11, అక్టోబర్ 2020, ఆదివారం

*🚩పసుపుకుంకుమ*🚩

 


మన సనాతన సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. చాలామంది వాటిని చాదస్తం అని కొట్టిపారేస్తుంటారు. కాని వాటి వెనుక సైన్స్‌ దాగి వ్ఞందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఆచారాలలో మనం ఎప్పటికి మరువలేనివి నిత్యం ఉపయోగించేవి పసుపు, కుంకుమ. ముందుగా కుంకుమ స్త్రీలు నుదుట కంకుమని దిద్దుకుంటారు. ఇంట్లో పూజ చేసినప్పుడు గుడికి వెళ్లి దేవ్ఞడ్ని దర్శించినప్పుడు తప్పనిసరిగా చేసే నియమం. ఈ కుంకాన్ని ఐదారు వందల సంవత్సరాల క్రితం వరకు హిందూమతస్తులందరూ తప్పనిసరిగా కుంకుమను నొసట దిద్దుకొనే ఆచారం వ్ఞండేది. ముఖ్యంగా శైవవైష్టవ మతస్తులు అందరూ నొసట కుంకుమ పెట్టుకోవడం గొప్పగా భావిస్తారు. కుంకమనే కాకుండా మంచి గంధాన్ని, విభూదిని కూడా దిద్దుకునేవారు.


రెండు కనుబొమ్మల మధ్య కుంకుమ దిద్దటం వల్ల మనిషికి దృష్టిదోషం తగలదని ఒక నమ్మకం. ఎర్రని కుంకమ, మనిషి నిగ్రహశక్తిని, కాక త్యాగనిరతిని, పరోపకార గుణాన్ని కల్గిస్తాయని మరో నమ్మకం. కుంకుమ స్త్రీల ఐదవ తనానికీ, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతం అని చెప్పవచ్చు. పూర్వ భర్తను కోల్పోయిన స్త్రీలు పరులెవ్వరికి అందంగా కనిపించకూడదు అన్న భావనతో కుంకుమను పెట్టుకొనేవారు కాదు. కుంకుమ సంస్కృతికి చెరగని ముద్ర. ఇది హైందవ సంప్రదాయం. మనవేదాలు, శాస్త్రాలు, పురాణాలు కూడా కుంకమ దాని విశిష్టత గురించి చెబుతున్నాయి. ఇక పసుపు, కుంకుమ జతకలపి చేసే కార్యక్రమాలు ఎన్నో. ఇంటి గడపకు, పసుపురాని, కుంకమబొట్టు పెడతారు. సంక్రాంతి ముగ్గుల్లో మరి గొబ్బెమ్మలకు ఎక్కువగా పసుపు, కుంకుమనే వాడతారు. శుభకార్యాలకు పిలిచేటప్పుడు కుంకుమను ఆ ఇంట్లో వ్ఞన్న స్త్రీల నుదుట పెట్టి, పెరంటానికి, శుభకార్యాలకు పిలుస్తారు.


పెళ్లికి ముందు నిశ్చయతాంబులాలో ఎక్కువగా, పసుపు, కుంకుమనే ఉపయోగిస్తారు. గృహప్రవేశాలకు, జన్మదిన, పెళ్లిశుభలేఖలకు పసుపు రాసి కుంకుమ బొట్టుపెట్టి పిలుస్తారు. గృహప్రవేశ సమయంలో గుమ్మడి కాయలను గడపముందు కొట్టి వాటిమీద ఎర్రటి కుంకమ చల్లుతారు. దసరా పండుగ సందర్భంగా ఆలయాలలో అమ్మవారికి కుంకుమార్చనలను నిర్వహిస్తారు. పిమ్మట ఆ కుంకుమను ముతైదువులకు పంచుతారు. ఇక దేవతలకే కాక దేవ్ఞడికి కూడా కుంకమ ఇష్టమని చెప్పవచ్చు.


ఆ దేవుడు ఎవరో కాదు సీతమ్మ, రామయ్యకు ఇష్టమైనవాడు హనుమంతుడు. హనుమాన్‌ దేవాలయాల్లో హనుమాన్‌ విగ్రహాలన్నీ నారింజ రంగులో ఉంటాయి. దానికి కారణం ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకోవడం చూసిన హనుమాన్‌ అది ఎందుకు తల్లి అని అడిగాడు. అప్పుడు సీతాదేవి రాముని ఆయుష్యు కోసం అంది.


వెంటనే రామభక్తుడైన హనుమాన్‌ ఒళ్లంతా సింధురాన్ని దిద్దుకున్నాడంటా. ఇంతటి విశిష్టత కల్గిన కుంకమను ఇటీవల కాలంలో స్త్రీలు, ఫ్యాషన్‌ పేరుతో దూరం చేస్తున్నారనే చెప్పాలి. అలాకాకుండా మన సంస్కృతిలో భాగమైన పసుపు, కుంకుమలను నిత్యం ఉపయోగిస్తూ ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుద్దాం.

🙏🙏🌸🙏🙏🌸🙏🙏🌸🙏🙏

కామెంట్‌లు లేవు: