23, అక్టోబర్ 2020, శుక్రవారం

శివామృతలహరి


.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని మరొక పద్య రత్నం;

శా||

సీతాకోకము భంగి చిక్కక జనున్ చిత్రం బదృష్టం; బదే

రీతిన్ పట్టగఁజూచినన్ దొరక దోర్మింజూపి కూర్చుండినన్

చేతుల్ కట్టుక - వ్రాలవచ్చు నొడిలో - చింతింపరీరీతి దు

ర్నీతిం జిక్కి హతాశులౌదురు జనుల్! శ్రీ సిద్ధలింగేశ్వరా!


భావం;

అదృష్టమనేది సీతాకోకచిలుక వంటిది,ఎంతసేపూ దాన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తుంటే చేతికి దొరకదు.

దాని గురించి ఆలోచించకుండా ఓర్పుగా మన ప్రయత్నాలు మనం చేస్తూ కూర్చుంటే వచ్చి ఒడిలో వాలుతుంది.

కానీ జనం ఈవిధంగా ఆలోచించకుండా ప్రయత్నం వెనుక కాకుండా అదృష్టం వెనుక పడి అది దొరకకపోతే అక్రమ మార్గాలు అనుసరించి, ఫలితం లభించక,నిరాశ చెందుతూ ఉంటారు కదా! శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

..సుబ్బు శివకుమార్ చిల్లర.

కామెంట్‌లు లేవు: