11, అక్టోబర్ 2020, ఆదివారం

జ్యేష్ఠ నక్షత్రము

 జ్యేష్ఠ నక్షత్రము - గుణగణాలు, ఫలితాలు


నక్షత్రములలో ఇది 18వ నక్షత్రము. జ్యేష్టా నక్షత్రమునకు అధిపతి బుధుడు. ఇది రాక్షసగణ నక్షత్రము, అధిదేవత ఇంద్రుడు, జంతువు లేడి, స్త్రీ జాతి. జ్యేష్ఠ నక్షత్రము కలిగిన వధూవరులిద్దరూ జ్యేష్టులైనచో వారికి వివాహము నిశ్చయించరాదని శాస్త్రం చెబుతోంది.  


జ్యేష్ఠ నక్షత్ర మొదటి పాదము

 ఈ నక్షత్రము మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రము. వీరికి పట్టుదల అధికం. వీరు మేధా సంపన్నులుగా ఉంటారు. అందువల్ల వీరికి మేధోసంబందిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వీరు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించగలరు. అధికార పదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు కూడా అందివస్తాయి.


14 సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల వీరు విద్యారంభం నుంచి విద్యలో ప్రతిభ చూపిస్తారు. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదుర్కొంటారు. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 21 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా కాస్త ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో విద్య కంటే అలంకరణ, విలాసాల మీదకు మనసు మళ్లుతుంది కనుక మనసును ప్రయత్నపూర్వకంగా విద్యవైపు మళ్ళించి విజయం సాధించాలి. జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 


41 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాత కొంత సుఖం తగ్గినా 64 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి. 


జ్యేష్ఠ నక్షత్ర రెండవ పాదము   

వీరికి పట్టుదల అధికం. వీరు శ్రమకు ఓర్చి పని చేయగలరు. బుద్ధి కుశలత కలిగి ఉంటారు. వీరికి వ్యాపారం అంటే కూడా ఇష్టమే. వీరికి పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వీరికి అనుకూలిస్తుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరగల అవకాశాలు మెండుగా ఉంటాయి. 


ఈ జాతకులకు పదేళ్ల వరకు బుధ దశ ఉంటుంది కాబట్టి విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కాలంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాల్సి ఉంటుంది. కేతు దశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఎదురుకావు. 17 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్ర దశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. ఉన్నత విద్య సుగమంగా సాగుతుంది. ఈ సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీద మనసు ఉంటుంది కనుక మనసును ప్రయత్నపూర్వకంగా విద్యవైపు మళ్ళించి విజయం సాధించాలి. 


ఈ నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగానే స్థిరపడతారు. సకాలంలో వివాహం అవుతుంది. 37 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. తరువాత కొంత సుఖం తగ్గినా 60 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి.


జ్యేష్ఠ నక్షత్ర మూడవ పాదము  

వీరు తమ అభిప్రాయాలను అంత సులువుగా మార్చుకోరు. వీరికి వ్యాపారం అంటే కూడా ఆసక్తి అధికంగానే ఉంటుంది. వీరికి పరిశ్రమలు, కర్మాగారాలు, మెకానిక్ షెడ్ వంటి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలిస్తాయి. భూ సంబంధిత, విద్య సంబంధిత ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తి వీరికి అనుకులిస్తుంది. 


ఆరు సంవత్సరాల వరకు బుధ దశ ఉండటం వల్ల విద్యారంభం బాగుంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతుదశ కారణగా విద్యారంభంలోనే కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్న పూర్వకంగా వాటిని అధిగమించి విద్యలో విజయం సాధించాలి. కేతు దశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఎదురవ్వవు. 13 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. మాధ్యమిక విద్య నుంచి సుగమంగా సాగుతుంది. అయితే ఈ సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీదికి మనసు మళ్లుతుంది కాబట్టి.. ప్రయత్నపూర్వకంగా విద్య వైపు వెళ్లి విజయం సాధించాలి. 


ఈ నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగా స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 33 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత కొంత సుఖం తగ్గినా 56 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి. 74 సంవత్సరాల తరువాత వచ్చే 18 సంవత్సరాల గురు దశ కారణంగా తిరిగి సుఖమైన జీవితం మొదలవుతుంది. వృద్ధాప్యం సౌఖ్యంగా కొనసాగుతుంది.


జ్యేష్ఠ నక్షత్ర నాలుగవ పాదము 

వీరి మీద గురు బుధ గ్రహ ఆధిక్యత ఉంటుంది. ఇది రాక్షసగణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికం. వీరు మేధాసంపన్నులుగా ఉంటారు. మేధోసంబందిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. వీరు విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించగలరు. అధికార పదవులను సమర్ధవంతగా నిర్వహించగలరు. వీరికి ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కలుగవచ్చు. 


రెండు సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. తరువాత వచ్చే 7 సంవత్సరాల కేతు దశ కారణంగా విద్యలో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించి విద్యను ప్రారంభం చేయాలి . 4వ తరగతి నుండి విద్యలో అభివృద్ధి ఉంటుంది. కేతుదశ అనుకూలంగా ఉంటే ఆటంకాలు ఉండవు. 11 సంవత్సరాల తరువాత వచ్చే 20 సంవత్సరాల శుక్రదశ కారణంగా కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో విద్యకంటే అలంకరణ, విలాసాల మీద మనసు మళ్లే అవకాశం ఉంటుంది కనుక.. ప్రయత్నపూర్వకంగా విద్య వైపు మళ్ళించి విజయం సాధించాలి. జీవితంలో తొందరగానే స్థిరపడతారు. సకాలంలో వివాహం జరుగుతుంది. 31 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా కొనసాగుతుంది. సంపాదించినది జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తరువాత కొంత సుఖం తగ్గినా 54 వయసు వరకు జీవితం సాఫీగా కొనసాగుతుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కాలంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు ఉంటాయి. 


జ్యేష్ట నక్షత్రము గుణగణాలు

 జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన జాతకులు సందర్భానుసారంగా అభిప్రాయాలు మార్చుకుంటారు. తమ రహస్యాలను కాపాడుకోవడానికి ఇతరుల రహస్యాలను తెలుసుకుంటారు. చిన్న విషయాలను కూడా సూక్ష్మంగా పరిశీలించి, లోపాలను ఎంచుకుంటారు. ఇతరులలో చిన్న విషయాలను కూడా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతారు. తగాదాలు పెట్టడమే ధ్యేయంగా ఉన్న వారిలా పేరు తెచ్చుకుంటారు. తమకు శక్తి లేకున్నా అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇతరుల సహాయాన్ని తమ హక్కులుగా వాడుకుంటారు. ఇక ఇతరుల నుంచి వచ్చే విమర్శలు సహించ లేరు. ఆత్మన్యూన్యతా భావం కలిగి ఉంటారు. ఎదుటి వారు సరదాగా చేసే వ్యాఖ్యలు తమను అపహాస్యం చేయడానికే చేసారని భావిస్తారు. 


వీరికి శాశ్వత మిత్రత్వం, శాశ్వత స్నేహం ఉండదు. సాంకేతిక రంగంలో ప్రత్యేక విభాగంలో నిపుణత ఉంటుంది. విదేశాల మీద మోజు, విహారయాత్రల మీద ఆసక్తి ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉంటే జీవితం సాఫిగా సాగుతుంది. బాల్యం నుంచి విద్యలో ప్రకాశిస్తారు. కాని ఉన్నత విద్యలకు కొంత ఆటంకం కలిగినా అడ్డంకులను అధిగమిస్తే అభివృద్ధి సాధించగలరు. తగిన వయసులో సంపాదన మొదలవుతుంది. సంపాదించిన ధనాన్ని భవిష్యత్తుకు జాగ్రత్త పరచుకోవాలసిన అవసరం ఉంటుంది. వృద్ధాప్యంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రంలో గ్రహ పరిస్థితులను అనుసరించి ఫలితాలలో మార్పులు ఉంటాయి.


ఈ నక్షత్ర జాతకులకు పసుపు, నలుపు రంగులు కలిసివస్తాయి. ఇంకా మంగళవారం వీరికి అన్ని విధాలా అనుకూలిస్తుంది. అలాగే సోమ, బుధవారాలు సామాన్య ఫలితాలనిస్తాయి. జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన జాతకులకు 9వ సంఖ్య అన్ని విధాలా కలిసివస్తుంది. అలాగే 9, 18, 36, 1, 2, 3 అనే సంఖ్యలు కూడా అన్ని విధాలా అనుకూలిస్తాయి. కానీ 4, 5, 6 అనే సంఖ్యలు ఈ జాతకులకు కలిసిరావు...మీ... *చింతా గోపి శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

కామెంట్‌లు లేవు: