12, నవంబర్ 2020, గురువారం

తిరుపతి మ్రొక్కులు🔔

 🔔తిరుపతి మ్రొక్కులు🔔

        🚩🦚🚩


ఆనంద నిలయంలో  లక్ష్మీ పద్మావతీ సమేతుడై శ్రీనివాసుడు  నివసిస్తున్న కాలంలో ఒకనాడు లక్ష్మీ దేవి

" స్వామీ! , కుబేరుని వద్ద పుచ్చుకున్న అప్పుకి వడ్డీ

పెరిగిపోతున్నది. 

మన వద్ద అనంతమైన 

సిరి సందలు వున్నాయి కదా , ఇప్పుడే  అప్పు తీర్చేయవచ్చును కదా, అని అడిగింది. 

పురుషోత్తముడు చిరునవ్వు

నవ్వాడు.  " దేవీ, అప్పు

ఆవిధంగా తీర్చడానికి 

తీసుకోలేదు.  నేను అప్పు తీసుకోవడమే లోకంలోని

మానవులకు  ధర్మాధర్మాలు బోధించడానికి , భక్తి మార్గం ప్రచారం కోసమే అని అన్నాడు. 


ఇద్దరు సతులకు  పురుషోత్తముని

మాటలకి అర్ధం తెలియలేదు. 

భగవంతుడే మరల ఆరంభించాడు. 

కలియుగంలోని ప్రజలు

నిష్కామ భక్తి 

(ప్రతిఫలం

ఆశించని భక్తి)   తో వుండడం

అపూర్వమైన విషయం. 

తమకోరికలు నెరవేర్చుకుందుకి ప్రార్ధించి

మ్రొక్కుకునే భక్తే గోచరిస్తుంది.

ఆవిధంగా తమ భక్తి ని

ఆలయాలకి వచ్చి మ్రొక్కులు

తీర్చుకుంటారు. ఆవిధంగా

కలియుగంలో భక్తి  నిలిచి

వుంటుంది.

అందుకనే  వారి  భక్తి కి మెచ్చి వరాలిచ్చే స్వామిగా, నన్ను

తలచినంత మాత్రముననే

వారి కష్టాలు తీర్చే స్వామిగా

కలియుగాంతము వరకు యీతిరుమలపై  నివసిస్తాను. 

" స్వామి!.మీ  దయాగుణము

మాకు తెలుసు. 

భక్తులను అనుగ్రహిస్తూ, 

కుబేరునికి  అప్పు ఎలా తీర్చగలరు ?  అని లక్ష్మీ దేవి ప్రశ్నించినది.  


" దేవీ! కలియుగంలో మానవులకి సిరిసంపదలు

ఒక్కటే ముఖ్యంగా  కనిపిస్తున్నాయి.  అందువలన అనేక పాపాలు చేసి ధనం చేరుస్తారు. ఆ పాపాల ఫలితమే కఠోర వ్యాధులుగాను, కష్టాలుగాను, 

మరణాలుగాను వచ్చినప్పుడు , బాధపడడం

మొదలెడతారు. 

' గోవిందా! నన్ను రక్షించు" అంటూ గోలపెడతారు. 

వారి కష్టాలు తీరితే కానుకలను సమర్పిస్తామని

మ్రొక్కులు మ్రొక్కుకుంటారు.

నేను వారి పాపాలను ఆ కానుకల మీద ఆవాహన చేసి , నా వద్దకు చేరేటట్టు

చేసుకుంటాను.   అన్నాడు స్వామి. 

పాపపు మచ్చ పడిన ధనం వలన మంచి కార్యాలు చేయగలమా? అని దేవి అడిగింది.

" దేవీ దానిలో  కూడా

భావార్ధం యిమిడి వున్నది.

పాపులు సమర్పించిన కానుకలు  అజ్ఞానము వలన బంగారాన్ని యిష్టపడిన వారికి

నన్ను స్తుతించిన వారికి 

అనుగ్రహిస్తాను. పవిత్రమైన

భక్తులు సమర్పించే కానుకలలో ఒక భాగం  నేను తీసుకుని ఒక భాగం కుబేరునికి అప్పు తీరుస్తాను. "

" దీనిలో మా భాగం  ఏమిటి 

స్వామీ ?  

' నన్ను  స్తుతించిన  భక్తులకు

నీవు సిరిసంపదలు  యివ్వాలి. వారు మంచి వారా ,చెడ్డవారా అని చూడకూడదు." అన్నాడు

భగవంతుడు.

" స్వామి! మీ చిత్తానుసారమే

చేస్తాను. కాని ధనం పెరిగిన కొద్దీ వారు గర్వమధాంధులుగా మారకుండా మీరే కాపాడాలి 

అని అన్నది శ్రీదేవి. 

యీ తిరుమల కొండ మీద దానధర్మాలు చేసే వారికి ఒకటికి పదింతలుగా  పుణ్యఫలాలు లభిస్తాయి. 

ఇక్కడ ఏకాగ్రతగా నన్ను పూజించి ధ్యానించిన

ఉత్తములకు ,  పవిత్ర భావాలను,  పుణ్య ఫలాలను కటాక్షిస్తాను. భక్తులకు నీవు

అనుగ్రహించే సంపదల వలన దుర్మార్గం  పెరుగుతుందని

నీవు సందేహించవద్దు." 

అని భగవంతుడు  అన్నాడు.

ఈ సంభాషణము పద్మ పురాణంలో

వివరించబడివున్నది.  కలియుగ

దైవమైన వేంకటేశ్వరుని అనుగ్రహానికి  గల రహస్యాన్ని

యీ విధంగా తెలుపుతున్నది.

ఈ రహస్యం తెలుసుకుని

తిరుమల దేవుని దర్శించిన వారి జీవితం   మంచి మలుపులు తిరిగి సుఖ

సంతోషాలతో వుంటారని

మన పూర్వీకులు 

చెప్పినమాట.


మనం శ్రధ్ధాభక్తులతో  తిరుమలవాసుని సేవించుకుందాము. 

సర్వశుభాలు పొందుదాము.

కామెంట్‌లు లేవు: