11, అక్టోబర్ 2020, ఆదివారం

"ఉద్ధవ నీతి

 "ఉద్ధవ నీతి". :- "భక్తుడు ఏ విధముగా నుండవలె? జగమున వుండెడు సకల వస్తువులలో భగవంతుడు ఉన్నాడు. జగతికి ఆశ్రమం ఆతడే. అతడు లేని చోట లేదు. అతడు లోపల బయట నిండి నిచిడీ కృతుడై ఉన్నాడు. అతడు సర్వవ్యాప్తి మాత్రమే కాదు సర్వులకు ఆశ్రయుడు కూడా! భగవంతుడు అన్ని చోట్లా ఉన్నాడని ఎవరు తెలుసుకుని ఉపాసన చేయుదురో వారే నిజమైన భక్తులు. శ్రేష్ట భక్తులు వీరే. వీరే భాగవ తోత్తములు. ఇది మొదటి వర్గము. 2). "భగవంతుని ఎడ ప్రీతి - భక్తి , భగవద్ భక్తులతో మైత్రి, అమాయకుల ఎడ కృప, భగవంతుని ద్వేషించు వారి పట్ల ఉదాసీనత త్వము. ఇట్లు ప్రేమ, మైత్రి, కృపా, ఉదాసీనత, అను చిత్త వృత్తులను అలవరుచుకొని వారు మధ్యమ వర్గపు భక్తులు కారణము ? వీరిలో ఒక విధమగు అహంకారము కలదు. అహంకారపు ఛాయలు స్పష్టముగా కనిపించును. 3) "భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని ప్రజ్ఞ ఇంకనూ జాగృతము కాలేదు. చిత్త వృత్తి పరిపక్వము కాలేదు. కేవలము ప్రతిమనే పూజించుట. ప్రతిమలో దేవుడున్నాడని శ్రద్ధా భక్తులతో పూజించుట ఈ విశ్వమంతయు భగవంతుని ప్రతీక ప్రతిమ అను జాగృతి లేదు . కనుక వీరు కనిష్ట భక్తులు. "మజుందార్, బెంగళూర్"

కామెంట్‌లు లేవు: