12, నవంబర్ 2020, గురువారం

శ్రీరమణీయం - (706)*

 _*శ్రీరమణీయం - (706)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"సర్వత్రా శాంతి విస్తరించి ఉంటే అశాంతి ఎందుకు వాటిల్లుతుంది ? నాకు కర్తవ్య బోధ కావాలి !?"*_


_*ప్రపంచంలోని అశాంతికైనా, మన మనసులోని అశాంతికైనా ఆలోచనలే కారణం. శాంతికి అడ్డుగా ఉన్నదేమిటో గుర్తించి, తొలగించటమే మన ముందున్న కర్తవ్యం. మనం చేయాల్సిన సాధన. ఈ సృష్టియావత్తు ఆత్మచేత నిర్మితం. ఆత్మలేనిది ఎక్కడ ? ఆత్మ-శాంతి ఒక్కటే అయినప్పుడు, ఇక శాంతి లేనిది మాత్రం ఎక్కడ ? సర్వత్రా నుండివున్న శాంతి, సమాజంలో గాని మన మనసుల్లో కానీ ఎందుకు వెల్లివిరియటంలేదు ? ప్రపంచానికి, సమాజానికి ఒక ఉజ్వల భవిష్యత్తు రావాలని కొందరు కోరుకుంటూ ఉంటారు. ప్రపంచం ఎప్పుడు ఉజ్వలంగానే ఉంటుందని భగవాన్ శ్రీరమణమహర్షి అంటున్నారు. ఎందుకంటే ప్రపంచం అనేది స్థిరంగా పడివుండే ఒక జడపదార్థం కాదు. నిత్యనూతన ప్రవాహం. మనం కోరుకున్న శాంతిని ఇప్పటికే అనుభవిస్తున్న వారంతా ఈ ప్రపంచంలో ఉండే అనుభవిస్తున్నారు. అందరికీ అందిస్తున్నారు. ప్రపంచ పరిణామాలను ఎప్పుడు ఆహ్వానించేవారు, వ్యతిరేకించేవారు ఇద్దరూ ఉంటారు. ఇప్పటి తన పరిస్థితి బాగాలేనివాడు ప్రపంచంలో రావలసిన మార్పును కోరుకుంటాడు. ఇప్పటికే సంతోషంతో తులతూగే వాడు ఉన్నపరిస్థితి కొనసాగాలని అనుకుంటాడు. ప్రపంచంలోని మనుషుల్లో ఈ తారతమ్యం ఎప్పుడూ ఉంటుంది. అది మన మనసుల్లో తేడానేగానీ నెలకొని ఉన్న శాంతిలో కాదు !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం }"*_

_*"లేదనే భావనే బాధ - బాధ లేని స్థితే ఆనందం !''*- *(అధ్యాయం -87)*_


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: