4, డిసెంబర్ 2020, శుక్రవారం

కన్నీళ్లు కధ

 *హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు.....*

*భోజనానికి ఎంత తీసుకుంటారు......*

*యజమాని చెప్పాడు...*

చేపల పులుసుతో అయితే 50 రూపాయలు, 

*అవి లేకుండా అయితే 20 రూపాయలు....*

*ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జేబులోనుండి నలిగి ,ముడతలుపడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు....*

*నా చేతిలో ఈవే ఉన్నాయి..*

*వీటికి ఎంతవస్తే అంతే పెట్టండిచాలు....ఉత్తి అన్నమైనా ఫరవాలేదు...*

*కాస్త ఆకలి తీరితే చాలు.*

*నిన్నటి నుండి ఏమీ తినలేదు...*

*ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి. గొంతు వణుకుతోంది....*

*హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్నీ ఆయన విస్తరిలో వడ్డించాడు.*

*నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తు నిలబడ్డాను....* ఆయన కంటినుంది కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి.వాటిని తుడుచుకుంటూ చిన్న పిల్లడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని, ప్రక్కన కూర్చున్నవ్యక్తి అడిగాడు....*


*మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా...?,*

* ఆయన ఆ మాట అడిగిన వ్యక్తివైపు చూసి కళ్ళు వొత్తుకుంటు ఇలాచెప్పారు...*

   * నా గత జీవితం గుర్తుకువచ్చి కన్నీళ్ళు వచ్చాయి.... నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి.....*

* ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి.... నేను కూడపెట్టిన ప్రతీ పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చుపెట్టాను. దానికోసం నేను నాయవ్వనాన్ని, 28 సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను...*

* అన్నింటికి నా వెన్నుముకై నిలచిన నా భార్య నన్ను ఒంటరివాడినిచేసి ముందే వెళ్లి పోయింది....ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటినుండి నా కొడుకులు, కొడళ్లు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు.వాళ్లకు నేను భారమవ్వడం మొదలైనాను.

* ఎంత ఒదిగి ఉంటున్నా , నన్ను వాళ్ళు అంత దూరంపెట్టనారంభించారు....*

* నేను వృద్దుణ్ణి కదా....? కనీసం 

నా వయస్సు కైనా గౌరవమివ్వచ్చుకదా....? అదీ ..లేదు...*

* వాళ్లందరు భోజనం చేసిన తరువాతనే నేను భోజనానికి వెళ్లే వాడిని, అయినా అప్పుడు కూడా తిట్లూ, చీత్కారాలు తప్పేవి కావు, భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పగా అయ్యేది, మనవలుకూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ, నాన్న చూస్తే తిడతారనే భయంతో...*

* ఎప్పుడు ఒకటే సతాయింపు ఎక్కడికైనా పొయి బ్రతకవచ్చుకదా, అని...*

*పగలనక, రాత్రనక, చెమటోడ్చి కష్టపడి, కంటినిండా నిద్ర పోకుండా, కడుపునిండా తినకుండా ఆమె, నేను కూడబెట్టిన డబ్బుతో ఒకొక్క ఇటుక పేర్చి కట్టిన ఈ ఇల్లు...., ఆమె జ్ఞాపకాలు, చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఆ ఇల్లు విడచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకు వేయనీయడం లేదు...*

* కానీ ఏం చేయను కోడలి బంగారం దొంగిలించాననే నెపంతో దొంగ అనే ముద్ర వేశారు...* కొడుకు కోప్పడ్డాడు, ఇంకా నయం కొట్టలేదు, అదే నా అదృష్టం. ఇంకా అక్కడ నిలబడితే అదికూడా జరగవచ్చు. *తండ్రి* పై చేయి చేసుకున్న *కొడుకు* అనే అపవాదు వాడికి రాకూడదని, బయటకు వచ్చాను. నాకు చావంటే భయం లేదు, అయినా నేను బ్రతికి ఎవరికి ఉపయోగం, ఎవరికోసం బ్రతకాలి....?

*ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు..*

తనవద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు....

యజమాని వద్దు చేతిలో ఉండనివ్వండి అన్నాడు....*

*ఎప్పుడైనా మీరు ఇక్కడకు రావచ్చు...*

*మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది..*

*ఐతే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడపెట్టి చెప్పాడు....*

చాలా సంతోషం, మీ ఉపకారానికి.... ఏమి అనుకోకండి... ఆత్మాభిమానం, నన్ను విడవటంలేదు. వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకుని *గమ్యంతెలియని బాటసారిలా...* వెళ్ళిపోయాడు.

ఆ వ్యక్తి నా మనసుకి చేసిన గాయం నేటికీ మానలేదు.

*అందుకే అంటారు ప్రతీ పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండుటాకు అవుతుందని .......*

పండుటాకులాంటి ఆ పెద్దలను పువ్వులలో పెట్టి చూసుకోవాలని, లేకుంటే మనకు అటువంటి ఒకరోజు వస్తుందని ఎవరు చింతించడం లేదు..???


*కావలసింది, అక్కరలేనిది అని తేడా లేకుండా ప్రతీది షేర్ చేసి MB అవగొట్టేవాళ్ళు, దీన్నికూడా షేర్ చెయ్యండి 

ఎవరైనా ఒక్కళ్ళ మనసు మారినా.....* చాలు.*

* మార్పు మననుండే ప్రారంభం కానీయండి.*

🙏🙏ధన్యవాదాలు🙏🙏

కామెంట్‌లు లేవు: