23, అక్టోబర్ 2020, శుక్రవారం

కాళరాత్రి

 కాళరాత్రి


ప్రధమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ!

తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చథుర్ధకమ్!

పంచమమ్ స్కంధమంతేతి షష్టం కాత్యాయనతిచ!

సప్తమం కాళరాత్రేతి మహాగౌరీతి అష్టమం!

నవమ సిధ్ధిధాత్రీచ నవదుర్గాః ప్రకీర్తితాః 



కాళరాత్రి నవదుర్గలలో ఒక దుర్గా స్వరూపం. శక్తి లేకుండా ఎప్పుడూ ఏ పని జరగదు. శక్తి అనేది ఉంటేనే మనము ఏ పనినైనా పూర్తి చేయగలుగుతాము. నిర్మాణం చేయాలన్న, నిలబెట్టాలన్నా శక్తి ఉండాలి. లోకంలో ప్రళయం అని ఒక మాట వింటూ ఉంటాము. మనము సామాన్యంగా ప్రళయం అనగానే, అది ఒక క్రౌర్యంతో కూడుకున్నదని అనుకుంటూ ఉంటాము. భగవంతునికి కోపం వచ్చి ప్రళయం చేస్తాడనుకుంటాము. ఈశ్వరుడు నిర్వహించేటటువంటి పనులలో కేవలం కారుణ్యము మాత్రమే ఉంటుంది తప్ప క్రౌర్యానికి తావు లేదు. ఆయన ప్రళయం ఎందుకు చేస్తాడంటే, ఎన్ని జన్మలకో ఇచ్చిన భక్తితో ఉండక నన్ను పొందు అని అవకాశం ఇచ్చినా పొందలేకపోతున్నాడు, అని మనమీద కారుణ్యముతో ఆ జీవుడు నన్ను ఎలాగో పొందలేక పోతున్నాడు. నేనే వాడిని పొందేస్తాను అని అందరినీ ఆయన పొందేస్తాడు. ఇలా పొందే ప్రక్రియకు ప్రళయం అని పేరు. సృష్టి చేసేవాడు, పడగొట్టేవాడు కూడా ఆయనే. ఈ ప్రక్రియలు చేయడంలో ఆయనకి కోపం ఏమీ ఉండదు. అమ్మవారు కాళరాత్రి అని ప్రవర్తించేటప్పుడు కూడా ఆవిడ అంత కారుణ్యమూర్తియే.


సంస్కృత భాషలో రాత్రిని 'నిశ' అంటారు. అర్ధరాత్రిని 'నిశీధి' అంటారు. నిశీధి కాలంలో అనగా ఆర్ధరాత్రి కాలంలో జీవన ప్రక్రియలన్నీ ఆగిపోతాయి. మళ్ళీ బ్రహ్మ ముహూర్తం వచ్చేటప్పటికి కార్యక్రమాలు మొదలవుతాయి. దీనిని బట్టి శక్తిని పుంజు కోవాలంటే పరిగెత్తడం ఎంత అవసరమో, ఆపడం కూడా అంతే అవసరం. కాళరాత్రి అంటే ఆపే ప్రక్రియకి సంకేతం. ఆవిడ మొత్తం కదలికలను ఆపుతుంది. రాత్రులు మూడు రాత్రులుగా ఉంటాయి. జీవరాత్రి, ఈశ్వరరాత్రి మరియు కాళరాత్రి.


జీవరాత్రి అంటే జీవులన్నీ పడిపోతాయి. ఇక జీవులు ఉండవు. మహాప్రళయము అంటారు. సముద్రాలలో ఉండే నీరు అంతా భూమి మీదకి వచ్చి ఒక్క జీవి కూడా మిగలదు. అన్ని లయమై పరమేశ్వరుని లోకి వెళ్ళిపోతాయి.


ఈశ్వర రాత్రి అంటే ఈశ్వరుడు కార్య నిర్వహణ చేస్తూ ఉంటాడు. జీవులు లయమవుతూ ఉన్నాయి. అంటే ఈశ్వర సంబంధంగా ఒక పని అవుతున్నది కదా. అందుకని ఈశ్వర కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఆ ఈశ్వర కార్యక్రమాలను ఆపేస్తుంది. దానికి ఈశ్వర రాత్రి అంటారు.


కాళరాత్రి ఇవేమీ ఉండకుండా అన్నీ వెళ్లి పరమేశ్వరునిలో చేరిపోతే దానిని కాళరాత్రి అంటారు. ఈ సమయంలో సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉండవు. కాలం నడవడం ఉండదు. కటిక చీకటి ఒక్కటే మిగులుతుంది. దానిని కాళరాత్రి అంటారు.


నడవడానికి ఏ తల్లి శక్తి రూపంగా నడిపిస్తుందో ఆ తల్లే ఉప సంహారం కూడా చేస్తుంది. నడకకి కాలం ప్రధానం. కాలం కదులుతూ ఉంటుంది. ఆవిడ కదులుతున్న కాలాన్ని కూడా ఆపేస్తుంది. అలా ఆప గలిగిన శక్తి ఏదో ఆవిడ కాళరాత్రి. ఆవిడ సమస్త బ్రహ్మండాలను ఆపివేస్తుంది. ఆవిడ అనుగ్రహిస్తే ఎక్కడినుండి ఎక్కడి వరకు ఏదైనా ఇచ్చేస్తుంది. శివశక్త్యై రూపిని లలితాంబికా అంటూ ఆవిడ వైపు చూడకుండా ప్రార్ధన చేయక, అనుగ్రహం పొందలేకపోతే దీపపు పురుగులు పుట్టినట్లు కొన్ని కోట్ల జన్మలు పుట్టి, గిడుతూనే ఉంటాము. ఇన్నింటిని నడుపుతున్న తల్లిని చూడాలని ఉన్నది, అని మనసులో అనిపిస్తే, విజయవాడ వెళితే, ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ కాళరాత్రి, ఆవిడ కదుపుతున్నది. ఎర్రగా తాంబూల చర్వణం చేస్తూ, నవ్వుతూ, త్రిశూలం చేతిలో పట్టుకుని నిలబడి ఉంది. ఈ కదలికలు అన్నింటికీ కారణం ఆవిడ కాళరాత్రి. ఏదైనా అనుగ్రహించగలదు. అలాంటి అనుగ్రహాన్ని మనమందరం అ తల్లి దగ్గిరనుండి అపెక్షిస్తూ....


సర్వేజనా సుఖినోభవంతు


శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి


WhatsApp Number: +91 8886240088

కామెంట్‌లు లేవు: