11, అక్టోబర్ 2020, ఆదివారం

*మేం విశ్వకర్మలం

 గటక,రొట్టె తిన్నోల్లం

గట్టిగ ఉన్నోళ్ళం...

*మేం విశ్వకర్మలం*


రెక్కల కష్టం నమ్మి

చేతి ,మేధ కళ ను నమ్మి

బతుకు బండి నడిపి నోళ్ళం...

*మేం విశ్వకర్మలం*


దేవునికే రూపమిచ్చి

నీడనిచ్చి తరాలకు బాట సూపినోళ్ళం...

*మేం విశ్వకర్మలం*


చెమట సుక్కల కరిగించి మానవాళికి బతుకు బాట వేసినోళ్ళం... 

*మేం విశ్వకర్మలం*


ఉడుకునెత్తురు కరిగించి మానవాళిని బతికించినోళ్ళం... 

*మేం విశ్వకర్మలం*


దేశభక్తిని గుండెలనిండా నింపుకున్నోళ్ళం... 

*మేం విశ్వకర్మలం*


పస్తులుండి ప్రపంచాన్ని సంస్కృతి వైపు పరిగెత్తించినోళ్ళం...

*మేం విశ్వకర్మలం*


పడుతున్న ప్రపంచాన్ని ప్రతీసారి లేచి నిలబెట్టినోళ్ళం...

*మేం విశ్వకర్మలం*


పల్లెల పునాదిరాల్ల చరిత్రనుండి

చంద్రుని పాదాల్ని తాకెదాక దిక్సూచిగ ఉన్నోళ్ళం ...

*మేం విశ్వకర్మలం*


కోకిల రాగాల నుండి బతుకు పూలు పూయించినోళ్ళం...

*మేం విశ్వకర్మలం*


విశ్వం దు:ఖ్ఖం చెరిపేయుటకై జలధారల్ని నేలపై కురిపించి తిండిగింజల్ని మొలకెత్తిచినోళ్ళం...

*మేం విశ్వకర్మలం*


మాటల ఊటలకు శబ్ధాల్ని అతికించి గొంతుసంచుల్లోంచి శంఖాల్ని పూరించినోళ్ళం...

*మేం విశ్వకర్మలం*


జీవి పుట్టి గిట్టె దాక అడుగడుగున అంటిపెట్టుకున్నోళ్ళం...

*మేం విశ్వకర్మలం*


ఆది నుండి అంతమొరకు రక్షకులుగ ఉన్నోళ్ళం...


*మేమే విశ్వకర్మలం*

*జై విశ్వకర్మ ...

జైజై విశ్వకర్మ...

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: