4, డిసెంబర్ 2020, శుక్రవారం

జలం గురించి

 మనుష్యులకు ప్రాణప్రదమైన జలం గురించి సంపూర్ణ వివరణ - 


   ఈ సకల సృష్టిలో సకలప్రాణులకు ప్రాణాధారం నీరు. ఆహారం తీసుకోకుండా అయినా కొన్నిరోజుల వరకు అయినా ప్రాణం నిలుపుకోవచ్చు ఏమో కాని నీరు తాగకుండా జీవించడం మహా దుర్లభం . ఇప్పుడు మీకు నీటి గురించి ఆయుర్వేదం ఎంత గొప్పగా వివరించిందో మీకు తెలియచేస్తాను.


 * జలం చలవ చేయును . హృదయమునకు మేలు చేయును .


 * పిత్తము, విషము, భ్రమ , దాహము, అజీర్ణం, మదాత్యరోగమును హరించును .


 *  వాత రోగము, కుష్టు రోగము, గొంతు సంబంధ రోగము, కొత్తగా వచ్చిన జ్వరం, గ్రహణి , అతిసార రోగము, కడుపు ఉబ్బరం , అజీర్ణ రోగులు , ఎక్కిళ్లు వ్యాధి కలవారు , గుల్మరోగులు , నాభియందు వ్రణం కలిగినవారు , కఫ రోగులు , మేహము, అరుచి, వగర్పు, పాండు రోగులు , నొప్పి , వాంతులు , విరేచనాలతో ఇబ్బంది పడుతున్నవారు చల్లని నీటిని పుచ్చుకోకూడదు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే సేవించవలెను .


 * నూతి నీరు కఫాన్ని హరించును , శరీరం నందు వేడిని కలుగచేయును .


 * చెరువునీరు వాతాన్ని ప్రకోపింపచేయును . పెద్ద చెరువుల నీరు శరీరం నందు వేడిని పెంచి వాతాన్ని, కఫాన్ని హరింపచేయును .


 * సెలయేటి నీరు హృదయమునకు మేలుచేసి శరీరం నందు వేడి పెంచును.


 * మడుగునీరు పిత్తమును మరియు తాపమును హరించును . విశేషముగా ఆకలి పుట్టించును .


 * సొరకాయ దోన లేక సోన నీళ్లు అగ్నిని పెంచి కఫాన్ని హరించివేయును , మధురముగా ఉండును.


 *  వర్షము ద్వారా లభించు జలం భూమిని తాకకుండా ఉన్న జలం సకల దోషాలను హరించివేయును .


 * హంసోదకం , పగటి యందు సూర్యకిరణముల చేత కాగి రాత్రి చంద్రకిరణముల చేత చల్లబడిన నీరుని హంసోదకం అని పిలుస్తారు . ఇది త్రిదోషములను హరించును . మలమును బంధించును. ఆయురారోగ్యాలను వృద్ధిబొందించి దోషరహితమై అమృతతుల్యముగా ఉండును.


 *  గోదావరి నది జలం పత్యకారి , పిత్త సంబంధమైన రోగములు, రక్తదోషము, వాతము, కుష్టువు మొదలగు దుష్టరోగాల సంహారిగా , దాహ శాంతికరంగా ఉండి , శరీరం నందు అగ్నిని పెంచి తాపమును పోగొట్టును.


 *  కృష్ణా నది జలం రుచిగా ఉండును. శుద్ధం అయినది . జడత్వమును పోగొట్టి రక్తంలో వేడిని పెంచును.


 * చెలములు నుండి గ్రహించిన నీరు శుక్రమును వృద్ధిచెందించి పిత్తకఫాలను హరించి దాహాన్ని తగ్గించి తృప్తిని కలుగచేయును . శరీరం నందు వేడి పెంచును.


 * ఎర్రని భూమియందలి నీరు వాతరోగాన్ని పెంచును. మలిన భూమియందు నీరు రోగములను పుట్టించుటయే కాక దోషకారిగా ఉండి అజీర్ణరోగాన్ని కలిగించును.


 * తెల్లని భుమియందలి నీరు వాతాదిరోగాలను పొగొట్టును. పత్యకారిగా , మధురంగా ఉండును.


 * నలుపు రంగు భుమియందలి నీరు ప్రశస్తమైనది. త్రిదోషాధి సమస్తరోగములను హరించివేయును . ఉప్పునీరు వేడిని మరియు శరీరంలో జఠరాగ్ని వృద్ది చెందించును. కఫవాతరోగములకు చాలా మంచిది . మేహరోగులు వాడరాదు.


 * మెరక ప్రదేశము నందలి జలం సకలదోషములను పోగొట్టి జఠరదీప్తిని కలిగించును. పల్లపు ప్రదేశాల్లో ఉండు జలం జఠరాగ్నిని తగ్గించి అనేక రోగములను కలిగించును.


 * ఆకులు మొదలుగునవి పడి కుళ్ళిన నీరు , వర్షాకాలం నందు ప్రవహించు కొత్తనీరు ఉపయోగించిన శరీరం లోపల , బయట అనేక కొత్తరోగములు పుట్టించును .


 * తామరాకులు, పచ్చగడ్డి వంటివాటితో కప్పబడి దుర్గంధయుక్తమై ,సూర్యచంద్రకిరణాల ప్రసారం లేక కల్మషంగా ఉండు నీరు రోగకారకంగా ఉండును. సర్వరోగాలను కలిగించును. అదేవిధంగా అకాల వర్షం ద్వారా వచ్చిన నీరు పానయోగ్యం కాదు.


 *  ఒక లీటరు జలం మూడు వంతులు మిగులునట్లు కాచినది వాతరోగమును , సగం అయ్యేంతవరకు కాచినది పిత్తరోగమును , నాలుగోవంతు మిగులునట్లు కాచినది కఫరోగమును మరియు మలబద్ధకం తీసివేయును .శ్లేష్మవాతలను పొగొట్టును.


 *  నురుగులేకుండా బాగా కాచబడి గోరువెచ్చగా ఉండు నీరు సకలరోగాలను హరింపచేయునదిగా ఉండును. ఉష్ణముగా ఉండు జలం జఠరాగ్నిని పెంచి పార్శ్వశూల , పీనస అనగా ముక్కు నుంచి నీరుకారు రోగం , కడుపు ఉబ్బరం , ఎక్కిళ్ళు, వాత , కఫం పొగొట్టును. రాత్రిళ్ళు వేడినీటిని పానం చేసిన అజీర్ణం పోగొట్టును .


 * కాగి చల్లారిన నీరు మంచిది . త్రిదోషాలను హరించును . ధాతుక్షయం , రక్తదోషం , వాతం , ప్రమేహం , విషం , గ్రహపీడ , జీర్ణజ్వరం , టైఫాయిడ్ వంటి రోగములు యందు కాగి చల్లారిన ఉదకం మంచిది .


 *  కాగి చల్లారిన 8 గంటల తరువాత ఆ జలం పులియును. అట్టి జలమును , పగలు కాచిన జలం రాత్రుల యందు , రాత్రుల యందు కాచిన జలం పగలున్ను సేవించిన త్రిదోషాదిదోషములును కలుగచేయును . కాగి చల్లారిన పిమ్మట మరలా కాచిన నీరు విషతుల్యం అగును.


 *  చల్లటినీరు 8 గంటల్లోను, కాగి చల్లారిన నీరు నాలుగు గడియల్లోను , కాగి చల్లారి తేరిన నీరు రెండుగడియల్లోను జీర్ణం అగును.


 *  పైత్యరోగులు , రక్తపిత్త రోగులు , కుష్టురోగులు, వ్రణరోగులు , మూలవ్యాధి, కామెర్లు, నేత్రసంభంద రోగులు , విషజ్వరపీడిత రోగులు , గుదసంభంధ రోగులు , గొంతులో వ్రణం ఉన్నరోగులు , నోటిలో వ్రణం ఉన్నవారు గ్రీష్మఋతువు అనగా ఎండాకాలం నందు వేడినీరు పుచ్చుకోకూడదు.


    

   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: