12, నవంబర్ 2020, గురువారం

ఋభుగీత " (173)*

 _*"ఋభుగీత " (173)*_

🕉🌞🌎🌙🌟🚩


_*12వ అధ్యాయము [సర్వమూ బ్రహ్మమే ]*_


_*తృప్తిలో మనసు బ్రహ్మగా వ్యక్తమౌతుంది !*_


_*ఏ భావం ఉన్నచోట ఆ ఆలోచనే ఉంటుంది. ఏ భావంలేని "అభావస్థితి"లో దైవం ఉంటుంది. ఏభావానికి తావులేకపోవడం అనేది పరిపూర్ణ తృప్తికి సంకేతం. ఆ పరిపూర్ణ తృప్తి కూడా బ్రహ్మమే. మనలోని గుణాలు, గుణాతీతమైన స్థితి రెండూ బ్రహ్మమే. మనలోని మనసు మన గుణాల రూపంలోనే వ్యక్తమౌతుంది. మనసు బ్రహ్మ స్వరూపమే కనుక గుణాలు కూడా బ్రహ్మమే. అందరిలోనూ ఉన్న సహజ, సామాన్య  (కామన్) గుణం ఒకటుంది. అదే మౌనం, అదికూడా బ్రహ్మమే. తృప్తి కలిగినప్పుడు కలిగే స్వాంతనలో నుండి దైవం మౌనంగా వ్యక్తమౌతుంది. తృప్తిలేని మనసు నిరంతరం రణగొణధ్వని చేస్తుంది. తృప్తిలో మనసు బ్రహ్మగా వ్యక్తమౌతుంది !*_


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: