25, జులై 2020, శనివారం

రుద్రచమకం లో #గణితరహస్యం:-

శ్రీ రుద్రం విశిష్టత :

#శతరుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మే నని తెలియజేస్తుంది. శ్రీ రుద్రాన్ని రుద్రాప్రస్న అని కూడా అంటారు. వేద మంత్రాలలో ఏంటో ఉత్కృష్టమైనది. శ్రీ రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. "నమో" పదం వచ్చే మొదటి భాగం, యజుర్వేదంలో ౧౬వ అధ్యాయంలో ఉంటుంది. దీనిని #నమకం అంటారు. రెండవ భాగంలో "చమే" అన్న పదం మరల మరల రావటం వాళ్ళ దీనిని #చమకం అంటారు. ఇది ౧౮వ అధ్యాయంలోఉంది.

🙏చమకం నమకం చైవ పురుష సూక్తం తథైవ చ |
నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||🙏

నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతీ దినం చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.

చమకం విశిష్టత:
➖➖➖➖➖
నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేడు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే.

అనువాకం – 11:
పదకొండవ అనువాకంలో మానవ సరిసంఖ్యకానికి దైవ బేసి సంఖ్యకానికి అనుబంధం కుదరడానికి కావలసిన శక్తిని దీవేనని కోరుకునే ప్రార్ధన.
చమకం ఐహిక సుఖానేషణ నుండి మొదలయి మొక్షాన్వేషణకు దారిచూపిస్తుంది. దైవం ఆద్యంతమైనది. అదే భూమి, ఆకాశం, కాలం, పునః మరణం, పునః జననం అన్నింటికీ కారణం, అంతం అని చెప్తుంది..

పదకొండవ అనువాకము:
🙏🙏🙏🕉🕉🕉🙏🙏🙏

ఏకా’ చ మే తిస్రశ్చ’ మే పంచ’ చ మే సప్త చ’ మే నవ’ చ మ ఏకా’దశ చ మే త్రయోదశ చ మే పంచ’దశ చ మే సప్తద’శ చ మే నవ’దశ చ మ ఏక’విగ్ంశతిశ్చ మే త్రయో’విగ్ంశతిశ్చ మే పంచ’విగ్ంశతిశ్చ మే సప్త విగ్‍మ్’శతిశ్చ మే నవ’విగ్ంశతిశ్చ మ ఏక’త్రిగ్ంశచ్చ మే త్రయ’స్త్రిగ్ంశచ్చ మే చత’స్-రశ్చ మే‌உష్టౌ చ’ మే ద్వాద’శ చ మే షోడ’శ చ మే విగ్ంశతిశ్చ’ మే చతు’ర్విగ్ంశతిశ్చ మే‌உష్టావిగ్‍మ్’శతిశ్చ మే ద్వాత్రిగ్‍మ్’శచ్చ మే షట్-త్రిగ్‍మ్’శచ్చ మే చత్వారిగ్ంశచ్చ’ మే చతు’శ్-చత్వారిగ్ంశచ్చ మే‌உష్టాచ’త్వారిగ్ంశచ్చ మే వాజ’శ్చ ప్రసవశ్చా’పిజశ్చ క్రతు’శ్చ సువ’శ్చ మూర్ధా చ వ్యశ్ని’యశ్-చాంత్యాయనశ్-చాంత్య’శ్చ భౌవనశ్చ భువ’నశ్-చాధి’పతిశ్చ || 11 ||

ఓం ఇడా’ దేవహూర్-మను’ర్-యఙ్ఞనీర్-బృహస్పతి’రుక్థామదాని’ శగ్ంసిషద్-విశ్వే’-దేవాః సూ”క్తవాచః పృథి’విమాతర్మా మా’ హిగ్ంసీర్-మధు’ మనిష్యే మధు’ జనిష్యే మధు’ వక్ష్యామి మధు’ వదిష్యామి మధు’మతీం దేవేభ్యో వాచముద్యాసగ్ంశుశ్రూషేణ్యా”మ్ మనుష్యే”భ్యస్తం మా’ దేవా అ’వన్తు శోభాయై’ పితరో‌உను’మదన్తు ||

ఓం శాంతిః శాంతిః శాంతిః 

తాత్పర్యము :
🖋🖋🖋🖋🖋🖋🖋🖋

గర్భిణీలు అయిన గోవులు, గోవులు, దూడలు, ఒకటిన్నర, రెండు, రెండున్నర, మూడు, మూడున్నర, నాలుగు సంవత్సరములున్న గోవులు, ఎద్దులు, వీర్యమున్న ఎద్దులు, బాలింతలైన గోవులు, గొడ్లు అందుబాటులో ఉండుగాక. ఈ అగ్నిహోత్రములోని అగ్ని నాకు పూర్ణాయుష్షు, ఉచ్చ్వాశ నిశ్శ్వాసలు, ఆరోగ్యకరమైన కళ్ళు, చెవులు, మనసు, వాక్కు, ఆత్మను ఇచ్చు గాక. ఇటువంటి కార్యములు ఇంకా చేయుటకు శక్తిని ఇచ్చు గాక. ఒకటి, మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు, పదిహేను, పదిహేడు, పంతొమ్మిది, ఇరవై ఒకటి, ఇరవై మూడు, ఇరవై ఐదు, ఇరవై ఏడు, ఇరవై తొమ్మిది, ముప్ఫై ఒకటి, ముప్ఫై మూడు నాతో ఉండు గాక. నాలుగు, ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇరవై, ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది, ముప్ఫై రెండు, ముప్ఫై ఆరు, నలభై, నలభై నలుగు, నలభై ఎనిమిది నాతో ఉండు గాక. ఆహారము, ధాన్యము, ధన్యోత్పత్తి, దాని వృద్ధి, అగ్నిహోత్రము నాతో ఉండు గాక. దీనికొరకు నేను పంచ భూతములను, దిక్పాలకులను నాయందు కరుణ చూపవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

(ఇక్కడ చెప్పబడిన సంఖ్యలు సరి సంఖ్యలు భూలోక సంబంధమైనవి గా, బేసి సంఖ్యలు  దేవలోక సంబంధమైనవిగా వ్యాఖ్యానించ బడినది. ఇంకొక వ్యాఖ్యానం -  ఒక ప్రకృతి, మూడు గుణములు, పంచ భూతములు,  ఏడు ఇంద్రియములు, నవ రంధ్రములు...ఇలా ప్రతి ఒక సంఖ్య ఒక విశేషమైన ప్రాధాన్యత సంతరించు కొన్నట్లు)

1 (ఎకమేవాద్వితీయం బ్రహ్మ), 3 (3 లోకాలు, 3 గుణాలు), 5 (పంచ మహాభూతాలు), 7 (సప్తలోకాలు, సప్త పరిధులు, సప్త ఋషులు), 9 ( నవగ్రహాలు, నవవిధభక్తి, నవగ్రహాల అనుకూలం, నవరత్నాలు), 11 (పది ప్రాణాలు + సుషుమ్న, ఏకాదశ రుద్రులు) , 13 (దేవతలు, అక్షరాలు), 15(నాడులు, పక్షం రోజులు), 17 (అంగాలు), 19(ముఖ్య మూలికలు, మాండూక్య ఉపనిషత్ పరంగా ఒకరికున్న 19 ముఖాలు), 21 (యజ్ఞాలు), 23 (ఆరోగ్య దేవతలు), 25 (అప్సరసలు), 27 (నక్షత్రాలు, గంధర్వులు), 29 (విద్యుత్ దేవతలు), 31 (లోకాలు), 33 (దేవతలు)
అలాగే  4 (చతుర్విధ పురుషార్ధాలు, ౪ వేదాలు, 4 ఆశ్రమాలు), 8 (దిక్కులు, వేదాలు+ఉపవేదాలు), 12 (ఆదిత్యులు, నెలలు, రాశులు), 16 (దేవుని కళలు, చంద్రకళలు, , సిద్ధులు), 24 (గాయత్రి మంత్రం), 28 (విష్ణు అవతారాలు), 32 (అనుష్టుప్ ఛందస్సు), 36 (తంత్రాలు), 40 (ఇంద్రాశ్వాలు), 44 (త్రుష్టుప్), 48 (జగతి)

కామధేనువు దేవతలను ఆహ్వానించు గాక; మనువు కార్యము చేయు గాక.  బృహస్పతి మంత్రములు చదువు గాక. విశ్వ దేవుడు పధ్ధతి చెప్పు గాక. ఓ భూమాత! మాకు ఆటంకములు కలిగించకు. నేను ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో, సత్కార్యములు చేస్తూ, దేవతలకు ప్రీతికరమైన వస్తువులు తెచ్చి సమర్పిస్తాను. సజ్జనులారా! నేను ఈ విధంగా చేసినందు వలన ఆ దేవతలు, పితరులు నన్ను రక్షింతురు గాక.  

ఓం శాంతి శాంతి శాంతి 

ఇది కృష్ణ యజుర్వేదములోని, నాలుగవ కాండ, ఏడవ ప్రపాఠకములోనిది.

ఈ 11 వ అనువాకం లో ఒక #రహస్యం దాగి ఉంది ఇందులో వరుసగ సంస్కృతంలో అన్నీ బేసి సంఖ్యలే వస్తాయి ఈ అంకెలు ఒక క్రమ పద్ధతిలో వచ్చునవి కావు ఇవి #దేవసంఖ్యలు. కాని వాటి ముందు ఉండు సంఖ్య తో కూడి వర్గ మూలము లను అపాదించిన ఒక క్రమ పద్ధతిలో గల #మనుష్యసంఖ్యలు( వరుసక్రమం లో వచ్చు సంఖ్యలు) కలుగుతాయి.

ఉదాహరణ కు అందులో (ఏకాచమే అనగా 1, త్రిసస్చమే అనగా 3, పంచచమే = 5 సప్తచమే 7, నవచమే 9, ఏకాదశచమే 11 ఇలా 1,3,5,7,9,11....బేసి సంఖ్యలే వస్తాయి ). 
కాని వాటి ముందు ఉండు సంఖ్య తో కూడి వర్గ మూలము లను అపాదించిన చో ఇగో ఇలా వస్తాయి....

ఏకాచమే అనగా ఒకటి =1, 
త్రిసస్చమే అనగా 3+1 = 4 కి వర్గమూలం =2,
పంచచమే = 5+4=9 కి వర్గమూలం = 3, 
సప్తచమే = 7+9=16 కి వర్గమూలం = 4, 
నవచమే = 9+16=25 కి వర్గ మూలం = 5, 
ఏకాదశచమే = 11+25 =36 కి వర్గ మూలం = 6, 
త్రయోదశచమే = 13 + 36 = 49 కి వర్గ మూలం = 7, 
పంచ దశచమే = 15 + 49 = 64 కి వర్గ మూలం = 8, 
సప్త దశచమే = 17 + 64 = 81 కి వర్గ మూలం = 9, 
నవ దశచమే = 19 + 81 = 100 కి వర్గ మూలం = 10,
ఏకవిగుం శతిస్చమే = 21 +100 = 121 కి వర్గ మూలం = 11, 
త్రయో వింశతి శ్చమే = 23 + 121 = 144 కి వర్గ మూలం = 12, 
పంచ వింశతి శ్చమే = 25 + 144 = 169 కి వర్గ మూలం = 13, 
సప వింశతి శ్చమే = 27+ 169 = 196 కి వర్గ మూలం = 14, 
నవ వింశతి శ్చమే = 29 + 196 = 225 కి వర్గ మూలం = 15, 
ఏక త్రింశతి శ్చమే = 31 + 225 = 256 కి వర్గ మూలం = 16, 
త్రయో త్రింశతి శ్చమే = 33 +256 = 289 కి వర్గ మూలం = 17, 
పంచ త్రింశతి శ్చమే = 35 + 289 = 324 కి వర్గ మూలం = 18, 
సప్త త్రింశతి శ్చమే = 37 + 324 = 361 కి వర్గ మూలం = 19, 
నవ త్రింశతి శ్చమే = 39 + 361 = 400 కి వర్గ మూలం = 20, 

కానీ దీనిలో ఎంతో గణిత జ్ఞానం కూడా నిక్షిప్తమై వున్నది.
ఒక్కసారి ఇచ్చిన వరుస చూడండి: 1,3,5,7,9,11,13,15,17,19,21,23,25,27,29,31,33 ( అన్నీ బేసి సంఖ్యలు)
దీన్ని arithmetic progression అని అంటాము గణిత భాషలో.

శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరిత్రలో గ్రంధకర్త దీనిలో ఒక విషయం గమనించారు:
1+3 = 2**2 (4)
1+3+5 = 3**2 (9)
1+3+5+7 = 4**2 (16)
ఇలాగ
1+3+5+7+9+11+13+15+17+19+21+23+25+27+29+31+33 = 17**2 ( 289)
అదే విధంగా తరువాత వచ్చే సిరీస్ చూడండి
4,8,12,16,20,24,28,32,36,40,44. ఇది  పై  సిరీస్ నుండి ఉద్భవించిన వైనం చూడండి
1+3 = 4
3+5 = 8
5+7 =12
ఈ విధంగా 23+25 = 48
ఇది కూడా arithmetic progression కానీ దీన్ని derivative series అని అన్వయించవచ్చు.

🙏Gödel, Escher, Bach: 📒An Eternal Golden Braid, GEB అని ఒక పుస్తకం patterns కు, ఆర్ట్ కు, 🎶సంగీతానికి, 😇మానవ మేధస్సుకు సంబంధం వివరించాడు. దాని ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకున్న ఇటువంటి సిరీస్ పరంగా ఎలా మారుతుందో, అటువంటి pattern వలన మానవ మేధస్సు ఎలా ద్విగుణీకృతము అవుతుందో చెప్పబడి వుంది.

ఇంతే కాదు మన లక్షణాలను నిరూపించాగలిగే  మానవ DNA కు సంబంధించి 33,000 mitochondrial basepairs ని ఈ 1-33 ప్రాతినిధ్యం వహిస్తుంది అని , 4-48 chromosomes ను నిరూపిస్తాయని అంటారు. (మానవులకు - 44 సాధారణ chromosomes, 2 సెక్స్ chromosomes ), కానీ #hominidae(great apes) లు అందరికీ 48 chromosomes ఉంటాయని వైజ్ఞానిక శాస్త్రం.
కొంతమంది పూర్వులకు ఇటువంటి DNA వివరాలు ఎలా తెలియవచ్చు అని అడగవచ్చు, కానీ ఒక్కసారి మన చరిత్ర చదివితే తెలుసుతుంది. అగస్త్య, వసిష్ఠ మహర్షులు #కుంభ_సంభవులు. అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకుంటున్న టెస్ట్ ట్యూబ్ బేబీస్. అంతే కాదు ఎన్నో పురాణాలలో ఎందరివో ఇటువంటి పుట్ట్టుకలు వివరింపబడి వుంటాయి. మనమింకా పరిశోధిస్తే మరిన్ని వివరాలు బయల్పడతాయి. దేవుని దయ వలన మనలోని జిజ్ఞాసులు మరి కొందరు ఈ తీరులో పరిశోధనలు చేసి మరిన్ని వివరాలు వెలుగులోకి తీసుకు వస్తారని ఆశిద్దాం.

రుద్ర చమకము లో ఈ 11 వ అనువాకము సృష్టి పరమాణు రహస్యము. 

#కణాదమహర్షి సిద్ధాంతము:-

 ఈ సమస్త సృష్టి అణు, పరమాణు సూక్ష్మ కణ స్వరూపమని వాటి లో గల సంఖ్యా భేదము అనుసరించి వివిధ ధాతువులు యేర్పడినవి అని.

 శివ తత్వము ఈ సృష్టి లోని, పరమాణు స్వరూపం.

 శివోహం శివోహం శివోహం,...

*గోపూజా మహిమ*

గోపూజ పశు పూజ కాదు. అది పరదేవతకు పూజ చేయడం. చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి. గోవు ఒక్కటి మాత్రం బ్రహ్మ సృష్టిలోనిది కాదు. అష్ట వసువులూ ఒక్క సంవత్సరం పాటు హోమం చేసి, ఆ తపశ్శక్తి చేత ఒక గోవును సృష్టించారు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి.

వేదం గోవుని ఏమని చెప్పిందంటే “ *గౌరగ్నిహోత్రః* ” అంది. గోవు “అగ్నిహోత్రము”. అగ్ని స్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో, గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. మీరు ప్రతీ రోజూ యజ్ఞం చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహం పొందడం ఎంత కష్టమో, అంత తేలికగా పొందడానికి అవకాశం గోపూజ.

గోవు పృష్ట భాగమునందు కాస్త పసుపు, కుంకుమ వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలు అవుతుంది.

 లక్ష్మీదేవి ఉండే స్ధానములు ఐదే.

 1. ఏనుగుకుంభస్థలం
2. ఆవువెనకతట్టు 3.తామరపువ్వు
4. బిళ్వదళంవెనుకఈనెలు ఉండే భాగం
 5. సువాసిని పాపట ప్రారంభస్ధానం.

అందుకే గోవుని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

ఒక్క గోదానానికి మాత్రం వేదం ఏం చెప్పిందో తెలుసా! గోవుని దానం చేస్తే పుచ్చుకున్నవాడు వెయ్యి గోవులు పుచ్చుకున్నాడని, మీరు వెయ్యి గోవులు ఇచ్చారని వేస్తారు. గో సహస్రమని తప్ప, ఒక్క గోవుని దానం చేసాడని వెయ్యరు. ఒక్క గోదానంలోనే ఆ గొప్పతనం.

మీకొక రహస్యం చెప్పనా! గోసేవ చేసాడనుకోండి, గోగ్రాసం పెట్టాడనుకోండి. అంటే కాసిన్ని పచ్చగడ్డి గోవుకి తినిపించి, ప్రదక్షిణం చేసి, గంగడోలు ఇలా దువ్వి, గోవు పృష్టభాగంలో పసుపు, కుంకుమ వేసి వెళితే ఏం చేస్తారని చెప్పిందో తెలుసా వేదం! ఆయన సేవించిన ఆవు శరీరానికి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్కపెడతాడు. ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకుని ఆ సంవత్సరంలో ఈయన నూరు యజ్ఞాలు చేసారని లెక్క వేస్తారు.

“కామాక్షి పరదేతకు అరటిపండు తినిపించడం సాధ్యంకాదు. కానీ పరదేవతకు అరటిపండు తినిపిస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక్క గోవుకు అరటిపండు తినిపిస్తే అంత ఫలితమూ వస్తుంది”.

 *గవో మేచాగ్రతో నిత్యం! గావః పృష్టత ఏవచ !*
 *గావో మే హృదయేచైవ! గవాం మధ్యే వసామ్యహం !*

భావము

 గోవులు నా ఎదుట, నా వెనుక, నా హృదయమునందు నిత్యము ఉండుగాక, నేను ఎప్పుడూ గోవుల మధ్య ఉందును గాక (స్కాంద పురాణాంతర్గతము).


శ్రీ కృష్ణ భగవానుడు గోపూజ చేసి మనకు తరుణోపాయం చూపారు. అందుకే గోపూజ చేసిన వారికి మోక్షం సులభ సాధ్యము. గోవు సమస్త దేవతా స్వరూపము.

గోపాదాలు – పితృదేవతలు,
పిక్కలు – గుడి గంటలు,
అడుగులు – ఆకాశగంగ,
కర్ర్ఇ – కర్ర్ఏనుగు,
ముక్కొలుకులు – ముత్యపు చిప్పలు,
పొదుగు – పుండరీకాక్షుడు,
స్తనములు- చతుర్వేదములు,
గోమయము – శ్రీ లక్ష్మి,
పాలు – పంచామృతాలు,
తోక – తొంబది కోట్ల ఋషులు,
కడుపు – కైలాసము,
బొడ్డు – పొన్నపువ్వు,
ముఖము – జ్యేష్ఠ,
కొమ్ములు – కోటి గుడులు,
ముక్కు – సిరి,
కళ్ళు – కలువ రేకులు,
వెన్ను – యమధర్మరాజు,
చెవులు – శంఖనాదము,
నాలుక – నారాయణ స్వరూపము,
దంతాలు – దేవతలు,
పళ్ళు – పరమేశ్వరి,
నోరు – లోకనిధి.

ప్రాతఃకాల గో దర్శనం శుభప్రదము.
పూజించుట మోక్షప్రదము.
స్పృశించుటచే ఉత్తమ తీర్థ స్నాన ఫలము కలుగుతుంది.

ఉదయాన్నే లేచి గో మహాత్మ్యాన్ని పఠిస్తే సకల పాపాలు తొలిగిపోతాయి. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, తెలిసీ తెలియక చేసిన పాపాలు నశిస్తాయి.

మధ్యాహ్న కాలములో పఠిస్తే వెయ్యి గుళ్ళల్లో దీపారాధన చేసిన ఫలము, జన్మాంతరము ఐదోతనము ఇచ్చునట్లు,
రాత్రి పూటపఠిస్తే యమబాధలు వుండవు.

గో మహాత్మ్యాన్ని ఒకసారి పఠించినవారికి మూడు నెలల పాపము,
సంధ్యవేళ గో మహాత్మము పఠించిన వారి ఇంటికి శ్రీ మహాలక్ష్మి స్వయముగా విచ్చేస్తుంది.
కాళరాత్రి గోమాహాత్మ్యము పఠిస్తే కాలయముని భయము దూరమవుతుంది.

నిత్యము గోమాహాత్మ్యము పఠించిన వారికి నిత్యము చేసిన పాపములు దూరమవుతాయి.
విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము ప్రాప్తిస్తాయి.

ఎదురుగా కదలాడే తల్లి, తండ్రి, గురువు, గోమాత వంటి ప్రత్యక్ష దైవములను గుర్తించలేక దేవుడెక్కడున్నాడు అనుకొనే అజ్ణానులము మనము.


కంచి కామకోటి 68వ పీఠధిపతులు అయిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంధ్ర సరస్వతి మహాస్వామి వారు నిత్యం సాక్షాత్ పరదేవత అయిన గోమాత ని పూజని ప్రతిరోజూ చేస్తూ ఉండే వారు.
**సేకరణ

పగరుడ పంచమి

పగరుడ పంచమి సందర్భంగా ఎవరైతే సర్పసూక్తం భక్తి శ్రద్దలతో పారాయణ చేస్తారో వారికి ఉండే సమస్త సర్పదోషాలు తగ్గి, విష బాధల నుండి విముక్తి పొందగలుగుతారు. ఈ పర్వదినాన ఈవిధంగా చేసిన వారికి వంశాభివృద్ధి, సంతానోత్పత్తి, కార్యసిద్ధి కలుగటంతో పాటు, కాలసర్ప/నాగ దోషాలు తగ్గుముఖం పడతాయి. రోగాలు నశిస్తాయి, అయితే ఈ గరుడ పంచమి గురించి క్లుప్తంగా చెప్పాలి అంటే దీని ప్రాముఖ్యతని సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించాడు. శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమిగా జరుపుకుంటారు. ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగితే.. తాము ఉద్బవించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికను మన్నించిన శ్రీమహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున జనులు సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడు. కావున అప్పటి నుండి ఈ రోజున సర్ప దేవతలని పూజించటం వంటివి చేస్తారు. తద్వారా వారి దోషాలు తొలగి కోర్కెలు నెరవేరతాయని ప్రతీతి.

ఇలాంటి విషయాలు నేను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలియ పరుస్తాను (ఏ పర్వదినాన ఎవరిని ఏ విధంగా కొలవాలి వంటివి) కావున మీలో ఎవరైనా నా నెంబర్ సేవ్ చేసుకోకపోతే సేవ్ చేసుకుని నా స్టేటస్ ను ఫాలో అవ్వొచ్చు. అలానే మీ నెంబర్ నేను సేవ్ చేసుకోకపోతే మీరు సేవ్ చేసుకోమని మేసేజ్ పెడితేచాలు, సేవ్ చేసుకుంటాను. అలానే మీ అందరి సౌలభ్యం కోసం నేడు సర్ప సూక్తాన్ని పంపిస్తున్నాను. ఇంకేమైనా సందేహాలు ఉంటె అడుగగలరు. ఈ సర్పసూక్తాన్ని 1,3,11,108 సార్లు పారాయణ చెయ్యవచ్చు. అది వారి ఇష్టాన్ని/ఓపికను బట్టి ఉంటుంది.

జై హింద్.
హిందూ ధర్మం వర్ధిల్లాలి
Whatsapp: +91 95814 51419

మహా మంత్రం..!!

హరేరామ హరేరామ రామరామ హరేహరే.!
హరేకృష్ణ  హరేకృష్ణ  కృష్ణకృష్ణ హరేహరే..!!
అనేది మహా మంత్రం .

అన్ని విధాలుగా మనలను ఆదుకొని
ఉత్తేజపరిచే దివ్య ఔషథరాజం .
అన్ని  మంత్రములు ఇందే ఆవహించెను
అన్న అన్నమయ్య పదానికి అచ్చమైన నిదర్శనం

కృష్ణుడు చంద్రవంశపు రాజకులానికి చెందిన
యదువంశంలో పుట్టినవాడు .
ఆయన నామస్మరణం చంద్రునికి ఆనందాన్నిస్తుంది . చంద్రుడు మనః కారకుడు .
అందుకే చంద్రుని వెన్నెల ఎంతటి అశాంతితో కూడిన మనస్సుకైనా ఆహ్లాదాన్నిస్తుంది .
కృష్ణ నామము అంతే..మనస్సుకు ఆహ్లాదాన్నిస్తుంది. ఆహ్లాదభరితంగా మనస్సు శాంతంగా ఆలోచిస్తుంది.
సహన స్వభావాన్ని కలిగివుంటుంది .

బుధుడు..చంద్రుని కుమారుడు .
మనలోని సహన గుణానికి వినయానికి కారకుడు .
కృష్ణ నామస్మరణతో చంద్రుడు సంతోషభరితుడయితే , తన తండ్రి సంతోషానికి కారణమైన
మనపట్ల బుధుడు ప్రసన్నత కలిగి ఉండి
సహన గుణాన్ని మనలో ప్రేరేపిస్తాడు .
ఎవరు సహనవంతులో వారినే శాంతి వరిస్తుంది .
ఎవరి మనసు ప్రసన్నతతో కూడి..
సహన పూర్వక ప్రవర్తన కలిగి వుంటారో..
వారి బుద్ధి  సరైన మార్గంలో ప్రచోదితమవుతుంది .
బుద్ధి కారకుడు బృహస్పతీ.

శ్రీరాముడు సూర్య వంశపు రాజు .
రాముని గుణకీర్తనతో సూర్యుడు సంతోషిస్తాడు . సూర్యుడు గ్రహాధిపతి .
చక్కని ఆరోగ్యాన్ని , సుజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు

శ్రీరాముని పాద స్పర్శతో పునీత అయిన
మాత భూమాత .
రాముని హృదయలక్ష్మి భూజాత సీత .
ఆ భూపుత్రుడే అంగారకుడు ...
ఋణ విమోచన కారకుడు .
రాముని స్మరణం సీతమ్మకు ఆనందాన్నిస్తుంది  .
సోదరి ఆనంద కారకుడైన వానిపట్ల అంగారకుని అనుగ్రహం లక్ష్మీప్రదం . 

భార్గవ వంశోద్భవి అమ్మ మహాలక్ష్మి.
హరికి పట్టపు రాణి .
హరి స్మరణ అమ్మకు ఆనందదాయకం .
అమ్మ ఆనందం..భార్గవ వంశభూషణుడైన
శుక్రాచార్యునికి మోదాన్నిస్తుంది .
శుక్రుని మోదం మనకు సుఖదాయకం.

రాముని స్మరణం సూర్యునికి తృప్తిని కలిగిస్తే ,
తన తండ్రి అయిన సూర్యుని మనస్సుకు సంతోషం కలిగించిన మనపట్ల శని ప్రసన్నతభావం కలిగివుంటారు .
శని సరయూ తీరంలో నిరంతరం..
కృష్ణనామ ధ్యానంలో వుంటారు .
తన ఇష్ట దైవమైన  కృష్ణ నామస్మరణతో శని
మన పట్ల కరుణాంతరంగుడవుతాడు .

శని సంప్రీతుడైతే ఆయన ఆజ్ఞానువర్తులై ఫలాలు ప్రసాదించు రాహు కేతువులు శుభ ఫలితాలిస్తారు.

శ్రీరాముడు సకల గుణాభిరాముడు.
లోకోత్తర సౌందర్యరూపుడు .
అమ్మ లలిత.. త్రిపుర సుందరి 
సకల గుణాభిరామి
శ్రీరాముడే అమ్మ లలిత.

శ్రీకృష్ణుడు సకల కళావల్లభుడు.
షోడశ కళానిధి .........
అమ్మ శ్యామల సకల విద్యా స్వరూపిణి .
శ్యామల చేతి వీణయే కృష్ణుని హస్త భూషణమైన
వేణువై విలసిల్లింది
శ్రీకృష్ణుడే అమ్మ శ్యామల.

హరి నామంలోనే దాగి వుంది హర నామం .
సకల పాపాలను హరించేవాడు హరి .
ఈ శరీరాలను లయం చేసుకునేవాడు హరుడు .
హరే హరుడు . హరుఁడే హరి.

చతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత అమ్మ లలిత.
యోగి గణ సేవితుడు శ్రీరాముడు.
ఆ యోగిని యోగి గణములే గో గోప గోపికలై
సేవించు పరంధాముడే శ్రీకృష్ణుడు.
అదే చింతామణి గృహం.
అదే వైకుంఠం.
అదే గోలోక బృందావనం.

ఒక్క మంత్రం సకల దేవతా సాక్షాత్కారం .
ఒక్క మంత్రం సకల దేవతా నమస్కారం .
ఒక్క మంత్రం సకల సమస్యా పరిష్కారం .
సందేహమే లేదు .......
అన్ని మంత్రములిందే ఆవహించెను ;

ఈ నామ స్మరణ మించిన రత్నం లేదు.
యంత్రం లేదు.
తంత్రం లేదు.
పూజ లేదు.
వ్రతం లేదు.
హోమం లేదు.
యజ్ఞం అంత కన్నా  లేదు .
ఇంతకు మించి సత్యము లేదు.ఓం శనైచ్చరాయనమః

నాగచంద్రేశ్వర దేవాలయానికి ప్రత్యేక ప్రాశస్త్యం నాగపంచమి ' నాడు తెరవబడుతుంది.

మహాకాళ దేవుని మహా నగరం.. ఉజ్జయిని. ఈ నగరానికి దేవాలయాల నగరంగా మరో పేరుంది. ఈ నగరంలో వీధికి ఒక దేవాలయాన్ని మీరు కనుగొనవచ్చు.

కానీ నాగచంద్రేశ్వర దేవాలయానికి ప్రత్యేక ప్రాశస్త్యం ఉన్నది.

 మహాకాళేశ్వర దేవాలయానికి క్షేత్ర భాగాన కొలువైన ఈ దేవాలయం సంవత్సరానికి ఒకసారి అదీ ' #నాగపంచమి ' నాడు తెరవబడుతుంది.

సర్పాధిపతిగా పిలువబడే తక్షకుని విగ్రహాన్ని నాగపంచమి నాడు కొలిచేందుకు వేల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి విచ్చేస్తారు.

 నాగరాజైన తక్షకుని కరుణా కటాక్ష వీక్షణాల కోసం సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తారు.

 దేవాలయం లోపలిభాగంలో, విఘ్నేశ్నర పార్వతీ సమేత ఈశ్వరుని భారీ విగ్రహం కొలువై ఉంటుంది. పరమశివుని విగ్రహం సర్పతల్పంపై ప్రతిష్టించబడి ఉంటుంది.

సాధారణంగా మహావిష్ణువు సర్పతల్పంపై పరుండి కనిపిస్తాడు కానీ అందుకు భిన్నంగా ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని రీతిలో ఇక్కడి దేవాలయంలో బోళాశంకరుడు సర్పతల్పంపై ఉంటాడు.

విగ్రహ రూపంలోని శంకర మహాదేవుడు భుజంపైన మరియు మెడ చుట్టూ సర్పాలను ధరించి ఉంటాడు.

సర్పాధిపతి తక్షకుడు పరమశివుని ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైన తపస్సు చేసాడు. తక్షకుని తపస్సుకు సంతసించిన మహాశివుడు చిరంజీవిగా వర్ధిల్లమని వరమిచ్చాడు. ఆనాటి నుంచి తక్షకుడు మహాశివుని చెంతనే ఉండిపోయాడని చెప్పబడింది.'

ఇతిహాసాల విశ్వాసం
ఇది చాలా పురాతనమైన దేవాలయం.

పర్మర్ వంశానికి చెందిన భోజరాజు ఈ దేవాలయాన్ని 1050వ సంవత్సరంలో పునరుద్ధరించాడని ఒక విశ్వాసం. అనంతరం 1732వ సంవత్సరంలో, మహాకాళ దేవాలయంతో ఈ దేవాలయానికి రాణాజీ సింధియా నూత్న వైభవాన్ని తెచ్చారు.

ఈ దేవాలయంలో పూజలు చేసిన వారికి సర్వ సర్పదోషాలు తొలగిపోతాయని చెప్పబడింది. 'నాగపంచమి' నాడు లక్షలాదిగా భక్తులు ఈ దేవాలయాన్ని
సందర్శించడం వెనుక ఇది కూడా ఒక కారణం కావచ్చు.

సేకరణ

గుడ్లగూబ_లక్ష్మీదేవికి_వాహనం_ఎలా_అయ్యింది


మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినపుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండటాన్ని చూస్తుంటాం. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది? అనే ప్రశ్న మనల్ని పట్టి పీడిస్తుంది. దానికి సమాధానంగా పురాణాలలో ఓ కథ కనబడుతోంది. ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గానమాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూలశరీరాన్ని విడిన తరువాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం ఆంతరంగిక సంగీతసభ ఒకటి ఏర్పాటుచేసాడు. ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు. తుంబరునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబరునకు స్వాగత సత్కారాలు లభించడం చూచిన నారదుడు మండిపడ్డాడు. అయినా, తమాయించుకుని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అదితెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమైయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది. శరీరమంతా చెమటలు పట్టాయి.

కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గు పడుతున్న నారదుని చూచి అన్నాడు - 'నారదా! నీ కోపకారణం నాకు తెలియును. నిజానికి భక్తి జ్ఞానములందు, శీల వర్తనములందు తుంబరుడు నీకన్న కపటి కాడు, గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికి వ్యర్థం. భక్తిశ్రద్ధలతో నన్నుకొలుచువారలకు అవశ్యం వశ్యుడనే. సంగీతం చేత ననుజేరవచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తుంబరులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధ పడటం లేదు. లోకహితమే జరుగుతుంది. చింతించ వద్దు.' నారదునికి అప్పటికి జ్ఞానోదయమైంది. "ఓ దేవదేవా! నా తప్పులను క్షమించుము. అవివేకివలె ప్రవర్తించాను. నన్ను కాపాడుము. తుంబర కౌశికులవలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా!' అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాలమీద పడ్డాడు.

భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్యహస్తాలతో నారదుని పైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానససరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దివాంధం ఉంది. ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చెతులు జోడించిన నారదుడు సెలవుపుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానససరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గానమాధుర్యాన్ని పట్టుకుని ఆవలిగిరి శిఖరం చేరాడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరాసాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న 'గానబంధు' నారదుని చూడగానే వినయంతో ఆశనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశలప్రశ్నలు వేసాడు. ఏతెంచిన కారణం చెప్పమని ప్రార్థించాడు.

నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీత వేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడెవరైతేనేం! తనకు కావలసింది సంగీతవిద్య. ఉలూకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యంకాని శ్రీహరిని తుంబుర కౌశికులు గానమాధుర్యంతో వశం చేసికొన్నారని, తనకూ అలాంటీ దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు, నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింప సాగాడు - పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలి గుండెగలవాడు. ధర్మవర్తనుడు. సంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుని కూడా భక్తిగీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేసాడు. ఆ గానమాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మరచిపోయారు. వెంటనే రాజబటులు వచ్చారు. హరిమిత్రుని రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం. మరణశిక్షతో సమానమైనది రాజ్యబషిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసికొని రాజ్యం నుండి వెళ్లగొట్టాడు.

కాలచక్రం తిరగడం మానదుకదా! కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అలాగే గిట్టినప్రాణి కూడ పుట్టక తప్పదు. నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంధజన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారయింది. పురాకృత దోషఫలితం కాబోలు; ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరగలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసికొన్న సుకృతం వల్ల మరణ దేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముని చూచి 'ధర్మరాజా! ఎందుకు ఈవిధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గతజన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు?' అన్నాడు భువనేశుడు. దివాంధ స్థితికి యమధర్మరాజు జాలి పడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా! తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది! అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు.

"దివాంధమా! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసినమాట నిజమే. కాని పరమాత్ముని వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమపావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువైనదియా! ఆ పాప ఫలితం కొండంతయై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టిపీడిస్తోంది. విష్ణుభక్తులకు చేసిన కీడు నీకీ అవస్థ తెచ్చిపెట్టింది. దీనినుండి బయట పడటం ఎవరికీ సాధ్యం కాదు". సమవర్తి చెప్పింది విన్నాక గాని, దివాంధానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుని స్తుతించ వచ్చన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాలమీద పడ్డాడు. యముని హృదయం కూడా ద్రవించింది. "ఉలూకరాజా! చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము. అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకుని భక్షించు. అది పూర్తి అయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది" అని దీవించి వెళ్ళాడు.

"ఓ మహర్షీ! ఆ దురదృష్టవంతుడను నేనే! ఆ తరువాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా, దివ్య తేజస్వియైన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూచి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి, 'ఇది భువనేశుని కాయము వలెనున్నది. ఇందేల పడియున్నది? దీనిని యీ పక్షి భక్షించుటేమి?" అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుని గుర్తించాను. అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదములపైబడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతుండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా వివరించాను. హరిమిత్రుడది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకనుగుణంగా ఇలా పలికాడు. 'నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నాయెడల చూపిన కాఠిన్యం నేను ఆరోజునే మరచాను. నీవనుభవించిన బాధలిక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక! గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువు గాక!' అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికేగాడు. వాని దీవనలు ఫలించి నేనిట్లున్నాను" అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు.

ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలిరోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతో గాని, తామసంతో కాని అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధనచేస్తే ఎవరైనా అపురూపమయిన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చన్నాడు. గౌరవ భావం మొహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా వేయేళ్లు గడిచాయి. కఠోరమైనదీక్షతో నారదుడు 3,60.006 రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. అమితానందంతో గురువును జేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను. ఏమికావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సంశయింప వద్దన్నాడు.

శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. 'ఓ మహర్షీ! దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను! దివాంధమునకు వలసిన అవసరములేమి ఉంటాయి? శిష్యుడవైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉండునంత వరకు సంగీతకళతోపాటు నేను సహితం లోకంలో గుర్తుండేలా వరము ప్రసాదింపుము' అని మనసులోని మాట బయట పెట్టాడు. నారదుడు విశాలంగా నవ్వాడు. 'గురువర్యా! ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున సంగీతకళ నిలిచియున్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవాభాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాధిస్తున్నాను. ప్రళయం సంభవించినవేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతునివలె శ్రీమహాలక్ష్మికి నీవు వాహనమై తరియింతువు గాక!' అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకొన్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది.

ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే

*ఇది గుర్తుంచుకోండి.*

  *కరోనా వ్యాధి అనేది దగ్గు, జలుబు కంటే పెద్ద వ్యాధి కాదు.*

  *యునైటెడ్ స్టేట్స్లో ఒక ఖైదీకి మరణశిక్ష విధించినప్పుడు, కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ఖైదీపై కొన్ని ప్రయోగాలు చేయాలని భావించారు.* 
*ఉరి తీయడానికి బదులుగా విషపూరితమైన కోబ్రా నీపై దాడి (attack) చేయడం వలన నీవు  చంపబడతావని ఆ ఖైదీని భయపెట్టి చెప్పడం జరిగింది.*

  *ఒక పెద్ద విషపూరిత పాము అతని ముందుకు తీసుకురాబడింది, వారు ఖైదీ యొక్క కళ్ళు మూసివేసి, కళ్ళకు గంతలు కట్టి, అతన్ని కుర్చీకి కట్టేసారు. అతన్ని పాముతో కరిపించలేదు, గానీ రెండు భద్రతా పిన్స్ తో  (Two safety pins) గుచ్చారు అంతే, ఆ ఖైదీ రెండు సెకన్లలోనే మరణించాడు.*

  *ఆ ఖైదీ శరీరంలో పాము విషాన్ని పోలిన విషం ఉందని పోస్ట్‌మార్టం ద్వారా వెల్లడైంది.*

  *ఇప్పుడు ఈ విషం ఎక్కడ నుండి వచ్చింది, లేదా ఖైదీ మరణానికి కారణమేమిటి?*
 *ఆ విషం మానసిక రుగ్మతల ఒత్తిడి కారణంగా తన సొంత శరీరమే ఉత్పత్తి చేయబడిన విషం.!*

 *మానసిక భయాందోళనల ఒత్తిడికి గురియై మరణించడం జరిపించారు.*

  *మీ శరీరం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సానుకూల స్పందన లేదా ప్రతికూల స్పందనలు బట్టి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. (The energy results depends up on our body produces the hormones  positive energy or negative energy accordingly). తదనుగుణంగా మీ శరీరం హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.*

  *90% అనారోగ్యాలకు మూలకారణం ప్రతికూల ఆలోచనల (Negative thoughts) వలన ఉత్పన్నమయ్యే అనారోగ్యాలే.*

  *ఈ రోజు మనిషి తన తప్పుడు ఆలోచనలతో తనను తాను కాల్చుకుని తనను తాను నాశనం చేసుకుంటున్నాడు.*

  *5 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వయస్సు ఉన్న రోగులు పాజిటివ్ నుండి కరోనా ప్రతికూలంగా ఉన్నారు.*

  *గణాంకాలపైకి వెళ్లవద్దు ఎందుకంటే సగానికి పైగా ప్రజలు బాగానే ఉన్నారు, మరియు మరణాలు కరోనా వ్యాధి వల్ల మాత్రమే కాదు, వారికి ఇతర అనారోగ్యాలు ఉన్నాయి, కాబట్టి వారు భరించలేక మరణించారు.*

  *కరోనా చేత ఇంట్లో ఎవరూ చనిపోలేదని గుర్తుంచుకోండి, రోగులందరూ ఎక్కువగా ఆసుపత్రులలోనే మరణించారు. ఆసుపత్రిలో వాతావరణం మరియు మనస్సులో భయం ఉండటమే కారణం.*

  *ఎల్లప్పుడూ మీ ఆలోచనలను సానుకూలంగా (Positive గా) ఉంచండి, సంతోషంగా ఉండండి.*

  *కరోనా వ్యాధి అనేది దగ్గు, జలుబు కంటే పెద్ద వ్యాధి కాదు.*

పెళ్లి తప్పేట్టు లేదు...పెదబాబుకి

‘కరోనా వెళ్ళేదాకా కాస్త ఆగరా’  అంటే “ఇది జీవితాంతం ఉండే వైరసు! అంటే లైఫులో నాకు పెళ్లి చెయ్యరా?” తిక్క రేగింది వాడికి.

 “సరే తగలడు.  ఎవరెవర్ని పిలవాలో లిస్టు తయారు చెయ్యండి. ఇరవై మందికే పర్మిషనట!” అన్నాడు పెద్దాయన.  
 🥵🥵

“ఇదిగో చెల్లి పెళ్ళప్పటి  లిస్టు. ఇందులో  ఏడువందల ఎనభై రెండు పేర్లున్నాయి  మరి!” 

“చచ్చేం! పేర్లన్నీ కొట్టెయ్యండి. దయాదాక్షిణ్యాలు లేవు, బంధుత్వాబంధుత్వాలు లేవు, ప్రతిష్టా అప్రదిష్ఠలు లేవు!” అన్నాడు పెద్దాయన ఆవేశంగా.🥵

అలాగే  కొట్టేసుకుంటూ పోతే పంతొమ్మిది  మంది తేలేరు.  “ ఇంతకుమించి  చచ్చినా  తగ్గరు!” 

 “గుడ్. పెళ్లి కూతురు ఒక్కత్తినీ పంపించమని వియ్యంకుడికి ఫోన్ కొడదాం. దాంతో ఇరవై మంది అవుతారు.” 

 “బావుంది సంబడం! పెళ్ళికూతురొక్కత్తినీ పంపిస్తే మరి ఎవరి బాబొచ్చి చేస్తాడండీ కన్యాదానం?” వియ్యంకుడు ఎగిరి పడ్డాడు.  🥵

“అవును కదా, సరే మీ మొగుడూ పెళ్లాలిద్దరూ కూడా రండి, ఆవార మేం ఇద్దరిని తగ్గించుకుంటాం మా లిస్టులో! 

ఇంతకీ  పురోహితుణ్ణి మీరు తెస్తున్నారుగా?”    

“లేదు లేదు మీరే తేవాలి.”  “అయినా  ‘మాంగల్యం తంతునా నేనా’ మనకందరికీ నోటి కొచ్చిందే కదా. అది చదివేసి  పుస్తి కట్టించేస్తే పోలా? సుమతీ శతకం చదివేసి  మావాడొకడు పెళ్లిళ్లు చేయించేస్తున్నాడు. వాళ్ళంతా  పిల్లాపాపలతో సుఖంగా కాపరాలు చేసుకుంటున్నారు!”

 “ఓకే. మరి భజంత్రీలో?”  “భజంత్రీలు??  బహువచనం కూడానా?  ‘భజంత్రీ’.. అనండి.🤔

 ఒకాయనే వస్తాడు.  ఆయనే నోటితో తూతూబాకా వాయిస్తూ  రెండు చేతుల్తో డోలు వాయిస్తాడు!”
🤔

 “అన్నట్టు  వీడియో వాళ్ళు నలుగురొస్తారట.” గుర్తు చేసాడు పెదబాబు.  

“ చాల్చాలు. వొడిలిపోయి, వాడిపోయిన మన మొహాలకు వీడియోలు కూడానా?   చినబాబు  వాడి కెమెరాతో ఫుటోలు తీస్తాడు చాలు..”   🤔

“మరిచిపోయా బావగారూ. వాళ్ళక్క పెళ్ళిలో జడ తనే పైకెత్తి పట్టుకోవాలని మా చంటిది   ఎప్పట్నుంచో రిహార్సల్సు వేసుకుంటోంది. దాన్ని రావద్దంటే చంపేస్తుంది. 🤔

ఇంకో విషయం. 

పెళ్ళికూతురికి  చీర కట్టుకోడం రాదు. దానివన్నీ  చుడీదార్లే కదా. చీర కట్టడానికి, పీటల మీద  అది జారిపోకుండా చూసుకోడానికీ   మా మరదలు దగ్గరుండాల్సిందే. 

అలాగే పెట్టి దగ్గర కూర్చుని సామాను అందించడానికి, పిల్లని బుట్టలో తేవడానికి ముగ్గురు బావమరుదులు   తప్పదు!” అన్నాడు వియ్యంకుడు. “బుట్ట సిస్టం కాన్సిలండీ. పిల్లని నడిచి రమ్మనండి. పెళ్లి మండపం దూరవేం  కాదు.”

 “అంటే మరో తొమ్మిది మందిని కొట్టెయ్యాలి మా లిస్టులో!  బావుంది. ఇలా మీరు  పదహారు అక్షౌణీల సైన్యాన్ని యుద్ధానికి తెచ్చినట్టు తెస్తే మేం ఏమైపోవాలి?  మా వాళ్ళని ఎంతమందిని తెగ్గోయాలి? 🧐

మా కొంపలోనే పదిమంది ఉన్నామాయె!”  😲 

“ఎందుకుండరూ? కుటుంబ నియంత్రణాపరేషను చేయించుకోమని అప్పట్లో ఎన్నిసార్లు బతిమాలేరు మా వాళ్ళు! వినిపించుకున్నారా?”🤪 వంటింట్లోంచి పలికిందో  స్త్రీ స్వరం. 
    
  “నాన్నా! మరి  భోజనాలు?”  “ఔన్రోయ్ మరిచిపోయాం.  
కేటరింగ్ వాళ్ళు నలుగురొస్తారట. వాళ్ళని తగ్గిస్తే తిండుండదు ఎవరికీ.  

ఓర్నాయనో! అవతల ఆడ పెళ్ళివాళ్ళు, ఇవతల వీళ్ళు!  ఎవరి పేర్లు కొట్టెయ్యాలిరా?  ఈ పెళ్లి  నా వల్ల కాదు!  గంగలో దూకండి అంతా!” 

పోనీ, ఇరవై కంటే ఎక్కువమందిని తెచ్చుకోడానికి మనిషికి ఇంత చొప్పున పెనాల్టీ కట్టేద్దామా గవర్నమెంటుకి? 
సగం సగం భరిద్దాం మీరూ మేమూ.”  

 “చాల్చాలు. ఇప్పటికే మాస్కులూ, సబ్బులూ, తువ్వాళ్ళూ  అంటూ చాలా పెనాల్టీలు వేశారు మా మీద. ఇక మా వల్ల కాదు.” వియ్యంకుడి జవాబు. 

“నాన్నా,  అరమొహం మాస్కులతో,  వైరస్ భయాలతో, రాని చుట్టాలతో ఈ పెళ్లి ఏం కళ కడుతుంది?  వాయిదా వెయ్యండి. 
ఈలోగా ఆ పిల్లని పంపించమనండి. అందాకా సహజీవనం చేస్తాం!” 

“డొక్క చీరేస్తా వెధవా!   రిజిస్టర్ మ్యారేజ్  చేసుకు తగలడండి! పోండి!

మధ్య తరగతి మనో "గతం"

(Whatts up నుండి .)

ఎవరో ఈల వేసి పిలిచినట్టు సెల్ ఫోను మోగగానే ఆయనకేసి చూశాను జాపుకున్న కాళ్ళకి పతంజలి నూనె రాసుకుంటూ.."పార్వతీ! నీ కొడుకు నీ అకౌంటకి 2000 డాలర్లు పంపాడట, వ్వాట్సాప్ లో చెబుతున్నాడు" అన్నారు 
మావారు శంకర ప్రసాదు గారు."డాలర్లలో చెప్పకండి, నాకర్ధమయ్యేట్టు రూపాయల్లో చెప్పండి" అన్నాను విసుగ్గా. 
"2000ని 74తో గుణించు, రూపాయల్లో వస్తుంది" అన్నారు. విద్యార్థికి లెక్క ఇస్తున్నట్టుగా "ఆ గుణకారాలేవో మీరే చెయ్యండి, లెక్కల మాష్టారు కదా ?" అన్నాను తెలివిగా. "లక్షా నలభై ఎనిమిది వేలవుతుంది" అని చెప్పేసి వ్వాట్సాప్ లోకి దూరిపోయారు యధాలాపంగా.

చెప్పొద్దూ...అమెరికా వెళ్ళినప్పుడల్లా ఏ మాల్ కి వెళ్లినా ధరలు చూసి వెంటనే 70 తో గుడించేదాన్ని. నాకు ఏడో ఏకం బాగానే వచ్చు .

రూపాయిల్లోకి మార్చాక గుండె గుభేల్మనేది .
"ఇక్కడ రూపాయల్లో ఆలోచించ కూడదమ్మా"
అనేవారు పిల్లలు.
పుట్టుకతో వచ్చిందిమా ఊరికినే పోతుందా ?

కరివేపాకు కట్ట 70 రూపాయలట!
అందుకే.. కూరల్లో, చారులో కొంచం తగ్గించే వేసేదాన్ని. ఎప్పుడు ఏ సంఘటన జరిగినా ...
ఎందుకో పాత జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి. 
ఈయన మూడేళ్ళ కిందట రిటైర్ అయ్యాక మరీను !

ఇప్పుడు నా రెండో కొడుకు ప్రత్యేకంగా జ్ఞాపకం పెట్టుకుని, నా పుట్టిన రోజుకి ఏదైనా కొనుక్కోమని లక్ష చిల్లర డబ్బులు పంపిస్తే ఆనందమే...కానీ....

అప్పట్లో మా మావయ్య నాపుట్టిన రోజుకని ఇచ్చిన యాభై రూపాయలకి ఎంత సంబర పడిపోయానో..
ఎంత మందితో చెప్పుకున్నానో! అంత సంతోషించడానికి కారణం ఆ వయసా? అప్పటి పరిస్థితులా? లేక అవసరాలా? ఏమో!

ఇప్పుడు ఖరీదైన 4 బెడ్ రూముల అపార్టుమెంటు,
ఏసీలు, సోఫా సెట్లు, కింగ్ సైజు మంచాలు, అమెరికా పరుపులు, పేద్ధ టీవీ, ఖరీదైన కారు ...అన్నీ ఉన్నా....

ఎందుకో..ఆ మూడు వరస గదుల అద్దె ఇంట్లో 
మా అత్తగారు, మేవిద్దరం, ముగ్గురు పిల్లల్తో ఉన్నా 
ఎంతో ఆనందంగా, కళ కళ్ళాడుతూ ఉండేది !
ఇరుకు అనిపించేదే కాదు.

సెకండు హ్యాండు స్కూటర్ మీద ఆయన అలా..
గోదారి గట్టు మీదకి తీసుకెడితే...ఆ ‘ఇదే’ వేరు! ఫ్రిజ్ కూడా లేదు, నలుపు, తెలుపు టీవీలో చిత్ర లహరి చూస్తుంటే ఏమి ఆనందించాం !

మా ఆడపడుచులు వస్తే అందరం బరకం పరుచుకుని, పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే.. నిద్రే వచ్చేదికాదు !
మా అత్తగారు కూడా మధ్యలో కబుర్లు కలుపుతూ, కునికి పాట్లుపడుతూ, "ఇంక చాలు, పడుకోండి, తెల్లారి పోతోంది,మళ్ళీ పెందలాడే లేవాలి" అనేవారు.

మా కబుర్ల కంటే నవ్వులే ఎక్కువగా ఉండేవి,…
ఎవర్నీ నిద్దరోనీకుండా. 
మా ఆడపడుచులు ఎంతో మంచివాళ్ళు, ఇప్పటి టీవీ, సినిమా ఆడపడుచుల్లా కాదు.

అప్పట్లో ఈయన పినతల్లి కొడుకు పెళ్లికి వెళ్ళాలంటే మంచి పట్టు చీరలే ఉండేవి కావు.

ఇప్పుడు మూడు బీరువాల నిండా ఎవరెవరో పెట్టినవి, పెట్టించుకున్నవి,కొనుక్కున్నవి చాలా ఉన్నాయి.
పట్టు చీరలైతే లెక్కే లేదు…. ఫాన్సీ చీరలు ఉన్నా ...
ఏం కట్టుకుంటాం ?

అటూ, ఇటూ అందరి పెళ్ళిళ్ళూ అయిపోయాయి. 
అందరి కుటుంబాలనించీ ఒక్కళ్ళైనా అమెరికాయో,
లండనో చెక్కేశారు. 
మా రోజుల్లో కొంపకి ఒక్కళ్లు హైదరాబాద్ వెడితే 
‘అబ్బో’ అనుకునే వాళ్ళం. 
శ్రావణ మాసం పేరంటంలో ఎవరైనా "మావాడు హైడ్రాబాడ్ లో చార్మినారు, ట్యాంకు బండూ చూపించాడు" అంటే, మనం ఎప్పుడు చూస్తామో అనుకునే వాళ్ళం.

ప్రస్తుతం మా పిల్లలు, ఇద్దరబ్బాయిలూ, 
ఒకమ్మాయి అమెరికాలో స్థిరపడ్డారు. శతమానం భవతి సినిమాలో లాగ.

నేనూ, ఈయనా ఇక్కడే భాగ్య నగరంలోనే ఉండి పోయాం, జయసుధా, ప్రకాష్ రాజుల్లాగా.

కొడుకులు ఫోను చేసినప్పుడల్లా "గ్రీన్ కార్డు" అంటూవుంటారు..
స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ మాటిమాటికి 
"నా ఉజ్జోగం?" అన్నట్టు!

ఎందుకో అమెరికా వెళ్లాలంటే ఇంకా మనసు 
రావడం లేదు,

ఇక్కడే పాత స్నేహితులు, చుట్టాలతో వాట్సాప్, ఫోనులతో కాలక్షేపం చేయడమే ఇష్టం. 
తరవాత్తరవాత భగవంతుడెలా నిర్ణయిస్తాడో మరి!
నాకు మాత్రం, ఆ టీవీ సీరియళ్లు, చాగంటి వారి ప్రవచనాలు చూసుకుంటూ వేళకి ఇంత ఉడకేసిపడేస్తే 
హాయిగా గడిచిపోతుంది.

అన్నట్టు మొన్న వేసంకాలం మా అమ్మాయి, పెద్ద మనవరాలు, మనవడు వచ్చినపుడు వేలకి వేలు తగలేసి నాకోసంట 
స్మార్టు ఫోను, టాబ్ కొన్నారు...చెప్పాచెయ్యకుండా. వాటిల్లో వాట్సాప్, యూట్యూబు పెట్టి నన్ను చూసుకోమన్నారు. మా పెద్ద మనవరాలు మా హై స్కూల్ సైన్సు మాష్టారి లాగ అన్నీ నేర్పించి వెళ్ళింది.

ఈయన నేర్పితే రాదుకానీ... అది నేర్పితే బాగానే అలవడ్డాయి నాకు.

నిజంచెప్పొద్దూ..అవన్నీ నేర్చుకున్నాక, రోజూ పిల్లలందరి మెసేజీలు, ఫోటోలు, వీడియోలు,
రక రకాల విశేషాలు చూస్తుంటే మాటాడుతుంటే
టైమే తెలియడంలేదు.

అదే నా పెళ్ళైన కొత్తలో నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న మా అమ్మ కోసం ఎంత బెంగెట్టుకునేదాన్నో!
ఏమాటకామాటే చెప్పుకోవాలి, పాపం ఈయన వారానికి రెండుసార్లు పుట్టింటికి పంపించేవారు బడ్జెట్ ఇబ్బందులున్నా !

తనికెళ్ళ భరణి తీసిన "మిధునం" చూస్తుంటే మా కధే తీసినట్టు అనిపిస్తుంది. 
కాకపోతే లక్ష్మి, బాలు గార్లు పల్లెటూళ్ళో ఉంటారంతే.

మా పిల్లలు వారానికి రెండు మూడు సార్లు వీడియో కాల్సు చేస్తే 
వంట డ్యూటీ తనదేనని పాపం శంకర ప్రసాద్ గారికి తెలుసు.

ఆయనక్కూడా వాట్సాప్, యూట్యూబు, ఫేసు బుక్కు ఉన్నా, ఆయన రూటే సెపరేటు. ఎప్పుడూ రాజకీయాల గొడవే !
"వాడలా అన్నాడు, వీడిలా అన్నాడు " అని ఆవేశపడిపోతూ ఉంటారు.

ఆ ఫేసు బుక్కులో వ్యాసాలకి వ్యాసాలు రాసేస్తుంటారు, 
తానే సమాజాన్ని మార్చెయ్యాలన్నట్టు !

ఇంక టీవీ చూడ్డం మొదలెడితే స్నానమవదు, 
అన్నానికి లేవరు. 
పొద్దుకుంగే దాకా ఆ దిక్కుమాలిన ఛానళ్ళలో వాదనలే వింటుంటారు.

పది మందీ కలిసి ఒక్క సారే అరిచేస్తుంటారు,
ఒకడు చెప్పేది ఇంకోడు వినిపించుకోడు. ఈయన, "నువ్వునోరుముయ్యరా" అని అరిచేస్తుంటారు !
రోజూ ఇదో ప్రహసనం !

నేను మాత్రం, నా గదిలోకి వెళ్లి, ఏసీ వేసుకుని,
సుమ ఆడవాళ్ళ చేత ఆడించే ఆటలు చూస్తూ,
వాళ్ళు కట్టుకున్న పట్టుచీరలు, నగలు చూస్తూ, ఈటీవీలో 'అభిరుచి' లోని రకరకాల వంటల కార్యక్రమాలని ఎంజాయ్ చేస్తుంటాను.

ఆయనకి ఇవేమీ నచ్చవు. 
ఎప్పుడూ రాజకీయాలు, వార్తలు, ట్రంపు, మోడీ, 
చంద్రబాబు, కేసీయారు, జగన్ను, పవన్ను...లేక పోతే ఆ జంతువులు ఒకదాన్నొకటి పీక్కుతినే 'విజ్ఞాన' చానళ్ళుట.... అవే చూస్తుంటారు.

మా దాంపత్య జీవితంలో నగలు, చీరలకోసం ఎన్నడూ ఆయన్ని వేధించలేదు కానీ..
చిన్న టీవీ ఉన్నప్పుడు మాత్రం, సీరియళ్ల టైముకి ఛానల్ మారిస్తే మాత్రం గొడవలే.

అందుకే మొన్నామధ్య మా చిన్నబ్బాయి వచ్చినపుడు, రాజీమార్గం గా నా కోసం ఒకటి, వాళ్ళ నాన్నకి ఒక పేద్ధ టీవీ కొని పారేశాక, కొంపలో శాంతి నెలకొంది... శ్రీలంకలో లాగ..

అప్పుడప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ముగ్గురు పిల్లలు, నేను, మా ఆయన, మా అత్తగారు
ఉన్నపుడు ఇల్లు ఇరుకనిపించ లేదు, డబ్బు లేదనిపించలేదు. (ఈయన జీతం ఏ నెల్లో ఎంత వచ్చేదో నేను ఎప్పుడైనా పట్టించుకుంటేగా!)

చుట్టాలు, పక్కాలు వచ్చి మూడు, నాలుగు రోజులుండి పోయినా ఇబ్బందనిపించేది కాదు.
ఎన్నిసార్లు డికాషన్ తీసేదాన్నో.. ఎన్నిసార్లు కుక్కర్ పెట్టేదాన్నో !
సమయానికి గ్యాస్ అయిపోతే, పక్క వాటా వాళ్ళ సిలిండెర్ ఉమ్మడి ఆస్తి అయిపోయేది.

ఫ్రిజ్ లేని రోజుల్లో అధాట్టుగా ఎవరైనా వస్తే,
పాలు, పంచదార, కాఫీ పొడికి పక్కింటి
రాధమ్మ గారే మాకు క్రెడిట్ కార్డు.

ఇప్పుడేమో లంకంత కొంపలో బిక్కు బిక్కుమంటూ మేమిద్దరమే. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయిలాగ. ఎవరి ఫోన్లు, డెబిట్ కార్డులు, బాంక్ అకౌంట్లు, 
ఫేసుబుక్ అకౌంట్ లు వాళ్లవే.

పిల్లలు వారంలో ఐదారు సార్లు ఫోను చేసినా ఆయనతో మాట్లాడేది తక్కువే. ఎప్పుడైనా ఆయన ఫోను తీస్తే, "ఎలా ఉన్నార్రా?" అంతే. మాటలే ఉండవు. అదే మాకయితే డైలీ సీరియళ్ళే !

మా చిన్న కోడలు ఫోను చేసిందంటే బీబీసీ దగ్గరినించీ అన్ని చానళ్ల న్యూస్ చెప్పాక,
మా బుల్లి మనవడి బొమ్మల టెంటులోకి తీసుకెళ్లి వాడితో మాట్లాడించే లోపు 
వాడు "నానమ్మ, బాయ్" అంటాడు. వాడు బాయ్ ఎంత బాగా చెప్తాడో !

మాపెద్ద కోడలైతే వీకెండ్ లోనే మాట్లాడుతుంది, 
ఉద్యోగ భారం కారణంగా .
ఈ లోగా మా పెద్దాడు వచ్చి, "అమ్మా, గ్రీన్ కార్డు విషయం ఏంచేశారు?" అంటాడు సినిమా మధ్యలో వాణిజ్య ప్రకటనలాగ.

"మీ నాన్ననడుగు" అని ఆయన మీదకి తోసేస్తాను. 
ఆయనతో ఈ విషయం మాట్లాడ్డానికి వాడికెందుకో
చాలా 'ఇది'.

మా అమ్మాయి అయితే ఈటీవీ జబర్దస్తు లెవెల్లో
జోకులు వేస్తూనే ఉంటుంది. ఈ లోగా మా పెద్ద మనవడు, మనవరాలు వచ్చి, వాళ్ళకొచ్చిన గిఫ్టులు, సర్టిఫికెట్లు చూపించేస్తారు.

“అంతసేపు మాట్లాడ్డానికి ఏముంటాయి?"
అంటారీయన.!
ఈయనకేంతెలుసు, పిల్లల్తో మాట్లాడాక నాకు టానిక్ తాగినట్టుంటుందని ?

మా అబ్బాయిలు "అమ్మా, వచ్చే సమ్మర్ కి మీరు
ఇక్కడికి రావడానికి టికెట్లు బుక్ చేస్తున్నాం " అంటే 
"మీ నాన్న తో చెప్పండి" అని ముక్తాయిస్తా .

వాళ్ళ నాన్నని అడిగితే "మొన్ననే కదరా వచ్చాం" 
అంటారని వాళ్లకి తెలుసు. 
ఎందుకో రాను రాను అమెరికా ప్రయాణాలు బోరు కొడుతున్నాయి .

అదే చిన్నప్పుడు విమానం శబ్దం వినిపిస్తే చాలు,
బయటికి పరుగెత్తి, 
విమానం కనుమరుగయ్యేదాకా చూస్తే ఎంత బాగుండేదో !

అదే ఇప్పుడు .. ఎయిరిండియాలూ, లుఫ్తాన్సాలు, 
ఎతిహాద్ లు ఆనట్లేదు.

చిన్నప్పుడు పిల్లల్తో ఎర్ర బస్సెక్కి పుట్టింటికి వెడుతుంటే ...
కిటికీలోంచి ఆ పచ్చటి పొలాలు, కాలువలు, చెట్లు ఎంత అందంగా ఉండేవని !
(అప్పట్లో ఈయన జోకు...
నేను పుట్టింటికెళ్లేటప్పుడు
ఎర్ర బస్సు వికార పెట్టదుట
అదే బస్సు తిరుగు ప్రయాణంలో 
ఎంత వికారం పెడుతుందోట!)

ఇప్పుడేంటి ?
హాంగ్ కాంగు, దుబాయి, ఫ్రాంక్ ఫర్టు,అబుదాబీలు మామూలుగానే కనిపిస్తున్నాయి?

పుట్టింటినుంచి వచ్చేస్తుంటే అమ్మ కొన్న చుక్కల
కాటన్ చీర ఎంత బాగుండేది !
(ఇప్పటికీ దాచుకున్నా)

ఇప్పుడు ఈయన, పిల్లలు ఎన్ని వేలో పోసి కొన్న పట్టు చీరలు ఎందుకు అంత గ్లామరస్ గా అనిపించట్లేదు?

ఇలా చెప్పుకుంటూ పోతే.... ఎన్నో, ఎన్నెన్నో!

మా చిన్నాడి పెళ్లికి మొదలయిన టీవీ సీరియల్,
"జిగట కాంభోజి రాగాలు" ఇప్పటికీ మలుపుల మీద మలుపులు తిరుగుతూ పోతున్నట్టు, ఎప్పటికీ పూర్తి కాదు.

నా ఈ మధ్య తరగతి మనోగతంలోని కొన్నిఅనుభవాలు. 

Cell phone గురించి

ఈ Cell phone గురించి ఎవర్రాశారో గానీ చాలా సరదాగా ఉంది..సరళ సంస్కృతంలో ఉండటం వల్ల..తెలుగు మాతృభాషైన అందరికీ సులభంగా అర్థమవుతుంది..పోతే రాసిన కవి ఎవరో తెలియదు కానీ.. ఆ అజ్ఞాత మనిషికి ఈ రూపకంగా శతాధిక అభినందనలు తెలుపుకుంటున్నా..

** చరవాణి స్తోత్రమ్ **
*******
ప్రథమం  వాయుభాషణం|
ద్వితీయం యంత్ర గణనం|
తృతీయం ఛాయాచిత్రాణి |
చతుర్థం క్రయ విక్రయం |
పంచమం అంతర్జాలిన్యాం |
షష్టమం క్రీడా విలాసిని    |
సప్తమం చిత్ర దర్శిని   |
అష్టమం ఖండాతర దర్శినీ |
నవమం సర్వప్రాంత విహారిణీ |
దశమం మార్గదర్శిని |
ఏకాదశం ముఖపుస్తకే |
ద్వాదశం వ్యర్థ  సందేశః |
ఇతి ద్వాదశ నామానీ |
చరవాణీ నమోస్తుతే||

చరవాణీ నమస్తుభ్యం |
సర్వ వార్తా సమన్వితః|
చరాచర స్వరూపేణ  |
విద్యుత్ గ్రాస భక్షిణీ||1||

చిత్రగ్రహణ రూపేణ|
యంత్ర గణన రూపిణీ |
క్రయ విక్రయ సర్వాణీ |
గృహ ప్రాంగణ దర్శిని||2||

సర్వ స్తోత్రాణి గానాని  |
కర్ణాంతరాళ శ్రావణి  |
దూర ప్రాంతేషుమార్గాణి |
అంతర్జాల సందర్శిని  ||3||

మధ్యమాంగుళ తర్జన్యా|
స్పర్ళ  మాత్రేణ శోభినీ |
సర్వ మానవ హస్తేన |
అలంకారేణ దర్శనం॥|4॥

సర్వక్రీడా సముత్పన్న |
సర్వ వస్తు విలక్షణ|
దూరభారాణి విచ్ఛేద | 
వాయుమార్గ సంచారిణీ ॥5॥

ఖండాంతర నివాసిన్యాం|
భాషణేషు సమీపతః |
వాయు సంకేత గ్రాహేణ|
సమీపేన సందర్శిని ॥6॥

వినా మానవ హస్తేన |
క్షణక్షణ విచారిణః |
చరవాణి సభా మధ్యే |
సంభాషణే విశేషతః ॥7॥

కార్య కారణ సంబంధ |
మధ్యే వాయు విహారిణీ |
సందేశాని సంకేతాణి |
పురోగతి నిరోదకః ॥8॥

వయో విత్తం జ్ఞాన శూన్యం|
లింగ భేదాన్యేవచ |
చరవాణీ వినాహస్తే  |
పశు రూపేణ గణ్యతే ॥9॥

జల మధ్యే జంతు మధ్యే ప్ర యాణే గమనేషుచ|
గృహ మధ్యే కార్య మధ్యే ప్రయాణ ప్రాంగణేషుచ |
యాజ్ఞీకేషు యాచకేషు వైద్య వైజ్ఞానికేషుచ|
దేవాలయే విద్యాలయే చరవాణీ సందర్శనమ్ ॥ 10 ॥

వాగ్భూషణం చరభాషణం|
చరవాణీ హస్త భూషణం|
కర్ణే వార్తాయాం శ్రవణం |
చరవాణీ నమోనమః ॥11॥

కంపనం ఆగమనేన |
సూక్ష్మ ప్రాణి వినాశనం |
సంభాషణేన సర్వాణీ |
వాయు మార్గేన గమ్యతే ॥12॥

సంఖ్యా మాత్రేణ ఆహ్వానం |
సంఖ్యా ధీనేన వర్తినీ|
  వ్యర్థేన కాలక్షేపాయ |
కుర్వంతి వ్యర్థ భాషణం ॥13॥

జ్ఞప్తి పత్రాణి సంయుక్త |
నామ పత్ర సమన్విత |
ఇదం పత్ర వినాశేన |
సర్వ సంబంధ నాశనం ॥14॥

    #$ ఫలశృతి* *#$
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
ప్రయాణే  భాషణేనస్య |
ప్రమాదానిచ లభ్యతే |
వైద్యశాలాయాం గచ్చంతీ |
పరలోకం చ లభ్యతే ॥

చరవాణీ యో జానాతి |
అనారోగ్యంచ లభ్యతే|
నిత్య ప్రయోగ మాత్రేన|
మృత్యు మార్గం చ గమ్యతే||
********భలేరాసారు ఎవరోగానీ

ప్రాణాలు కాపాడే తద్దినం చారు!!!

ప్రాణాలు కాపాడే తద్దినం చారు!!!
అనంతసాహితి -ఆయుర్వేదం పంచమవేదం-007

‘‘చారుగా చారుగా చారుగా‘‘ అని ఒకరంటే మరొకరు ‘‘జారుగా జారుగా జారుగా‘‘ అని అంటారు. ఈ ‘‘రెంటికీ‘‘ మూలం ఒకటే. దాన్ని చారు అని కొందరు అంటే రసం అని కొందరు అంటారు. ఇందులో మొదటి దానికి అర్థం అందంగా చారు కాచారుగదా? అని అర్థం. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు ప్రతి రోజు తమ భోజనంలో చారు తీసుకునే వారు. ఏదో మొక్కుబడిగా కాకుండా పెరుగన్నం ముందు మొత్తం కంచంలో దాదాపు 200ఎం ఎల్ వచ్చే విధంగా అన్నంలో కలిపి త్రాగేవారు. 

తెలుగువారి చారులో తమిళ కర్ణాటకవారి రసంలో అనేక ఆయుర్వేద రహస్యాలున్నాయి. చారు తయారు చేయడంలో వాడే ప్రతి పదార్థం అద్భుతమైన పోషక విలువలు, వనమూలికలు, ఔషథాలు ఉన్నాయి. చారులో ప్రధానమైనవి చింతపండు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, శొంఠి లేదా అల్లం, మిరపకాయలు (కన్నా కారం మంచిది), మెంతులు (ఆడవారికి చక్కెర వ్యాథి మంచిది), టమోటా, బెల్లం, (వెల్లుల్లి) పోపు సామాన్లు. అతిముఖ్యంగా పసుపు వేసి దీన్ని బాగా మరిగిస్తారు. ఇవేకాక చాలా సంప్రదాయభేదాలతో భారతదేశం మొత్తం చారు అనే రసం ఉంటుంది.

రసం తీసుకోవడంలో కూడా అనేక సంప్రదాయాలున్నాయి. కర్ణాటకవారు రసాన్ని ఎపిటైజర్ గా (అంటే ఆంగ్లేయులు త్రాగే సూప్ మాదిరిగా, ఆకలి, అరుగుదల ప్రేరేపించే రసాయనంగా) భోజన ప్రారంభంలో తీసుకుంటారు. తెలుగువారు అరవం వాళ్ళు పెరుగు లేదా మజ్జికకు ముందు తీసుకుంటారు. ఎవరు ఎలా తీసుకున్నా చారు ప్రయోజనం మాత్రం అన్నం జీర్ణం కావడంలో ముఖ్యపాత్ర పోషించడమే కాక సుఖంగా టాయిలెట్ కి వెళ్ళడానికి ఉపయోగిస్తుంది. రోజు 200 ఎం ఎల్  తీసుకుంటే పైల్స్ రావు.

కనుకనే దీన్ని సరదాగా ‘‘జారుగా జారుగా జారుగా‘‘ అంటారు. 

నేటి కరోనా సమయంలో ఇది అతిముఖ్యమైన ఆహారం అవుతోంది.

 ఇంటిల్లిపాదీ ప్రతి రోజూ రసం తయారు చేసుకొని అన్నంలో కలుపి కనీసం 200 ఎం ఎల్ రెండు పూట్లా మజ్జిగకు ముందు తింటే కరోనా దరి చేరదు. లేదా పానీయంగా తీసుకోవచ్చు.  ఇందులో ముఖ్యమైన ధాతువుల మూడు. అవే మిరియాలు, శొంఠి, పొడుగు మిరియాలు (పిప్పలి). ఇవి మూడూ ఆయుర్వేదం కొన్నివేల ఏళ్ళ క్రితం అతిముఖ్యమైన ఆహార చూర్ణంగా చెప్పింది. దీన్ని ప్రతి రోజూ రెండు చిటికెలు తేనెలో కలిపి (కారంగా ఉంటుంది కనుక) తీసుకుంటే అగ్ని మాంద్యం ఉండదని చెప్పింది.

సమస్త రోగాలకూ మూల కారణం అజీర్తి. కనుకనే నేటి ఆంగ్ల వైద్యులు కూడా ఆయుర్వేదాన్ని కాపీ కొట్టి పొద్దున్నే టాయిలెట్ కి వెళ్ళారా అని అడుగుతున్నారు. పొద్దున్నే టాయిలెట్ రాకపోతే అది రోగగ్రస్త శరీరానికి చిహ్నం. జీర్ణం కాని ఆహారం మరిన్ని రోగాలు సృష్టిస్తుంది. అన్నం జీర్ణం అవ్వాలంటే ఒంట్లో అగ్ని అనే వైశ్వానరాగ్ని ఉండాలి. ఇది ఉంటే అన్నం జీర్ణం అవుతుంది. కనుక ఈ వైశ్వానరాగ్నిని రగిలించే త్రికటు అనే మిరియాలు, శొంఠి, పిప్పలి ఉపయోగిస్తారు. ఇది కేవలం అగ్నిమాంద్యం తొలగించమే కాకుండా ఇది రగిల్చిన అగ్ని కఫనాశిని అవుతుందని అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా కరోనా కలిగించే కఫం అనే శ్లేష్మం అనే వ్యాథులను ఇది అరికట్టి శ్వాసకోశ వ్యాథులు రాకుండా చేస్తుంది.  ఈ రెండు కారణాల వలనా భారత ప్రభుత్వ ప్రత్యామ్నాయ వైద్యాభివృద్ధి సంస్థ అనే ఆయుష్ కేంద్రం త్రికటు వాడమని తన ఆరోగ్యజాగ్రత్తల్లో బుద్ధి చెడిపోని క్రితం చెప్పింది.

చాలా ఆశ్చర్యకరమైన అంశం ఒకటి ఇక్కడ చెప్పాలి. పితృదేవతా రహస్యాల్లో చారు  ఒక భాగం. పారణ విధానంలో బ్రాహ్మణులను పిలిచి అన్నం వండి పెట్టే ప్రత్యాబ్దికాలు అనే తద్దినాలలో తప్పకుండా చారు పెడతారు. అయితే కేవలం లెక్కకోసం శాస్త్రం కోసం మాత్రమే వండుతూ అశ్రద్ధ చేసేవారు ‘‘తద్దినం చారు‘‘ పెట్టి ఇన్ని నీళ్ళలో పోపుపెట్టి చింతపండు వేసి పసుపు వేసి ఇష్టం లేని తద్దినాలు పెడతారు. దాన్ని రెండు చుక్కల వడ్డన ప్రారంభంలో వేస్తారు. 

కానీ ఇందులో మహారోగ్యరహస్యం ఉంది. 

పితృకార్యంలో తప్పనిసరిగా గారెలు వండుతారు. ఈ గారెలను మినుములు అనే మాషధాన్యంతో తయారు చేస్తారు. ఈ మినుములు మాంసం కన్నా అనేక రెట్లు బలవంతమైన ఆహారం. బ్రాహ్మణులు మాంసం తినకపోయినా వారు మహాబలవంతులుగా ఉండడానికి కారణం ఈ మినుములే. ఇది మాంసం మాదిరిగా తేలిగ్గా అరగదు. కనుక భోక్తలు గారెలను చారులో నానవేసి స్వీకరిస్తారు. చారులో ఉండే ధాతువుల వల్ల గారెలు సులభంగా జీర్ణం అవుతాయి. ఇవేగారెలు పొట్టుతో పాటు కొందరు తెలివైన వారు వాడతారు. తిరుపతి వడల్లో కూడా పొట్టు ఉంచే తయారు చేస్తారు. మినపప్పులోని దోష గుణం పోగొట్టే రహస్యం పొట్టులో ఉంది. అందులో ఫైబర్ ఉంటుంది.  ఈ రహస్యాలు తెలిసిన కర్ణాటక, తమిళనాడు హోటళ్ళవారు రసం ఇడ్లీ, రసం గారెలు పేరుతో సొమ్ము చేసుకుంటున్నారు. కనుక ఈ రసం ఇడ్లీ గారెల వెనుక వేలాది ఏళ్ళ ఆయుర్వేద రహస్యం ఉంది.

కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఈ త్రికటును పైన చెప్పిన విధంగా చారులా తయారు చేసుకుని ప్రతి ఒక్కరూ కనీసం 200 ఎం ఎల్ అన్నంలో కలుపి తింటే వారిని ఏ రోగం దరిచేరలేదు. త్రికటును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా పతంజలి ఆయుర్వేద దుకాణాల్లో సులభంగా ఒక నలుగురు వ్యక్తుల కుటుంబానికి ఒక రోజుకు  సరిపడా చిన్ని చిన్న పాకెట్లలో ఇస్తున్నారు. ఇది కేవలం 14 రూపాయల ధరలో ఉంది. లేదా నెలకు సరిపడా డబ్బాల్లో కూడా బైద్యనాథ్, శ్రీశ్రీ, జండూ, హిమాలయ ఆయుర్వేద ఉత్పత్తి సంస్థలు అందిస్తున్నాయి. లేదా పచారీ దుకాణాల్లో శొంఠి, మిరియాలు, పిప్పలి అనే లాంగ్ పెప్పర్ సమపాళ్ళలో గ్రైండ్ చేసి వాడవచ్చు. నేడు ఆయుర్వేద మందులు అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి. 

పాదాలపై పడినా అమ్మల గోడు పట్టించుకోని ఆంగ్లవైద్యరాక్షసులకు వ్యతిరేకంగా ఆయుర్వేద ప్రచారంలో భాగంగా మేము ఈ త్రికటు శివామృత ప్రసాదంగా ఇస్తున్నాము. మా ఆశ్రమానికి వచ్చిన వారికి ఒక పాకెట్ త్రికటు ఇచ్చి రసం చేసుకుని ఇంటిల్లిపాదీ తీసుకోవడం ప్రారంభించమని కోరుతున్నాము. లేదా తేనెలో రెండు చిటికెలు వేసుకొని తీసుకోమని కోరుతున్నాము. ఇది ఆరోగ్యదానం వంటిది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా త్రికటూ చూర్ణం పొట్లాన్ని బహుమతిగా అందరికీ ఇవ్వడం లేదా ఆత్మీయులు వచ్చినప్పుడు టమోటా, కొత్తిమీర, తులసి, బెల్లంతో సూప్ మాదిరి తయారు చేసి ఇవ్వడం చేయండి. దీని వలన ఆరోగ్యదానం చేసివారు అయి ఆయుర్వేదప్రదాత అయిన వైద్యనాథేశ్వరుడైన జ్యోతిర్లింగేశ్వరుని కటాక్షం కలుగుతుంది.

మానవత్వంలేని రాహుకేతుగ్రస్త రాక్షస వైద్యులను (వైద్యులు శస్త్రచికిత్స కారులు కావాలంటే జాతకాల్లో రాహుకేతువులు ముఖ్యం) సేవించడం కన్నా అశ్వగంధ ఒకబిళ్ళ (లేదా ఒక చెంచాడు చూర్ణం), తులసి ఘనవటి బిళ్ళ ఒకటి (లేదా పది నుంచీ ఇరవై దళాలు), తిప్పతీగ అనే గిల్లోయ్ ఘనవటి బిళ్ళ ఒకటి, నాలుగు చుక్కల నువ్వుల నూనె ముక్కులో వేసుకుంటే కరోనా రానేరాదు. ఇది మేము చెప్పడం లేదు. పంచమ వేదం ఆయుర్వేదం చెబుతోంది. నమ్మిచెడిన వారులేరు. నమ్మక చెడతారు. అయినా మేము చెప్పక మానం. విన్నవారు రోజుకు 5 రూపాయలతో నిశ్చింతగా ఉంటారు. లేని వారు  20 లక్షలు తక్కువ కాకుండా ఖర్చుపెట్టుకొని ఆంగ్లమరణశయ్య చేరుకుంటున్నారు. 

కరోనా సమయంలో మరిన్ని ఆయుర్వేదఆరోగ్య రహస్యాలు ముందు ముందు తెలుసుకుందాం.


స్వామీ అనంతానంద
అనంతసాహితి ఆశ్రమం
హైదరాబాద్, గుంటూరు.

ప్రాత:స్మరణీయులు ‘నడిచే దైవం’

మహానుభావులు కంచి కామకోటి పీఠాధిపత్యము వహించిన ప్రాత:స్మరణీయులు ‘నడిచే దైవం’ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానము అంటే ధర్మానుష్ఠానమే అనేలా చేసేవాడు. ఆయనకి పరమాచార్యని దగ్గరగా చూడాలి అని కోరిక. రెండు రోజులు ఆయన విడిది చేసిన చోటుకి వెళ్ళాడు. విపరీతమైన జనము వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి. దూరమునుండి చూసి ఆయన దగ్గరకి ఎలా వెడతాను ఆయన మనతో ఎందుకు మాట్లాడతారు. వెళ్ళడము అనవసరము అని ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడనుండే ఒక నమస్కారము అని పడుకున్నాడు.

పరమాచార్యస్వామి తెల్లవారుఝామున రెండు గంటల వేళ ఎవరికీ చెప్పకుండా బయలు దేరి గబగబా కాలినడకన ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. ఆయనకి ఇల్లు ఎలా తెలుసు అనుకోకూడదు. ఆయన పరబ్రహ్మ స్వరూపులు, త్రికాల వేది ఆయనకి తెలియనిది ఉండదు. తిన్నగా బ్రాహ్మణుడి ఇంటిముందు వెళ్ళి నించున్నారు. ఆయన ఇల్లాలు కళ్ళాపి చల్లడానికి బయటికి వచ్చింది. కళ్ళాపి చల్లి పక్కకు చూస్తే చలికాలము అవడము వలన మహాస్వామి ముడుచుకుని కూర్చుని జపము చేసుకుంటున్నారు. ఆమె హడలిపోయింది. నడిచే దేవుడని పేరుగాచిన వ్యక్తి, ప్రపంచములో కొన్ని కోట్లమంది ఆయన తన పాదములను తలచుకుని నమస్కరిస్తారు. అటువంటి వారు తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు.

పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తని పిలిచింది. నిద్ర మంచము మీద నుండి దూకి బయటికి వచ్చి నేలమీద పడి నమస్కరించి ఏడుస్తూ మహానుభావా మా ఇంటికి మీరు వచ్చారా అన్నారు. ఆయన అతణ్ణి చూసి “రెండు రోజులుగా నా దగ్గరకి వస్తున్నావుగా. ఈయన దగ్గరకు వెళ్ళగలనా మనని పలకరిస్తారా అనుకున్నావు. ధర్మానుష్ఠానము చేసేవాడి దగ్గరకు నేను రాను అనుకున్నావు అందుకే నేనే వచ్చాను” అన్నారు. తణుకు వద్ద జరిగినది ఈ సంఘటన.

మహాత్ముల దృష్టిలోకి ఏదో చేస్తే వెళ్ళగలము అనుకోకూడదు. పటాటోపములకు వారి ఆకర్శితులు కారు. ఏ మూల కూర్చుని ధర్మానుష్ఠానము చేస్తున్నా మహాత్ముల దృష్టిలోకి వెళ్ళి తీరుతారు. సత్పురుషుల దృష్టిలో పడటము జీవితములో గొప్ప అదృష్టము. వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే అంతకన్నా అదృష్టము ఇంకోటి లేదు.

అనుబంధం

ఒక ఇల్లు తగలబడి పోతోంది. జనం చుట్టూ చేరి చూస్తున్నారు.   

యజమాని దూరoగా నిల్చుని రోదిస్తున్నాడు. ఎంతో అందమైన ఇల్లు.

పది రోజుల క్రితం ఎవరో రెట్టింపు ధర ఇస్తామన్నా అమ్మలేదు.

అందుకే దుఃఖం. ఇంతలో పెద్ద కొడుకు వచ్చాడు. "నీకు తెలీదా నాన్నా? మూడు రెట్లు ధర వస్తే, ఇల్లు నిన్నే అమ్మేసాను. నీకు చెప్పేటంత సమయం లేక పోయింది" అన్నాడు.

చేత్తో తీసేసినట్టు ఒక్క సారిగా వేదన పోయింది. గుండెల్నిండా సంతోషంగా గాలి పీల్చుకున్నాడు.

ఆ తరువాత తనూ ఒకడిగా మంటల్ని చూస్తూ పక్క వారి సంభాషణలో పాలు పంచుకొనసాగాడు…!

అదే ఇల్లు. అవే మంటలు. క్షణం క్రితం వరకూ ఉన్న అటాచ్‌మెంట్ పోయింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే, కా... స్త ఆనందిస్తున్నాడు కూడా.

ఇంతలో రెండో కొడుకు వచ్చాడు. "నువ్వు సంతకం పెట్టకుండా అమ్మకం ఎలా పూర్తి అవుతుంది నాన్నా. ఆమాత్రం తెలీదా?" అన్నాడు. అంతే. తిరిగి దుఃఖం చుట్టు ముట్టింది.

ఈ లోపులో మూడో కొడుకు వచ్చి, "మాట మీద నిలబడే నిజాయితీ గల మనిషి ఆయన. మాటతోనే అమ్మకం జరిగిపోయిందన్నాడు. సగం డబ్బు చెల్లించేశాడు కూడా" అన్నాడు. తిరిగి సంతోషం పెనవేసుకుంది.

ఇది నాది’ అనుకున్నప్పుడు దుఃఖం వస్తోంది. కాదనుకున్నప్పుడు పోతోంది.

నిజానికి ఏమీ మారలేదు. ఇదే బుద్ధుడు చెప్పిన నిర్వికార నిర్వాణ యోగం.

*ఎవరి బాధైనా బాధే కదా , మనకి వస్తే బాధ , అవతలి వారికి వస్తే కాదు అనుకోవడం మన మనస్తత్వం అస్సలు అవ్వకూడదు.జాలిపడినా పడకపోయినా కాస్తంత ఓదార్పు ఇవ్వండి, వీలైతే సాయం చేయండి...🙏🙏🙏

షాదీ కరోనా (స్కెచ్)



పెళ్లి తప్పేట్టు లేదు పెదబాబుకి.  ‘కరోనా వెళ్ళేదాకా కాస్త ఆగరా’  అంటే “ఇది జీవితాంతం ఉండే వైరసు! అంటే లైఫులో నాకు పెళ్లి చెయ్యరా?” తిక్క రేగింది వాడికి. “సరే తగలడు.  ఎవరెవర్ని పిలవాలో లిస్టు తయారు చెయ్యండి. ఇరవై మందికే పర్మిషనట!” అన్నాడు పెద్దాయన.  “ఇదిగో చెల్లి పెళ్ళప్పటి  లిస్టు. ఇందులో  ఏడువందల ఎనభై రెండు పేర్లున్నాయి  మరి!” 

  “చచ్చేం! పేర్లన్నీ కొట్టెయ్యండి. దయాదాక్షిణ్యాలు లేవు, బంధుత్వాబంధుత్వాలు లేవు, ప్రతిష్టాఅప్రదిష్ఠలు లేవు!” అన్నాడు పెద్దాయన ఆవేశంగా.   అలాగే  కొట్టేసుకుంటూ పోతే పంతొమ్మిది  మంది తేలేరు.  “ ఇంతకుమించి  చచ్చినా  తగ్గరు!”  “గుడ్. పెళ్లి కూతురు ఒక్కత్తినీ పంపించమని వియ్యంకుడికి ఫోన్ కొడదాం. దాంతో ఇరవై మంది అవుతారు.” 

  “బావుంది సంబడం! పెళ్ళికూతురొక్కత్తినీ పంపిస్తే మరి ఎవరి బాబొచ్చి చేస్తాడండీ కన్యాదానం?” వియ్యంకుడు ఎగిరి పడ్డాడు.  “అవును కదా, సరే మీ మొగుడూ పెళ్లాలిద్దరూ కూడా రండి, ఆవార మేం ఇద్దరిని తగ్గించుకుంటాం మా లిస్టులో! ఇంతకీ  పురోహితుణ్ణి మీరు తెస్తున్నారుగా?”    “లేదు లేదు మీరే తేవాలి.”  “అయినా  ‘మాంగల్యం తంతునా నేనా’ మనకందరికీ నోటి కొచ్చిందే కదా. అది చదివేసి  పుస్తి కట్టించేస్తే పోలా? సుమతీ శతకం చదివేసి  మావాడొకడు పెళ్లిళ్లు చేయించేస్తున్నాడు. వాళ్ళంతా  పిల్లాపాపలతో సుఖంగా కాపరాలు చేసుకుంటున్నారు!”

 “ఓకే. మరి భజంత్రీలో?”  “భజంత్రీలు??  బహువచనం కూడానా?  ‘భజంత్రీ’.. అనండి. ఒకాయనే వస్తాడు.  ఆయనే నోటితో తూతూబాకా వాయిస్తూ  రెండు చేతుల్తో డోలు వాయిస్తాడు!”

 “అన్నట్టు  వీడియో వాళ్ళు నలుగురొస్తారట.” గుర్తు చేసాడు పెదబాబు.  “ చాల్చాలు. వొడిలిపోయి, వాడిపోయిన మన మొహాలకు వీడియోలు కూడానా?   చినబాబు  వాడి కెమెరాతో ఫుటోలు తీస్తాడు చాలు..”   

“మరిచిపోయా బావగారూ. వాళ్ళక్క పెళ్ళిలో జడ తనే పైకెత్తి పట్టుకోవాలని మా చంటిది   ఎప్పట్నుంచో రిహార్సల్సు వేసుకుంటోంది. దాన్ని రావద్దంటే చంపేస్తుంది. ఇంకో విషయం.  పెళ్ళికూతురికి  చీర కట్టుకోడం రాదు. దానివన్నీ  చుడీదార్లే కదా. చీర కట్టడానికి, పీటల మీద  అది జారిపోకుండా చూసుకోడానికీ   మా మరదలు దగ్గరుండాల్సిందే. అలాగే పెట్టి దగ్గర కూర్చుని సామాను అందించడానికి, పిల్లని బుట్టలో తేవడానికి ముగ్గురు బావమరుదులు   తప్పదు!” అన్నాడు వియ్యంకుడు. “బుట్ట సిస్టం కాన్సిలండీ. పిల్లని నడిచి రమ్మనండి. పెళ్లి మండపం దూరవేం  కాదు.”

 “అంటే మరో తొమ్మిది  మందిని కొట్టెయ్యాలి మా లిస్టులో!  బావుంది. ఇలా మీరు  పదహారు అక్షౌణీల సైన్యాన్ని యుద్ధానికి తెచ్చినట్టు తెస్తే మేం ఏమైపోవాలి?  మా వాళ్ళని ఎంతమందిని తెగ్గోయాలి? మా కొంపలోనే పదిమంది ఉన్నామాయె!”  “ఎందుకుండరూ? కుటుంబ నియంత్రణాపరేషను చేయించుకోమని అప్పట్లో ఎన్నిసార్లు బతిమాలేరు మా వాళ్ళు! వినిపించుకున్నారా?” వంటింట్లోంచి పలికిందో  స్త్రీ స్వరం.     

  “నాన్నా! మరి  భోజనాలు?”  “ఔన్రోయ్ మరిచిపోయాం.  కేటరింగ్ వాళ్ళు నలుగురొస్తారట. వాళ్ళని తగ్గిస్తే తిండుండదు ఎవరికీ.  ఓర్నాయనో! అవతల ఆడ పెళ్ళివాళ్ళు, ఇవతల వీళ్ళు!  ఎవరి పేర్లు కొట్టెయ్యాలిరా?  ఈ పెళ్లి  నా వల్ల కాదు!  గంగలో దూకండి అంతా!” 

పోనీ, ఇరవై కంటే ఎక్కువమందిని తెచ్చుకోడానికి మనిషికి ఇంత చొప్పున పెనాల్టీ కట్టేద్దామా గవర్నమెంటుకి? సగం సగం భరిద్దాం మీరూ మేమూ.”   “చాల్చాలు. ఇప్పటికే మాస్కులూ, సబ్బులూ, తువ్వాళ్ళూ  అంటూ చాలా పెనాల్టీలు వేశారు మా మీద. ఇక మా వల్ల కాదు.” వియ్యంకుడి జవాబు. 

“నాన్నా,  అరమొహం మాస్కులతో,  వైరస్ భయాలతో, రాని చుట్టాలతో ఈ పెళ్లి ఏం కళ కడుతుంది?  వాయిదా వెయ్యండి. ఈలోగా ఆ పిల్లని పంపించమనండి. అందాకా సహజీవనం చేస్తాం!” 

“డొక్క చీరేస్తా వెధవా!   అంత ఖంగారైతే రిజిస్టర్ మ్యారేజ్  చేసుకు తగలడండి! పోండి!”

ఇదీ కరోనా కాలంలో పెళ్లిళ్లు....

రామాయణమ్ 10


.
విశ్వామిత్రమహర్షి మాటలు విన్నాడు దశరధుడు.
మనసొప్పటంలేదు ఆయనకు! ఇలా అంటున్నాడు!
.
ఊన షోడశ వర్షేణ రామో రాజీవ లోచనః
న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః
.
రాజీవ లోచనుడైన నా రామునకు పదహారు సంవత్సరాలు ఇంకారాలేదు ( పదహారుకు ఒకటి తక్కువ ,ఊన అంటే -1 )
రాక్షసులతో యుద్ధం చేసే యోగ్యత ఉన్నదని నేను అనుకోవడంలేదు! .
.
నా రాముడు ఇంకా బాలుడయ్యా! పూర్తిగా ఇంకా విద్యలే నేర్వలేదు ! అస్త్రాలు ఇంకా తెలువవు ! అలాంటి వాడు మాయావులైన రాక్షసులతో ఎలా యుద్ధం చేయగలడు ! కోరి కోరి కొడుకును కొలిమిలో ఎవరైనా నెట్టివేస్తారా!.
.
మహర్షీ నేనే ధనుస్సు ధరించి మీవెంట నడుస్తాను ,నా వెంట మెరికల్లాంటి యోధులు ఒక అక్షౌహిణి సైన్యం నడుస్తుంది!
మీ యాగసంరక్షణ నేనుగావిస్తాను మునీంద్రా! .
.
నా రాముడు బాలుడు! ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డడు వాడిని విడచి ఒక్కక్షణమైనా నేను బ్రతుకజాలను!.
.
అంతగా నీకు రాముడే కావలెనంటే అతనితోపాటు నన్ను నా చతురంగబలాలనూ కూడా తీసుకొని వెళ్ళు,అంతేకానీ ఒంటరిగా రాముని నే పంపజాలను!.
.
మునిచంద్రా అసలు ఆ రాక్షసులు ఎవరు? ఎవరు పంపగా వారు నీ యాగానికి విఘ్నం గావిస్తున్నారు?.
.
రాజా ఆరాక్షసులు రావణాసురుడు పంపగా వచ్చినవారు ,రావణుడు బ్రహ్మవరప్రసాది ! విశ్రవసు పుత్రుడు! 
వాడిచే ప్రేరేపింపబడి మారీచ సుబాహులనెడి వారు యజ్ఞవిఘ్నానికి పూనుకొన్నారు!
.
అసలు విషయం వినగానే దశరధమహారాజు తీవ్రమైన వేదనకు గురి అయి మహర్షీ ! 
దేవ,దానవ,యక్ష,గంధర్వ, పతగ,పన్నగులలో రావణుని ఎదిరించువారులేరే ! 
నా పసికూన! రాముని ,వానికి ఎదురు వెళ్ళమంటావా! నన్ను క‌నికరించు మహర్షీ! నా కొడుకు పట్ల అనుగ్రహము చూపు !.
.
మహర్షీ ! అంతటి బలవంతుడికి నేనుగానీ,నాసైన్యముగానీ ,నా కుమారుడుగానీ ఎదురునిలవలేము! యుద్ధము చేయజాలము!
.
ఆ మారీచ ,సుబాహులు మాయావులు మహాబలవంతులు వారిలో నా స్నేహితులతో కలసికూడా ఎవరో ఒకరితోనే తలపడగలను అలాంటిది ఇద్దరితో  తలపడమని రాముని పంపటమా నా వల్ల కాదు! పంపనుగాక పంపను ! అని ఖండితముగా పలికాడు దశరధుడు!
.
దశరధుడి ఈ అసంబద్ధ ప్రేలాపనలు విని మహర్షి ఒక్కసారిగా తోకతొక్కిన త్రాచు అయినాడు! యజ్ఞ కుండంలో నేయివోయ భగ్గున లేచిన పెనుమంట అయినాడు ,తీవ్రమైన కోపంతో కనులు అరుణ వర్ణం దాల్చాయి!.
.
అడిగినది ఇస్తానని ప్రతిజ్ఞ చేసి మాట తప్పుతున్నావ్ దశరధా!ఇది రఘువంశ సంజాతులు చేయవలసిన పనికాదు! సరే నీ కొడుకుతో ,బంధుమిత్రులతో సుఖంగా ఉండు వచ్చిన దారినే నే వెడతాను అని తీవ్రమైన ఆగ్రహావేశాలతో కంపించిపోయాడు!.
.
విశ్వామిత్రుని గురించి సకలము తెలిసిన మహర్షి వసిష్ఠుడు కల్పించుకొని !రాజా ! నీవు ఇక్ష్వాకుడవు ! నీ వంశమెట్టిది? లోకంలో మీరే ఆడిన మాట తప్పితే ఇంక మాటమీద నిలబడే వారెవరయ్యా! నీ మనసులో ఏ విధమైన శంకకు తావివ్వకు రాముని విశ్వామిత్రునితో యాగసంరక్షణార్ధమై పంపు!.
.
ఈ విశ్వామిత్రుడెవరనుకొన్నావు? ఈయన సంరక్షణ లొనున్న రామునికి అస్త్రములు తెలిస్తే నేమి? తెలియకున్న నేమి?.
.
విశ్వామిత్రుడు మూర్తీభవించిన ధర్మము! పరాక్రమవంతులలో శ్రేష్టమైన వాడు!
.
ఈయనకు తెలిసినన్ని అస్త్రములు సకలభువనాలలో ఎవరికీ తెలియవు! మరి భవిష్యత్తులో కూడా ఈయనకంటే ఎక్కువగా ఎవరికీ తెలవవు!.
.
ఈయనకు తెలిసిన శస్త్రాస్త్రాలెలాంటివో చెపుతాను విను!
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

ధర్మధ్వజం
హిందు చైతన్య వేదిక

నాగపంచమి విశిష్టత

 నాగపంచమి విశిష్టత మరియు పూజావిధానం 
సాక్షాత్తు పరమేశ్వరుడే "నాగపంచమి"నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీ దేవికి వివరించినట్లుగా స్కాందపురాణం చెబుతోంది. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం . నాగ పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, పాయసము నివేదించాలని ముక్కంటి.. శక్తిమాతకు వివరించినట్లు ఆ పురాణం పేర్కొంటుంది. ముఖ్యంగా నాగపంచమి రోజున నాగేంద్రేనికి పాలు, మిర్యాలు, పూలు పెట్టి పూజిస్తారు. ఇంట్లో వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగ పడిగెలకు భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే పుత్రదైకాదని సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్దలతో శ్రావణ శుక్ల 11వరోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లైతే సంతానభాగ్యం కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. నాగపంచమి విశిష్టత పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమెకు ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యా వినయంగల సౌజన్యురాలు. పెద్దలపట్ల వినయవిదేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుబూతిగల సద్గుణ సంపన్నురాలు . ఈ సుగుణ వతికి ఒక తీరని బాధ వుండేది. చెవిలో చీము కారుతుండేది. రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది. అందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది. నాగపంచమి విశిష్టత ఎన్ని పూజలు చేసినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు. తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సాధువు వాళ్ళ ఊరుకు వచ్చాడు. ఆ సాధువు త్రికాలజ్ఞానుడని విని అతనివద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిధి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని, ఇవి తొలగే మార్గామేమిటని వినయపూర్వకముగా వేడుకున్నది. నాగపంచమి విశిష్టత అందుకు ఆ సాధువు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోషంవల్ల సంభవించింది. ఏమిచేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్దని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం అని తెలిపెను. నాగపంచమి విశిష్టత నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మినవారిని ఉద్దరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగ పంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి. చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయెను. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్దలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళన లు తొలగి సంతోషముగా వున్నది. నాగపంచమి విశిష్టత ఉద్యాపన: శ్రావణ మాసంలో శుక్ల పంచమినాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో ఉంది నాగేంద్రుడిని ఆరాధించాలి. నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల పహ్ల పుష్పాదులు నారికేళం సమర్పించాలి. నాడు ఉపవాసం వుండాలి. నిరాహారం జాగరణ మరింత శ్రేయస్కరం. పూజావిధానం: నాగపంచమి రోజున సూర్యోదయమునకు ముందే ఐదు గంటలకే లేవాలి. శుచిగా తలస్నానము చేసి, ఎరుపురంగు బట్టలు ధరించాలి. పూజామందిరమును, ఇల్లును శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ, గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజామందిరము, ఇంటిముందు ముగ్గులు పెట్టాలి. పూజావిధానం: పూజకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి, పాముపడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి పువ్వులు (కనకాంబరాలు), మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్లు, వడపప్పు, అరటిపండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేగాకుండా రెండు ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకుని దూదితో 7 వత్తులలో నేతితో దీపమెలిగించాలి. పూజావిధానం: నాగపంచమి రోజున ఉదయం 9 గంటల లోపు పూజను పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి, పడమర దిక్కున తిరిగి పూజించాలి. 'ఓం నాగరాజాయనమః' అనే మంత్రమును 108 మార్లు జపించి, పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్రపటమునకు కర్పూర హారతులిచ్చి, నైవేద్యం సమర్పించుకోవాలి. పూజావిధానం: వీలైతే కర్పూర హారతులిచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరము, నాగ స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములలో ఏదైనా ఒక దానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్యపూజ, నాగదోష-పరిహారము వంటి పుస్తకములను తాంబూలము, పసుపు, కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్య ఫలం సిద్ధిస్తుంది. పూజావిధానం: అలాగే.. నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు. దేవాలయములో నాగా అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. 

                                                                                                     

నాగ పంచమిరోజే గరుడ పంచమి కూడా వస్తుంది. గరుడ పంచమి వెనుక ఉన్న పురాణగాధ ఏమిటంటే… కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువలన సర్పజాతి జన్మించిన శ్రావణశుద్ధ పంచమి ‘నాగ పంచమి’గా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక, అదే పంచమిని ‘గరుడ పంచమి’ అని కూడా పిలుస్తుంటారు. గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని ఈ రోజున గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు.

వ్రత నియమాలు…
అయితే సోదరులు వున్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం వుంది. సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి, ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి వుంటుంది.

సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా, లోకం మెచ్చేలా వుండాలని అనుకుంటుంది. అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన, ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది.

స్వామి వివేకానంద సూక్తి

కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్ధాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమని కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు.

Swamy Vivekananda quote

Speak angrily and lose character. Too much talk can cause you to lose your composure. Speak unnecessarily and lose meaning. To speak with arrogance is to lose love. Think and speak and live with uniqueness.
******************

నక్షత్రముల శక్తి

నక్షత్రముల శక్తిని వాటి కాంతి లక్షణాలు భూమిని ఏఏ డిగ్రీల కు సంభంధమెూ నిర్ణయించి కాలగమనంలో అనగా భూ చలనం ద్వారా వాటి శక్తిని తెలియజేసిరి. కాని అట్టి కాంతి లక్షణం ప్రత్యక్షంగా కనబడుట లేదు. రూపం మారిన గాని అదియును వస్తురూపంగానే తెలియును. అదియును ఆవస్తువుకూడా అనుభవించిన కొంతవరకు తెలియును. రాహువు యెుక్క కాంతి అసలు తెలియనే తెలియదు. అది రుద్ర శక్తి గనుక. అది మూల అగ్ని తత్వం యువి లక్షణము కలది. మిగిలిన ఏడు గ్రహముల ద్వారానే ఏడు వారముల రూపంలో గల గ్రహ శక్తి వలననే మనకు తెలియును. యిక చిత్ర, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, పూర్వాభాధ్ర, అశ్వని, కృత్తిక, మృగశీర్ష, పుష్యమి, మఖ, ఉత్తరఫల్గుణీ, మాసనామముల ప్రకృతి లక్షణమే ఆయా నక్షత్రముల కాంతి ని ఆయా నెలలో చంద్రుని పౌర్ణమి తిధి ద్వారానే మనకు మన భూమిపై యున్న వారికి మాత్రమే యని తెలియును.యిందు అశ్వనీ ఆశ్వయుజ శక్తి ప్రకృతి మార్పునకు,మఘ నక్షత్రము మాసమైన మాఘమాసమునకు కూడా విశిష్ట కాంతి లక్షణము యున్నట్టు తెలియుచున్నది. మనకు  యివే లక్షణములు ఆయా ఋుతు ధర్మం ప్రకారమే ప్రకృతిని  మార్పు చెందుచున్నది. అనేకమైన జీవ లక్షణములు  ప్రకృతి ద్వారానే తెలియనగును. వేరే సూత్రములు ఏమియు వీటికి ప్రాతిపదిక కాదు. ఏ మానవ ప్రకియకైనా సంవత్సర కాలము గల ఋతు ధర్మ లక్షణమే మూలమని అట్టి ఋతుధర్మంలేని జీవం నిర్జీవ మని తెలియును. ప్రకృతి వినాశనం జీవ వినాశనం. ప్రతీ సంక్రమణం ప్రతీ పౌర్ణమి. వివిధ రకాలైన ఋతు ధర్మ లక్షణములు గల ప్రకృతి సంబంధియైన దిగా చంద్ర సూర్యుని మూల కారణంగా తెలియుచున్నది.యింత బృహత్తరమైన విజ్ఞానం గురించి తెలుసుకొనుట యే దైవమని అది మానవ మేధస్సుకు తెలియనిది. ఆత్మ ద్వారానే సాధన ద్వారానే అనుభవము.దానివలననే భూమికి ఔషధీగుణం కలుగుచున్నది. లేనిదే సస్య వృధ్ది జరుగదు. సస్యవృధ్ది లేని భూమి నిర్జీవం. అందుకే ఆయా కాలానుగుణంగా ప్రకృతి సమతుల్యం సాగవలెనన్న హవన పూర్వక అగ్ని కార్యమే దీనికి శరణాగతి. యిది ఋగ్వేద నిరూపణమే. రుద్ర శక్తి యే విషు గా మారి ఆత్మ పరంగా మారి ఉప మన సమీపంలో దేహంలో మాత్రమే కలిగియున్నది. యిది తెలుసుకొనుటకు ప్రయత్నించిదాం మౌనంగానే .

Today's rhyme

east or west home is the best

take some rest

don't call any guest

enjoy your home fest

Don't have any out going zest 

this is our life saving test 

So be in your nest 

This is the entire worlds request 

****************
తెలుగు అనువాదం 
నేటి ప్రాస

తూర్పు లేదా పడమర ఇల్లు ఉత్తమమైనది, 
విశ్రాంతి తీసుకోండి
 ఏ అతిథిని మీ ఇంటి ఫెస్ట్ ఆనందించండి అని పిలవకండి. 
బయటికి వెళ్ళే అభిరుచి లేదు  
ఇది మా జీవిత పొదుపు పరీక్ష  
కాబట్టి మీ గూడులో ఉండండి 
ఇది మొత్తం ప్రపంచాల అభ్యర్థన 



గురుపూజోత్సవాలు



సెప్టెంబర్ 5 వ తేదీన గురుపూజోత్సవం. విద్యాబోధన పరమార్ధం, ఉపాధ్యాయుల కర్తవ్యం గురించి చర్విత చరణంగా ఉపన్యాసాలు వినిపిస్తాయి. జ్ఞానం, సృజన శక్తులు, ప్రతిభను మెరుగుపరచడం, ఉదాత్త భావాల్ని ప్రోది చేయడం అనే మాటలు మరోసారి వింటాం. వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆశయాలు, ఆదర్శాలు ఎన్ని వల్లించినా నిజంగా పిల్లలకు ఏమి కావాలో, విద్యా బోధనని అందమైన కార్యకలాపంగా ఎలా మార్చాలో ఎవరికైనా పెట్టిందా? ఇవాళ విద్యావ్యాసంగనికి జ్ఞాన సముపార్జన కాక ధన సంపాదన పరమావధి కావడం ఒక వాస్తవం. తన లోపలి శక్తులుని స్వచ్ఛగా, సృజనాత్మకంగా వ్యక్తీకరించటానికి పిల్లలకి అవకాశం కల్పించే బోధనా కార్యక్రమం ఒక కల. పిల్లల శారీరక, మానసిక వికాసానికి అనువుగా బోధన ఉండాలనేది కాగితాలమీద కనిపించే సదాశయం. అనేకానేక సంక్లిష్టతలతో కూడిన సమాజంలో దీనికి ఆచరణ రూపం కల్పించడం కేవలం ఉపాధ్యాయుని చేతిలో లేదు. ఒకరిద్దరి సంకల్పంతో ఇది నెరవేరదు. మన భాషలో మనం చదవాలి, చేతిలో బెత్తం లేకుండా చదువు చెప్పాలి, పిల్లలు ఆనందంగా బడికి రావాలి అనేవి కేవల నినాదాలుగా మిగిలినంత కాలం బోధనా కార్యక్రమం శిక్షణగా కాక పిల్లలకు శిక్షగానే ఉంటుంది. దీన్ని మార్చలన్న సంకల్పం అన్ని స్థాయిల్లో ఉండాలి. ఈ చిత్త శుద్ధి లేకుండా జరిపే గురుపూజోత్సవాలు మొక్కుబడి కార్యక్రమలుగా మిగులుతాయే తప్ప స్ఫూర్తిదాయకంగా నిలవవు. విద్యారంగం లోని ప్రస్తుత స్థితిగతులు మార్చలన్న సంకల్పం, నిబద్ధతతో కూడిన కృషి ప్రతీ స్థాయిలో ఉంటేనే కలలు సాకారమవుతాయి. మౌలికంగా ఈ దిశగా ఆలోచించడమే ఇవాళ సాహసం కావడం గమనార్హం.

సర్వేజనా సుఖినో భవంతు....మీ ఆకొండి రామ మూర్తి....26.07.2020....శనివారం.

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదు

చాలా కాలం క్రిందట ఒక గురువు ఆశ్రమంలో విద్య నభ్యసించడానికి ఒక విద్యార్థి వచ్చాడు. ఆశ్రమంలో విద్యార్థులందరూ తమ గురువు చెప్పిన విషయాలను ఆకళింపు చేసుకోవడంలో చురుగ్గా ఉండే వారు. కానీ ఈ కొత్తగా వచ్చిన విద్యార్థి మాత్రం వాళ్ళను అనుసరించ లేక పోతున్నాడు. వాళ్ళతో సమానంగా రాణించలేక అసహాయుడౌతున్నాడు. గురువు గారు ఇదంతా గమనిస్తున్నారు.
ఒకరోజు ఆయన ఆ శిష్యుణ్ణి పిలిచి హస్త సాముద్రికాన్ని పరిశీలించ దలచి చేయి చాపమన్నాడు. కొద్ది సేపు పరిశీలించిన మీదట శిష్యునితో “శిష్యా! నీ జాతక రీత్యా నీకు విద్యా యోగం లేదు. అంత వెతికినా నీ అరచేతిలో విద్యకు సంబంధించిన దాఖలాలు కనిపించడం లేదు కదా!” అన్నాడు. అప్పటికే నిస్పృహలో ఉన్న ఆ శిష్యుడు ఇంకా క్రుంగిపోయాడు. “నాయనా! నీవిక మీ ఇంటికి వెళ్ళి నీకు తగిన వృత్తిని అవలంభించడం ఉత్తమం” అన్నాడు గురువు.
బరువెక్కిన హృదయంతో ఇంటి బాట పట్టాడు శిష్యుడు. దారిలో మది నిండా ఆలోచనలే. కలత చెందిన మనసులో ములుకుల్లా బాధించే ఆలోచనలు తప్ప ఏముంటాయి? ఓ పక్క తల్లిదండ్రులు ఏమంటారోననే బాధ. మరో పక్క స్నేహితులు గేలి చేస్తారనే శంక. ఇరుగు పొరుగువారు తన్ని తక్కువగా చూస్తారేమే ననే సందేహం. ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉందుకు సాగిపోతున్నాడు. 
కొద్ది దూరం వెళ్ళాక దాహంగా అనిపించింది. చుట్టూ చూశాడు. ఒక గ్రామం సమీపంలో చేద బావి కనిపించింది. గ్రామస్తులు అందులోనుంచి ఒక రాతి గిలక సాయంతో నీటిని తోడుకుంటున్నారు. ఆ బావిలోని నీటితో దాహం తీర్చుకుని పక్కనే ఉన్న చెట్టు నీడన సేద తీర్చుకుందామని కూర్చున్నాడు. బావి వైపే చూస్తున్నాడు. తాడుతో ఒరిపిడి చెందడం వలన రాతి గిలక అరిగిపోయి ఉంది. శిష్యుడి మదిలో ఒక ఆలోచన మెదిలింది.
చేదగా చేదగా బలహీనమైన తాడు వల్ల ఒక రాయే అరిగిపోయింది. అలాంటిది సాధనతో నేను విద్యనార్జించలేనా? నా విద్య పూర్తి చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళ్ళను.
అని దృఢ నిశ్చయంతో ఆశ్రమానికి తిరుగుముఖం పట్టాడు. తిరిగి వచ్చిన శిష్యుణ్ణి చూసి గురువుగారు ఆశ్చర్యపోయారు. గురువు గారికి మళ్ళీ తన అరచేయి చూపించి “గురువు గారూ! మీరన్న విద్యా రేఖ ఇక్కడ ఎక్కడ ఉంటుందీ నాకు చూపించండి” అన్నాడు. తన వేలితో గుర్తులు చూపించాడు. ఇప్పుడే బయటకు వస్తానంటూ బయటకు వెళ్లాడా శిష్యుడు. దగ్గర్లో ఉన్న ఒక పదునైన రాయిని తీసుకుని గురువు గుర్తును చూపించిన చోట గీత లాగా కోసుకున్నాడు. తిరిగి గురువు దగ్గరికి వచ్చాడు. 
” గురువు గారూ! నాక్కూడా విద్యా రేఖ ఉంది. నేను ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. దయచేసి మిగతవాళ్ళతో పాటూ నాకు విద్యను బోధించండి” అని ప్రాధేయపడ్డాడు. గురువుగారికి నోట మాట రాలేదు. శిష్యుడికి విద్య పట్ల గల ఆసక్తి చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది. అతని పట్టుదలకు ముగ్దుడయ్యాడు. అతనికి కూడా విద్యనేర్పడం ప్రారంభించాడు.
అనతి కాలంలోనే ఆ విద్యార్థి మిగతా వారందరినీ మించిపోయాడు. పెద్దయ్యాక, ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన భాషగా భావిస్తున్న సంస్కృతానికి వ్యాకరణం రచించాడు. చరిత్రలో మిగిలిపోయాడు. ఆయన పేరు పాణిని. వాట్స్ ఆప్  సందేశం
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదు 

శివుడు చిన్న కృష్ణుడిని చూడటానికి గోకులం సందర్శించటం:


శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు, నంద మహారాజు ఇంట్లో, అన్ని ప్రభువుల ప్రభువు ఇప్పుడు వ్రజలో కనిపించాడని కనుగొన్నాడు. కాబట్టి శ్రీకృష్ణుడు పుట్టిన పన్నెండవ రోజున, శివుడు కృష్ణుడిని చూడటానికి గోకుల్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.


ఈ భయంకరమైన రూపాన్ని ప్రదర్శిస్తూ, అతను గోకుల్‌లోకి ప్రవేశించి, తల్లి యశోద ఇంటికి వెళ్లి, తలుపు తట్టాడు
“భిక్షాం దే హాయ్” .శయలను సందర్శించడానికి ఎల్లప్పుడూ ఉదారంగా ఉన్న యశోద, “బయట వేచి ఉండండి. నేను మీకు బహుమతి తెస్తాను. ”
శివుడు, “లేదు, లేదు, నాకు బహుమతులు వద్దు. మీ కొడుకును చూడటానికి నేను ఇక్కడకు వచ్చాను. ”
సందర్శకుల అభ్యర్థనను విన్న తల్లి యశోద, “లేదు, మీరు ఆయనను చూడటం సాధ్యం కాదు. మీరు కోరుకునే ఏదైనా, మీకు ఉండవచ్చు. మీరు ఆకలితో మరియు దుస్తులు అవసరం అని నేను చూస్తున్నాను.

శివుడు, "లేదు, లేదు, నాకు ప్రతిదీ ఉంది. దయచేసి మీ కొడుకును చూడటానికి ఒక్క సెకను మాత్రమే నన్ను అనుమతించండి" అని సమాధానం ఇచ్చారు. శివుడి విజ్ఞప్తిని విన్న తల్లి యశోద, "నేను మీకు ఇచ్చేదాన్ని తీసుకొని మీ పాముల ముందు వెళ్ళండి మరియు తేళ్లు ఇక్కడ వస్తాయి. దయచేసి నా బిడ్డ చాలా చిన్నదని మరియు మీ దుస్తులు చూసి భయపడతారని అర్థం చేసుకోండి, కాబట్టి దయచేసి వెళ్ళండి. ”శివుడు,“ నేను మీ కొడుకును చూసేవరకు నేను వెళ్ళను ”అని అన్నాడు.

అప్పుడు తల్లి యశోద, “మీకు కావలసినంత కాలం మీరు ఇక్కడ కూర్చోవచ్చు, కాని మీరు నా కొడుకును చూడలేరు.”
శివుడు, “నేను పదివేల సంవత్సరాలు ఇక్కడ కూర్చోగలను. ఒక రోజు, మీ కొడుకు పెద్దయ్యాక, మీ నియంత్రణలో లేనప్పుడు, నేను అతనిని చూస్తాను. ”
అప్పుడు తల్లి యశోద, “ఓ బాబాజీ, మీరు ఇక్కడ పదివేల సంవత్సరాలు కూర్చుంటే, నేను ఈ గేటును ఇరవై వేల సంవత్సరాలు మూసివేస్తాను. నన్ను సవాలు చేయవద్దు. నా మనోహరమైన కొడుకు నా జీవితం. ”

ఇంతలో, మంచం మీద పడుకున్న కృష్ణుడికి తలుపు బయట ఏమి జరుగుతుందో తెలుసు.
తన ఇద్దరు భక్తులు తనపై గొడవపడాలని ఆయన కోరుకున్నారు, ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ యొక్క మానసిక స్థితిలో ఉన్న భక్తులు సేవకుల మానసిక స్థితిలో ఉన్నవారి కంటే గొప్పవారని అందరికీ నిరూపించాలని ఆయన కోరుకున్నారు.

ఇద్దరికీ కృష్ణుడిపై పనికిరాని ప్రేమ ఉంది, కాని తల్లిదండ్రుల ప్రేమ యొక్క మానసిక స్థితి సేవకుల మానసిక స్థితి కంటే దగ్గరి సంబంధం. అందువల్ల, శివుడు ఈ ఘర్షణలో తల్లి యశోదకు లొంగవలసి వచ్చింది.

యశోద చేతిలో ఓడిపోయిన తరువాత, శివుడు తల్లి యశోదతో ఇలా అన్నాడు, "ఓ లేడీ, మీ కొడుకును చూడటానికి మీరే త్వరలో నన్ను పిలుస్తారు." తల్లి యశోద, “నువ్వు వెళ్ళు. నేను నిన్ను పిలవను. మీరు కోరుకున్నది మీరు తీసుకోవచ్చు, కాని నా బిడ్డను చూడమని నన్ను మళ్ళీ అడగవద్దు. ”

శివుడు అప్పుడు యశోద ఇంటి నుండి బయలుదేరాడు. అతను యమునా నది ఒడ్డుకు చేరుకున్నాడు. తన ఉత్తమ భక్తుడైన శివుడు సంతృప్తి చెందని ఇంటిని విడిచిపెట్టి, ఏడుపు మొదలుపెట్టాడు మరియు అతనిని ఎవరూ ఆపలేరని తెలుసుకున్న కృష్ణుడు.

అప్పుడు, లలిత అనే తెలివైన గోపి తల్లి యశోద వద్దకు వచ్చి ఎవరైనా ఇంటిని విడిచిపెట్టినారా అని అడిగారు.
తల్లి యశోద ఇలా అన్నారు, “అవును, ఒక మెండికాంట్ వచ్చింది, అతను కోరుకున్నది ఇవ్వాలనుకుంటున్నాను, కాని అతను నా బిడ్డను చూడాలని మాత్రమే కోరుకున్నాడు. అతను ఏమీ తీసుకోలేదు మరియు సంతృప్తి చెందలేదు. "
అప్పుడు లలిత, “ఒక సాధు ఎప్పుడూ ఒకరి ఇంటిని సంతృప్తికరంగా వదిలివేయకూడదు. ఇది మీ బిడ్డను, మనందరినీ వెంటాడే శాపం”. లలిత అప్పుడు సాధుని వెతుక్కుంటూ వెళ్లి, అతన్ని కనుగొని, ఇంటికి తిరిగి తీసుకువచ్చాడు.

ఏడుస్తున్న బేబీ కృష్ణుడిని తల్లి యశోద శివుడికి అప్పగించాడు.
శివుడు కృష్ణుడిని స్వీకరించిన వెంటనే, అతను ఏడుపు ఆపి, కళ్ళు తెరిచి, తన స్వచ్ఛమైన భక్తుడైన శివుడిని చూశాడు.
శివుడు, కృష్ణుడిని తన ఒడిలో పెట్టుకొని, “విశ్వ ప్రభువు, సుప్రీం కంట్రోలర్, మీరు తరువాత ఎలా వ్యవహరిస్తారో తెలుసుకోవడం చాలా కష్టం. వేలాది సంవత్సరాలు ధ్యానం చేయడం ద్వారా చూడలేని ప్రభువు ఇప్పుడు ఒక కౌహర్డ్ లేడీ బిడ్డగా వ్యవహరిస్తున్నాడని on హించలేము! మీ కోరిక మీకు మాత్రమే తెలుసు. మరెవరూ చేయరు. యెహోవా, నేను మీకు నా నివాళులర్పించాను. ”

ఈ మాట చెప్పిన తరువాత, శివుడు భగవంతుడి చిన్న పాదాలను తీసుకొని, అతని తలపై తాకి, గోపాల సహస్ర నామ స్తోత్రాన్ని "భగవంతుని వెయ్యి పేర్లు" అని నినాదాలు చేశాడు. ఇది చూసిన తల్లి యశోద, “బాబా (తండ్రి), మీ పాములను చూడండి. నా బిడ్డ చాలా చిన్నవాడు. ” ఇది విన్న శివుడు తల్లి యశోద భక్తి యొక్క ఆధిపత్యాన్ని గ్రహించి, కృష్ణుడు తన కొడుకుగా ఎందుకు కనిపించాడో అర్థం చేసుకున్నాడు. ఒకరు కృష్ణుడి నిజమైన భక్తుడైతే, కృష్ణుడు నిస్సందేహంగా అతనికి వ్యక్తమవుతాడు.

🕉️ ఓం నామో భగవతే వాసుదేవయ 🙏

******************

Visiting Gokulam to see Lord Shiva's little Krishna:


When Lord Shiva was meditating, in the house of Nanda Maharaja, he found that the lord of all lords had now appeared in Vraja. So on the twelfth day of Lord Krishna's birth, Lord Shiva decided to go to Gokul to see Lord Krishna.


Demonstrating this horrible look, he entered Gokul and went to his mother Yashoda's house and knocked on the door.
"Bhiksham de hi". Yashoda, who is always generous to visit the beds, said, "Wait outside. I will bring you a gift. "
Lord Shiva said, “No, no, I do not want gifts. I'm here to see your son. "
After hearing the visitors' request, mother Yashoda said, “No, you cannot see him. Whatever you want, you can have. I see that you are hungry and need clothing.

Lord Shiva replied, "No, no, I have everything. Please allow me only one second to see your son." Mother Yashoda, hearing Shiva's plea, said, "Take what I give you and go before your snakes and the scorpions will come here.  Please understand that my child is too small and afraid of your clothes, so please go." Lord Shiva said, "I will not go until I see your son." .

Then the mother Yashoda said, "You can sit here as long as you want, but you cannot see my son."
Lord Shiva said, “I can sit here for tens of thousands of years. One day, when your son grows up, when you are not in control, I will see him. "
Then mother Yashoda said, “O Babaji, if you sit here for ten thousand years, I will close this gate for twenty thousand years. Do not challenge me. My lovely son is my life. "

Meanwhile, Krishna lying on the bed knew what was going on outside the door.
He wanted his two devotees to fight over him because he wanted to prove to everyone that devotees who are in the mental state of parental love are greater than those who are in the mental state of servants.

Both have useless love for Krishna, but the state of mind of parental love is more closely related than the state of mind of the servants. Therefore, Lord Shiva had to surrender to mother Yashoda in this conflict.

After losing at the hands of Yashoda, Lord Shiva's mother said to Yashoda, "O Lady, you will soon call me to see your son." Mother Yashoda said, “You go. I will not call you. You can take what you want, but never ask me to see my baby again. "

Lord Shiva then departed from Yashoda's house. He reached the banks of the river Yamuna. His best devotee Shiva left the unsatisfied house and started crying and Krishna realized that no one could stop him.

Then, a wise Gopi mother named Lalita came to Yashoda and asked if anyone had left the house.
Mother Yashoda said, “Yes, a mendicant came, I wanted to give him what he wanted, but he only wanted to see my baby. He took nothing and was not satisfied. "
Then Lalit said, “A saint should never leave one’s house satisfactorily. This is the curse that haunts your child and all of us ”. Lalita then went in search of the saint, found him and brought him back home.

The crying baby Krishna was handed over to his mother Yashoda Shiva.
As soon as Lord Shiva received Krishna, he stopped crying, opened his eyes and saw Lord Shiva, his pure devotee.
Lord Shiva placed Krishna on his lap and said, “Lord of the universe, Supreme Controller, it is very difficult to know how you will act later. Can't imagine that the Lord who could not be seen by meditating for thousands of years is now acting like a cohort lady child! Only you, as the parent can know for sure. No one else will. Lord, I pay my respects to you. "

After saying this, Lord Shiva took the small feet of the Lord and touched His head, chanting the Gopala Sahasranama hymn "A thousand names of the Lord". Seeing this, mother Yashoda said, “Baba (father), look at your snakes. My baby is very young. On  hearing this, Lord Shiva realized the supremacy of his mother Yashoda Bhakti and understood why Krishna appeared as his son. If one is a true devotee of Krishna, Krishna will undoubtedly manifest to him.

🕉️ Om Namo Bhagavate Vasudevaya