4, డిసెంబర్ 2020, శుక్రవారం

హిందూ ధర్మం - 5

  **దశిక రాము**

హిందూ ధర్మం - 5



(మనకూ ఇతర మతాలకు ఉన్న తేడా)


ఎవరో ఏదో చెప్పడం, అందరూ దాన్ని గుడ్డిగా ఆచరించుకుంటూపోవడం, దాన్ని ప్రశ్నించడాన్ని నిషేధించడం వంటివి మతంలో కనిపిస్తాయి. మీరందరూ నా మాట వినాలి, నేను చెప్పిందే సత్యం, నాకు వ్యతిరేకంగా చెప్తే చంపేస్తాను వంటివి మతంలోనే కనిపిస్తాయి. అది పసి పిల్లల మనస్తత్వం. అన్ని మత గ్రంధాలు చదవండి, మీకే అర్ధమవుంది, ఎవరి దృక్పధం విశాలమో, ఎవరు అందరి గురించి ఆలోచించారో మీకే స్పష్టమవుతుంది. కానీ ఈ ధర్మంలో అటువంటివి ఉండవు. ఇక్కడ భగవంతుని అనుభూతి చెందడం ముఖ్యం. హిందువుల ధృక్పదంలో భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్ధం పర్ధం లేని కథలు చెప్పి, నన్నే పూజించమని చెప్పమనో, మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పమనో, ఎవరిని ఈ భూమి మీదకి పంపడు. ఎవరో దేవుడు ఉన్నాడని చెప్తే, అందరూ అది నమ్మాలి అని ధర్మం చెప్పదు, దేవుడిని ఉనికిని నిర్ధారించుకునే మార్గం చూపిస్తుంది, భగవత్ సాక్షాత్కారాన్ని సుగమం చేస్తుంది. శాస్త్రంలో చెప్పినవాటిని ప్రశ్నించే హక్కు ఇచ్చింది, ప్రశ్నించి, శోధించి, అనుభవంలో తెలుసుకునే ఆచరించే స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఇది ఒక్క ఈ ధర్మానికి మాత్రమే చెల్లింది.


ఎవరో ఒక వ్యక్తి దేవుడి గురించి ఏవో కొన్ని విషయాలు చెప్తే, అవే తరాల తరబడి మూఢంగా నమ్మూతూ ఉండడం మన ధర్మంలో ఉండదు. ప్రతి ఒక్కరు మరణించేలోపు దైవాన్ని చూడాలి, దైవాన్ని ప్రత్యక్షానుభూతితో తెలుసుకోవాలి, అదే దైవంలో ఐక్యమవ్వాలి. ఇదే హిందూ ధర్మం భోధిస్తుంది. అంతేకానీ, పుట్టినప్పటి నుంచి చచ్చేవరకు, నీ పూర్వులు నమ్మారు కనుక నువ్వు నమ్మాలని, కేవలం దేవుడు ఉన్నాడన్న మూఢనమ్మకంతో జీవించమని, అదే నమ్మకంతో చావమని చెప్పలేదు. అవసరమైతే నిన్ను నువ్వు ప్రశ్నించుకో, శాస్త్రగ్రంధాలను చదువు, దైవం ఉన్నదని నిర్ధారించుకో, ఆ తర్వాతే అతడిని చేరుకో అన్ని ప్రపంచంలో ఒక్క హిందూ ధర్మం మాత్రమే చెప్పగలదు.


ఇవన్నీ మనకూ, ఇతర మతాలకు ఉన్న తేడా. ఇక మన ధర్మం గురించి తెలుసుకుందాం.


**ధర్మో రక్షతి రక్షితః*

కామెంట్‌లు లేవు: