11, అక్టోబర్ 2020, ఆదివారం

శివామృతలహరి


శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;


మ||

వలలో జిక్కిన చేపపిల్లవలె దేవా! జీవియల్లాడు బా

ధలతోగూడిన ఘోరసంసరణ బంధమ్మందునన్ జిక్కి నిన్

గలియన్, వేడగ మిన్నకుంటివి పరాకా! మోక్షమీలేవ? నీ

చెలిమిన్ గోరెడి జంతుసంతతులకున్ శ్రీ సిద్దలింగేశ్వరా !


భావం;

వలలో చిక్కిన చేపపిల్ల ఎలాగైతే గిలగిలా కొట్టుకులాడుతూ ఉంటుందో, అలాగే మానవుడు కూడా అనేక బాధలతో కూడినటువంటి సంసారము అనే ఘోరమైన వలలో చిక్కి కొట్టుమిట్టాడుతూ, నీలో కలిసిపోవాలని తాపత్రయపడి, దీనంగా వేడుకుంటూ ఉన్నాడు, నువ్వు పరాకుగా ఉండి పట్టించు కోకపొతే ఎలా?

నీ చెలిమిని కోరుకునేటువంటి ప్రాణికోటికి మోక్షమిచ్చి కాపాడలేవా స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

... సుబ్బు శివకుమార్ చిల్లర.

కామెంట్‌లు లేవు: