11, అక్టోబర్ 2020, ఆదివారం

**అద్వైత వేదాంత పరిచయం**

 

2.4 పురాణాలు :

 నాలుగో స్థాయి పురాణాలు. అవి స్మృతికన్నా మరింత వివరంగా ఉంటాయి. పురాణం అంటే అది ప్రాచీన గ్రంధం అయినా, ఇప్పటికీ వర్తిస్తుంది. పురా అపి నవ: ప్రాచీనమే కాని ఆధునికంలో కూడా తాజాగా ఉంటుంది. ఇవి కూడా పద్యరూపంలో ఉంటాయి. ఇవి కూడా వేదాల్లోని అంశాలని క్రోఢీకరించి, స్పష్టత చేకూర్చి, ఉన్నతంగా చూపిస్తాయి. 

ఇంకో ప్రత్యేకత - అంతకు ముందు గ్రంధాల్లో చెప్పిన ధర్మాలకి కథలు 

ఉంటాయి. ఈ ధర్మాలని పాటించటం ఎంత కష్టమో చూపిస్తూ, అయినా వీటికి కట్టుబడి ఉన్నవాళ్ళ కథలు వివరిస్తాయి. స్మృతిలో కొన్ని వేల శ్లోకాలుంటే, ఒక్కొక్క పురాణంలో 15000 నుంచి 80,000 శ్లోకాలుంటాయి. కేవలం ఒక్క వేదమంత్రం సత్యం వద (సత్యమే పలుకు)కి పురాణంలో మొత్తం హరిశ్చంద్రుని కథ ఉంది.అలాగే పితృదేవోభవకి రాముడు లేదా శ్రవణకుమారుని కథలున్నాయి.కామ, క్రోథ, అహంకారం లాంటి భావాలకి రూపునిచ్చాయి రాక్షసుల రూపంలో.

 మనకి 18పురాణాలు,18 ఉపపురాణాలూ ఉన్నాయి. వ్యాసాచార్యుడు రచించినవే అవి. అన్నిటిలోకి ప్రముఖమైనది భాగవత పురాణం లేదా భాగవతం.ఈ రోజుకి కూడా ఈ పురాణాలు ఆబాలగోపాలాన్నీ ఆకర్షిస్తాయి. పిల్లలకి కావల్సిన మాయలు ఉంటాయి, మనిషి రాయిగా లేదా జంతువుగా మారటం వగైరా. పెద్దలకి కావల్సిన సిద్ధాంతంతో బాటు నైతిక విలువలు, సాంఘికనియమాలు, మానసిక విశ్లేషణలాంటివెన్నో ఉంటాయి.

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: