31, జులై 2023, సోమవారం

Photo











 

ఆత్మ లేకపోతే

 ఒక ప్రశ్న


ఆలోచించండి అందరూ ఆత్మవేరు శరీరంవేరు అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు ఆత్మ లేకపోతే శరీరం ఉండదు రెండూఉంటే శరీరంతో చేసేదికర్మ దానిఫలితం తాత్కాలికంగా అనుభ  వించేది శరీరం అనుభూతి మనసుకు మనసుఎవరు? సుఖంకష్టం ఎవరిది? మరలజన్మలో ఫలంఎవరనుభవించవలయును?

సనాతన హిందువా

 మనం ఎవ్వరిని తిట్టాలిసిన పనిలేదు మనల్నిమనమే ప్రశ్నించుకుందాం, నేను ఏమతానికి వ్యతిరేకం కాదు ఏ కులానికి వ్యతిరేకం కాదు, కాని నామతం వాళ్ళు, కళ్ళు తెరవాలని, అలాంటివారికోసం ఈ చిన్న కథ! 👇


ఒక కప్పను ఒక నీళ్ళగిన్నెలోఉంచి ఆ గిన్నెను పొయ్యి మీద ఉంచితే కాసేపటికి నీళ్ళు కొంచెం వేడి అవ్వటం మొదలవుతుంది, ఆ నీళ్ళ వేడికి తగ్గట్టుగా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటుంది. 


ఇంకొంచెంసేపు తర్వాత నీళ్ళు ఇంకా ఎక్కువ వేడి అవుతాయి, అప్పుడు కూడా కప్ప తన శరీర ఉష్ణోగ్రతను నీటి వేడికి తగ్గట్టుగా మార్చుకుని నీటి వేడిని ఓర్చుకోగలుగుతుంది.ఇలా కొన్నిసార్లు జరిగిన తరువాత ఇక నీళ్ళు పూర్తిగా మరిగినంత స్థితికి చేరాక, కప్ప తన శరీర ఉష్ణోగ్రతను ఇంక మార్చుకోలేదు, ఇక అప్పుడు కప్ప నిర్ణయించుకుంటుంది, 

నీళ్ళ గిన్నెలోంచి ఇక బయటకు దూకేద్దాము అని...


#కానీ, దూకలేకపోయింది, ఎందుకంటే అప్పటి వరకూ శరీర ఉష్ణోగ్రతను మార్చుకుంటూ నీటి వేడిని భరించటంలోనే కప్ప శక్తి అంతా హరించుకుపోయింది, వేడి నీళ్ళ గిన్నెలోంచి దూకే శక్తి లేక నీరసపడిపోయింది. 


#కాసేపటి తర్వాత కప్ప చనిపోయింది 😢 కారణం వేడినీళ్ళా ? కానే కాదు.


#గిన్నెలోంచి బయటకు ఎప్పుడు దూకాలో, సరైన సమయంలో సరైన నిర్ణయం,

కప్ప తీసుకోలేకపోయింది... అదే అసలైన కారణం...


#ఇప్పుడు హిందూ సమాజం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉంది...సెక్యులరిజం-అన్ని మతాలు సమానము, అన్ని దేవుళ్ళు ఒకటే అనే నీళ్ళలో కూరుకుపోయి ఉన్నారు.


#హనుమాన్-జయంతికి రాళ్ళు విసిరితే ఓర్చుకుంటాం, శ్రీ రామ నవమికి రాళ్ళు విసిరితే భరిస్తాం... ఇంకా ఇలా ఎన్నినాళ్ళు ఈ చీము నెత్తురు లేని బతుకులు.


#బైంసాలో హిందువుల ఇళ్ళు తగలబెడితే నాకెందుకు...

#కశ్మీర్ పండిట్ల పైన మారణహోమం జరిగిన విషయం #TheKasmirFiles సినిమా వచ్చేదాకా తెలియదు...

#పక్కింట్లో వాళ్ళని ప్రలోభపెట్టి మతం మారిస్తే నాకెందుకు...

#హిందూ దేవాలయాలు కూలిస్తే నాకెందుకు...

#లవ్జిహాద్ , #జమీన్ జిహాద్ తో మనకు సంబంధమే లేదు...


#ఎవరో_వస్తారని_ఏదో_చేస్తారని ఎదురు చూస్తూ సమయం ముగిసిపోయే వరకు ఉండి బలై పోయేకంటే, సమయం ఉన్నప్పుడే, కళ్ళు తెరుచుకుని ధైర్యంగా, సరైన శక్తి ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడం అనేది ఇప్పుడున్న హిందూ సమాజానికి చాలా అవసరం, లేదంటే ఎంతో ప్రమాదం. 


మేలుకో ఓ సనాతన హిందువా 

మొద్దు నిదురవీడు, నాకోసం కాదు మీకోసం మరియు భవిష్యత్తు తరాలకోసం🚩 


#వందేమాతరం 🇮🇳 

#భారత్_మాతాకీ జై 🇮🇳


https://www.instagram.com/p/CvHkakRS7PB/?igshid=MzRlODBiNWFlZA==


 

Beware of


 

Cancer


 

⚜ శ్రీ జానకి-కుండ్

 🕉 మన గుడి : 





⚜ బీహార్ : సీతామర్హి


⚜ శ్రీ జానకి-కుండ్



💠 సీతామర్హి బీహార్‌లోని ప్రసిద్ధి చెందిన హిందూ పుణ్యక్షేత్రం.  

రాముడి భార్య అయిన లక్ష్మీదేవి అవతారంగా భావించే సీతా దేవికి ఈ ఆలయం అంకితం చేయబడింది. 

 

💠 రామాయణం ప్రకారం, సీతామర్హి సీతాదేవి జన్మస్థలం అని నమ్ముతారు. ఆకట్టుకునే వాస్తుశిల్పం ఉన్న ఈ ఆలయం రథం ఆకారంలో నిర్మించబడింది.  

ప్రధాన గర్భగుడిలో సీతాదేవి విగ్రహం ఉంది మరియు అందమైన శిల్పాలతో అందంగా అలంకరించబడింది.  

ఈ ఆలయ సముదాయంలో రాముడు, హనుమంతుడు మరియు ఇతర దేవతలకు అనేక చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. 

 

💠 శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇది పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఇక్కడికి వచ్చే మహిళలకు కూడా ఈ ఆలయం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

  

💠 సమీపంలోని మరొక ఆకర్షణ హాలేశ్వర్ స్థాన్, ఇది శివుని పురాతన దేవాలయం. 

ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల నాటిదని నమ్ముతారు 


⚜ స్థలపురాణం ⚜


💠 మిధిలాపురి చక్రవర్తి, జనకమహారాజు రాజ్యపాలన చేస్తుండగా,ఒకసారి 14 సంవత్సరాలు అనావృష్టి ఏర్పడింది. 

కులగురువు శతానంద మహర్షి అనుమతితో,స్వయంగా తానే భూమి పూజ చేసి,నాగలి దున్నుతుండగా,సువర్ణ మయ రత్న పేటికలో,సకల శోభితురాలైన సీతాదేవి లభ్యమైంది. 

ఆ ప్రదేశమే సీతామర్హిగా పిలువబడుతోంది.


💠 ఆమె వివాహానంతరం ఆ ప్రదేశానికి గుర్తుగా రాముడు, సీత మరియు లక్ష్మణుల రాతి బొమ్మలను ఏర్పాటు చేసినట్లు చెబుతారు. 

ఈ ట్యాంక్‌ను జానకి-కుండ్ అని పిలుస్తారు మరియు జానకి మందిరానికి దక్షిణంగా ఉంది.

ఇక్కడ కొలనుమధ్యలో సీతాదేవి దొరికిన ప్రదేశం,దేవాలయం, నలుగురన్నదమ్ములు సతీ సమేతంగా దర్శనమిస్తారు.


💠 ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి నాడు సీతా జయంతిని జరుపుకుంటారు.

ప్రతి సంవత్సరం లక్షలమంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు మరియు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా సందర్శించే పుణ్యక్షేత్రం. 

నవరాత్రి మరియు రామ నవమి ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తుంటారు.


💠 బీహార్‌లోని హిందువులపై రామాయణ ప్రభావం ఎక్కువగా ఉన్నందున, ఈ ఆలయం ఏడాది పొడవునా భక్తులతో కిటకిటలాడుతుంది.


💠 మహావీర్ మందిర్ ట్రస్ట్స్ పేరుతో శ్రీ మహావీర్ సంస్థాన్ న్యాస్ సమితి సీతామర్హి జిల్లా వెలుపలి నుండి ఆలయాన్ని సందర్శించే యాత్రికుల కోసం పునౌరా ధామ్‌లో 27 జనవరి 2019 నుండి సీతా రసోయిని (వంటసాల) ప్రారంభించింది.


💠 ఈ ప్రదేశం బియ్యం, కలప, నూనె గింజలు మరియు తోలు వ్యాపారం చేసే వాణిజ్య కేంద్రం. శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీరామనవమి ఉత్సవంలో కుండలు, సుగంధ ద్రవ్యాలు, ఇత్తడి సామానులు మరియు దూది వస్త్రాలలో గణనీయమైన వ్యాపారంతో నిర్వహిస్తారు .


💠 కాలక్రమేణా, సుమారు 500 సంవత్సరాల క్రితం వరకు, బీర్బల్ దాస్ అనే హిందూ సన్యాసి, సీత జన్మించిన ఈ ప్రదేశాన్ని తెలుసుకునే వరకు ఈ భూమి అడవిగా ఉండేది. 

అతను అయోధ్య నుండి వచ్చి ఇక్కడి అడవిని తొలగించాడు. అప్పుడు జనక మహారాజు ఏర్పాటు చేసిన చిత్రాలను కనుగొన్నాడు,ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాడు మరియు సీతను పూజించడం ప్రారంభించాడు. 


💠 జానకి మందిరం ఆధునికమైనది మరియు సుమారు 100 సంవత్సరాల పురాతనమైనది. అయితే ఈ పట్టణంలో పురావస్తు ఆసక్తికి సంబంధించిన అవశేషాలు లేవు



💠 జానకి ఆలయం, సీతామర్హి

రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ నుండి సుమారు 1.5 కి.మీ.

Sanatana dharm


 

సత్యశోధకుని ఆత్మకథ

 "ఒక సత్యశోధకుని ఆత్మకథ" - 27వ భాగము.

- శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).


సత్యంతో కూడిన ధర్మము ఎలావుంటుందో శ్రీసీతారాముల జీవితమే నిదర్శనమని, జ్ఞానాన్ని ప్రభోదించే అన్ని ఉపనిషత్తుల సారాంశము భగవద్గీతలో లభిస్తుందని, ఆ రెండింటిని పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటే సత్యశోధనకు మార్గము సులువవుతుందని, ఆ పిమ్మట ఒక సద్గురువును ఆశ్రయించి, సేవించుటద్వారా ఆత్మజ్ఞానం కలిగి సత్యదర్శనం సిద్ధిస్తుందని బోధించేరు నా మొదటి గురువైన నాన్నగారు. ఆ మార్గాన్నే ఆచరిద్దామని మనస్సులో నిశ్చయించుకున్నాను. 


సద్గురువు లభించడం మన ఆధ్యాత్మిక పరిపక్వత బట్టీ వుంటుందని, అన్యఆలోచన చేయకుండా సత్యశోధన చేసుకుంటూ పొతే గురువు తనంతటతానే సాధకుడి వద్దకు వస్తాడని నాన్నగారు సూచించేరు. 


ఏ భావంతో సాధన చేస్తామో అదే సిద్ధిస్తుందని, అటువంటి శక్తిని జీవునికి ఆ పరమాత్మ ప్రసాదించేడని, కాబట్టి తత్వసాధనకు భావన స్వచ్ఛమైనదిగా వుండాలని, భావమే బాహ్యకర్మలుగా వ్యక్తమౌతుందని, అందుకే జీవుడు ముందుగా మనస్సును తన ఆధీనంలోకి తెచ్చుకునే సాధన చెయ్యాలని బోధించేరు నాన్నగారు.


జ్ఞానం పొందడానికి, అజ్ఞానంతో జీవించడానికి మనస్సే ప్రధాన కారణము. మనస్సే మన మిత్రుడు లేదా శత్రువు కూడా. ఆలోచనలు కలిగేది, కోరికలు పుట్టేది మనస్సులోనే. మనస్సు ఆధీనంలోనే ఇంద్రియాలు వుంటాయి. ఇంద్రియాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేవు కానీ మనస్సును ప్రభావితం చెయ్యగలవు. సాధకుడు ఈ విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తరువాతే సాధన ప్రారంభించాలి, లేకపోతె సాధన మధ్యలోనే పతనమౌతుందని నాన్నగారు అనేకసార్లు పేర్కొన్నారు.


పునాది ధృడంగా వుంటేనే ఆకృతి చిరకాలం నిలుస్తుందని మృదువుగా హెచ్చరించేరు. 


నాన్నగారి బోధనలు పునరావృత్తము చేసుకుంటూ నా సత్యశోధన ముందుకు సాగింది............

దక్షుని యజ్ఞం

 🌿దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలందు కాలిబూడిద అయినపుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. 


🌸వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసెను. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారమునందు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. 


🌿సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):


🌸పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్పవారని వాదనకుదిగి శివుని వద్దకు వచ్చిరి. అపుడు శివుడు ఆద్యంతములులేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను. 


🌿విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినను ఒకఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. 


🌸శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. 


🌿ఆలింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. 


🌸 శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):


🌿పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. 


🌸ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి పుండరీకపురము అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు. 


🌿వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అనుపేరుతో పిలువబడెను.


🌸సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు.....స్వస్తి..🚩

గొప్ప_మనసు

 గొప్ప_మనసు......"❤"

                    

        *నేను ఇంటి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి మూడు నెలలు అయింది. పని చురుకుగానే సాగుతున్నది.*

        *ఈ రోజు స్లాబ్ వేయాలి. మేస్త్రి కనిపిస్తే "పని వాళ్ళు అందరూ వచ్చినట్లేనా?" అని అడిగాను."ఒక మనిషి తగ్గాడు. మరేం ఫర్లేదు. పనికి ఇబ్బంది లేదు".. అన్నాడు.*

      *అంతలో ఒక వ్యక్తి వచ్చాడు.నాకు నమస్కారం చేసి "అయ్యా! నా పేరు రాజయ్య.*

 *పొరుగూరు నుంచి కుటుంబం తో వచ్చాను.*

 *వారం నుండి పని కోసం తిరుగుతున్నాను.*

 *ఎక్కడా పని దొరకలేదు. పిల్లలు పస్తు ఉన్నారు. దయచూపించి పని ఇప్పించండి" అని ప్రాధేయ పడ్డాడు.*

          *అక్కడే ఉన్న మేస్త్రి " నీవెవరివో తెలీకుండా... నీపనితనం తెలీకుండా.. పనిలో పెట్టుకొనేది లేదు. *వెళ్ళు! వెళ్ళు!" అని కసురుకున్నాడు.*

     

     *అతను నా వైపు జాలిగా చూస్తూ"  ఇది నాకు అలవాటున్న పనేనయ్యా! దయచూపండి" అని ప్రాధేయ పడ్డాడు.*

       *నాకెందుకో అతని మాటల్లో నిజాయితీ... కన్నుల్లో ఆకలి కనిపించింది.*

      *మేస్త్రితో " తెలిసిన పనే అంటున్నాడుగా!*

 *ఈ రోజుకు పెట్టుకు చూద్దాం" అన్నాను.*

  *మేస్త్రీ అయిష్టంగా "సరే! మీ ఇష్టం" అన్నాడు.*

      *అతను నా వంక కృతజ్ఞతగా చూసి పనిముట్లు వైపు నడిచాడు. మధ్య మధ్యలో అతని వంక చూసాను. కష్టపడి పనిచేయడం గమనించాను. "పోనీలే! నేను పని ఇవ్వడం వలన అతని కుటుంబానికి ఒక రోజు గడుస్తుంది" అని మనసులో సంతోషించాను.*

          *మధ్యలో కూలీలు అందరికీ టీ తెప్పించాను. అందరూ పదినిముషాలు పని ఆపి కబుర్లు ఆడుతూ టీ తాగుతున్నారు.*

 *రాజయ్య వంక చూసాను. ఎంతో ఇష్టంగా టీ తాగుతూ నా వంక చూస్తున్నాడు. అతను ఆకలిగా ఉన్నట్లు గ్రహించాను.*

         *మధ్యాహ్నం కూలీలు పని ఆపి భోజనాలు చేస్తున్నారు. రాజయ్య ఏం తెచ్చుకోకపోవడంతో పని ఆపకుండా తట్టలు పైకి మోస్తున్నాడు. ఆతని  ఆకలి గుర్తించగలిగాను. కానీ దగ్గరలో ఏం హోటల్స్ లేకపోవడంతో అతన్ని టిఫిన్ చేయడానికి పంపలేకపోయాను.*  *రాజయ్య మాత్రంమంచి నీళ్ళతో సరిపెట్టేసుకున్నాడు.*

         *అతని ఆకలి నాకు గిల్టీగానే ఉంది. సాయంత్రం అయింది.* *మేస్త్రీకి డబ్బులు ఇచ్చాను. అతడు కూలీలకు పంచాడు.*

         *రాజయ్య బయలుదేరుతూ నా దగ్గరకు వచ్చి రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. "నువ్వేం తినలేదు. త్వరగా వెళ్లి భోజనం చేయి" అన్నాను.*

     *"నేనే కాదయ్యా! ఇంట్లో వాళ్లకు ఎవరికీ భోజనం లేదు. మీ  దయవల్ల ఈ పూట గడుస్తుంది" అన్నాడు. అతని కన్నుల్లోని ఆవేదన సరిగానే గుర్తించాను.*

         *అతను బయలు దేరిపోయాడు. ఎందుకో తెలీదు... రాజయ్య వంకే చూడసాగాను. వెళ్తున్న రాజయ్యకు పావురాలు అమ్ముతున్న వ్యక్తి ఎదురు పడ్డాడు. రాజయ్య ఆగి తనను దాటి పోయిన పావురాలు అమ్మే వ్యక్తినే చూడసాగాడు.*

 *అతని చేతిలో రెండు పావురాలు ఉన్నాయి.*

       *రెండు నిముషాలు ఆగి రాజయ్య ఆ వ్యక్తిని కేకేసి పిలిచాడు. నాకు విషయం అర్థం అయిపోయింది. ఈపూట రాజయ్య పావురాయి మాంసంతో విందు భోజనం చేయబోతున్నాడు....*

 *అన్న ఆలోచన రాగానే నాకు అంతవరకు రాజయ్య మీద జాలి కరిగి పోయింది.*

       *"ఆ డబ్బు జాగ్రత్త చేసుకుంటే మరో పూట కూడా గడిచి పోతుంది. అలాంటిది పావురాయి మాంసంతో జల్సా చేసుకుంటున్నాడు" ఆ ఆలోచన నాకు అతని మీద కలిగిన సదభిప్రాయాన్ని దూరం చేసింది.*

          *బేరం కుదిరినట్లు ఉంది. పావురాలు అమ్మే వ్యక్తి రాజయ్య ఇచ్చిన డబ్బు తీసుకొని పావురాలు అందిస్తూ" చాలా రుచిగా ఉంటాయి. మరలా నన్ను వెతుక్కోవాలి నువ్వు" అన్నాడు.*

      *రాజయ్య చిన్నగా నవ్వి వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీయసాగాడు. పావురాలు అమ్మిన వ్యక్తి రాజయ్యను వారిస్తూ" ఈ పని ఇంటి దగ్గర చేయి. లేకపోతే ఎగిరి పోతాయి".. అన్నాడు.*

       *రాజయ్య అతని మాటలు పట్టించుకోకుండా వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీసి వాటిని ఒక్కసారి ముద్దు పెట్టుకొని గాలిలోకి ఎగర వేశాడు.*

 *స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పావురాల వంక అలానే ఆనందంగా చూడ సాగాడు.*

 *ఆ రెండు పావురాలు స్వేచ్చగా ఎగిరి పోయాయి.*

       *రాజయ్య చేసినపనికి నాతో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్య పోయారు.*

 *ఆఖరికి పావురాలు అమ్మిన వ్యక్తి కూడా.*

      *"ఏంటి నీవు చేసిన పని? డబ్బులు తేరగా వచ్చాయా?" అన్నాడు.*

        *"డబ్బులు మరలా సంపాదించవచ్చు. పోయిన ప్రాణం మరలా రాదు" అన్నాడు రాజయ్య. ఆ మాట నా చెవినపడింది. రాజయ్య నాకు ఒక అద్భుతమైన వ్యక్తిలా కనిపించాడు.*

 *అతని ఆకలి... ఎదురుచూసే అతని వాళ్ల ఆకలి నా కళ్ళ ముందు కదలాడింది. కూలీ పని చేసి బ్రతికే ఒక మనిషిలో ఎంత గొప్ప మనసు దాగి ఉందో బోధ పడింది.*

     *అంతలో పావురాలు అమ్మిన వ్యక్తి... రాజయ్యతో అన్నా! నేను చేసే పని తప్పని తెలుసు. కానీ పొట్టకోటి కోసం తప్పడం లేదు. నీ డబ్బులు నీవే ఉంచుకో!"*

 *అని రాజయ్య డబ్బులు వెనక్కి ఇవ్వబోయాడు.*

 *రాజయ్య అతన్ని వారిస్తూ" డబ్బు వెనక్కి తీసుకుంటే నాకు తృప్తి ఉండదు" అని ముందుకు కదిలాడు.*

        *కొంచెం సేపు అలానే ఉండిపోయాను.*

 *తరువాత బైక్ స్టార్ట్ చేసి... రాజయ్య దగ్గరకు పోనిచ్చి "ఎక్కు" అన్నాను.*

 *"వద్దు అయ్యగారూ!" అన్నాడు." మరేం ఫర్లేదు. నేనూ అటేవెళ్తున్నాను" అని బలవంతంగా ఎక్కించి ఒక హోటల్ ముందు ఆపి మీల్స్ పార్సెల్ చేయించాను.*

      *ఆ తరువాత రాజయ్య ఎక్కడ ఉంటున్నాడో కనుక్కొని అక్కడ డ్రాప్ చేసి మీల్స్ పార్సిల్ అందించి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాను.*

      *"అదేంటి  అయ్యగారూ!మీలాంటి గొప్పోడు నాకు దండం పెట్టడం" అన్నాడు రాజయ్య.*

     *"డబ్బు ఉన్నోడు గొప్పోడు కాదు. మనసున్న వాడే గొప్పోడు. ఆ మనసు నీకుంది. రేపు పనిలోకి వచ్చేయి!" అనిబైక్ స్టార్ట్ చేసాను.*

     *బైక్  డ్రైవ్ చేస్తున్న నాకు ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తూ కనిపించింది.*

    *నాకు రాజయ్య గుర్తుకు వచ్చాడు!!*

మూఢుడు

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝


*శ్రుతం సత్యం తపశ్శీలం* 

*విజ్ఞానం విత్తమున్నతిమ్ |*

*ఇంధనీకురుతే మూఢః* 

*ప్రవిశ్య వనితానలమ్*


≈ *తాత్పర్యం* ≈


మూఢుడు గురుముఖము నుండి వినిన ధర్మము, శాస్త్రము, సత్యము, తపస్సు, పుణ్యశీలము, విజ్ఞానము, ధనము ఉన్నతపదవి...ఇట్టి యమోఘములగు దివ్యగుణములను వనితయను అగ్నియందు కట్టెలవలె కాల్చి భస్మమొనర్చుచున్నాడు.

ఈషణత్రయము

 *ఈషణత్రయము*



పుత్రదార గృహాదిషు అనభిష్వంగః


*అభిష్వంగః అంటే అతిస్నేహం. అనభిష్వంగః అంటే తగులుకోకుండా ఉండటం*. సంతానం, భార్య భర్త, ఇల్లు మొ॥న విషయాల పట్ల అతిస్నేహం పనికి రాదు. వీటినే *ఈషణత్రయం అంటారు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ - వీటిలో మానవుడు తగులుకోరాదు. వీటిని కలిగి ఉండటంలో తప్పులేదు. కాని వాటిపై అతిస్నేహం కూడదు - అని గ్రహించాలి*. నిజంగా ఇవి ఏవీ శాశ్వతం కాదు. అవి నీనుండైనా దూరమౌతాయి, లేదా నీవైనా వాటికి దూరం అవుతావు. ఈ విషయాన్ని గ్రహించి వాటి కొరకే నా జీవితం, అవి లేకపోతే నేను లేను. అనే భ్రమను తొలగించుకోవాలి.


వ్యామోహం అనే జిడ్డును వదిలించుకోవాలి. అద్దాన్ని చూడండి. అది అన్నింటిని కౌగిలించుకొంటుంది. అందరితో సంబంధం పెట్టుకుంటుంది. కాని దేనికీ అంటుకోదు. అన్నింటిని వదిలేస్తుంది. *కనుక సాధకుడు అద్దంలాగా ఉండాలి*.


*ఎలాంటి వారితో సాంగత్యం చేస్తే అలాంటి బుద్ధులే వస్తాయి*.


. దుమ్ము గాలితో స్నేహం చేస్తే ఆకాశానికి ఎగురుతుంది.


. అదే నీటితో స్నేహం చేస్తే అడుగుకు చేరి పోతుంది.


. ఇనుము మట్టితో స్నేహం చేస్తే తుప్పు పట్టి పోతుంది.


. అదే అగ్నితో స్నేహం చేస్తే శుద్ధమై నిర్మలమవుతుంది.


*కనుక సంగ ప్రభావం అద్భుతమైనది. కనుక పామరులకు దూరంగా ఉండాలి*.


*సత్సాంగత్యం అనేది ఏకాంతవాసం కన్నా - అన్నింటికన్నా అధిక ఫలదాయకం*,


. సత్సాంగత్యం వల్లనే రత్నాకరుడు వాల్మీకియై రామాయణాన్ని రచించాడు.


. సత్సాంగత్యం వల్లనే దాసీ పుత్రుడు దేవర్షి నారదుడయ్యాడు.


. సత్సాంగత్యం వల్లనే పరీక్షిత్తు ఏడు రోజులలో ముక్తిని పొందాడు.


*కనుక సత్పురుషులకు దగ్గరగా ఉండాలి. దుర్జనులకు, పామరులకు దూరంగా ఉండాలి. నిజంగా సత్పురుషులతో సాంగత్యం చేస్తూ జ్ఞానార్జన చేస్తూ ఉంటే పామరజనులతో సంబంధం దానంతట అదే తెగిపోతుంది


*నీవు ఏ పనులు చేస్తున్నా, ఏ ఆలోచనలు చేస్తున్నా భగవంతుని స్మరణ - ఆత్మస్మరణ - పరమాత్మ స్మరణ నేపథ్య సంగీతంలా జరిగిపోతూనే ఉండాలి. పడవ ఎటు తిరుగుతున్నా దిక్సూచిలో ఉత్తర దిక్కు వైపుకే ముల్లు చూపుతున్నట్లు ఈ జీవన నావ సంసారమనే సముద్రంలో ఎటు తిరుగుతున్నా మనస్సు అనే దిక్సూచిలో ముల్లు మాత్రం ఆత్మవైపే - పరమాత్మ వైపే తిరిగి ఉండాలి. అదే జ్ఞాని ముఖ్యాతి ముఖ్యమైన లక్షణం*.


తగలబడుతున్న ఇంటిలో నుండి తప్పించుకొని బయటపడాలని తాపత్రయం చెందినట్లుగా; నీటిలో మునిగి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైనవాడు బయటపడాలని తాపత్రయపడినట్లుగా అజ్ఞానంతో కూడిన ఈ సంసారబంధం నుండి త్వరగా విముక్తి చెందాలని ఆవేదన పడే వాడే - ఆర్తితో ఏడ్చే వాడే *ముముక్షువు. మోక్షం పట్ల తీవ్ర ఆసక్తి గలవాడు* అని తెలుసుకోవాలి.

శివాలయంలో

 *నిత్యాన్వేషణ:*


శివాలయంలో నందీశ్వరునికి ఉన్న ప్రాధాన్యత మిగిలిన దేవాలయాల్లో ఆయా దేవుళ్ళు వాహనాలకు ఉండదు, ఎందుకని? 



*నందీశ్వర నమస్తుభ్యం, సాంబానంద ప్రదాయకం౹*

*ఉమామహేశ్వర పూజార్ధం, అనుజ్ఞామ్ దాతుమర్హసి॥*

శివ దర్శనం చేసుకునేముందు నందీశ్వర దర్శనం తప్పనిసరి అని చెప్తారు.. మొదటగా నందీశ్వరుని పృష్ట భాగాన్ని స్పృశించి , అయన శృంగములు (కొమ్ములు) మధ్యనుంచి శివ దర్శనం చేసుకోవాలి అని చెప్తారు.. మన కోరికలు కూడా మొదట నందీశ్వరుని చెవిలోని విన్పించాలి అంటుంటారు..


అసలు నందికి అంత ప్రాముఖ్యత ఎలా లభించింది? అంటే పురాణపరంగా, శాస్త్రపరంగా అనేక రకాలైన ఆసక్తికర విశ్లేషణలు ఉన్నాయి.. మొదట పురాణపరమైన కారణాలు..

*శిలాదుడు అనే మహర్షి కి నంది శివ ప్రసాదంగా లభిస్తాడు.. అయితే నంది అల్పాయాష్కుడు అని కొంత మంది మునుల ద్వారా తెలుసుకున్న శిలాదుడు ఆందోళన చెందుతాడు.. అయితే నంది మాత్రం శివానుగ్రహం వల్ల తన తలరాతను మార్చుకోదలచి తపస్సుకి పూనుకుంటాడు.. నంది తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, ఆ మహానుభావుని దివ్యదర్శనానికి పులకరించి పోయిన నంది, ఆయుష్షు కాకుండా నిరంతరం శివసాన్నిధ్యం అని గొప్ప వరాన్ని అడుగుతాడు*


*శివుడు తధాస్తు అని నిరంతరం తనతోపాటు ఉండి , తనకి వాహనంగా ఉండే వరాన్ని అనుగ్రహిస్తాడు.. అంతే కాకుండా నందిని ప్రమథ గణాలకి అధిపతిగా కూడా నియమిస్తాడు.. ఈ విధంగా నిరంతరం శివుడిని అంటిపెట్టుకుని ఉండే అవకాశాన్ని నంది తన తఫఫలంగా పొందాడు* అని చెప్పవచ్చు..


ఇక విజ్ఞాన పరమైన విశ్లేషణ:


*ఇక వృషభం(ఎద్దు) అపరిమితమైన బలానికి, అంతులేని సహనానికి, లైంగిక పటుత్వానికి ప్రతీక.. నిజం చెప్పాలంటే ఈ మూడు గుణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అసాధ్యం (సాధారణ వ్యక్తులకి).. ఎంత బలమున్నా ,ఎదిగి ఉండాలి అని చెప్పడం, కామం ఉన్నా ధర్మంగా ,సంతానోత్పత్తికి మాత్రమే ఉపయోగించుకోవాలని నంది విగ్రహం ఒక సందేశం ఇస్తుంది* అని నా భావన..


*ఇక వృషభం యొక్క నాలుగు పాదాలు సత్యం, ధర్మం, శాంతి ,ప్రేమకు చిహ్నాలుగా చెపుతారు.. ఒక జీవుడు ముక్తి పొందడనికి ఈ నాలుగు పాటించడం తప్పనిసరి* అని చెప్పడం..


*మీరు సరిగ్గా గమనిస్తే శివాలయంలో నంది ఎక్కువగా ధ్యాన ముద్రలో దర్శనమిస్తాడు.. అయన శివుడితో ఏమీ చెప్పుకోడు.. కళ్ళ ముందే ఉంటూ ఆయన్నే ధ్యానిస్తూ ఉంటాడు.. అలాగే మనం కూడా గుడిలో శివుడిని వరాల కోసం విసిగించకుండా, కేవలం ధ్యానిస్తే చాలు, ఈశ్వరుడే ఐశ్వర్యాలను అందిస్తాడు అని ఒక సందేశం.* ప్రార్ధన, ధ్యానం రెండూ వేరు వేరు అని చదివాను.. ప్రార్ధన అంటే దేవుడితో మనం మాట్లాడడం, ధ్యానం అంటే దైవం చెప్పేది మనం వినడం.. కాబట్టి ధ్యానానికి ఉన్న ప్రాశస్త్యాన్ని నంది విగ్రహం ద్వారా వివరించారు అని ఒక విశ్లేషణ..


*ఇక నందికి , శివునికి మధ్యలో ఎవర్ని నిలబడవద్దు అని పూజారి వారిస్తారు .. దానికి అర్ధం మీరు నిరంతరం శివ ధ్యానంలో ఉండాలి, మీకు, ఆ శివునికి మధ్యలో ఎటువంటి అడ్డు ఉండకూడదు, అంటే రకరకాల ఆకర్షణలు, వ్యామోహాలు లాంటివి లేకుండా, చట్టంలో శివుడిని ఉంచుకోవాలి* అని చెప్పఁడం..

అలాగే శ్రీ మహావిష్ణువు కి గరుత్మంతుడు, వినాయకునికి మూషికుడు , సుబ్రహ్మణ్యుడికి కుక్కుటం , దుర్గాదేవికి సింహం.. ఇలా వేరు వేరు దేవతా రూపాలకి వేరు వేరు జంతువులు, పక్షులు వాహనాలుగా ఉన్నాయి.. ఒక్కో వాహనానికి ఒక్కో విశిష్టత, ఎంతో మహోత్తరమైన సందేశాలు ఉన్నాయి.. హిందూ ధర్మం లోని గొప్పతనం అదే..

31-07-2023* *సోమవారము* *రాశి ఫలితాలు*

 *31-07-2023*

  *సోమవారము*

 *రాశి ఫలితాలు*

*మేషం*

సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు    మరింత ఉత్సాహంగా సాగుతాయి.

*వృషభం*

కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ  విలువ పెంచుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

*మిధునం*

నిరుద్యోగ  ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. గృహనిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

*కర్కాటకం*

చేపట్టిన పనులు సకాలంలో  పూర్తి చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు. స్ధిరాస్తి  క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది.

*సింహం*

కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన  పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.  గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాలలో  పాల్గొంటారు.  సంతాన విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.

*కన్య*

జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు  కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహంలో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా  సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు మరింత ఇబ్బంది  కలిగిస్తాయి.

*తుల*

వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. స్థిరమైన  నిర్ణయాలు తీసుకోకపోవడం  వలన నష్టపడతారు. నూతన  రుణ  ప్రయత్నాలు  ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు.  ఆలయ దర్శనాలు చేసుకుంటారు.  ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

*వృశ్చికం*

ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల  సహాయంతో  వివాదాల నుండి బయట పడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది.

*ధనస్సు*

కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఇంటా బయట కొందరి  ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.  ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.   ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

*మకరం*

ఉద్యోగాలలో ఉత్సాహకర  వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. గృహమున  శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

*కుంభం*

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఋణ ప్రయత్నాలు కలిసి రావు.

*మీనం*

గృహమున బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో  సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

🕉️

National security


 

Bhajan


 

పరమేశ్వర

 ెపరమేశ్వర ఆరాధన !        



             చ: ఉనికి శిలోచ్చయంబు , నిజయోష శిలోచ్చయరాజ పుత్రి , నీ


                   ధనువు శిలోచ్చయంబు , పురదాహ! రథీకృత రత్నగర్భ ! నీ 


                    మనమున కీ శిలాశకల మండలమెట్లు ప్రియంబు సేసె? నే


                    మనగలవాడ నిన్ను? వ్రతహానియొనర్చు దురాత్ముఁడుండగన్.


                     శ్రీ కాళ హస్తీశ్వర మాహాత్మ్యము--2--ఆ : 122పద్యం: ధూర్జటి మహాకవి! 


                అర్ధములు: శిలోచ్చయము-- రాళ్ళసముదాయం-పర్వతం; నిజయోష-- భార్య ; పురదాహ--త్రిపురములను దహించినవాడా! రథీకృత--రథముగా చేయబడిన; రత్నగర్భ-- భూమి; శిలాశకలములు--రాతిముక్కలు: మండలము--సముదాయము; 


                    భావము; త్రిపురములను దహించిన ఓపరమశివా! రత్నగర్భను రథముగా నెన్నుకొనినవాడా! నీనివాసం రాళ్ళగుట్ట(కొండ )నీభార్యయా పర్వత రాజపుత్రి ( ఒకపెద్ద బండరాయి కూతురు) నీకు రాళ్ళకేమి కొదవయ్యా! నీపరివారమంతా రాళ్ళేకదా? అయినా నీకీ రాతిముక్కలెలా ప్రియమయ్యాయి స్వామీ! నిన్నని పనేమిలే నాపూజా వ్రత భంగకారకుడుండగా!

అని భావము. 


                           ఇదియొక గొప్పపద్యము. నిందాస్తుతితో పరమేశ్వరారాధనము చ

బీహార్ : సూరజ్‌పూర్, నలంద

 🕉 మన గుడి : 







⚜ బీహార్ : సూరజ్‌పూర్, నలంద


⚜ సూర్య కుండ్



💠 బీహార్ ని పండుగల దేశం

అంటారు. పండుగలు పౌరాణిక కాలం నుండి బిహారీ నాగరికతలో చేర్చబడ్డాయి. వివిధ నాగరికత, మతం మరియు సంస్కృతికి చెందిన ప్రజలు రాష్ట్రంలోని పవిత్ర భూమిలో నివసిస్తున్నారు, దీని కారణంగా ఈ ఉపవాసాలు మరియు పండుగల ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. 

ఈ బీహార్ గడ్డపై అడుగడుగునా ఇలాంటి పౌరాణిక మఠాలు, దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. నలంద జిల్లాలోని  ఉన్న చారిత్రాత్మక సూర్య దేవాలయం అటువంటి దేవాలయాలలో ఒకటి. భాస్కరునికి అర్హ్యం ఇచ్చే సంప్రదాయం ఇక్కడి నుంచే

ప్రారంభమైందని ప్రతీతి.


💠 ఈ ఆలయం ద్వాపర కాలం నాటిదని

చెబుతారు. సూర్య భగవానుడి ప్రత్యేక ఆరాధన అయిన  " ఛత్ పూజ "ఈ ఆలయం నుండి ప్రారంభమైందని నమ్ముతారు.

సూర్యారాధన బీహార్‌లో ఛత్ పూజగా కొనసాగుతోంది.  


💠 ఈ ఆలయంలో నల్లరాతి మూర్తులు పురాతనమైనవి.  

సూర్య నారాయణ మూర్తిలతో పాటు, శివలింగాలు, ఆదిత్య, పార్వతి మరియు కాల భైరవ మూర్తి వంటి అనేక మూర్తులు ఉన్నాయి.


💠 ద్వాపర కాలంలో శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి ఇక్కడి రాజగిరికి వచ్చినప్పుడు, అతను ఈ ఆలయానికి చేరుకుని, భాస్కరుడిని పూజించాడని ఆలయచరిత్ర.

ఇది కాకుండా మగధ చక్రవర్తి  జరాసంధుడు కూడా ఇక్కడ సూర్య భగవానునికి పూజలు  చేశారు. పై కారణాలు వల్ల ఈ ఆలయ ఖ్యాతి దేశంలోని నలుమూలలకు వ్యాపించింది. 


💠 ఈ సూర్య దేవాలయం బీహార్‌లోని నలందా సమీపంలోని సూరజ్‌పూర్ బరాగావ్‌లో ఉన్న పురాతన హిందూ దేవాలయం. 

ఇది భారతదేశంలోని 12 సూర్యధాములలో ఒకటి మరియు నలందలో సందర్శించవలసిన ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి.


💠 ఈ ఆలయంలో అనేక బౌద్ధ దేవతలతో పాటు చాలా అందమైన హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి. అన్ని విగ్రహాలలో అత్యంత ఆకర్షణీయమైనది పార్వతీ దేవి యొక్క 5 అడుగుల ఎత్తైన విగ్రహం. 


💠 వైశాఖ మరియు కార్తీక మాసాలలో సంవత్సరానికి రెండుసార్లు ఇక్కడ జరిగే 'ఛత్ పూజ' వేడుకకు ఈ ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది. చాట్ పూజలో భాగంగా ఈ ఆలయంలో ప్రసాదం ఇక్కడి చెరువు నీటి నుండి తయారుచేయబడును


💠 ఇక్కడి సూర్యుని చెరువులో స్నానం చేసి, ఆలయంలోని భాస్కరుడిని పూజించడం వల్ల కుష్టువ్యాధితో పాటు నయం కాని అనేక వ్యాధులు నయమవుతాయని ప్రజల నమ్మకం.


⚜ స్థల పురాణం ⚜


💠 దుర్వాస మహర్షి  శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకకు వెళ్లాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు రుక్మణితో కలిసి తోటలో నడుస్తూ ఉన్నాడు. ఇంతలో శ్రీకృష్ణుని కొడుకు సాంబుడు అకస్మాత్తుగా ఏదో నవ్వాడు. మహర్షి దుర్వాసుడు అతని నవ్వును  వెక్కిరింపుగా అర్థం చేసుకున్నాడు. 

అప్పుడు సాంబుడుకి కుష్ఠురోగం వస్తుందని శపించాడు. దీని తరువాత, శ్రీ కృష్ణుడు ఆ  కుష్టు వ్యాధి నివారణకు సూర్య భగవానుని ఆరాధన చేసి ఇక్కడి సూర్య కుండంలో స్నానం చేయమని ఆదేశించాడు.

అలాగే సూర్య రాశిని వెతకమని ఆదేశించాడు


💠 శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు సాంబుడు 49 రోజుల పాటు పూజలు చేశాడు, శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు, సాంబుడు సూర్యుని రాశిని వెతకడానికి బయలుదేరాడు. దారిలో దాహం వేసింది. దీని తరువాత, సేవకుడికి నీరు తీసుకురావాలని ఆదేశించాడు.

దట్టమైన అరణ్యం వల్ల చాలా దూరం వరకు నీరు దొరకడం లేదు. ఒక చోట గొయ్యిలో నీరు కనిపించింది, అది కూడా మురికిగా ఉంది. సేవకుడు ఆ గుంటలోంచి నీళ్ళు తెచ్చి రాజుకి ఇచ్చాడు. రాజు మొదట నీళ్లతో కాళ్లు చేతులు కడుక్కొన్నాడు. ఆ తర్వాత ఆ నీటితో దాహం తీర్చుకున్నాడు. నీళ్లు తాగిన వెంటనే అతని శరీరంలో మార్పులు కనిపించాయి. ఆ తర్వాత అక్కడే ఉంటూ నీళ్లు తాగుతూనే ఉన్నారు. 

49 రోజుల పాటు సూర్యుడిని నిరంతరం పూజించారు. దీని తరువాత అతను శాపం నుండి విముక్తి పొందాడు.

శ్రీకృష్ణుడి కొడుకు అయిన సాంబుడు ఈ ఆలయాన్ని నిర్మించారు.


💠 ఇంకో స్థల పురాణం ప్రకారం, 

ఒకసారి శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడిని చూసి గోపికలు శ్రీకృష్ణునిగా పొరబడ్డారు. 

సాంబుడు తన గుర్తింపును గోపికలకు వెల్లడించలేదు మరియు గోపికలతో కాలక్షేపాలలో పాల్గొన్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న శ్రీకృష్ణుడు కోపంతో తన కుమారుడైన సాంబుని కుష్టు వ్యాధిగ్రస్తుడు శపించాడు . అతని శాపం కారణంగా సాంబుడు కుష్ఠురోగి అయ్యాడు. 


💠 సాంబుడు శ్రీ కృష్ణుడిని శాపవిమోచనం  కోసం ప్రార్థించినప్పుడు, శ్రీ కృష్ణుడు 12 సూర్య దేవాలయాలను నిర్మించమని కోరాడు. వాటిలో ఈ సూర్య దేవాలయం ఒకటి అని నమ్ముతారు.


💠 ఇక్కడ ఉన్న సరస్సులో కనీసం 5 ఆదివారాలు స్నానం చేస్తే కుష్టు వ్యాధి నుండి విముక్తి లభిస్తుందని కూడా ఒక నమ్మకం. 


💠 ఈ ఆలయం దేశంలోని 12 ప్రసిద్ధ సూర్య దేవాలయాలలో ఒకటి అంటారు. 1934లో వచ్చిన భయంకరమైన భూకంపం వల్ల ఈ ఆలయం దెబ్బతిన్నదని చెబుతారు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని మళ్లీ మరమ్మతులు చేశారు.


💠 బిహార్ రాష్ట్రంలో ఎక్కడా వేడి నీటి సూర్య కుండ్ లేకపోవడం పెద్ద విషయం. ఈ కొలను మాత్రమే వేడి నీటి కొలను రూపంలో ఉంటుంది.


💠 దూరం (నలంద రైల్వే స్టేషన్ నుండి): 4 కి.మీ

ఆదివారం, జూలై 30, 202రాశి ఫలాలు3*

 .       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*ఆదివారం, జూలై 30, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*అధిక శ్రావణ మాసం - శుక్ల పక్షం*

*తిధి*      :    *ద్వాదశి ఉ7.07* వరకు 

             తదుపరి *త్రయోదశి తె 5.12* 

   వరకు

.                *🌹రాశి ఫలాలు🌹* 

 

*మేషం*


సంతానం విద్యా విషయాలలో  శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో  పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహం తో  వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

---------------------------------------

*వృషభం*


వాహన  ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. దాయాదులతో  ఆస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు.

---------------------------------------

*మిధునం*


ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.  ఇంటాబయట  ఊహించని చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.  జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో  శ్రద్ధ వహించా. వృత్తి వ్యాపారాలు మందకోడిగా  సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

---------------------------------------

*కర్కాటకం*


ప్రయాణాలలో  కొత్త వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు  ఉపయోగపడతాయి. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు  సంతృప్తినిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

*సింహం*


సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో  ఇంటాబయట అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

---------------------------------------

*కన్య*


దూరప్రయాణాలు  ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలను  దర్శించుకుంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. 

---------------------------------------

*తుల*


బంధు మిత్రులతో  ఊహించిన మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు తప్పవు.  ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

*వృశ్చికం*


నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. ప్రణాళికలతో అనుకున్న పనులను పూర్తిచేస్తారు.  ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక వ్యవహారంలో దూరప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు.  వ్యాపారాలలో ఉత్సాహంతో  ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

---------------------------------------

*ధనస్సు*


వృధా  ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.

---------------------------------------

*మకరం*


ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు  అప్రయత్నంగా పూర్తి చేస్తారు.  వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం.

---------------------------------------

*కుంభం*


ఆరోగ్య  విషయంలో  అశ్రద్ధ  చేయడం మంచిది కాదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది.  దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. సోదరులతో  స్థిరస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

*మీనం*


ఆర్థిక వ్యవహారాలు  గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం   అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు.  ఆప్తుల  నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపారాలకు  నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున  అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి.


🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి పోస్టు. 


👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

పండిత పుత్రుడు... చిన్నకధ...

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

పండిత పుత్రుడు... చిన్నకధ...


రత్నపురి రాజ్య ఆస్థాన పండితుడు వరదాచారి.ఆయన ఎంతటి వారినైనా తన వాగ్ధాటితో చిత్తు చేసేవాడు. ఎంత గొప్ప పండితుడినైనా తన అమోఘ పాండిత్యంతో అవలీలగా ఓడించేవాడు. దాంతో ఆయన కీర్తి నలుదిక్కులా మారుమోగిపోసాగింది.

వరదాచారి కుమారుడు సుబుద్ధి. అతడికి చదువుమీద ఆసక్తి లేదు. ‘చదువే బంగారు భవిష్యత్తుకు పునాది’ అని ఎవరైనా హితవు పలికితే అతడికి తగని చిరాకు. ‘కష్టపడి చదవవలసిన అవసరం నాకు లేదు. చదువు లేకున్నా నేనుహాయిగా, దర్జాగా బతకగలను. మా నాన్న గొప్పపండితుడు. మా ఇంటినిండా బంగారు నాణాలు,రత్న,మాణిక్యాలు ఉన్నాయి’ అని గొప్పగా చెప్పేవాడు.

రోజూ ఆట పాటలతో సమయం వృథా చేసేవాడు. అది గమనించిన ఓ వ్యక్తి ‘‘పండిత పుత్రః పరమశుంఠః’’ అన్నాడు.

ఆ మాటలు విన్న సుబుద్ధి పండితుడి పుత్రుణ్ని పరమశుంఠ అని గౌరవంగా పిలుస్తారని భావించి, ఎంతో పొంగిపోయాడు. ఒకరోజు సుబుద్ధిరాజుగారి ఉద్యానవనంలో ఆడుకుంటున్నాడు.

అంతలో అటుగా వెళుతున్న మంత్రి, ‘‘ఎవరుబాబూ నీవు?’’ అని ప్రశ్నించాడు. ‘‘నేను పండిత వరదాచారి పుత్రుడిని. పరమశుంఠను’’ అని గర్వంగా చెప్పాడు సుబుద్ధి.

అంతలో ఏదో శబ్దం వినిపిస్తే ఇద్దరూ అటువైపుచూశారు. అక్కడ ఓ చెట్టుపై కొన్ని కోతులుఉన్నాయి. అవి ఒక కొమ్మమీద నుంచి మరో కొమ్మమీదకుదూకుతున్నాయి. అంతలో ఓ కోతి పట్టుతప్పి కిందపడింది. వెంటనే మిగిలిన కోతులు దానిని వెలివేసి, అక్కడ నుంచి వెళ్లిపోయాయి.

సుబుద్ధి బాధపడుతూ, ‘‘ఆ కోతులు కిందపడిన కోతిపై ఎందుకు జాలి చూపలేదు?’’ అని అడిగాడు. అందుకు మంత్రి, ‘‘బాబూ! కోతి జాతిలోఓ పద్ధతి ఉంది. కోతులు ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు దూకేటప్పుడు కిందపడవు. ఏ కోతైనా పొరపాటున కింద పడితే, అది తమకోతి జాతికే అవమానంగా కోతులు భావిస్తాయి. అందుకే ఆ కోతిపై జాలి చూపక దాన్ని వెలివేసి వెళ్లిపోయాయి.

ఎందుకో తెలుసా? కోతులు దేన్నైనా సహిస్తాయి కాని,చేతకానితనాన్ని మాత్రం సహించలేవు’’ అని చెప్పాడు.

అది విన్న సుబుద్ధి, ‘‘అయితే పండితుల పిల్లలంతా బాగా చదువుకుంటున్నారు. కానీచదువు రాని నేను వాళ్లందరి ముందూచేతకానివాడిని అవుతాను కదా! మరి అందరూ నన్నువెలివేస్తారా?’’ అని ఉద్వేగంగా అడిగాడు.

మంత్రి అతడి భుజంపై చెయ్యేసి, ‘‘అవును నాయనా. నీవు చదువుకోకుంటే అందరూ నిన్ను‘పండిత పుత్రః పరమ శుంఠః’ అంటారు.

పరమ శుంఠ అంటే తెలివితక్కువవాడు అనిఅర్థం’’ అన్నారు.

సుబుద్ధి కాసేపు ఆలోచించుకుని, ‘‘నేను బాగా చదువుకుని గొప్ప పండితుడిని అవుతాను.

తండ్రిని మించిన కొడుకు అన్న పేరుతెచ్చుకుంటాను’’ అన్నాడు. మంత్రి అతడినిమనసారా ఆశీర్వదించారు.

తర్వాతి కాలంలో సుబుద్ది తండ్రిని మించిన తనయుడుగా వేనోళ్ళ కీర్తింపబడ్దాడు.


 *🌷పలుకు తేనియలు🌷* 

 *శ్రీ వి.వి.అప్పారావు*

Jai shrikrishna


 

తురకలా చేతిలో మన హిందూ సోదరులు

 



నా తండ్రి గారు తురకల చేతిలో దెబ్బలు తిని చావువరకు వెళ్లి బ్రతికి వచ్చిండు. 😭😭 ఈ సంఘటన జరిగి 15 సంవత్సరాలు గడిచింది. 

తురకలా చేతిలో మన హిందూ సోదరులు దెబ్బలు తినడం, చావడం మనం సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా లో చూసి బాధ పడటం న్యాయం జరగాలి పోస్ట్ పెట్టడం తప్ప మనం ఎం చేయలేక పోతున్నాం. నా తండ్రి గారి మిద జరిగిన కూడా నేను ఏమి చేయలేకపోయాను. 😭

#వివరాల్లోకి వెళ్తే


అది 2008 సంవత్సరం నా ఉన్నత విద్యకోసం భాగ్యనగరానికి వచ్చిన మొదటి రోజుల్లో నాన మిమ్మల్ని చూడాలని అంటున్నాడు మీతో ఏదో మాట్లాడాలి అంట రమ్మని ఫోన్ చేశారు. ఏంటో నాకు అర్ధం కాలే ఎప్పుడు బానే ఉంటారు ఉన్నత చదువులు చదవాలి అని మమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తి అకస్మాత్తుగా ఎందుకు ఇలా రమ్మంటున్నారు అని ఏం అయిన జరిగిందా అని మనసులో ఏదో కంగరపాటు భయం మొదలు అయ్యింది.

అలా భయపడుతూనే భాగ్యనగరం నుండి బోధన్ ప్రయాణం అయ్యాను.

బోధన్ లో బస్ దిగిన తరువాత మా చదువులకు ఆర్థిక సహాయం చేసిన దాతలు వాళ్ల ఇంటికి తీసుకువెళ్ళి భోజనం పెట్టీ నాన్నగారు బయటకు వెళ్లారు తిన్న తరువాత అక్కడికి వెల్దాం అని చెప్పారు. ఇంకా నా భయం ఎక్కువ అయింది. తిన్న తరువాత నన్ను తీసుకొని నేరుగా బోధన్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు అప్పుడు నా గుండె ఎక్కువ కొట్టుకోవడం ప్రారంభం అయింది ఎం అవుతుందో అర్థం కాని పరిస్థితి. లోపలికి వెళ్ళే సరికి నాన మంచం మిద ఉన్నాడు తల, పగిలి పోయింది, మోకం మొత్తం వాపు వచ్చింది కంట్లో రక్తం నిండి ఉంది, కాళ్ళు చేతులు మొత్తం రక్తం వచ్చి కమిలిపోయాయి ఆ పరిస్థితిలో మా నాన గారిని చూడగానే తట్టుకోలేని బాధ ఏడుపు అసలు ఆగటం లేదు అమ్మగారు వచ్చి పట్టుకొని బోరున ఏడ్చేసారు 😭😭. అమ్మగారు ఏడుస్తూ మీ నాన్నకు ప్రమాదం జరగలేదు హత్య యత్నం జరిగింది అని చెప్పింది నేను షాక్.

ఇది తమ్ముడికి ఏ మాత్రం తెలియదు ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు హాస్టల్లో ఉన్నాడు వాడికి తెలిస్తే చదువు ఎక్కడ విఘాతం కలుగుతుందని అసలు చెప్పలేదు. 

#అసలు_ఈ_హత్య_యత్నం_ఎందుకు_జరిగింది?

నాన గారు తమ్ముడిని హాస్టల్, నన్ను భాగ్యనగరం పంపించి వల్ల మిత్రులతో కలసి 100 ఏకరాల వ్యవసాయ భూమిని కవులుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. అది బోధన్ పట్టణానికి దగ్గరగా గ్రామం అది. 

రకా రకాల పంటలు వేశారు అందులో వరీ ఎక్కువ గా వేశారు. అందులో గట్ల పైన పెరిగిన గడ్డిని కూలీల చేత కత్తెరిస్తు ఆ గడ్డిని 5 రూ కట్ట చొప్పున అమ్ముతున్నారు, తెలిసిన వాళ్ళు వాళ్ళ పశువులకు ఉచితంగానే తీసుకెళ్తున్నారు. 

#ఈ_తుర్కొడు వాడి కొడుకుని తీసుకొని వచ్చి గడ్డి తీసుకుంటే అయ్య మేము లక్షలు పెట్టీ వ్యవసాయం చేస్తున్నాం కూలీలకు డబ్బులు ఇవ్వాలి మీరు ఇలా వచ్చి పట్టుకెళ్ళిపోతే ఎలా? ఎంతో కొంత ఇచ్చి పట్టుకెళ్ళండి ఒక్క కూలీ డబ్బులు వచ్చిన చాలు అని మా నాన గారి మిత్రుడు వాడితో అన్నాడట. అది జీర్ణించుకోలేని ఈ ఆఫ్ కట్ గాడు ఎక్కడి నుండో మా ఊరికి బ్రతకడానికి వచ్చి నా దగ్గరే డబ్బులు అడుగుతావ అని అసభ్య పదజాలం తో ఊగిపోయాడు. అది చూసిన మా నాన గారు ఏం అయ్య ఆయన అన్నది ఏమిటి నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ కొంచెం పద్ధతిగా మాట్లాడు అన్న తరువాత అక్కడి నుండి వెళ్తూ వెళ్తూ మీ అంతు చూస్తాను అంటూ వెళ్ళిపోయాడట. 

మా నాన గారు వాల మిత్రునితో ఊరు కానీ ఊరు వచ్చాము వాళ్ళతో మనకు ఎందుకు పశువులకు కదా వాడు తీసుకెళ్తుంది తిసుకపోనివ్వు వాడితో అనరాని మాటలు అనిపించుకున్న ము అని అన్నాడట 

అలా పొలంలో పని ముగించుకొని సైకిల్ తీసుకొని మా నాన గారు వాల మిత్రుడు ఒక కూలీ దారి వెంబడి మాట్లాడుకుంటూ వస్తు ఉన్నారు మద్యలోకి రాగానే వీళ్ళు ఎప్పుడు వస్తారా కాపు కాస్తున్న ఈ తుర్కోడు వల్ల మిత్రులు ఒక 10 మంది కలిసి తాగి వచ్చి రాడ్లు, కర్రలతో దాడి చేయడం ప్రారంభించారు. వాళ్ళు 10 మంది వీళ్ళు 3రు నిరాధియులు వాళ్ల చేతుల్లో ఆయుధాలు ఎం చెయ్యలేని పరిస్థితి. 

అలా కొడుతూ ఒక్కడు #నాన_తలపైన గట్టిగా కొట్టాడట మోకంలో నుండి రక్తం పట పట కరుత్తుంది ఎప్పుడు నాన గారికి అర్థం అయింది ఒక్కటే నన్ను వీళ్ళు ఎలాగైనా చంపి వేస్తారు నా పిల్లలు అనాధలు అవుతారు వల్ల పరిస్థితి ఏంది వాళ్ల చదువులు ఇంతటితో ఆగిపోతాయి. ఏం అయిపోతారో 😭😭

#ఆయనకు #చావు భయం కంటే కూడా తన పిల్లల #భవిష్యత్తు కనిపిస్తుంది. చీకటి పడింది తప్పించుకోవడానికి శక్తి లేదు ఇంకో రెండు మూడు దెబ్బలు గట్టిగా కొడితే కచ్చితంగా చావడం కాయం దేవుడా నేను ఎం తప్పు చేశాను ఈ శిక్ష వేసావు నేను ఎలాగో చస్తున్నా #నాకు_ఒక్క_ఆయుధం దొరికేలా చేయు నేను ఒక్కడినే చావను #ఒక్కడినైనా_చంపి చస్తాను అని అనుకున్నాడట. నాన్నను వదిలి వాళ్ల మిత్రుని మీదకు వెళ్లారట అది గమనించి పక్కన ఒక చిన్న కంపెనీ ఉంటుంది అక్కడ చాలా మంది ఉంటారు వాళ్ళు నన్ను కాపాడుతారు అని అక్కడికి పరిగెత్తి ఒక గుడిసెలో వెళ్లి జరిగింది చెప్పారట. వాళ్ళు భయంగానే నానను అక్కడ ఉండటానికి ఒప్పుకున్నరట. 

ఇది గమనించిన ఈ తుర్కలు నాన వాళ్ల మిత్రున్ని వదిలి మళ్లీ నాన వెంట పడ్డారట ఆ గుడిసెల దగ్గరకు వచ్చి ఇందాక ఒకడు మీ గుడిసెల్లో కి వచ్చాడు వాన్ని పట్టించండి రా అని దౌర్జన్నం చేశారు వాళ్ళను కూడా కొట్టడం ప్రారంభించరు ఇది చూసి వాళ్ళు చస్తే చావు మీకోసం మేము చావల అని నానాను భయటకి తోసి వేశారట. వాళ్ళు నాన కాళ్ళు చేతులు పట్టుకొని కొడుతూ ఆటో లోకి తోసి వేశారట. ప్రాణం మీద మొత్తం ఆశలు వదిలేశాడు ఇక. ఆ గుడిసెల్లో ఉన్న ఒక వ్యక్తి ఏంట్రా మీ దౌర్జన్యం అని గట్టిగ అరుస్తూ వల్ల మీదకు వెళ్ళాడట మాకే ఎదురు చెప్తావా అని వాళ్ల మీదకు వీళ్ళ గాంగ్ మొత్తం వెళ్లిందట నాననూ వదిలేసి. ఇది గమనించి నాన గారు తను కట్టుకున్న దోతిని అక్కడే ఆటో లో వదిలి కేవలం చెడ్డిపైనే పక్కనే జెసిబి తవ్విన గుంతల్లో పోర్లుకుంటు వెళ్ళిపోయాడట. ఆ గుంతల చుట్టూ ముల్ల పొదలు ఉన్నాయి అవి గుచ్చుతున్నయి అయిన కూడా అలానే పాకుకుంటు 2 కిలోమీటర్లు వెళ్లి ప్రాణాలను దక్కించుకున్నాడు. 

కానీ అందరూ చంపేశారు అని అనుకున్నారు. అలా రాత్రంతా తగిలిన గాయాలతో నిద్రలేకుండా ఒక పొదలో దాచుకొని వాళ్ల కూలీ వాళ్ల ఇంటికి వెళ్లి కూలీ లుంగీ కట్టుకుని జరిగినది చెప్పి మూర్చపోయాడు అంట. 

తరువాత హాస్పిటల్ ల్లో చేర్పించడం, కేసులు పెట్టడం అంతా జరిగింది. 

వీళ్ళు ఎంత ముర్కులో నాకు ప్రత్యక్షంగా తెలుసు అందుకే నేను ఎప్పుడూ వీళ్ళను మాటకైన మంచొల్లు అనను. 

ప్రాణాలతో బ్రతికి వచ్చాడు కానీ దాని ప్రభావం ఇప్పుడు నాన గారి ఆరోగ్యం పైన ఎంతగానో ఉంది. వాళ్ళు కొట్టిన దెబ్బలకు ఇప్పుడు పల్లు ఊడిపోయాయి. 

మనకు ఐక్యమత్యమే మహా బలం. 

జై శ్రీ రామ్

హరే కృష్ణ 🙏🙏

ఇది నేను సింపతీ కోసం పెట్టింది కాదు

నేను కూడా తుర్కళ బాధితుడిని అని చెప్పడం కోసం మాత్రమే.

D Kalyan kumar

కనబడరు

 *1808*

ఘనమగు వృక్షము నీడన

మననీడయు కానరాదు మనుషులకటులన్

ధనములు తలకెక్కినపుడు

తను బంధములగుపడవిల తప్పక సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మహావృక్షం నీడలో మననీడకూడా మనకు కనబడదు(మాయమై పోతుంది). మనుషుల కు కూడా అలాగే డబ్బు తలకెక్కితే తన బంధుమిత్రులు కూడా కనబడరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

నువ్వు ఏమి చేస్తుంటావు

 నువ్వు ఏమి చేస్తుంటావు?


1989లో ఒకరోజు సాయింత్రం ఆరు గంటలప్పుడు కంచి శ్రీమఠంలో కూర్చుని స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. పూర్వం కాంచీపురానికి తహసీల్దార్ గా పనిచేసిన మా పెద్దన్న తిరు. సుందరం, నేను మరియు అదనపు జిల్లాధికారి(అసిస్టెంట్ కలెక్టర్) స్వామివారి దర్శనం కోసం కూర్చుని ఉన్నాము. ఈ సంఘటన జరిగినప్పుడు మా అన్నయ్య తిరనల్వేలి జిల్లా కార్యాలయంలో బలహీన వర్గాల సంక్షేమాధికారిగా విధులు నిర్వహించేవాడు. అతను స్వామివారి దర్శనం ముగించుకొని ఆ రాత్రికే చెన్నై వెళ్ళిపోవాలి. 


భక్తులందరూ ఒక్కొక్కరిగా ముందుకు వెళ్ళి స్వామికి నమస్కరించారు. మా వంతు రాగానే మేమూ స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డాము. స్వామివారు నవ్వుతూ, “వెళ్ళడానికి చాలా ఆత్రంగా ఉన్నారే? కొద్దిసేపు ఉండండి” అని ఆదేశించారు. స్వామివారి ఆదేశానికి కట్టుబడి మేము అక్కడే కూర్చున్నాము. స్వామివారి చేతులుపైకెత్తి, దర్శాననికి వచ్చిన దాదాపు ముప్పైమందిని కూర్చుండమని సైగ చేశారు. 


స్వామివారు మొత్తం గుంపుని పలుసార్లు చూసి భక్తితో మూలగా కూర్చున్న ఒక వ్యక్తిపై పడ్డాయి. స్వామివారు అతనితో మాట్లాడగా అతను లేచి నిలబడ్డాడు. అతను చొక్కా తీసి పంచెపైన నడుము చుట్టూ కట్టుకున్నాడు. 


“నీ పేరు?” అని అడిగారు స్వామివారు. ”మురుగేశన్” అని వినయంగా చెప్పాడు. ”ఏం చేస్తుంటావు?”


“వ్యవసాయం సామి”


“ప్రపంచానికి అన్నం పెడుతున్నావన్నమాట” అని చిన్నగా నవ్వి, కూచోమన్నట్టుగా సైగచేశారు. అతను కూర్చున్నాడు. 


స్వామివారి కళ్ళు మరలా వెతకనారంభించాయి ఈసారి ఇంకొక భక్తుణ్ణి అడిగారు. అతను లేచి నిలబడి తన పేరు మునుస్వామి అని వెల్లోర్ లో రెవిన్యూ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నానని చెప్పాడు. 


“నువ్వు ప్రజలకు ఎలా సేవ చేస్తావు?” అని అడిగారు. 


”నేను ప్రజలుకోరిన ప్రకారం భూయజమాన్య పత్రాలు, ఇంటి స్థాలాల హక్కు పత్రాలు వంటివి జారీ చేస్తుంటాను పెరియవ”


వెంటనే స్వామివారు నావైపు చూసి “ఇప్పుడు ఏ పదవిలో ఉన్నావు?” అని అడిగారు. 


నాకు కాళ్ళుచేతులు అడడంలేదు. ఎందుకంటే, తమిళనాడు కంజ్యూమర్ ఫెడరేషన్ కి సహాయక తహసిల్దార్ గా చేస్తున్నాను. TASMAC(Tamil Nadu State Marketing Corporation)లో నా పని ప్రభుత్వ గోడౌన్ నుండి మద్యం చిల్లర వర్తకులకు వివిధ రకాలైన మద్యం అమ్మడం. ఇది ప్రజాసేవగా ఎలా చెప్పుకోను?


కాస్త సందేహిస్తూనే స్వామివారికి, “TASMACలో డిప్యుటి తహసిల్దార్ గా చేస్తున్నాను” అని చెప్పాను. ఆందోళనతో చమటలు పడుతున్నాయి. కాని స్వామివారి నా ఉద్యోగం గురించి ఎక్కువగా అడగలేదు. 


బ్రతుకుజీవుడా అని కూర్చున్నాను. 


తరువాత మా అన్నయ్యని అడిగారు. అతను లేచి స్వామివారికి తాను అసిస్టెంట్ కలెక్టరుగా ఉచిత విద్య, బలహీన వర్గాలవారికి ఆహారము, ఉపాధి కల్పన, అర్హులకు కుట్టుమిషన్లు, ఇస్త్రీపెట్టెల పంపిణీ వంటివి చేస్తుంటాను అని చెప్పాడు. 


అది విన్నతరువాత స్వామివారు ఇలా చెప్పారు, “ఇక్కడ ఉన్నవారిలో ప్రజలకు మేలుచేసే రెవెన్యూ అధికారి, సహాయ తహసిల్దార్, సహాయ కలెక్టరు వంటివారు ఉన్నారు. మనకు ఇంకేం కావాలి?” అని ఒక ఆకర్షణీయమైన నవ్వు నవ్వారు. 


కాని నాకు మరలా స్వామివారి కళ్ళు నాపై పడొచ్చు అని గుండెదడగా ఉంది. ప్రజలకు హానిచేసే నా ఉద్యోగం గురించి స్వామివారికి ఎలా చెప్పగలను? నా మనసులోనే స్వామివారిని వేడుకున్నాను, “స్వామి గత మూడేళ్ళుగా నేను ఈ అధికారంలో ఉన్నాను. నాకు ఇక ఉండాలని లేదు. నాకు ఈ పనినుండి విముక్తి కల్పించండి”. కరుణావరుణాలయులైన మహాస్వామివారు నా ఉద్యోగం గురించి అడిగి నన్ను ఇబ్బందికి గురి చెయ్యలేదు.


ఈ సంఘటన జరిగిన కొన్ని వారాల్లోనే అక్కడి నుండి బదిలీ అయ్యి కలెక్టర్ కార్యాలయంలో డిప్యుటి తహసిల్దార్ గా చేరాను. బదిలీ ఉత్తర్వులు ఇచ్చినది ప్రభుత్వమే అయినా, అవి వచ్చేలా చేసినది మాత్రం స్వామివారే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 


--- ఇరసు, చెన్నై-61. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

బ్రాహ్మణుడు

: బ్రాహ్మణుడు వైదిక శాస్త్రాలలోని పద్నాలుగు శాఖలతో అవగాహన కలిగి ఉండాలి. 

అతను గంధర్వ-వేదం లేదా సంగీతంలో కూడా ప్రావీణ్యం కలిగి ఉండాలి మరియు వ్యవసాయ శాస్త్రం, గృహాల నిర్మాణం మొదలైనవాటిలో తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. అదే సమయంలో అతను తగిన కులాల విద్యార్థులకు ఈ విషయాలలో సూచనలను ఇవ్వాలి. 

అతని స్వంత వృత్తి వేదాల అధ్యయనం మరియు అతనికి ఇతర ఆదాయ వనరులు ఉండకూడదు.



విశ్వామిత్రుడు ధనుర్వేద (సైనిక శాస్త్రం) మాస్టర్. 

అతను యాగాలు చేసినప్పుడు, రాక్షసులు సుబాహు మరియు మారిక వారితో విధ్వంసం ఆడటానికి ప్రయత్నించారు. 

తాను గొప్ప యోధుడైనప్పటికీ రాక్షసులను తరిమికొట్టడానికి ప్రయత్నించలేదు. 

బదులుగా, అతను ప్రయోజనం కోసం రాముడు మరియు లక్ష్మణుడిని తీసుకువచ్చాడు. 

విశ్వామిత్రుడు ఆ తర్వాత ఇద్దరికీ అస్త్రాలు మరియు శాస్త్రాలను ఉపయోగించడంలో ఉపదేశాన్ని ఇచ్చాడు.



"నీకు కత్తి పట్టడం తెలుసా?" అని బ్రాహ్మణుడిని అడిగితే, అతను "అవును, నాకు తెలుసు" అని సమాధానం చెప్పగలగాలి. 

"నీకు గీయడం, పెయింట్ చేయడం తెలుసా" అని అడిగితే మళ్ళీ "అవును" అని చెప్పక తప్పదు. 

కానీ అతను తన జీవనోపాధి కోసం కత్తిని పట్టుకోలేడు లేదా కళాకారుడు కాలేడు. 

ఈ కళలను నేర్చుకుని ఇతరులకు వారి కులాన్ని బట్టి నేర్పించడమే అతడు చేయగలడు. 

అతను తనను తాను కాపాడుకోవడానికి దక్షిణాన్ని స్వీకరించడానికి అనుమతించబడ్డాడు మరియు అతను దానితో ఎలా సంతృప్తి చెందాలి


: సనాతన వైదిక (క్రతువులు) సంస్కారాలు:


సనాతన హిందూ సాంప్రదాయములో వైదిక (క్రతువులు)  సంస్కారములు  అనేవి ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి. స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననం, మరణం, తదనంతరము ఆత్మ పరలోక శాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును.


సంస్కారములు (క్రతువులు) మొత్తము పదహారు. వీనినే షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరించెదరు. ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు భాగముల క్రింద విభజించారు. అవి 1. జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు), 2. జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత). మొదటి మూడు సంస్కారములు జనన పూర్వ సంస్కారములు, ఆపై పదమూడు సంస్కారములు జననానంతర సంస్కారములు.


వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు:


1. గర్భాదానము:

స్త్రీ పురుష తొలి సమాగమ సందర్భములో మంచి పుత్రుని ఆశించి జరిపే కార్యక్రమము ఇది. ఈ సందర్భములో చదివే మంత్రాలు సత్సంతానాన్ని (పురుష) ఆ దేవుని కోరుకుంటున్నట్లుగా తెలియజేస్తాయి.


2. పుంసవనం:

స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు జరిపే క్రతువు. గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసముంటుంది. ఆ రాత్రికి మొల కెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని హిరణ్యగర్భ: అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేస్తారు. చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు ఇలా చేయడం ద్వారా ఆరోగ్యవంత మైన కొడుకు, దృఢకాయుడు పుడతాడని నమ్మకం. ఇది, సీమంతోన్నయనం గర్భాన్ని రక్షించుకొనుటకు చేసే సంస్కారములు. కావున ఈ రెండు గర్భాకాలమునందే చేయవలెను. 


పుంసవనము గర్భము ధరించిన మూడవ మాసములో మొదటి పది రోజులలో చేయవలెను. ఈ కార్యక్రమములో మఱ్ఱిపండ్లను మినుములతో, యవలతో కలిపి గర్భిణికి వాసన చూపించెడి వ్యవస్థ యున్నది. దీనివలన యోనియందున్న దోషములు తొలగి గర్భరక్షణ శక్తి కలుగునని సుశ్రుతము మొదలగు ఆయుర్వేద శాస్త్రములందు చెప్పబడియున్నది. మోక్షమునకు ఉపయోగపడే ఉత్తమ స్థూల శరీరమును పొందు లక్ష్యముతోనే ఈ పుంసవన సంస్కారము నిర్ణయించబడింది.


3. సీమంతం:

తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దోహదం (అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం). సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం.


4. జాతకర్మ:

బొడ్డుతాడు కోసే ముందు చేసే సంస్కారాలు. దీంట్లో భాగంగా జరిపే తంతులు చాలా ఉన్నాయి:


మేథాజనన: బలానికి, తెలివితేటలకు ప్రతీకలైన నెయ్యి, తేనెలనుఒక సన్నని బంగారుదారంతో శిశువు నోటికందిస్తారు. దీన్ని పిల్లల పట్ల తాము నెరవేర్చవలసిన మొట్టమొదటి బాధ్యతగా వారు భావిస్తారు. హిందువులు పిల్లల తెలివి తేటలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో దీని ద్వారా మనకు తెలుస్తుంది.


ఆయుష్య: దీర్ఘాయుష్షును కలిగించే ఋషులు, పితృదేవతలు, అగ్ని, సోములను ఆవాహన చేసే మంత్రాలను శిశువుముందు చదువుతారు.


శక్తి: తండ్రి బిడ్డ చెవిలో "త్వం...శతమానం భవతి:" అని ఆ శిశువుకు చెబుతాడు. అప్పుడు బొడ్డుతాడు కోసి, శిశువును శుభ్రం చేసి, చనుబాలు పట్టిస్తారు.


5. నామకరణం:

నామకరణం అనగా పేరు పెట్టడం. ఆడ, మగ పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్య సూత్రాలు పేర్కొన్నాయి. పరాశర గృహ్యసూత్రాల ప్రకారం పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర్లో దీర్ఘం కానీ విసర్గం కానీ ఉండాలి. వేర్వేరు గృహ్యసూత్రాల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉన్నాయి. ఆడపిల్ల పేరు బేసి అక్షరాలుండి పేరు చివర అ ఉండాలి.


పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి:


మొదటిది జన్మనక్షత్రాన్ని బట్టి; రెండవది పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి;మూడవది ఇలవేలుపును బట్టి;నాలుగవది అందరూ పిలిచే పేరును బట్టి. చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, విద్యాస్థాయిని బట్టి ఉంటుంది. ఐతే లేకలేక కలిగిన. సంతానానికి, కుటుంబంలో చాలామంది పిల్లలు చనిపోయాక పుట్టినవారికి దుష్టశక్తుల్ని దూరంగా ఉంచడం కోసం విడ్డూరంగా ఉండే పేర్లను పెడతారు.


6. నిష్క్రమణ:

బిడ్డను మొదటిసారిగా ఇంట్లోనుంచి బయటికి తీసుకురావడం. అప్పటివరకూ ఇంట్లోనే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయటి ప్రపంచంలో అడుగుపెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతిశక్తులనుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు (అధిభౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి) తీసుకోవాలి. అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.


7. అన్నప్రాశన:

మొదటిసారిగా ఘనాహారం తినిపించడం (సాధారణంగా ఆరో నెలలో) అన్నప్రాశన. పెరుగుతున్న బిడ్డ భౌతికావసరాలను తీర్చడానికి అవసరమైన అతి ముఖ్యమైన ప్రక్రియ. సుశ్రుతుడు కూడా 6 వ నెలలో బిడ్డ చేత తల్లిపాలు మానిపించిఘనాహారం ఇవ్వాలని పేర్కొన్నాడు. ఇందుకవసరమైన ఆహారాన్ని కూడా వేదమంత్రోచ్చాటనల మధ్య పరిశుభ్రమైన పాత్రల్లో వండుతారు. ఒక్కో రకమైన గుణాన్ని పెంపొందించ డానికి ఒక్కో రకమైన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ సంస్కారం జరపడం వల్ల వయసుకు తగిన ఆహారం అందడమే గాక ఆహారం పట్ల పవిత్రభావన ఏర్పడుతుంది.


8. చూడాకరణ (పుట్టు వెండ్రుకలు తీయించడం.):

పుట్టువెండ్రుకలు తీయించడం. దీర్ఘాయుష్షును, అందాన్ని కోరుతూ చేసే సంస్కారం. సుశ్రుతుడు, చరకుడు కూడా గుండు వల్ల దీర్ఘాయుష్షు, అందం చేకూరుతాయని పేర్కొన్నారు. తలనీలాలు దేవునికి లేదా దేవతకు అర్పించడం గురించి గృహ్య సూత్రాల్లో గానీ, స్మృతుల్లో గానీ లేనేలేదు! పూర్వకాలంలో కూడా కొన్ని సార్లు దేవాలయాల్లో తలనీలాలు అర్పించడం ఉన్నప్పటికీ అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జరిగేది (లేకలేక కలిగిన పిల్లలు లేదా ఒకరిద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన పిల్లలకు). గృహ్యసూత్రాల ప్రకారం ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివర్లో గానీ, మూడొ ఏటగానీ చెయ్యాలి. తర్వాతి కాలాలోని సూత్రకర్తలు ఈ వయసును ఏడేళ్ళవరకు పొడిగించారు.


9. కర్ణవేధ:

ఇదే చెవులు కుట్టించడం. ఐదేళ్ళలోపు చేయవలసిన సంస్కారం. కర్ణాభరణాలు ధరించడం మొదట్లో అందం కోసమే మొదలైనా తర్వాత ఆరోగ్యదృష్ట్యా దానికున్న ప్రాధాన్యతను బట్టి దానిని సంస్కారాల్లో చేర్చి ఉండవచ్చు. చెవులు కుట్టడానికి వాడే సూది: క్షత్రియులకు బంగారంతో, బ్రాహ్మణ, వైశ్యులకు వెండితో చేసినది వాడుతారు


దేవలుడనే స్మృతికర్త "చెవిరంధ్రాలగుండా సూర్యకిరణాలు ప్రసరించని బ్రాహ్మణుడిని చూడడం వల్ల అప్పటివరకు చేసుకున్న పుణ్యమంతా పోతుంది." అని పేర్కొన్నాడు.


10. అక్షరాభ్యాసం:

బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్చుకోవడం. ఈ సంస్కారాన్నే అక్షరారంభమనీ, అక్షరలేఖనమనీ, విద్యారంభమనీ అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని ఐదో ఏట చేస్తారు. విశ్వామిత్రుడు దీన్ని ఏడొ ఏటివరకు పొడిగించాడు. కానీ కొందరు స్మృతికర్తలు చూడాకరణ ఐన వెంటనే చేయాలని నిర్దేశించారు.


11. ఉపనయనం:

అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు. భౌతిక జననం రోత కలిగించేది. ఉదాత్తమైనది కాదు. క్రమశిక్షణ, విద్యార్జనల ద్వారా పొందే రెండవజన్మ పవిత్రమైనది, ఉదాత్తమైనది.


ఐతే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతోబాటే మారుతూ వచ్చాయి. అథర్వణ వేదంలో ఉపనయనాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవడం అనే అర్థంలో వాడితే తర్వాతికాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం చేయడమే ఉపనయనంగా భావించడం జరిగింది. హిందూ మతంలో అతిపవిత్రము, శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. అంతేగాక ఉపనయనం ఉన్నతవిద్యకు ఆరంభంగా గాక మతపరమైన తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది.


తగిన వయస్సు:

బ్రాహ్మణుడికి ఎనిమిది సంవత్సరాలు;

క్షత్రియుడికి పదకొండు సంవత్సరాలు;

వైశ్యుడికి పన్నెండు సంవత్సరాలు;


గరిష్ఠ వయోపరిమితి:

బ్రాహ్మణుడికి పదహారు సంవత్సరాలు; క్షత్రియుడికి ఇరవైరెండు సంవత్సరాలు; వైశ్యుడికి ఇరవైనాలుగు సంవత్సరాలు;

కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారంలో ప్రధానభాగంగా మారింది. ఉపనయనం చేయించుకునేవారు సూర్యునివైపు చూస్తూ ఉండగా వారికి దీర్ఘాయుష్షు, పవిత్రత, బలం, తేజస్సు కలగాలని కోరుతూ గురువు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక-ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తుచేస్తూ వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంత పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది. ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజినం (జింక చర్మం), దండం కూడా ఉపనయనమప్పుడు ఇస్తారు.


12. వేదారంభం:

అతిపురాతన ధర్మశాస్త్రాల్లో వేదారంభం గానీ, దీని తర్వాతిదైన కేశాంతం గానీ కనిపించవు. మొదట్లో ఉపనయనంతోనే వేదవిద్యారంభం చేసేవారు. కానీ తర్వాతికాలంలో వేదవిద్యతో బాటే ఇతర సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందాక వేదవిద్యారంభానికి విడిగా మరో సంస్కారం అవసరమైంది. ప్రతి విద్యార్థి తన వంశం వారు నైపుణ్యం సాధించిన వేదాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకే ఈ సంస్కారం ఒక్కో వర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కో రకంగా ఉంటుంది


రెండు వేదాలను అధ్యయనం చేసినవారు ద్వివేది,మూడు వేదాలను అధ్యయనం చేసినవారు త్రివేది, నాలుగు వేదాలను అధ్యయనం చేసినవారు చతుర్వేది.


13. కేశాంత:

పదహారేళ్ళ వయసొచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడానికి (గీయించుకోవడానికి) సంబంధించినది ఈ సంస్కారం. యౌవనారంభదశలోని చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్ని, బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తుచేస్తుంది. ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడాకరణను పోలి ఉంటుంది. ఈ సంస్కారం జరిపేటప్పుడు చివర్లో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు. అందుకే కేశాంతాన్ని గోదానమని కూడా అంటారు.


14. సమావర్తన:

చదువు ముగించుకుని విద్యార్థి గురుకులాన్ని వదిలి వచ్చేటప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. దీన్నే స్నాతకమని కూడా అంటారు. విద్యార్థి తాను అప్పటివరకు పాటించిన బ్రహ్మచర్యాశ్రమం యొక్క గొప్పదనాన్ని గుర్తిస్తూ, యజ్ఞయాగాదులను ముగించేటప్పుడు చేసే అవభృతస్నానం చేస్తాడు. క్రమశిక్షణతో మెలగి విద్యార్జనలో ఉత్తీర్ణుడైన విద్యార్థిని విద్యాసాగరాన్ని ఈదిన స్నాతకుడు లేక నిష్ణాతుడుగా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయాలు ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టా ప్రదానం చేయడాన్ని స్నాతకోత్సవమనే అంటారు.


సమావర్తనతో చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగిరావడం విద్యార్థి జీవితంలో అతి కీలకమైన ఘట్టం. స్నాతకుడు పెళ్ళి చేసుకుని గృహస్థ జీవితం గడపడానికైనా, తాను గడించిన వైదిక విజ్ఞానంతో భౌతిక మానసిక బంధాలకు దూరంగా జీవితం గడపడానికైనా సిద్ధంగా ఉంటాడు. మొదటిమార్గం పాటించేవాళ్ళను ఉపకుర్వనులని, రెండవ వర్గం వారిని నైష్ఠికులని అంటారు. ఏ మార్గం పాటించడానికైనా గురువు అనుమతి తప్పనిసరి. అప్పటివరకు విద్యార్థి దశలో గురువుతోనే ఉన్నా ఆయనకు రుసుమేమీ చెల్లించకుండానే ఆయన్ని సేవించుకుంటూ విద్యను పొందిన విద్యార్థి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు మాత్రం తన స్తోమతుకు తగినట్లు గురుదక్షిణ సమర్పించుకుంటాడు. గురుదక్షిణగా ఏమీ ఇవ్వలేకపోయినా గురువు అనుమతి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.


15. వివాహం:

హిందూ సంస్కారాల్లో కేంద్రస్థానం వివాహానిది. వధువుకు తగిన వరుణ్ణి, వరుడికి తగిన వధువును ఎంపిక చేయడం వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టం. హిందూ సమాజంలో వధూవరులుగా ఒకే వర్ణానికి (సవర్ణ), భిన్న గోత్రాలకు, భిన్నపిండాలకు చెందినవారిని ఎంచుకోవడమనే ఆనవాయితీ కొనసాగుతోంది. సపిండకుల (రక్తసంబంధీకుల) మధ్య వివాహాలను అన్నికాలాల్లో నైతికంగానూ, శాస్త్రపరంగానూ పూర్తిగా నిషేధించడం జరిగింది.


వివాహాల్లోని రకాల గురించి తెలుసుకోవడానికి అష్టవిధవివాహాలు చూడండి.


వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు:

వాగ్ధానం: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం)

వర-వరణం: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం

కన్యాదానం: కన్య తండ్రి లేక తండ్రి స్థానంలో ఉండి ఆమె బాగోగులు చూసేవారు కన్యను వరుడికి అప్పజెప్పడం

వివాహ-హోమం: పెళ్ళిలో చేసే హోమం

పాణిగ్రహణం: వధూవరులు ఒకరి చేతినొకరు పట్టుకోవడం

హృదయస్పర్శ:హృదయాన్ని తాకడం

సప్తపది: సౌభాగ్యానికి, దాంపత్య సాఫల్యానికి గుర్తుగా కలిసి నడిచే ఏడడుగులు

అశ్మారోహణ: సన్నికల్లు తొక్కడం

సూర్యావలోకనం: జరుగుతున్న పెళ్ళికి సాక్ష్యంగా నిలిచిన సూర్యుణ్ణి చూడడం.

ధృవదర్శనం: స్థిరత్వానికి సూచిక ఐన ధ్రువనక్షత్రాన్ని చూడడం

త్రిరాత్ర-వ్రతం: మూడురాత్రులు విడిగా ఉండడం

చతుర్ధి-కర్మ: లాంఛనంగా వధూవరులు కలిసే నాలుగోనాటిరాత్రి జరిపే సంబరం


హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.


16. అంత్యేష్టి:

హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి.


మరణానికి ముందు: మరణమాసన్నమైన వ్యక్తి తన కుటుంబసభ్యులను, బంధువులను, ఆత్మీయులను పిలిపించుకుని కన్నుమూసే ముందు అందరినీ ఒకసారి చివరిసారిగా చూసుకుని, వారికి, ప్రపంచానికి వీడ్కోలు పలుకుతారు. వారు తృప్తిగా కన్నుమూయడానికి, మరణానంతరం వారు సంతోషంగా ఉండడానికి వీలుగా వారిపేరుమీద, వీలైతే వారి చేతుల మీదుగానే దాన ధర్మాలు జరుగుతాయి.


అంతిమయాత్రకు ముందు: వారు జీవితపర్యంతం రగిలించిన పవిత్రాగ్నిలోకి ఆహుతులు సమర్పిస్తారు. దగ్గరివారు చనిపోతున్నవారి నోట్లో తులసితీర్థం, గంగాజలం వదులుతారు.


పాడె: శవాన్ని అంత్యక్రియలు జరిగేచోటికి తీసుకువెళ్ళడానికి ఏడుకట్లతో ప్రత్యేకంగా తయారుచేసిన పొడవాటి నిర్మాణం. శవాన్ని దానిమీదికి చేరుస్తారు.


అంతిమయాత్ర: మరణించినవారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులందరూ అంతిమయాత్రలో పాల్గొంటారు. అందరూ కలసి శ్మశానస్థలిని చేరుకుంటారు.


అనుస్తరణి: జీవితసాగరాన్ని దాటి అవతలికి వెళ్ళేటప్పుడు సహాయకారిగా ఉంటుందనే నమ్మకంతో హిందువులు పవిత్రంగా భావించే గోవును మరణించినవ్యక్తి తరపున దానంగా ఇస్తారు.


దింపుడుకళ్ళెం: భగవదనుగ్రం వల్లో, చనిపోయినవారి ఆయుస్సు ఇంకా తీరలేదని యమధర్మరాజు వెనక్కి పంపెయ్యడం వల్లో చనిపోయినవారు తిరిగి బ్రతుకుతారనే నమ్మకంతో, బ్రతకాలనే ఆశతో అంతా సిద్ధమయ్యాక కూడా అంత్యక్రియలను కొన్ని నిమిషాలసేపు ఆలస్యం చేయడానికి పాడెను శ్మశానానికి తీసుకువెళ్ళే దారి మధ్యలో దించి శవం చెవిలో మూడసార్లు పేరుపెట్టి పిలుస్తారు. ఒక్కోసారి మరణించారని పొరబాటుగా భావించినవారు తర్వాత తిరిగి లేవడం వల్ల ఈ ఆచారం పుట్టి ఉంటుంది.


దహనం: శరీరాన్ని దహనం చెయ్యడానికి చితిపై ఉంచేముందు శరీరానికి జలంతో అభిషేకం చేయించడంతోబాటు అంత్యక్రియల్లో భాగంగా వేసే కర్మ కొంత ఉంటుంది. అది పూర్తయాక శరీరాన్ని చితిపై ఉంచి వేదమంత్రాల మధ్య నిప్పంటిస్తారు.


ఉదకకర్మ: చితిపై మంటల మధ్య శరీరం కాలిపోగా ఆ వేడిని తగ్గించి మరణానంతర జీవుడిని చల్లబరచడానికి ఉదకం (నీళ్ళు) సమర్పిస్తారు. ఓదార్పుఆత్మీయుడిని పోగొట్టుకుని దు:ఖంలో ఉన్నవారికి పెద్దలు జీవితమింతేనని తెలుపుతూ మతగ్రంథాల్లో నుంచి గాథలను, జీవితసత్యాలను బోధపరిచి దు:ఖభారాన్ని తగ్గిస్తారు.


అశౌచం: చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు (సూతకం రెండురకాలు: జాతాశౌచం, మృతాశౌచం).


అస్థిసంచయనం: శరీరం కాలి బూడదైనా ఎముకలు పూర్తిగా కాలిపోవు. ఆ బూడిదలో మిగిలిపోయిన ఎముకలను ఏరి తీసుకోవడం అస్థిసంచయనం. మిగిలినవి శాంతికర్మ, స్మారకం, శ్రాద్ధం. (మూలం: వివాహ, ఉపనయన, శ్రాద్ధక విధి నుండి)

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 



                             శ్లోకం:33/150 


ప్రస్కందనో విభాగజ్ఞో 

హ్యతుల్యో యజ్ఞభాగవిత్ I  

సర్వవాస స్సర్వచారీ 

దుర్వాసా వాసవోఽమరః ॥ 33 ॥  


* ప్రస్కందః = శత్రువులను నశింపచేయువాడు, 

* విభాగజ్ఞః = యజ్ఞ భాగములు తెలిసినవాడు, 

* అతుల్యః = తనతో సమానుడు లేనివాడు, 

* యజ్ఞభాగవిత్ = యజ్ఞమునందలి భాగములు (ఆహ్వానములు) తెలిసినవాడు, 

* సర్వవాసః = సమస్తమును ధరించువాడు, 

* సర్వచారీ = సమస్త ప్రదేశములందు సంచరించువాడు, 

* దుర్వాసా = మేలిమి వస్త్రములు కాకపోయినా కూడా ధరించువాడు, 

* వాసవః = ఇంద్ర రూపుడు, 

* అమరః = మరణము లేనివాడు (దేవత). 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

30, జులై 2023, ఆదివారం

Veda patanam


 

 'మాటకు ప్రాణము సత్యము

కోటకు ప్రాణము సుభటకోటి ధరి త్రైన్ 

బోటికి ప్రాణము మానము 

చీటికి ప్రాణంబువ్రాలు సిద్ధము సుమతీ

భార్యలు - భిన్న స్వభావాలు

 *ॐ భార్యలు - భిన్న స్వభావాలు* 


*కౌసల్యామాత సీతాదేవితో* 


*అసత్యశీలా వికృతా* 

*దుర్గ్రాహ్యహృదయాస్సదా I* 

*యువత్యః పాపసంకల్పాః* 

*క్షణమాత్రాద్విరాగిణః ৷৷* 

                *అయోధ్య 38/22*  


    దుష్టాలోచనలుగల యువతులు సర్వదా కపట వచనములను పలుకుతూ ఉంటారు. 

    కోపతాపాది వికారములకు లోనగుతూ ఉంటారు. 

    వారి మనస్సులలోగల భావాలు దుర్గ్రాహ్యాలు. 

    వారు చిన్నచిన్న సంఘటనలకే పతులపై అలుకవహించి, వారికి దూరమవుతూ ఉంటారు.  


    Evil-minded young ladies are infidels. 

    They are of perverted nature. 

    They are inscrutable. 

    In an instant they lose their love (for their husbands). 


*న కులం న కృతం విద్యాం* 

*న దత్తం నాపి సంగ్రహమ్ I*

*స్త్రీణాం గృహ్ణాతి హృదయమ్* 

*అనిత్యహృదయా హి తాః ৷৷* 

                       *38/23* 

అట్టి స్త్రీలకు 

  - భర్తయొక్క అభిజాత్యము (గొప్ప వంశమున జన్మించడం) గానీ, 

  - అతడు చేసిన ఉపకారాలుగానీ, 

  - అతనియొక్క విద్యావైభవములుగానీ, 

  - అతడు తెచ్చిపెట్టిన వస్త్రాభరణాదులుగానీ, 

  - ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతిగానీ జ్ఞాపకమునకే ఉండవు. 

    ఎందుకంటే వారి స్వభావములు చంచలములు. వారికి పతికంటే సంపదలే ముఖ్యము. 

    అంతేకాదు "స్థూణానిఖనన" న్యాయమున వారు పాతవిషయమలను త్రవ్వుతూ భర్తతో ఎల్లప్పుడును గిల్లికజ్జాలాడుతూ ఉంటారు.  


    Neither family traditions 

    nor benefits received, 

    nor education 

    nor affection 

    nor gifts 

    nor even accumulated wealth attract women's hearts. 

    Their minds are unstable indeed. 


*సాధ్వీనాం హి స్థితానాం* 

*తు శీలే సత్యే శ్రుతే శమే I* 

*స్త్రీణాం పవిత్రం పరమం* 

*పతిరేకో విశిష్యతే ৷৷* 

                  *38/24* 


    సాధ్వీమణులరీతి దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. 

    వారు తమ వంశమర్యాదలకు తగినట్లుగా ప్రవర్తిస్తారు. 

    గురువుల (పెద్దల) ఉపదేశాలను అనుసరించి నడుచుకొంటారు. 

    శాంత స్వభావం కలిగియుంటారు. 

    వారికి పతియే దైవము. వారి జీవితాలు పరమ పవిత్రాలు. 


    But for those virtuous women whose minds are fixed in 

  - chastity, 

  - truth, 

  - scriptures and 

  - stability, 

    the husband occupies a distinguished place and is considered supremely holy. 


*స్థూణానిఖననన్యాయము*  


    గుంజని పాతేటప్పుడు చాలాసార్లు నేలని తవ్వుతూ, గుంజని(స్తంభాన్ని) అటూఇటూ కదులుస్తూంటారు. 

    పోట్లాడే స్వభావంగలవారు తాము మాట్లాడుచున్న విషయానికి సంబంధంలేకుండా పాతవిషయాలను పదేపదే త్రవ్వుతూ ఎదుటివారిని నొప్పిస్తూంటారు. 

    ఎంతకీ వారు తమ మొండివాదాన్ని వీడరు. ఇది దుష్టుల లక్షణం. 

    దీనినే "స్థూణానిఖనన న్యాయం" అంటారు. 

    

                              =x=x=x= 


  — రామాయణం శర్మ 

            భద్రాచలం

Photo