11, అక్టోబర్ 2020, ఆదివారం

శివామృతలహరి

 


శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన


 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;




మ||




తెలియన్ రక్కసులంచు వేరొకరు ప్రత్యేకంబుగా లేరిలన్


కలిలో దుర్గుణషట్కమేచి పలువంకన్ బట్టి పల్చార్చ, దు


ష్టులుగా మారి చరించు మానవులె రక్షోవర్గ ; మవ్వారి నం


చెలుగానైన సముద్ధరింపగదవే శ్రీ సిద్ధలింగేశ్వరా!




భావం;


ఈ లోకంలో రాక్షసులంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు.


కలి పురుషుడి తన ప్రభావం చూపటానికి


దుర్గుణషట్కం( అంటే కామ,క్రోధ,లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరు దుర్గుణాల)అనే వలవేసి నిగ్రహం లేని మానవులను


పట్టి, వారిలోని సుగుణాలను పల్చ బారేటట్లు చేసి దుష్టులుగా మార్చివేస్తాడు.వారే మనుషుల్లోని రాక్షస వర్గం.వారిని ఒకసారిగా కాకపోయినా, అంచెలంచెలుగా నైనా ఉద్ధరించి మంచి మనుషులు గా చెయ్యి స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: