23, అక్టోబర్ 2020, శుక్రవారం

జోక్

 🌷🌷🌷


చార్లీ చాప్లిన్ ఓ సభలో

ఓ జోక్ చెప్పారు. అందరూ గొల్లున నవ్వారు.


నవ్వులన్నీ ఆగిన తర్వాత చాప్లిన్ ఆ జోకునే మళ్ళీ చెప్పారు. సభలో సగం మందే నవ్వారు.


కాస్సేపు తర్వాత చాప్లిన్ మళ్ళీ ఆ జోకునే చెప్పారు. ఈసారి అతి తక్కువమందే నవ్వారు.

చాప్లిన్ నాలుగోసారి ఆ జోకుని చెప్పినప్పుడు ఒక్కరూ నవ్వలేదు. సభ నిశ్శబ్దంగా ఉంది.


అప్పుడు చాప్లిన్ ఇలా అన్నారు....


"నవ్వులు పుట్టించిన జోకునే పదే పదే చెప్తే నవ్వు తెప్పించనప్పుడు

ఒకే దిగులునే పదే పదే అనుకుని బాధపడడం ఎందుకు? జీవితంలో ఏవీ శాశ్వతం కావు. 


నవ్వుల వెంట కన్నీళ్ళూ, కన్నీళ్ళ వెంట నవ్వులూ ఉంటూ ఉంటాయి....

దేన్నయినా స్వీకరించకతప్పదు" అని...


ఇవి మన జీవితంలో ఉంటూనే ఉంటాయి. దేనిని తక్కువగా చూడొద్దు ఒక దాని వలన ఒకటి మనం పొందగలుగుతున్నాం అనే ఆలోచనతో ముందుకు పయనించడమే.....


🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: