11, అక్టోబర్ 2020, ఆదివారం

కృష్ణార్పణమస్తు


" పుణ్యం చెడని పదార్థము" అన్నారు, అంటారు, మరి మన భాగవతం చెప్పలేదే! " మనం ధనం, దానం, సత్యవాక్కు పరిపాలన, "ధర్మం " ఆచరణ ద్వారా, మరియు తపస్సు, యజ్ఞ, యాగాలు, తీర్థయాత్రలు, సత్సంగము ల వల్ల, ఇతర అనేక ముఖ్యమైన మంచి కార్యముల వల్ల శ్రీ హరి ప్రీత్యర్థం , కృష్ణార్పణమస్తు అని చేసే కర్మల వల్ల, పుణ్యఫలము వస్తుంది. ఇంకనూ ఎన్నో జన్మల లో మనము చేసుకున్న పాపపుణ్యముల ఫలము, మన తాతముత్తాతలు చేసుకున్న దానధర్మములు ఫలము, మనకు సంప్రాప్త మవుతుంది. అంతటి విలువైన, పవిత్రమైన, జ్ఞాన పుణ్య సంపద జాగర్త పెట్టుకొనుట చాలా కష్టము. ఎందుకనగా:- మన మనస్సు చంచలమైనది, గుర్రము లాంటిది, దానికి బుద్ధి అను కళ్లెం వేసి పట్టుకుని లాగాలి. అది జారిందో నీ పని అంతే సుమా! కళ్యాణ గుణములు గల ధ్రువుడు శాశ్వితంగా నక్షత్ర మండలములో స్థానము సంపాదించుకునెను.36 వేల సంవత్సరములు, తండ్రి ఉత్తానపాదుడు, అప్పగించిన రాజ్యము రక్షించెను. ధర్మ ,అర్ధ, కామ ,పురుషార్థములు పరస్పర విరోధము లేని విధముగా అనుభవించెను. ధ్రువుడు శ్రీహరిని యొక్క పాదములను సేవించుట మనోరథం నెరవేరేను. సనక,సనందనాది, నైషిటిక బ్రహ్మచారులు అనేక జన్మలలో ఏకాగ్రతతో ధ్యానము చేసిరి . శ్రీహరి స్వరూప జ్ఞానము పొందిరి. శ్రీహరి పాదముల చెంత ఆరునెలలు తపస్సుచే చేరుకొనెను. ధ్రువ నీ తమ్ముడు ఉత్తముడు వేటలో మరణించును. తల్లి "సురుచి "అడవిలో వెతుకుటకు పోయి కార్చిచ్చు లో ప్రవేశించి మరణించ గలదు విషయం తెలిసిందే, శీ శ్రీహరిని ముక్తిని కోరలేదు ఆ కారణము చేత అతడు దుఃఖము పొందెను. (సవతి తల్లి వేరు, అనే దృష్టి) గలవాడు అగుట చే, దానికి మరల దూరమై నాడు. దేవతలు నేను పొందబోయే లోకము కంటే తక్కువ స్థానమునందు వుండెదరు. పైగా పుణ్యము ఖర్చు కాగానే వారి స్వర్గలోకం నివాసము అంతమగును. కావున నా అభివృద్ధి చూడలేక, ఓర్వలేక, వారు నా బుద్ధిని కలుషితము చేసినారు. అందువలననే నేను నారద మహర్షి యొక్క యథార్థ వచనములు పెడచెవిని పెట్టి తిని. నేను శ్రీ హరి మాయచే మోహితుడై నైతిని, ఈశ్వరుడు మోక్ష సామ్రాజ్యమును ఇచ్చును. కానీ మూర్ఖుడు అనగా నేను పుణ్యము క్షీణించుట, ధనము లేనివాడు, బియ్యపు గింజలు బిచ్చమెత్తు విధముగా ఆయన నుండి అభిమానం పెంచే ఉన్నత పదవిని కోరితిని. నీ వంటి నిష్కామ భక్తుల మనోరథం ఈశ్వరుడు ఇచ్చే లభించిన దానితతోడనే తీరిపోవు ను. మోక్ష ప్రదాత యగు శ్రీహరి యొక్క పాదపద్మముల సేవించే నీ వంటి వారలు ఆయన సేవలు మినహాయించి తమకై దేనినైనను కోరుకొనరు. "సింహం మీద స్వారీ చేయటం, చాలా గొప్పగా, దర్జాగా ఉండును, కానీ దాని మీద నుండి పడ్డావో !ఆ సింహము నిన్ను తన నోటికి కరచుకుని, చంపి రక్తము పీల్చి వేయును. అలాగే ఆడంబరాలకు పోయి, మెప్పు కోసం దానాలు,(కొందరికి అపాత్ర దానం చేసిన, అప్పు చేసి దానము చేసిన, తామస, రాజస దానములు) చేసి, ఒకసారి ఏదో దొంగతనము చేసి దొరికిపోయిన ( U/sec 379 I.P.C మేరకు శిక్షా ) నేరము రుజువైన ఇక్కడి కోర్టువారు జైలు శిక్ష విధించే అవకాశం కలదు. లౌకిక ప్రపంచంలో అత్యంత విలువైన పరువు, ప్రతిష్ట నశించును, కదా! అలాగే భగవంతుడైన ఆ శ్రీహరి నీ పుణ్య సంపద కూడా తప్పక నశింప జేయు ను. అజ్ఞానముతో, క్రోధము తో పూర్వ కాలములో చేసిన పుణ్యము నశించగానే పుట్టుక, కథ, విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి అవుటకు, ఎన్నోసార్లు తపము ఆచరిస్తూ, శాపములు ఇచ్చి, తన తపస్సు అంతా నష్టపోయే వాడు, మనము చదువుకున్నాము. విన్నాము. "ధ్రువుడి ని కూడా " ధ్రువ మన వంశములో ఇలాంటి వాళ్ళు లేరు. యక్ష వంశాన్ని నాశనం చేయుట తగదు, తప్పు చేసిన వారిని మాత్రమే శిక్షించుట సబబు. ఇది అంతయూ నేనే చేశాను అని అనుకోవటం పొరపాటు, "మానసికముగా చనిపోయిన వారిని" మళ్లీ నువ్వు ఏమి చంపుతావు? ఇది అంతయు భగవంతుని ఆదీనము. నీవు నిమిత్తమాత్రుడవు. సుమా! సేకరణ: భాగవతం నుండి, సమర్పణ:-"మజుందార్, బెంగళూర

" శ్రీ హరి భగవంతుడు" ఐస్కాంతం వలె కష్టమైన పనులు అన్నీ చేస్తాడు. తన వైపు తిప్పుకోనుటకు ఏ మాత్రం కష్టపడడు. ఐస్కాంతం లోహపు వస్తువులను తన వైపునకు సూది ,మేకు, ఇతర చిన్న కనిపించని లోహం వస్తువులైన ను తన వైపునకు ఆకర్షించు కో గలవు. ఇలాంటి జ్ఞాన సాహిత్య సంపద, "మన సనాతన వైదిక ధర్మం" లో ఏనాడు ఎప్పుడో రాయబడి ఉన్న గ్రంథము:- "సత్య సంహిత గ్రంథము" నేడు ఉత్తర, దక్షిణ ధ్రువాలు అంటూ ఐస్కాంత మనకు పేర్లు పెట్టి, సైంటిస్టులు అంటూ కనుగొన్నారు అంటూ, గొప్పగా సత్కార్యములు చేస్తారు.

కామెంట్‌లు లేవు: