11, అక్టోబర్ 2020, ఆదివారం

దర్శనం అయ్యాక

 దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపనం తప్పక తీసుకోవాలి. చాలా మంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినన పనైపోయింది చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్ది మంది మాత్రమే ఆగి, శఠగోపనం పెట్టించుకుంటారు. 


దేవతల పదాలు శఠగోపం పైన ఎందుకు ఉంటాయో తెల్సా? 


మనలో ఉన్న అరిషడ్వార్గాలని అణచి వేచి ఆత్మ జ్ఞానాన్ని మనిషికి అందిచటాని.. బలిచక్రవర్తి ఎంత దాన గుణ వంతుడైనను అహకారం ఉండటం వాళ్ళ నేలలోకి తొక్కబడ్డాడు అంటే మనం సమాజం లో ఎంత మంచి పనులు చేస్తున్న అహంకారంరాణికి మానికి లోను కాకూడదు ఆ భావాన్ని తెలియ చేస్తుంది అంతేకాదు హరి పాద జననం అయినా గంగ ఎంత నిర్మలంగా. పవిత్రం గా ఉంటుందో అదే విదంగా శఠగోపం తల పైన పెట్టుకున్న భక్తుని మనసు కుడా అంతే నిర్మలంగా పవిత్రoగ అవుతుంది  


శఠగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకిను తలుసుకోవాలి. అంటే మీ కోరికే శఠగోపనం. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం. శఠగోపనం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి అని అంటారు.

కామెంట్‌లు లేవు: