23, అక్టోబర్ 2020, శుక్రవారం

వానను దేనితో కొలుస్తాం*

 💧   *వానను దేనితో కొలుస్తాం*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

వానను దేనితో కొలుస్తాం ---

మునిగి ఇంకా తేలలేని

ఇండ్ల లెక్కతో కొలుస్తాం!

కోసుకు కోసుకు పోయిన రహదారుల లెక్క పత్రాలతో 

కట్టకట్టి కొలుస్తాం!

  

వానను దేనితో కొలుస్తాం -

బాధితుల లెక్కకు రాని

కన్నీళ్లతో కొలుస్తాం!

కట్ట తెగి బట్టబయలైన

మన రారాజుల నవాబుల నాటి

చెరువులతో కొలుస్తాం !


వానను దేనితో కొలుస్తాం ---

చేతికి రాబోయి చేజారిన

రైతు వేదనల పంటతో కొలుస్తాం!

కలం నుండి వరద ఊటైన

కవుల కవితలతో కొలుస్తాం !

      - కందాలై రాఘవాచార్య

కామెంట్‌లు లేవు: