4, డిసెంబర్ 2020, శుక్రవారం

కార్తికదీపారాధన మహత్యాన్ని తెలిపే పురాణ కథలేవి?*

 🌹💐🌷🌾🥀🌸🌺

*కార్తికదీపారాధన మహత్యాన్ని తెలిపే పురాణ కథలేవి?*


*కార్తికపురాణం కార్తికమాస ప్రాధాన్యాన్ని తెలియచేస్తోంది*

  

*ఆ పురాణం ప్రధానంగా దీపమహత్యాన్ని రెండు కథల ద్వారా తెలియచేస్తోంది.* 


*మొదటిది మూషికం మోక్షం పొందిన కథ కాగా, రెండోది మోడు ముక్తి పొందిన కథ*


*మొదటికథలో.. కర్మనిష్టుడనే యోగి కార్తికమాసంలో స్నానం ఆచరించడానికి సరస్వతీ నదీతీరానికి వస్తాడు. ఆ నదీతీరంలో ఆయనకు ఒక పాడుపడ్డ విష్ణు ఆలయం కనిపిస్తుంది. ఆలయం శిధిలావస్థలో ఉండడంతో బాధపడిన కర్మనిష్ఠుడు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆలయాన్ని తుడిచి, కడిగి శుభ్రం చేశాడు. తరువాత శక్తికొద్దీ ప్రమిదలు ఆ వత్తులు, నూనె సంపాదించి ఆలయంలో పన్నెండు దీపాలు వెలిగించాడు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ అక్కడే ఉన్నాడు. కార్తిక శుద్ధ ద్వాదశినాడు ఎప్పటిలాగే కర్మనిష్ఠుడు దీపాలు వెలిగించి తపస్సు చేసుకుంటుండగా, అక్కడికో ఎలుక వచ్చింది. నూనెతో తడిసిన వత్తులను నాకేందుకు ప్రయత్నం చేసింది అనుకోకుండా పక్కనే ఉన్న దీపం వెలిగింది. ఆ తరువాత కొంతకాలానికి ఆ ఎలుక మరణించింది. కార్తిక దీపారాధన పుణ్యబలం వల్ల దానికి ఉత్తమమైన పునర్జన్మ కలిగింది. కార్తికంలో స్వయంగా దీపారాధన చేయకపోయినా, ఇతరులు వెలిగించిన దీపాలు కాపాడినా గొప్ప పుణ్యం దక్కుతుందని కథ పరమార్థం*


*రెండో కథలో మతంగాశ్రమం సమీపంలో కొంతమంది రుషులు కలిసి ఒక స్తంభదీపాన్ని ఏర్పాటు చేస్తారు. ఒక చెట్టుమోడు మీద ధాన్యం, నువ్వులు పోసి దానిపై ఒక పాత్రలో దీపారాధన చేస్తారు. కొంత సేపటికి దీపం వెలిగించి ఉంచిన మోడు ఫెళ ఫెళ విరిగిపడడం చూసి వారు ఆశ్చర్య చకితులయ్యారు. ఆ మోడులోంచి ఒక దివ్యపురుషుడు వచ్చి, మునులకు నమస్కరించాడు. గతజన్మ పాపఫలంగా తాను మోడుగా పుట్టానని, ఇన్నాళ్లకు కార్తిక దీపారాధన వల్ల తనకు ఉత్తమ జన్మ వచ్చిందని తెలియచేశాడు*


*కార్తికంలో మనకోసం ఇతరులు, ఇతరుల కోసం మనం కూడా దీపాలు వెలిగించవచ్చు. ప్రాణులందరి క్షేమం కోసం దీపారాధన చేసే పవిత్ర సందర్భం కార్తికమాసం.*


                    *భక్తి*

                   M.s.s.k

కామెంట్‌లు లేవు: