12, నవంబర్ 2020, గురువారం

బాణాసంచాపై నిషేధం

 *రాష్ట్రంలో బాణాసంచాపై నిషేధం విధిస్తూ హైకోర్టు ఆదేశాలు*


 దీపావళి సందర్భంగా తెలంగాణలో బాణసంచా అమ్మకాలు, కాల్చడంపై హైకోర్టు నిషేధం విధించింది. కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో నిషేధం విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 


ఈ మేరకు బాణసంచా నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.దీపావళి సందర్భంగా బాణాసంచా నిషేధించాలని న్యాయవాది ఇంద్ర ప్రకాశ్​ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 


కరోనా పరిస్థితుల్లో కాలుష్యం పెరిగి తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషనర్ కోరారు. సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు రాష్ట్రాల్లో నిషేధించాయని చెప్పారు. దీనికి నిర్దిష్ట పాలసీ రూపొందించలేదని, ఎన్​జీటీ ఇతర మార్గదర్శకాలు పాటిస్తామన్న ప్రభుత్వం తెలిపింది. వాదనలు విన్న న్యాయస్థానం.... బాణసంచా విక్రయాలు, కాల్చడాన్ని నిషేధించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది.


 మరోవైపు ఇప్పటికే పలురాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధించాయి. దిల్లీ సహా కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్‌ ప్రభుత్వాలు నిషేధం విధిస్తూ ప్రకటన చేశాయి

కామెంట్‌లు లేవు: