4, డిసెంబర్ 2020, శుక్రవారం

🌹శ్రీలలితా సహస్రనామ వివరణ

 🌹శ్రీలలితా సహస్రనామ వివరణ 🌹


*44. నఖదీధిత సంఛన్న నమజ్జన తమోగుణా*


శ్రీమాత కాలిగోళ్లు చంద్రుని ముక్కలుగా చల్లగా ప్రకాశిస్తూవున్నవి.


బ్రహ్మ మొదలగు దేవతలంతా తల్లి పాదములకు తలలు వాల్చి నమస్కరిస్తూ ఉండగా వారి కిరీటములలో పొదగబడిన మణుల కాంతులు ఆమె పాదముల గోళ్ళపై బడి ఆ మణుల కాంతిలో అవి అద్దములవలె ప్రతిబింబిస్తూ వున్నాయి.


ఆ విధంగా ప్రతిబింబించే తల్లి గోళ్ళ కాంతులు దేవతల హృదయములలో ప్రవేశించి వారి 'తమో' భావమును అనగా అజ్ఞానమును పోగొట్టుతున్నవి అని భావము. సామాన్య చంద్రుని కాంతి చీకటులను పోగొడుతూ (బయటవున్న అంధకారము) వుంటే - శ్రీమాత యొక్క గోరుల నుండి ప్రసరించే దివ్యమైన కాంతులు 'అజ్ఞానం' అనే అంధకారమును కూడా పోగొడుతున్నవి.


కం|| నఖముల, కాంతుల దీప్తులుఅఖిలము వెలిగించు కిరణ మభినవ కీర్తుల్! నఖదీధితి వెల్లువలోనిఖిల తిమిర నాశమంత నీదే తల్లీ !!


         లలితానామసుగంధం

                   M.s.s.k

కామెంట్‌లు లేవు: