున్న

వదనంతో,  జ్ఞాన ముద్ర

అమృతకలశం, జపమాల

తాళపత్రగ్రంధాలు హస్తాలలో ధరించనది, 

తామరపుష్పంలో ఆశీనురాలైన,  

సుగాత్రి అయిన , త్రినేత్రములు కలిగిన 

సర్వ సంపదలను అనుగ్రహించే కరుణామయి అని కీర్తించబడే వాగ్దేవికి వందన మాచరిస్తున్నాను.


🌺

నకులి సరస్వతి...

అందమైన పలువరుసలతో, కొంచెం గా మూసిన పెదవులతో, 

వజ్రము వంటి తీక్షణమైన

జ్ఞానం తో ముల్లోకాలను పాలించే, వాగ్దేవి నాకు

ఉన్నతమైన వాక్కుని  ప్రసాదించుగాక.  ఆ దేవి

నాకు సర్వ శక్తులు  ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను.


గరుడ వాహనం  కలిగిన, 

అతిసౌందర్యవతి,  నాలికపై ఉద్భవించే  దేవి, సందేహాలను తీర్చే దేవి, వీణాగాన ప్రియ, చక్రం, శంఖం,  చురకత్తి,  ఆడ శుకమును, హస్తాలలోధరించి,  రాజభోగాలను

అనుగ్రహించే దేవి, పచ్చని మేని ఛాయ కలది.  ఈ విధమైన నకులీ దేవి

నా హృదయంలో నివసించి సర్వదా నన్ను కాపాడుగాక.


🌺

మహా సరస్వతి..

గంట, శూలం, కలప, రోకలి, చక్రం, ధనుర్బాణాలు  మొదలైన ఎనిమిది ఆయుధాలు ధరించినదై, శరత్కాలంలో ని చంద్రకాంతి వలె ప్రకాశించే, చంద్రుని వంటి శోభ కలిగి, గౌరీదేవి దేహం నుండి ఆవిర్భవించిన దేవియై

ముల్లోకాలకి ఆధారభూతమై, శుంభుడు మొదలైన దానవులను సంహరించిన దేవి అయిన మహాసరస్వతికి

వందనమాచరిస్తున్నాను. 


🌺

సౌభాగ్య వాగీశ్వరి..

 ప్రకాశవంతమైన చంద్రకళలను ధరించి, 

శ్వేత వర్ణఛ్ఛాయ కలిగినది. కుచభారంతో

నిండిన సౌందర్యము కలది, శ్వేత వర్ణ తామర పుష్పంలో ఆశీనురాలై,

ఘంటం, గ్రంధం, హస్తాలలో ధరించిన యీ వాగ్దేవి మనకి అనుగ్రహం

ప్రసాదిస్తుంది.


🌺

బ్రాహ్మీ...

నాలుగు ముఖాలు, ఆరు హస్తాలు కలిగిన దేవి. 

హంస వాహనం మీద ఆశీనురాలై వుంటుంది. పసుపు వర్ణ ఛ్ఛాయ, ఆభరణాలు ధరించినదై,

జింక చర్మాన్ని  ఉత్తరీయంగా ధ‌రించిన దేవి.  ఎడమ ప్రక్కన వున్న  మూడు చేతులలో

వరదం, సూత్రం, స్వరూపం, మదలైనవి. 

కుడి ప్రక్కన వున్న చేతులలో , గ్రంధం, ఘంటం, అభయం ధరించిన దేవిని ధ్యానిద్దాము.


🌺

శుధ్ధ విద్య..

శ్వేత వర్ణం కలిగినది.

జపమాల, పుస్తకం 

చిన్ముద్ర కలిగి ఆభయ ముద్రలతో అనుగ్రహించే

శుధ్ధ విద్యాదేవిని ధ్యానిద్దాం.


🌺

సరస్వతి (మరో రూపం)

 నాలుగు హస్తాలు కలిగిన దేవి. ఒక చేతిలో స్ఫటికాలతో చేసిన జపమాల, ఒక హస్తంలో

శ్వేత  తామరపుష్పం.

మరి యొక చేతిలో చిలుక, మరో చేతిలో గ్రంధం, కలిగినది. 

తెల్లని తామరపుష్పం, 

చంద్రుడు, శంఖం కలిగి

స్ఫటికం వలె ప్రకాశించే దేవి.  వాక్కుకి ఎదురేలేని శక్తిగా వున్న సరస్వతీ దేవి

సదా నా వాక్కులలో నివసించుగాక.


🌺

సరస్వతి ( మరొక  రూపం)..


నాలుగు హస్తాలు కల దేవి. శ్వేత పద్మ నివాసిని.

ఝటా ఝూటం ధరించినది.  శ్వేత వర్ణ మేని ఛాయ. జంధ్యం ధరించినది. శ్వేత వర్ణాంభర ధారిణి. 

మూత్యాల మాలతో అలంకరించిన దేవి. 

కుడి ప్రక్క వున్న రెండు హస్తాలలో  గ్రంధాన్ని, రుద్రాక్ష మాలని ఎడమ ప్రక్కన వున్న హస్తాలలో

చిలుకను, తామరపుష్పాన్ని ధరించి

వుంటుంది. అత్యంత సౌందర్యవతి. వీణావాదనమనిన ప్రియము కల  సరస్వతీ దేవికి వందనములు ఆచరిస్తున్నాను.


🌺

బాలా..

బాలా దేవి చేతిలో , జపమాల , పుస్తకం,  ధరించిన బాల సరస్వతీ దేవి స్వరూపమ

కామెంట్‌లు లేవు: