4, సెప్టెంబర్ 2023, సోమవారం

Sanskaar

అనుభవించే యోగాలు

 *1873*

*కం*

కొందరు సిరులార్జింతురు

కొందరు సిరులనుభవించ గోరుదురు భువిన్.

ఎందరు నెంతార్జించిన

నందరికీ యనుభవములు నందవు సుజనా

*భావం*:-- ఓ సుజనా! కొంత మంది సిరులను సంపాదిస్తారు,కొందరు సిరులను అనుభవించాలని కోరుకుంటారు. ఎంత మంది ఎంత సంపాదించిననూ అందరికీ అనుభవించే యోగాలు అందవు.

*సందేశం*:-- సిరులను సంపాదించడం కన్నా వాటిని అనుభవించే యోగం పొందేవాడే సుఖపడగలడు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

⚜ శ్రీ దంతేశ్వరి ఆలయం

 🕉 మన గుడి : నెం 168

⚜ ఛత్తీస్‌గఢ్ : దంతేవాడ

⚜ శ్రీ దంతేశ్వరి ఆలయం

💠 దేవి పురాణం ప్రకారం ఈ ఆలయం భారత ఉపఖండంలోని 52 శక్తి పీఠాలలో (స్త్రీ శక్తి పీఠాలు) ఒకటిగా పరిగణించబడుతుంది. 

ఈ ఆలయం దంతేవాడ జిల్లాలో, ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ తహసీల్‌కు నైరుతి దిశలో 80 కిమీ దూరంలో, శంకిని మరియు ధంకిని అనే పవిత్ర నదుల సంగమం  వద్ద ఉంది. 

'దంతేవాడ' అనే పదం 'దంతేశ్వరి దేవి' పేరు నుండి వచ్చింది. 

💠 కాకతీయుల కాలంలో దంతేశ్వరి దేవి నెలకొని యున్న ఈ ప్రాంతం కనుక ఈ గ్రామానికి దంతెవాడ అని పేరు వచ్చింది. సాంప్రదాయకంగా ఈ దేవత బస్తర్ జిల్లా వాసులకు కులదైవం.

💠 ఈ 600 సంవత్సరాల పురాతన ఆలయంలో మా దంతేశ్వరిని

శక్తి యొక్క అవతారంగా పూజించబడే స్థానిక దేవత అని నమ్ముతారు

💠 ఇక్కడ సతీదేవి దంతం పడిపోయిందని, అందుకే దంతేశ్వరి ఆలయంగా వాడుకలోకి వచ్చిందని నమ్ముతారు. 

🔅 ఆలయ చరిత్ర 🔅

💠 ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. 

💠 తన తండ్రి దక్షుడు తనకూ, తన భర్త అయిన పరమశివునికి చేసిన అవమానాన్ని , ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో

దూకి తనను తాను ఆహుతి చేసుకుంది..

💠 విషయం తెలిసి ఆగ్రహించిన శివుడు తన ప్రమధగణాలతో మరియు తన ఆవేశ అంశతో ఉద్భవించిన వీరభద్రుడి ద్వారా యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. 

💠 దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. 

సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. 

ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. 

సతీదేవి దంతాలు పడిన ప్రాంతం కనుక ఈ పీఠంలో దేవతను " దంతేశ్వరి" అని పిలుస్తారు.

💠 ఈ ఆలయం దైవిక శక్తులను కలిగి ఉందని నమ్ముతారు. 

ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా, చుట్టుపక్కల గ్రామాలు మరియు అడవి నుండి వేలాది మంది గిరిజనులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడకు తరలివస్తారు

💠 దంతెవాడ గ్రామం జగదల్‌పూర్ కు నైఋతి భాగంలో ఉంది. ఈ ప్రాంతంలో శంకిని, ఢాకిని అనే పుణ్య నదులు ఉన్నాయి. ఈ రెండు నదులు వివిధ రంగులతో ఉంటాయి.

600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం భారత దేశంలో ప్రాచీన చారిత్రిక స్థలాలలో ఒకటి.

💠 దంతేశ్వరి ఆలయం 13వ మరియు 14వ శతాబ్దానికి మధ్య ఉన్నట్లు నమ్ముతారు. బస్తర్ మొదటి కాకతీయ రాజు అన్నందేవ్ వరంగల్ (ఆంధ్రప్రదేశ్) నుండి ఇక్కడికి వచ్చాడని చెబుతారు.  చివరి కాకతీయ రాజు  ప్రతాపరుద్రు 2 సోదరుడైన అన్నమరాజు, తన మేనల్లుడును బస్టర్ రాష్ట్రానికి తదుపరి రాజుగా చేసి, దట్టమైన అడవికి, వంశదేవతతో 'దండకారణ్య'కి వెళ్లి, దంతెవాడలోని ఒక ఆలయంలో అమ్మవారిని ప్రతిష్టించాడు. 

💠 ఈ ఆలయాన్ని దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించారు.  

అమ్మవారి విగ్రహం మెరిసే నల్లరాతితో చెక్కబడి ఉంటుంది.  

ఈ ఆలయంలో నాలుగు భాగాలు ఉన్నాయి. గర్భ గృహం, 

మహా మండపం, 

ముఖ్య మండపం మరియు సభా మండపం. 

గర్భ గృహం మరియు మహా మండపం పూర్తిగా రాతితో నిర్మించబడ్డాయి.  

ఆలయ ప్రవేశ ద్వారం ముందు గరుడ స్థంభం ఉంది.  

💠 బస్తర్‌ దసరా వేడుకలకు 500 వందల సంవత్సరాల చరిత్ర ఉంది. 

మహారాజ పురుషోత్తం దేవ్‌ పరిపాలన కాలంలో ఈ వేడుకలు ప్రారంభమైనట్లు చెబుతారు.

కాకతీయులే ఇక్కడ దంతేశ్వరీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు కూడా కథనాలు వాడుకలో ఉన్నాయి. 

💠 ఇక్కడ జరిగే 90 రోజుల వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది చివరి పదిరోజుల గురించి. 

ఆ పది రోజుల కాలంలో రాజు అధికారికంగా ప్రధానపూజారిగా మారుతాడు. 

రాజరికాన్ని వదిలి పూర్తిగా దంతేశ్వరీ పూజలోనే గడుపుతాడు. పూజల సమయంలో రాజు ఉపవాస దీక్షను పాటిస్తాడు.

💠 ప్రతీ సంవత్సరం దసరా సందర్భంగా వేలాది గిరిజనులు వివిధ గ్రామాలు, అడవుల నుండి ఇచ్చటికి చేరి ఈ దేవతా విగ్రహాన్ని బయటకు తీసి పట్టణం చుట్టూ ఊరేగిస్తారు.

 ప్రస్తుతం "బస్తర్ దసరా" పండగ అనేది ప్రాముఖ్యత గల పర్యాటకుల ఆకర్షణగా నిలిచింది. నవరాత్రి సందర్భంగా జ్యోతికలశాన్ని వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం.

💠 ఇది చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్ తెహసీల్ నుండి 80 కి.మీ దూరంలో గల దంతెవాడ వద్ద ఉంది.

దంతెవాడ లో రైల్వే స్టేషన్ ఉన్నది.

Shiva

సప్త జ్ఞాన భూమికలు*

 _*సూర్యుడి నుండి వచ్చే* *ఏడు*_ 

_*కిరణాలు సప్త జ్ఞాన భూమికలు*_ 

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

*జ్ఞానం* 

జ్ఞానంలో ఏడు స్థితులున్నాయి. వీటినే సప్త జ్ఞాన భూమికలు అంటాం. 

(1) శుభేచ్ఛ (2) విచారణ (3) తనుమానసం (4) సత్త్వాపత్తి (5) అసంసక్తి (6) పదార్ధభావని (7) తురీయం 

అన్నవే సప్త జ్ఞాన భూమికలు.

 *శుభేచ్ఛ:* నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ; నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి అన్న తీవ్ర ఆకాంక్ష.

 *విచారణ* : బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి? అన్న మీమాంస; *బ్రహ్మజ్ఞాన* ప్రాప్తి విధానమే – ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకోవడం.

 *తనుమానసం* : ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. అంటే, ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే *తనుమానసం* .

*సత్త్వాపత్తి* : శుద్ధసాత్త్వికం సాధించడమే సత్త్వాపత్తి, అంటే తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. ఇక మిగిలింది శుద్ధ సాత్త్వికమే. 

 *తమోగుణం* అంటే సోమరితనం, 

     *రజోగుణం* అంటే నాకు తెలుసు అనే అధికార దర్పం. 

ఈ నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్రస్థాయి నందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీమండలం పూర్తిగా శుద్ధమైన స్థితి; మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి; అదే యోగి అయిన స్థితి. అహం బ్రహ్మాస్మి అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. బ్రహ్మవిదుడు అయిన స్థితి.

 *అసంసక్తి* : దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న స్థితి. తనువు, మరి సంసారం, రెండూ తాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెంటి మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే అసంసక్తి. దీన్నే పద్మపత్రమివాంభసా అన్నాడు కృష్ణుడు గీతలో. అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి వున్నా, ధర్మ-నిష్టుడు, మరి కర్మ – నిష్టుడు; తనువు పట్లా, మరి సంసారం పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక, సత్యద్రష్ట కాబోతున్నాడు కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ నిలిపినివాడు. ఇదే అసంసక్తి. ఇతనినే బ్రహ్మవిద్వరుడు అంటాం.

 *పదార్ధభావని* : అంటే దివ్య చక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నవాడు. ప్రతి పదం యొక్క అర్ధంలో, ప్రతి వస్తువు యొక్క భావంలో ప్రత్యక్షంగా నివసిస్తున్న వాడు. అంటే బ్రహ్మవిద్వరీయుడు అయిన స్థితి. ఇదే సిద్ధస్థితి; ఇదే సవికల్ప సమాధిస్థితి కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా కొద్దిగా, సంశయాలు వున్న స్థితి.

 *తురీయం* : ఇది మానవుని యొక్క పూర్ణవికాసస్థితి, సిద్ధుడు బుద్ధుడు అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధులుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం కట్టుకొని, తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై వున్నవాళ్ళనే *బుద్ధుడు* అంటాం. ఇదే *సహస్రదళకమలం* .

ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచినప్పుడల్లా *సహస్రదళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది.* ఇతనినే బ్రహ్మ విద్వరిష్టుడు అంటాం.

*తురీయం* అంటే సర్వ సామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. తురీయ అంటే మూడింటినీ దాటిన అని అర్థం; అంటే నిర్వికల్పసమాధి స్థితి కి చేరుకున్న స్థితి. సమాధి అంటే సమాధానాలు తెలుసుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏ సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి.

🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺🌺🌺🌺🌺

Panchang

సంపాదించిన సొమ్ము

 "1. తాను సంపాదించిన సొమ్ము ఉత్తమమైంది".

"2. తండ్రినుంచి సంక్రమించిన సొమ్ము మధ్యమం".

"3. సోదరుడినుంచి వచ్చినది అధమం."

"4. ఇక, స్త్రీవల్ల పొందినది అధమాధమమనిశాస్త్రవచనం."

"5. విజ్ఞులు పరుల సొమ్ముకు ఆశ పడకూడదు."

"6.సంపాదించేటప్పుడు మేరు పర్వతమంత సంపాదించాలి. దానం చేసేటప్పుడు ఆ ధనాన్ని గడ్డిపరకగా చూడాలని పెద్దలు చెబుతారు."

"7.ధనానికి దానం, భోగం, నాశనం అనే మూడు గతులు ఉన్నాయి."

"8. తాను అనుభవించక, ఒకరికి పెట్టక పోగుపెట్టే ధనానికి నాశనం తప్పదు."

"9. ధర్మం, అగ్ని, రాజు, దొంగ ఈ నలుగురూ ధనానికి దాయాదులు."

"10. వీరిలో జ్యేష్ఠుని అంటే ధర్మాన్ని అవమానిస్తే మిగిలిన ముగ్గురూ కోపిస్తారు.

సూర్య నమస్కారాలు

 సూర్య నమస్కారాలు ................!!

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి.

ఆసనానికో ప్రయోజనం :-

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఒకటి నుంచి ఐదు... ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం...

ఒకటి, పన్నెండు :- శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.

రెండు, పదకొండు :- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.

మూడు, పది :- రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.

నాలుగు, తొమ్మిది :- వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.

ఐదు, ఎనిమిది: గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఆరో ఆసనం :- మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఏడో ఆసనం :- జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.

మరెన్నో లాభాలు :-

సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు... మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. "సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.

ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది'' అని ఆనంద బాలయోగి వివరించారు. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు... సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.

1.నమస్కారాసనం ( ఓం మిత్రాయ నమ ):-

సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.

2.హస్త ఉత్తానాసనం ( ఓం రవయే నమః) :-

కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.

3.పాదహస్తాసనం ( ఓం సూర్యాయ నమః) :-

శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.

4.ఆంజనేయాసనం ( ఓం భానవే నమ ) :-

ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.

5.పర్వతాసనం ( ఓం ఖగాయ నమః) :-

కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

6.సాష్టాంగ నమస్కారం ( ఓం పూష్ణే నమః) :-

ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి 'అష్టాంగ నమస్కారం' అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం - ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.

7.సర్పాసనం ( ఓం హిరణ్యగర్భాయ నమః ) :-

శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.

8.పర్వతాసనం ( ఓం మరీచయే నమః) :-

ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

9.ఆంజనేయాసనం ( ఓం ఆదిత్యాయ నమః) :-

నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి

10.పాదహస్తాసనం ( ఓం సవిత్రే నమః) :-

మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.

11.హస్త ఉత్తానాసనం ( ఓం అర్కాయ నమః) :-

రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.

12.నమస్కారాసనం ( ఓం భాస్కరాయ నమః) :-

నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి.

బసవ పురాణం ౼ 22 వ భాగము...!!

 🎻🌹🙏బసవ పురాణం ౼

22 వ భాగము...!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌸అది విని కల్యాణ కటక ప్రజలందరూ గజ గజ వణికిపోయారు. మిగిలిన భక్తులంతా తలొక దిక్కుకూ చెదిరిపోయారు. బిజ్జలుని తర్వాత పట్టం కోసం వారసులు తమలో తాము కలహించుకొని నశించారు. 

🌿గుర్రాల తోకల వెంట నిప్పులు రాలాయి. ఏనుగులూ ఏనుగులూ కొట్టుకొని చచ్చాయి. ఎవరో శత్రువులొచ్చారని భ్రమపడి బిజ్జలుని మంత్రులూ సైన్యమూ తమలో తామే కొట్టుకొని మరణించారు. 

🌸ఈ విధంగా బసవని శాపం సత్యమయిందా అన్నట్లు కల్యాణ నగరం పాడుబడ్డదిబసవన్న ఈ వార్తలన్నీ విన్నాడు. కూడల సంగమేశ్వరానికి చేరుకున్నాడు. 

🌿అక్కడ తన గురువు సంగమ దేవుణ్ణి చూచాడు. తండ్రీ నీ యాజ్ఞతో భూమి మీదికి వచ్చి చేయవలసిన పనులన్నీ చేశాను. ఇంక నన్ను నీలోనే విశ్రాంతి తీసుకోని అని ప్రార్థించాడు. 

🌸సంగమ దేవుడు బసవణ్ణి దీవించి తన ప్రసాదం తినిపించి కొడుకును కౌగిలించుకున్నాడు. ఇరువురూ గర్భగుడిలోకి పోయారు. అంతే సంగమదేవుడూ కన్పడలేదు. 

🌿బసవన్నా కన్పడలేదు. ఇద్దరూ లింగంలో అదృశ్యమైనారు.ఆ క్షణమే దివి నుండి పూల వానలు కురిశాయి. భక్తులంతా జయజయధ్వానాలు చేశారు. గాలి నుండి సుడిగాలి పుట్టి మళ్లీ గాలి లోపలే కలిసిపోతుంది. 

🌸అలలు సముద్రంలో నుండే పుట్టి తిరిగి సముద్రంలోనే కలిసిపోతాయి. మెరుపుతీగ గగనంలో పుట్టి తిరిగి గగనంలోనే సమసిపోతుంది. 

🌸నీరు మేఘాలుగా మారి వర్షమై, వర్షం మళ్లీ సముద్రపు నీటిలోనే కలిసిపోతుంది. అలాగే బసవయ్యా భక్తజనోద్ధరణ కోసం నీవు సంగమేశ్వరుని నుండి వచ్చి తిరిగి ఆయనలోనే కలిశావు.

🌿పూవూ, తావీ విడదీయరానట్లు నీవూ, శివుడూ ఒక్కటే అని మాదిరాజయ్య, మాచిదేవుడు మొదలైన సమస్త భక్తులూ బసవణ్ణి స్తుతించారు. 

🌸బసవన్న ప్రసాదించిన సద్భక్తి భావంతో వారంతా తన్మయులై శివానంద సాగరంలో ఓలలాడారుప్రథమాధ్యాయము సమాప్తము

🌷ద్వితీయాధ్యాయము

🌿ముగ్ధ సంగయ్య కథకల్యాణ కటకంలో ముగ్ధ సంగయ్య అనే భక్తుడున్నాడు. అతడు ప్రపంచ జ్ఞానం లేని అమాయకుడు. 

🌸కొంత మంది వేశ్యల ఇంటికి పోతుంటే చూచి అది కూడా రాత్రి చేసే శివపూజలో ఒక భాగమనుకొని తానూ వేశ్య ఇంటికి పోతానని చెప్పాడు బసవన్నకు. 

🌿బసవన్న చిరునవ్వు నవ్వి ముగ్ధ సంగనికి సర్వాలంకారాలు చేయించి పంపాడు. సంగడు ఒక వేశ్య ఇంటికి పోయాడు. ఆమె సంగణ్ణి ఆదరంతో ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులిచ్చింది. 

🌸ముగ్ధ సంగడు జీవితంలో ఎన్నడూ వేశ్యలను చూచి ఎరుగడు. అందుకని ఆమెను చూచి ‘విభూతి పూసుకో శివ పూజ మొదలుపెడదాము’ అన్నాడు- ఆమె ఎవరో యోగినిగా భావించిమేము పచ్చ విభూతి పూస్తాము.

🌿ఇది మా సంప్రదాయం అని పసుపును చూపించిందామె నవ్విరుద్రాక్షల దండ ఏదీ? అని అడిగాడు ముగ్ధ సంగయ్య. మేము పాల సముద్రంలో పుట్టిన తెల్ల రుద్రాక్షలు వాడుతాము అని తన ముత్యాల దండ చూపింది.

🌸యోగీశ్వరీ! నీ జటాజూటమేదీ?’ అన్నాడు సంగయ్య.సగం శివ పూజా ప్రసాద కుసుమాల కోసం ఉంచి మిగిలిన సగమూ జడలుగా అల్లాను అని తన వాలుజడలను చూపింది 

🌿వేశ్య!కచ్చడం కట్టావా?అని అడిగాడు సంగయ్య.కచ్చడమేమిటి? ఇదుగో సర్వాంగ కచ్చడం అని తన చీరె చూపింది వేశ్య!మీసంప్రదాయమేమిటి? మీ గురువెవరు?’ అని ప్రశ్నించాడు సంగయ్య.

🌸మాది గౌరీ సంప్రదాయం. శివుడు తపస్సు చేసేటప్పుడుహిమాలయాలలో పార్వతి శివుణ్ణి గెల్చిందే ఆమె సంప్రదాయమిది. శక్తి స్వరూపిణి అయిన జగదేక సుందరి మాకు గురువు అని చెప్పింది వేశ్య.

🌿ముగ్ధ సంగడు ఇదంతా నిజమేనని నమ్మాడు. ఆమె పడక గది పూజా మందిరమనుకున్నాడు.హంసతూలికాతల్పం, శివ సింహాసనమని భావించాడు. 

🌸అక్కడి నృత్య, వాద్య, కేళికలన్నీ పూజాక్రమం కాబోలుననుకున్నాడు. మరునాడు వచ్చి అందరికీ ‘రాత్రి నేనొక వింత యోగినిని చూచాను. అలాంటి యోగిని ఎక్కడా లేదు

🌿అని చెప్పగా విని అంతా నవ్వి ముగ్ధ సంగయ్యను ఆటలు పట్టించారు.

రుద్ర పశుపతి కథపూర్వం రుద్ర పశుపతి అనే ముగ్ధ భక్తుడొకడు ఉండేవాడు. 

🌿ఒకనాడు ఆయన ఆదిపురాణం వింటున్నాడు. పౌరాణికుడు క్షీర సాగర మథన కధ చెపుతూ శివుని హలాహల భక్షణ వృత్తాంతం చెప్పాడు. రుద్ర పశుపతి అది విన్నాడు. 

🌸విని ఏమిటి శివుడు విషం తిన్నాడా?’ అని నిలుచున్న పాటనే నేలపై పడి ఏడ్వసాగాడు. ‘విస్వెశ్వరా! నిన్ను దేవ దానవులు ఇర్వురూ కలిసి వెఱ్ఱివాణ్ణి చేశారు. 

🌿లేకుంటే ఎవరైనా విషం తాగుతారా? అయ్యో ఇంక నాకు దిక్కెవరు? గౌరవమ్మా! సగం దేహమై వున్నా నీవైనా చెప్పలేకపోయావా? ప్రమథులారా! వీరభద్రుడా! ఏం చేస్తున్నారు మీరంతా?..

( సశేషం )..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం భాగం 9/12

ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 

                     భాగం 9/12 

(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)

                ----------------------- 

          8. జీవశాస్త్రం 

 ఆధునికత 

    సృష్టి పుట్టి సుమారు 200కోట్ల సంవత్సరాలైందనీ,

    జీవ పరిణామ క్రమంలో కోతి నుండి మానవుడు వచ్చాడనీ డార్విన్ వంటి శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు మనకీ విదితమే. 

    అవన్నీ మానవ పరిశోధనతో, మానవుడే ధ్రువపరచుకున్నవి. 

    ఆ శాస్త్రవేత్తలేగానీ, మరి ఏ ఇతరులు గానీ, మరికొన్ని పరిశోధనలతో ఈ విషయాలని కూడా ఖండించే అవకాశం లేకపోలేదు. 

రామాయణం 

    సృష్టి - పుట్టుక, మార్పిడిలకి సంబంధించి శ్రీమద్రామాయణం చక్కని వివరణలని విశ్లేషాత్మకంగా బోధిస్తుంది. 

    జటాయువు శ్రీరామునితో చెప్పిన సృష్టి విషయాలు, పైన చెప్పిన విధంగా కాక, ఎప్పటికీ సత్యంగా కనిపిస్తాయి. 

జటాయువు తెలిపిన సృష్టి వివరాలు 

    ప్రజాపతులలో చివరివాడైన కశ్యపుడు - 

    దక్ష ప్రజాపతి యొక్క అరవదిమంది కుమార్తెలలో 

      అదితి, 

      దితి, 

      దనువు, 

      కాళిక, 

      తామ్ర, 

      క్రోధవశ, 

      మనువు, 

      అనల అనే ఎనిమిది మందిని వివాహమాడాడు. అందులో 

1. అదితికి 

  - ద్వాదశాదిత్యులు, 

  - అష్టవసువులు, 

  - ఏకాదశ రుద్రులు, 

  - ఇరువురు అశ్వినీ దేవతలు 

    మొత్తం ముప్పది ముగ్గురు దేవతలు జన్మిస్తారు. 

2. దితికి దైత్యులూ, 

3. దనువుకు అశ్వగ్రీవుడూ, 

4. కాళికకు నరకుడూ, కాలకుడూ జన్మించారు. 

5. తామ్రకు - క్రౌంచి, 

                    భాసి, 

                    శ్యేని, 

                    ధృతరాష్ట్రి, 

                    శుకి అనే ఐదు పక్షి కుమార్తెలకు జన్మనిస్తుంది. 

    ఆ ఐదుగురిలో, 

క్రౌంచి - గుడ్లగూబలనూ, 

భాసి - నీటికాకులనూ, 

శ్యేనీ - డేగలనీ గ్రద్దలనీ, 

ధృతరాష్ట్రి - హంసలనీ కలహంసలనీ, 

శుకి - నతనీ, 

నత - వినతనీ, 

వినత - గరుడుణ్ణీ కన్నారు. 

6.క్రోధవశ - మృగి, 

                 మృగమంద, 

                 హరి, 

                 భద్రమద, 

                 మాతంగి, 

                 శార్దూలి, 

                 శ్వేత, 

                 సురభి, 

                 సురస, 

                 కద్రువ అనే పదిమందికి జన్మనిచ్చింది. 

    అందులో 

అ) మృగి - మృగాలనీ, 

ఆ) మృగమంద - ఎలుగుబంట్లనీ, సృమరాలనీ, 

ఇ) హరి - సింహాలనీ వానరాలనీ, 

ఈ) భద్రమద - ఇరావతినీ, 

      ఇరావతి - ఐరావతాన్నీ, 

ఉ) మాతంగి - ఏనుగులనీ, 

ఊ) శార్దూలి - కొండముచ్చులనీ, పెద్దపులులనీ, .. 

ఋ) శ్వేత - దిగ్గజాలనీ

ౠ) సురభి - రోహిణినీ, గంధర్వినీ, 

         రోహిణి - గోవులనీ,

         గంధర్వి - అశ్వాలనీ, 

ఌ) సురస - నాగులనీ, 

ౡ) కద్రువ - ఆదిశేషునీ సర్పాలనీ అందించాయి. 

7. మనువు యందు కలిగినవారే మానవులు. 

8. అనల యొక్క సంతానము మధుర ఫలములతో కూడిన వృక్షములు మొదలైనవి. 

    ప్రధాన జాతులకు సంబంధించి సృష్టి విశ్లేషణ మానవ మేధస్సుకు అందనంతగా శ్రీమద్రామాయణం తెలుపుతుంది. 

జంతువులు - గుణాలు 

    సీతకై వెతుకుతున్న శ్రీరాముడు, 

  - లేడినీ, 

  - పులినీ, 

  - ఏనుగునూ పిలుస్తూ సీతజాడ అడుగుతాడు. 

    వాటి లక్షణాల గూర్చి ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, 

    జంతువులలో ప్రధానమైన సత్త్వరజస్తమోగుణాలు మూడిటికీ చిహ్నాలుగా విశ్లేషణలో తెలుస్తుంది. 

వృక్ష శాస్త్రం 

    శ్రీరాముడు సీత తప్పిపోయినపుడు వెతుకుతూ, వివిధ వృక్షాలను సంబోధిస్తూ అడుగుతాడు.    

    కడిమి, మారేడు, తెల్లమద్ది, ఏఱుమద్ది, ఎర్రగోరింట, అశోక, తాళ, నేరేడు, గన్నేరు వంటి చెట్లనూ, 

    మల్లె, మాధవీలత, మొగలివంటి పొదలనూ కూడా సీత జాడగూర్చి ప్రశ్నించాడు. 

    వీటన్నిటికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. 

ఉదా॥ 1. ఏఱుమద్ది వృక్షం పుష్పాలు లేకుండానే ఫలిస్తుంది. 

           2.అశోక వృక్షం శోకాలను తొలగించేదని పేర్కొంటాడు శ్రీరాముడు. 

    దీని ద్వారా పొదలూ వృక్షాలద్వారా, 

    వాటి ప్రత్యేకతలూ, 

    వాటిద్వారా పొందే 

  - మానసిక ఆనందాన్నీ, 

  - శారీరక శక్తులనీ సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది. 

    జంతుజాలం పుట్టుక, జంతువుల ప్రధాన లక్షణాలు,

    వృక్షజాతులవల్ల పొందే సుఖసంతోషాల వంటి ప్రధాన విషయాల ద్వారా 

    శ్రీమద్వాల్మీకి రామాయణంలోని ఈ విధమైన ఆదర్శ జీవశాస్త్రం మనలని అబ్బురపరుస్తుంది.

                    =x=x=x= 

    — రామాయణం శర్మ 

              భద్రాచలం

Amarnadh

Pempakam

Photo

Champion

D

రాశి ఫలాలు🌹సోమవారం, సెప్టెంబర్ 04, 2023

 .       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*

*సోమవారం, సెప్టెంబర్ 04, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం*

*తిధి*      : *పంచమి రా9.54* వరకు  

.                *🌹రాశి ఫలాలు🌹* 

*మేషం*

పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. గృహమున సొంత ఆలోచనలు  అమలు చేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

---------------------------------------

*వృషభం*

బంధువులతో అకారణ మాట పట్టింపులు ఉంటాయి. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

---------------------------------------

*మిధునం*

బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.  వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

---------------------------------------

*కర్కాటకం*

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా  మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి.  వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

---------------------------------------

*సింహం*

ఇంటా బయట  బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో అవరోధాలు తప్పవు. కుటుంబసభ్యులతో ఊహించని  వివాదాలు నెలకొంటాయి.  వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలు పని ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------

*కన్య*

ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. వ్యాపారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.  సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది. 

---------------------------------------

*తుల*

సన్నిహితుల నుండి  సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు అందుకుంటారు.  సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.  విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

*వృశ్చికం*

భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు.  బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించినట్టు అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------

*ధనస్సు*

 స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.  వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితుల మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి సమస్యలు తప్పవు.

---------------------------------------

*మకరం*

చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

*కుంభం*

భూవివాదాల పరిష్కారమౌతాయి. వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంకాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

*మీనం*

 చేపట్టిన పనుల్లో  ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థుల విదేశీ యత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.  వ్యాపారమున భాగస్థుల తో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻

🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

శ్రీ శివ మంగళాష్టకమ్

 *శివ మంగళాష్టకమ్* 

భవాయ చంద్ర చూడాయ నిర్గుణాయ గుణాత్మనే | 

కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ || 

వృషారూఢాయ భీమాయ వ్యాఘ్ర చర్మాంబరాయ చ | 

పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ ||

భస్మోద్ధూళిత దేహాయ వ్యాళ యజ్ఞోపవీతినే | 

రుద్రాక్షమాలా భూషాయ వ్యోమకేశాయ మంగళమ్ || 

సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే | 

సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ ||

మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంత కారిణే | 

త్ర్యంబకాయ చ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ ||

గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే | 

ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ ||

సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞాన ప్రదాయినే | 

ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళమ్ ||

సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ | 

అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ ||

శ్రీ చాముండాప్రేరితేన రచితం మంగళాస్పదం తస్యాభీష్ఠ ప్రదం 

శంభో యఃపఠేన్మంగళాష్టకమ్ | 

సర్వార్థసిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతఃపరమ్ ||

*ఇతి శ్రీ శివ మంగళాష్టకమ్ సంపూర్ణమ్*

🙏

మన మతం

 మన మతం అనగానే అదేదో మతం  అని మన మిత్రులు అనుకుంటున్నారు.  అందుకే మన మతం గూర్చి వివరిస్తున్నాను. 

నియమాలు  మన మతానికి ఈ క్రింది నియమాలు వున్నాయి. 
1)దైవ  అభేద త్వం: అంటే మనం అందరం శివ, కేశవ అబేధంగా వర్తించడం అని అర్థం.  అనగా శివునిపై ఇష్టం ఉన్నవారు శివుని, అలాగే విష్ణువుపై ఇష్టం ఉన్నవారు విష్ణువును ఆరాధించవచ్చు, కానీ శివుని ఆరాధించే వారు విష్ణువును అలాగే విష్ణువును ఆరాధించేవారు శివుని యెడల అబేధంగా అంటే వేరుగా చూడకుండా ఉండటం.  నిజానికి భాగవతుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన ఆ పరబ్రహ్మ తత్వాన్ని చేరుకోవటానికి ప్రాధమిక మార్గంగా సగుణోపాసన కాబట్టి ఏ రూపంలో కొలిచినా మన అంతిమ లక్ష్యం నిర్గుణ బ్రహ్మను చేరుకోవడమే
2)  ప్రాతఃకాలంలో నిద్రలేవటం: విధిగా ప్రతివారు సూర్యోదయానికి ముందే నిద్ర లేవ వలెను. కాలకృత్యాలను ముగించుకొని తిలక ధారణ చేసి ఇష్టదైవాన్ని అర్చించటం. నిత్యం ఇంట్లో దూప, దీప, నైవేద్యాదులు భగవంతునికి అర్పింపవలెను. 
3)  ఇంట్లో పిల్లలుకూడా వారి వాయిస్తాయిని పట్టి తప్పకుండ నిత్యం భగవదారాధనలో పాలు పంచుకునే విధంగా తర్ఫీదు ఇవ్వటం. 
4)  మానవ అభేదత్వం: సర్వ మానవులు ఆ పరమేశ్వరుని స్వరూపంగా భావించి అందరిని నిన్ను నీవు చూసుకునే విధంగా చూసుకోవటం. 
5)  స్త్రీ, పురుష అభేదత్వం : మీకు ఎదురుగా వున్నది స్త్రీ అయినా పురుషుడు అయినా ఇద్దరినీ సమ భావంతో చూడటం. ఇది సాధకులు అలవరచుకోవలసిన ఒక ముఖ్య లక్షణం.  ఎప్పుడైతే నీవు న్త్రీ పురుష అభేదత్వన్ని ఆచరిస్తావో అప్పుడు అందరిలో భగవంతుని చూడగలవు. 
6)  నమస్కరించటం: కనపడిన ప్రతివారినీ రెండు చేతులు జోడించి నమస్కరించటం. ఇది కొంత ప్రయత్నంతో సాధించవచ్చు. చిన్నవారిని నమస్కరించటం ఏమిటి అని అనుకుంటారు.  నిజానికి ఈ జగత్తులో చిన్నవారు, పెద్దవారు అని లేనే లేదు. ఈ భూమిమీద రావటంలో మనకు చిన్నా పెద్ద అనే తేడా కనిపిస్తుంది.  కానీ నిజానికి ప్రతి మనిషిలోని పరమాత్మకు వయస్సుతో సంబంధం లేదు.  అతడు చిరంజీవి అనంతుడు. సర్వజ్న్యుడు 
7)   వినయశీలత: ప్రతివారితోటి వినయంగా ప్రవర్తించవలెను. నాకు అన్నీ తెలుసు అనే భావనను పూర్తిగా విడనాడవలెను. ఎందుకంటె నీకు నీవు ఏది తెలుసు అని అనుకుంటున్నావో అంతకంటే ఎక్కువగా తెలిసినవారు అనేకులు నీ ప్రక్కన ఉండి వుంటారు.  ఈ జగత్తులో సర్వము తెలిసినవాడు కేవలం ఈశ్వరుడు ఒక్కడే.  ఈ నిజం మనకు సదా స్పృహలో ఉండాలి. 
8)  నిగర్వంగా ఉండటం: నేను ఐశ్వర్యపరుడను ఈ భూమి మీద దేనినయినా కొనగలను అనే ఆలోచన అస్సలు ఉండరాదు.  నీవు ధనవంతుడవు అయితే నీ ధనంతో పలువురికి ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టు. ఈ జగత్తులోని ఐశ్వర్యం పూర్తిగా ఆ ఈశ్వరునిదే అయి వున్నది.  నేను నాది అని అనుకునేది కేవలం నేను కొద్దీ కాలం అనియూభావించటానికి మాత్రమే కానీ నేను దేనికి యజమానిని కాను అనే సత్యం తెలుసుకొని వర్తించాలి. 
9)  బంధాలు: మనము సామాన్యంగా వివాహం వలన, పుట్టుక వలన బంధాలను ఏర్పరచుకొని వాటి చుట్టూ గిరిగీసుకొని ప్రవర్తిస్తుంటాము.  కానీ నిజానికి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఆ పార్వతి పరమేశ్వరులు మాత్రమే జగత్ మాత జగత్ పిత అంటే అందరికి తల్లిదండ్రులు వారే కానీ వేరొకరు కాదు. ఎదుకంటే మనలో నిక్షిప్తంగా వున్న నేను అనబడే ఆ చెతన్యస్వరూపుడు వారి సంతానం మాత్రమే కాబట్టి ఈ జగత్తులో వున్న సర్వ జీవరాశి కూడా నాకు సోదర సోదరీమణులు అనే భావం కలిగి ఉండాలి. 
ఆచరించవలసినవి: 
ఈ నియమాలు కొంత కఠినంగా ఉంటాయి కానీ అసాధ్యం మాత్రము కాదు. 
దేహవ్యామోహం: దేహవ్యామోహం తగ్గించుకోవాలి అందుకు ఏమి చేయాలి అంటే నేను దేహాన్ని కాదు దేహిని మాత్రం అనే భావం కలిగి శరీరాన్ని కేవలము మోక్ష సాధనకు పనికి వచ్చు ఉపకరణంగా మాత్రం భావించి శరీర వ్యాపారాలు చేయాలి. ఏవిధంగా అయితే ఒక పనిమంతుడు తన పనికి పనికి వచ్చు పరికరాలు చేసుకుంటాడో అలాగే.  శరీరాన్ని పరిశుభ్రంగా చూసుకోవాలి కానీ శరీరాన్ని అందంగా ఉండాలని అనుకోకూడదు, అంటే వివిధ లేపనాలు పూసుకోవటం, కేశాలను అలంకరించుకోవడం మొదలైనవి. 
వస్త్రధారణ: వస్త్రాలు కేవలం శరీరానికి ఆశ్చాదనగా మాత్రం స్వీకరించాలి. అందమైన అలంకరణలు, ఖరీదైన వస్త్రాలు, వస్తువులు పొంది ఉంటే మనస్సు వాటితో అనుబంధం ఏర్పరచుకొని మనస్సు భగవంతుని నుంచి దూరంగా వెడలుతుంది.  నన్ను ఏది కట్టి పడవేయదు అని భావిస్తే ఏవి వున్నా అవి నిన్ను ఏమి చేయలేవు. 
ఈ మతాన్ని నిర్దేశించిన గురుదేవులు ఎవరు అంటే ఇంకా ఎవరు శ్రీ ఆది శంకర భగవతపాదులు.  వారిని అనుసరిద్దాము.  వారు  ఏర్పాటు చేసిన మార్గమే మనకు సర్వదా శిరోధార్యం.  
ఓం శాంతి శాంతి శాంతిహి 
ఇట్లు 
మీ 
మీ భార్గవ శర్మ  

పండితులు కానివారు

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 

 𝕝𝕝శ్లోకం𝕝𝕝 

*ప్రమాణమప్రమాణవై* 

*యః కుర్యాదబుధో జనః౹*

*న స ప్రమాణతామర్హః* 

*వివాదజననో హిసః౹౹*

𝕝𝕝తా𝕝𝕝

పండితులు కానివారు ప్రమాణాన్ని ప్రమాణం కాదని వాదిస్తాడు. అతని వాదం ప్రమాణం కాదు. అని వివాదాలు కల్పించడమే వారి ఉద్దేశ్యం.

నవగ్రహా పురాణం🪐* . *16వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *16వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*పురాణ పఠనం ప్రారంభం*

*సూర్యగ్రహ జననం - 7*

కశ్యప ప్రజాపతి అధ్యాపనంలో సూర్యుడి విద్యార్జన ప్రారంభమైంది. వేదాలూ , వేదాంగాలూ , తర్క , వ్యాకరణ , ధర్మ , మీమాంస , జ్యోతిష , వైద్య శాస్త్రాలూ అచిరకాలంలో సూర్యుడి మేధస్సులో కాపురం చేయసాగాయి. విద్యా బలంతో , సహజ కాంతివంతమైన సూర్యుడి ముఖ మండలంలో నూతన వర్చస్సు తాండవం చేయసాగింది.

సకల చరాచర ప్రాణుల పట్లా చిన్నతనం నుంచే సూర్యుడు ప్రకటించే 'సమత' అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. విద్యనూ , వినయాన్నీ పుణికి పుచ్చుకున్న సూర్యుడు బాల్యావస్థను దాటి యవ్వనంలోకి అడుగుపెట్టాడు. చూపుల్ని సూదంటు రాయిలా లాగిపట్టే శరీరకాంతి , సౌష్టవంతో నిండిన నిలువెత్తు విగ్రహం , అందమైన ముఖంలో చెరగని చిరునవ్వు , ప్రత్యూష సౌందర్య పరాకాష్ఠలా ఉన్నాడు సూర్యుడు.

అదితి ఆశ్రమం ముందు అరుగు మీద కూర్చుంది. సమిధలూ , పువ్వులూ సేకరించుకుని కశ్యపుడు వచ్చాడు. పువ్వుల్ని అదితి ముందున్న దర్భతో అల్లిన చాప మీద రాశిగా పోశాడు. అందమైన తామర మొగ్గలు ప్రత్యేకంగా కనువిందు చేస్తున్నాయి.

తల్లిదండ్రుల వైపు చిరునవ్వులు చిందిస్తూ సూర్యుడు వెలుపలి నుంచి ఆశ్రమం వైపుకు వస్తున్నాడు. అదితి కొడుకుని రెప్పవేయకుండా చూస్తోంది.

*"స్వామీ ! నా కొడుకుని చూశారా ! యవ్వనం సూర్యుడి అందాన్ని వెయ్యింతలు చేసింది కదూ ?"* అదితి కంఠంలో మాతృ సహజమైన గర్వం లీలగా ధ్వనించింది. *"నీ పుత్రుడి సౌందర్యం దైవిక సౌందర్యం అదితీ !"*

*"నా బిడ్డడి ఆ దివ్య సౌందర్యం ఏ అదృష్టవంతురాలికి మహాభాగ్యం అవుతుందో !"* అదితి పారవశ్యంతో అంది.

*"సౌందర్యంలో సరితూగే యువతిని అన్వేషించాలి మన సూర్యుడి కోసం ,"* కశ్యపుడు సూర్యుణ్ణి చూస్తూ అన్నాడు.

సూర్యుడు ఆశ్రమం ద్వారం ముందుకు వచ్చాడు. సూర్యుడు దగ్గరకు రాగానే ప్రాణం వచ్చినట్లు తామర మొగ్గలు వికసించాయి.

*"సమిధలు ఇలా ఇవ్వండి నాన్నగారూ !"* అంటూ కశ్యపుడు మోస్తున్న సమిధలను తీసుకుని సూర్యుడు ఆశ్రమంలోనికి వెళ్లాడు. కశ్యపుడు కూర్చున్నాడు. అదితి , కశ్యపులు తలలు తిప్పి , కొడుకు వైపే చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆశ్రమం ముందు వైపు నుంచి శ్రావ్యంగా నారాయణ నామగానం వినిపించింది. ఇద్దరూ తలలు తిప్పి చూశారు. వీణను మీటుతూ , నామగానం చేస్తూ వస్తున్నాడు నారదమహర్షి.

అదితి , కశ్యపుడూ అరుగు మీంచి లేచి , మర్యాద పూర్వకంగా నారదుడికి ఎదురేగారు. చిరునవ్వుతో స్వాగతం చెప్తూ , *"దయచేయండి !"* కశ్యపుడు చేతులు జోడిస్తూ అన్నాడు. *"ఈరోజు మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి !"* అదితి నారదుడితో అంది.

*"అలాగేమ్మా. దానికేం భాగ్యం !"* నారదుడు నవ్వుతూ అన్నాడు. *"ఆకాశమార్గాన వెళ్తుంటే... మీ సుపుత్రుడు సూర్యుడు ఏదో కాంతిస్తంభంలా కనిపించాడు. వయసు పెరిగింది ; అందమూ పెరిగింది.”*

*"ఇందాకా మేమిద్దరమూ అదే అనుకున్నాం. సూర్యుడు చూడచక్కని యువకుడయ్యాడు!"* కశ్యపుడు నవ్వుతూ అన్నాడు.. *"ఔనౌను. వివాహం సంకల్పించారా ? నారదుడు అడిగాడు.ఆ

*"మాదేముంది ? ఆ దైవం సంకల్పించాలి.”* అదితి వినయంగా అంది.

*"దైవ సంకల్పం జరిగిపోయింది. ఆ... కశ్యపా ! చూడచక్కని సుందరాకారుడైన సూర్యుడికి చూడచక్కని సుందరి కావాలి కదా. చూడచక్కని సుందరాంగిని ఇటీవల చూశాను...”* నారదుడు అన్నాడు. అరుగు మీద ఆసీనుడవుతూ...

*"ఎక్కడ మహర్షీ ?"* అదితి ఆతృతగా అడిగింది. *"ఎవరా చిన్నది ?”.* 

*"దేవశిల్పి విశ్వకర్మ ఉన్నాడు కదా ! ఆయన ఎవరనుకున్నారు ?"* నారదుడు అడిగాడు.

*"ప్రభాసవసు పుత్రుడు కదా?"* కశ్యపుడు అన్నాడు.

*"ఔను ! అష్టవసువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుడికీ , ఆయన పత్ని 'వరస్త్రీ'కి జన్మించినవాడు మన విశ్వకర్మ. ఆయన సేవలు అందుకొనని దేవతలు లేరు. ఆ దంపతుల జ్యేష్ఠ పుత్రిక సంజ్ఞ... సౌందర్యరాశి. మన సూర్యుడి కోసమే జన్మించిందని అనిపించింది నాకు ఆ కన్యను చూడగానే ,"* నారదుడు వివరించాడు.

*"అలాగా ! అయితే విశ్వకర్మ దంపతులను సంప్రదించి , వాళ్ళ అభిప్రాయం...."* అదితి కశ్యపుడి వైపు చూస్తూ చెప్పుకుపోతోంది. 

*"తెలుసుకునే వచ్చాను!"* ఆమె మాటకు తన మాటతో అడ్డువేశాడు నారదుడు. *"మన సూర్యుడి గురించి విశ్వకర్మ ఆనోటా , ఈనోటా మాత్రమే కాకుండా చతుర్ముఖుల నాలుగు నోళ్ళ ద్వారా విని ఉన్నాడు. ఆ దంపతులకు లేశమంత అభ్యంతరమూ లేదు..."*

*"అయితే ఆ కన్యామణి అభిప్రాయం ?"* కళ్యపుడు అన్నాడు.

*"సంజ్ఞాకుమారి అభిప్రాయం కూడా పసిగట్టే వచ్చాను. ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనూ , విడిగానూ సూర్యుడి అందచందాలనూ , ప్రభావాన్ని కళ్ళకు కట్టినట్టు చక్కగా వర్ణించాను. సంజ్ఞ తన ఇష్టాన్ని పెదవులతో చెప్పలేదు గానీ , కళ్ళతో స్పష్టం చేసింది"* నారదుడు నవ్వుతూ అన్నాడు.

*"అలాగా ! అన్నీ ఆకళింపు చేసుకునే వచ్చారన్నమాట!"* అదితి నవ్వుతూ అంది.

*"నారదుల వారి తీరే అంత అదితీ , మన కళ్యాణం విషయంలోనూ ఇలాగే చొరవగా ప్రవర్తించారు కదా !"* కశ్యపుడు గతాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు. 

*"ఇంతెందుకు కశ్యప ప్రజాపతీ ! నాతో చెప్పకపోయినప్పటికీ సంజ్ఞ అభిప్రాయం. వినే వచ్చాను. ఆ చిన్నది ఉద్యానవనంలో తన తల్లితో సూర్యుడి గురించి ఉత్సాహంగా చెప్తుంటే ఆ మాటను చాటుగా విన్నాను."* నారదుడు నవ్వుతూ అన్నాడు.

*"అయితే , ఇంకేం ? ఆ కన్యామణి అందచందాల గురించీ , గుణగణాల గురించీ సూర్యుడికి మీరే వివరించి చెప్పండి. తదనంతరం విశ్వకర్మ దంపతులతో సంప్రదించి , కళ్యాణం జరిపించుదాం !"* కశ్యపుడు అన్నాడు.

*"సంజ్ఞ గురించి మన సూర్యుడికి ఎరుక పరచడానికే ప్రత్యేకంగా వచ్చాననుకోండి ! ఆ కార్యం సానుకూలం చేసి , విశ్వకర్మతో మాట్లాడుతాను. ఆయనే మీ దర్శనానికి వస్తాడు."* అన్నాడు నారదుడు.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-35🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-35🌹*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*విష్ణుమూర్తి విగ్రహంగా నిరూపణ:*

వేంకటేశ్వరస్వామి విగ్రహం విష్ణువా, కుమారస్వామియా, శివుడా, శక్తియా, కాలభైరవుడా, బ్రహ్మా అన్న విషయంపై జరిగిన నిర్ణయచర్చలో రామానుజులు ఇతర దైవాలన్న వాదనలు ఖండిస్తూ, విష్ణువేనన్న విషయాన్ని సమర్థిస్తూ చేసిన వాదనలోని అంశాలివి. అనంతాచార్యులు రచించిన వేంకటాచల ఇతిహాసమాలలో క్రీ.శ.పదకొండవ శతాబ్దినాడు జరిగిన ఈ వాదన విస్తారంగా వివరించారు.

వామనపురాణంలోని 33వ అధ్యాయంలో అగస్త్యుడు, ఇతర మునులు, వసువుతో స్వామి పుష్కరిణికి, వేంకటాచలానికి వెళ్తూ-అది నారాయణునికి ప్రీతిపాత్రమైన విష్ణుమూర్తి క్షేత్రమని ప్రస్తావిస్తారు. వరాహపురాణంలో సూతుని వాక్యాలు, భూ వరాహస్వాముల సంవాదం, పద్మపురాణంలోని శుకుని వాక్యాలు, గరుడపురాణంలో వశిష్ఠుడు అరుంధతికి చేసే బోధ, బ్రహ్మాండపురాణంలో భృగుమహర్షికి నారదుని బోధ వంటివి వైష్ణవ క్షేత్రంగా వేంకటాచలాన్ని అభివర్ణించారు.

హరివంశ పురాణంలో భీష్ముడు తాను ఎలా వేంకటాచలానికి వచ్చాడో ధర్మరాజుకు చెప్తూ 'స్వామి పుష్కరిణీ తీరములో సూర్యమండలమువంటి విమానంలో శ్రీనివాసుడు వేంచేసి వున్నారని వర్ణించారు. వరాహపురాణంలో భూదేవి, వరాహమూర్తిల సంభాషణలో వేంకటాచలంపై పుష్కరిణీతీరంపై ఆనందము అనే పేరుగల పుణ్యవిమానంలో నివసిస్తాడని స్పష్టంగా చెప్తారు. పుష్కరిణికి పశ్చిమంగా, వరాహస్వామికి దక్షిణంగా శ్రీనివాసుడు నివసించడాన్ని గురించి పద్మపురాణం, మార్కండేయ, స్కంద, భవిష్యోత్తర పురాణాల్లో విపులవర్ణనలు ఉన్నాయి

స్కందుడు ఈ ప్రాంతానికి వచ్చి తపమాచరించినందున ధృవబేరం ఆయన మూర్తేనన్న వాదన ఖండిస్తూ ఈ పర్వతానికి ఎవరు వచ్చినా శ్రీనివాసుని దర్శించుకుని, ఆయన గురించి తపస్సు చేయడానికో, పాపప్రక్షాళనల కొరకో వచ్చినవారేనని పురాణాలే చెప్తున్నాయని వివరించారు.

వామన పురాణంలో తారకాసురుని వధ వల్ల వచ్చిన పాపప్రక్షాళన ఎలా చేసుకోవాలని ప్రశ్నించిన స్కందునితో వేంకటాచల మహాత్మ్యం అక్కడ కొలువైన విష్ణుమూర్తి మహిమలు వివరించి పరమశివుడే వేంకటాచలం పంపినట్టు నారదుడు వాల్మీకితో చెప్పారు. వైష్ణవ మంత్రాల్లోకెల్లా ఉత్తమమైన వైష్ణవమంత్రం ఉపదేశించమని శంభుణ్ణి కోరి ఉపదేశం పొందిన స్కందుడు వేంకటాచలానికి వెళ్ళాడని పురాణం చెప్తోంది.

పురాణాల పరంగా ఆదిశేషుడు, వాయుదేవుడూ ఈ పర్వతంపై తపమాచరించారని అంతమాత్రాన ఇది వాయుక్షేత్రమో, శేషుని క్షేత్రమో అవుతుందా అని ప్రశ్నించారు. స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడం వెనుక అది తీర్థాలన్నిటికీ సార్వభౌమమని భగవంతుడు వరం ఇవ్వడమే కారణమని స్పష్టం చేశారు. తపస్సు ఆచరించడానికి వచ్చిన కుమారస్వామి కనుక ఆయుధాలు లేవని శైవుల సమర్థనను వామన పురాణంలో వేంకటాచలం వెళ్ళినపుడు కుమారస్వామి ధనుస్సు, శక్తి ధరించే వెళ్ళినట్టు ఉండడాన్ని గుర్తుచేసి ఖండించారు. 

ధృవబేరానికి రెండు చేతులు కటిహస్తం, వరదహస్తం కాగా మరో రెండు చేతులూ పైకి ఎత్తి ఆయుధాలు పట్టుకోవడానికి ఎత్తినట్టు ఉంటాయి. శరవణుడే ఐతే ధనుస్సు ఆయుధంగా కల ఆయన అది వదిలారనుకున్నా అలా చెయ్యి ఎత్తిపట్టుకోరు కదా. 3

శంఖ చక్రాలు ధరించకపోవడాన్ని సమర్థిస్తూ పురాణాల్లో చోళరాజుకు ఐదు ఆయుధాలు ఇవ్వడం, రాక్షస సంహారం కోసం తొండమాను చక్రవర్తికి తన శంఖచక్రాలు ఇచ్చినట్టున్న సందర్భాలు వివరించారు.

శ్రీనివాసుడు తొండమానుడికి ఆయుధాలు ఇచ్చినప్పుడు వరం కోరుకొమ్మంటే తనకు సహాయంగా శ్రీహరి శంఖచక్రాలు ఇచ్చినట్టు తరతరాలుగా తెలిసేట్టు ఆ ఆయుధాలు ధరించని స్థితిలో ఉండమని కోరాడు. దాన్ని మన్నించి ఆ ఆయుధాలను అవ్యక్తంగా ఉంచేశారనే ఘటన వివరించి సమర్థించారు.

తొండమానుడితో సంభాషణలోనే భవిష్యత్ కాలంలో తాను తిరిగి శంఖచక్రాలు ధరిస్తానని తెలిపారట.

వీటన్నిటి నేపథ్యంలో వాదనల అనంతరం స్వామి ముందు విష్ణు ఆయుధాలైన శంఖచక్రాలు, సుబ్రహ్మణ్య ఆయుధాలైన శక్తి, శివపార్వతుల త్రిశూలం బంగారంతో చేయించి ముందుంచారు. నీవు ఏ దైవానివైతే ఆ ఆయుధాలు స్వీకరించమని ప్రార్థించి తెల్లవార్లూ ఆలయం చుట్టూ కాపలా ఉండి ఉదయం తెరచి చూశారు. ఖాళీ చేతుల స్థానంలో శంఖ చక్రాలు చేరాయని అదే స్థితిలో నేటికీ ధృవబేరం ఉందని వేంకటాచల ఇతిహాసమాల తెలిపింది.

వక్షఃస్థలంపై లక్ష్మీశ్రీవత్సం ఉండడం కూడా వేంకటేశుడే శ్రీనివాసుడని సూచిస్తున్నట్టుగా తెలిపారు.

మహేంద్ర వినుత గోవిందా, మహాను భావా గోవిందా, మహలక్ష్మి నాధ గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||35||

*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🌹సౌందర్యలహరి🌹* *శ్లోకం - 13*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

          *🌹సౌందర్యలహరి🌹*

*శ్లోకం - 13*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

*నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం*

*తవాపాంగాలోకే పతిత మనుధావన్తి శతశః |*

*గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్త సిచయాః*

*హఠత్తృట్యత్ కాంచో విగళిత దుకూలా యువతయః ||*

అమ్మా నీ కరుణా కటాక్ష వీక్షణాలు పడితే ఎంత పనికిమాలినవాడైనా సమర్ధుడుగా మారతాడని ఈ శ్లోకం అర్థం. ఇక్కడ శంకరులు స్థిరః, స్థాణుః అని నామాలున్న జడుడైన(ఆత్మారాముడైన) శివుని పై ఆరోపించి చమత్కారంగా చెప్పారు ఈ అద్భుతమైన శ్లోకం.

నరం వర్షీయాంసం = వయస్సుచేత వృద్ధుడు (అనాదియైనవాడు)

నయనవిరసం = కంటి చూపుకు కూడా బాగాలేనివాడు (విరూపాక్షుడు కదా!)

నర్మసు జడం = సరసానికి, రసజ్ఞతకు జడుడు.ఇలాంటి వాడిని అమ్మవారు,

మనుధావంతి శతశః = తన కరుణాపూరితమైన చూపులు ప్రసరింపచేయగానే,ఆయన ఎంత ఆకర్షణీయంగా అవుతాడంటే,దేవతా స్త్రీలు ఆయనను చూసి,

గలద్వేణీబంధాః = జుట్టు ముడులు విడిపోతూ ఉండగా

యోగపరంగా రుద్రగ్రంథి విభేదిని, భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రము నుండి సహస్రారపద్మమునకు చేర్చునది.కేశపాశములు ఉండే స్థానము.

కుచకలశ విస్రస్త సిచయాః = వక్షములపై కల వస్త్రములు ముడులు తొలగిపోయి

విష్ణుగ్రంధి విభేదిని, హృదయస్థానములో కల అనాహతము నుండి విశుద్ధిచక్రమునకు చేర్చునది.

హఠాత్తృట్యత్ కాంచో = నడుముకు చుట్టిన  వస్త్రము ముడి ఊడిపోయి

బ్రహ్మగ్రంధి విభేదిని, మూలాధారము నుండి నాభి వెనక కల మణిపూరమునకు చేర్చునది.ఈ గ్రంధులు విడిపోగానే సాధకుడు జీవన్ముక్తుడవుతాడు.

విగళిత దుకూలా = వస్త్రములు ఊడిపోయి 

కృష్ణుని వేణుగానం విన్న గోపికలవలె తనువులు మరచి ఆకర్షితులవుతున్నారు అని భావం.

అమ్మవారి చూపు పడగానే ప్రపంచంలోని శక్తులన్నీ ఆమెకి దాసానుదాసులవుతారని గ్రహించాలి.

            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

Photo

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 29*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 29*

ఎవరో చెప్పారు కనుక, ఏదో ఫలానా గ్రంథంలో వ్రాశారు కాబట్టి దేనినీ యథాతథంగా స్వీకరించే వ్యక్తి కాదు నరేంద్రుడు. సత్యాన్ని ప్రత్యక్షంగా ఆవిష్కరించుకొన్న వ్యక్తిని దర్శించాలని  పలువురిని కలుసుకొని విచారణ చేశాడు. కాని ఎవరి నుండి 'అవును' అనే స్పష్టమయిన జవాబు లభించలేదు. ఈ తరుణంలో ఒక రోజు అతడి బంధువూ, శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో ఒకరూ అయిన రామచంద్ర దత్తా అతడితో, 

"ఇలా చూడు నరేంద్రా! నిజమైన మహాత్మునికై నువ్వు ఇక్కడా అక్కడా గాలిస్తున్నావు. దక్షిణేశ్వరంలో ఒక పరమహంస నివసిస్తున్నారు. ఒక రోజు నాతోబాటు వచ్చి ఆయనను చూడు" అని చెప్పాడు. అందుకు నరేంద్రుడు "నాకు తెలుసు. ఆయనను గురించి వాకబు చేశాను. కాని ఆయన విద్యాగంధం లేని వారు! స్పెన్సర్, హేమిల్టన్, లాక్కే లాంటి పలువురిని అధ్యయనం చేసిన నాకు, విద్యాహీనులైన ఆయన ఎలా మార్గదర్శికాగలరు?" అని ఎదురు ప్రశ్న వేశాడు. రామచంద్రదత్తా మౌనం వహించాడు.దేనికైనా సమయమూ, సందర్భమూ రావాలి కదా! అలాంటి తరుణం సత్వరమే ఆసన్నమయింది.🙏

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

నవగ్రహ పురాణం - 45 వ అధ్యాయం*

 *నవగ్రహ పురాణం - 45 వ అధ్యాయం*

🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷🪻🌿🪷

*బుధగ్రహ జననం - 8*

బృహస్పతి విద్యార్థుల కోసం ఎదురు చూస్తూ తన స్థానంలో కూర్చున్నాడు. చెట్టు గుబురులో దాక్కున్న చిలక , ఒక్కసారి రెక్కల్ని టపటపలాడించి , ప్రణవం ప్రారంభించింది. 

*'ఓమ్!' 'ఓమ్!' 'ఓమ్ ! '*

విద్యార్థులను పాఠానికి రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది ఆ చిలక చేస్తున్న ఓంకార నాదం !

బృహస్పతి చిరునవ్వుతో చెట్టు గుబురు వైపు చూశారు. విద్యార్థులకు తీసిపోకుండా నేర్చుకొంటోందీ చిలక ! ఆశ్రమాల్లో చిలకలు వేదాలు పఠించాలి. సింహాలు జింకలతో ఆడుకోవాలి ! గుంపులుగా వచ్చిన విద్యార్థులు , వరసలుగా కూర్చుంటున్నారు. బృహస్పతి. చూపులు విద్యార్థుల ముఖాలను పరిశీలనగా చూస్తున్నాయి. అందరూ ఉన్నారు... చంద్రుడు ?

బృహస్పతి కళ్ళు మరోసారి విద్యార్థులను కలియజూశాయి. చంద్రుడు వచ్చినట్టు లేడు. ఏదో అడగడానికి ఆయన నోరు తెరిచాడు...

*“స్వామీ...”* పుంజికస్థల పిలుపు విని బృహస్పతి పక్కకు చూశాడు. పుంజికస్థల ఆయన వైపు వినయంగా చూసింది. *"గురుపత్ని... ఆశ్రమంలో లేరు... " "తార ఆశ్రమంలో లేదా ?"* బృహస్పతి ఆమెకు అడ్డు తగిలాడు.

*"లేరు... విద్యార్థులకు ఆహారం సిద్ధం చేయనా ?!"* పుంజికస్థల వినయంగా అడిగింది. 

*"తార ఎక్కడికెళ్ళింది , పుంజికా ?”*

*"తెలియదు ! నిన్న మీరు ఇంద్రసభకు వెళ్లినప్పట్నుంచీ గురుపత్ని కనిపించలేదు. మీతో వెళ్ళి ఉంటారనుకున్నాను..."* పుంజికస్థల వినయంగా అంది. 

*"ఔను , గురువుగారూ ! మేమూ అలాగే అనుకున్నాం ! మీ వెంట చంద్రుణ్ణి కూడా తీసుకువెళ్ళి ఉంటారనుకున్నాం..."* ఒక విద్యార్థి లేచి , నిలబడి అన్నాడు.

బృహస్పతి కళ్ళు చిట్లించాడు. చంద్రుడా ! అంటే చంద్రుడు ఇక్కడ లేడా ?

*"చంద్రుడెక్కడ ?”* అప్రయత్నంగా ప్రశ్నించాడు బృహస్పతి.

*"మీరూ , గురుపత్నిగారూ , చంద్రుడూ - ఒకే సమయంలో ఆశ్రమంలో లేకుండా పోయారు...గురువుగారూ... అందుకని... కలిసే దేవలోకానికి..."* సనాతనుడు అనే విద్యార్థి వివరిస్తున్నాడు.

*"పుంజికా ! చంద్రుడు కూడా లేడా ?”* బృహస్పతి పరిచారికను ప్రశ్నించాడు.

*"లేడు...”*

*“ఇద్దరూ మళ్ళీ నదీస్నానానికి..."* బృహస్పతి సాలోచనగా అన్నాడు. *“నదీస్నానానికి వెళ్ళకూడదని చంద్రుణ్ణి ఆజ్ఞాపించానే !”*

*"నదిలో ఏదైనా ప్రమాదం...”* బృహస్పతి అనుమానంగా అన్నాడు. 

*"నది వైపు వెళ్ళలేదు...వాళ్ళు...”* పుంజికస్థల మెల్లిగా అంది.

వాళ్ళు ? బృహస్పతి పుంజికస్థల వైపు అర్ధం కానట్టు చూశాడు. వాళ్ళు... తారా , చంద్రుడూ కలిసి తిరుగుతున్నారా ?! ఆయనలో ఏవో ఆలోచనలు ఆందోళనలు పుట్టిస్తూ , సాగుతున్నాయి. ఏ సమిథలకో అడవిలోకి వెళ్ళి ఉంటారా ?

*"సనాతనా ! సునీతుడూ , నువ్వూ - ఇంకాకొందరూ అరణ్యంలో చూడండి ! తారకూ , చంద్రుడికీ ఏదైనా ప్రమాదం..."* వాక్యం పూర్తి చేయకుండానే ఆగాడు బృహస్పతి.

*"స్వామీ... విద్యార్థులకూ , మీకూ... ఆహారం...”*. 

*"సిద్ధం చేయి, పుంజికా..."* బృహస్పతి నిట్టూర్చాడు.

వయసులో పెద్దవాళ్ళైన విద్యార్థులు చాలా మందే అరణ్యం వైపు బయలుదేరారు. అప్పుడే తన వైపే చూస్తున్న విద్యార్థుల వైపు అన్యమనస్కంగా చూశాడు బృహస్పతి. 

*"నిన్నటి పాఠం వల్లె వేసుకోండి !"* అన్నాడు.

*"రా , చంద్రా !”* చెట్టు మీది చిలక ఉన్నట్టుండి అంది. బృహస్పతి చిలకవైపు ఆశ్చర్యంగా చూశాడు.

*"ఇలా రా , చంద్రా !”* తార పిలుపు కోకిల గానంలా చంద్రుడి చెవుల్ని తాకింది.

మందిరం ముందు నిలుచున్న చంద్రుడు లోపలికి నడిచాడు. తార పిలుపు మళ్ళీ ఒకసారి శయనాగారం లోంచి వినిపించింది. చంద్రుడు శయ్యాగారంలోకి అడుగులు వేసి , హంసతూలికా తల్పం ముందు నిలుచున్న తార పక్కనే నిలుచున్నాడు. అతని చెయ్యి తీగలా సాగి , సన్నటి తార నడుముని చుట్టింది. తార తలని చంద్రుడి భుజం మీద వాల్చింది.

*"ఈ తల్పం ఎంత బాగుందో , చూశావా ?"* అంది తార.

*"విశ్వకర్మ సృష్టి !"* చంద్రుడు నవ్వుతూ అన్నాడు. *“నీకోసమే!”*

*"కాదు"* తార వెంటనే అంది. *"మన కోసం !"*

*"నేను... శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను !"* తార పారవశ్యంతో అంది. *"ఈ మందిరం , ఈ హంసతూలికా తల్పాలు , తూగుటుయ్యాలలు , ఇవన్నీ కావాలి , నాకు !"* 

చంద్రుడు ప్రేమగా ఆమె నడుము చుట్టూ తన చేతులతో బిగించాడు. *“ఎందుకూ అంత ఆశ ?"* చిరునవ్వుతో అడిగాడు.

*"దర్భాసనాలు , కృష్ణాజినాలూ , ఆకులూ , అలములూ - వీటితో అలసిపోయాను ; విసిగిపోయాను !"* అంటూ తార సున్నితంగా చంద్రుడి చేతిని తప్పిస్తూ కొంచెం ఎడంగా జరిగింది. చంద్రుడి వైపు తిరిగి , వయ్యారంగా నిలబడింది.

*"ఇలా నా వైపు చూడు !"* అంది తార.

చంద్రుడు పూర్తిగా ఆమె వైపు తిరిగి , చూశాడు.

*"నన్ను చూడు , చంద్రా !”* అంది తార. తన ముఖంలోకి చూస్తున్న చంద్రుడితో.. చంద్రుడు రెండు చేతుల్నీ నడుం మీద ఆన్చుకుని , తారను నఖశిఖ పర్యంతం చూస్తూ ఉండిపోయాడు. అతని చూపులు కనిపించని సున్నితమైన కుంచెల్లా తార శరీరాన్ని స్పృశిస్తూ ఉండిపోయాయి.

తార - నిలువెత్తు సౌందర్యం ! రూపం ధరించి తన ముందు నిలుచున్న అందం ! 'అందగత్తె' అంటే ఇలా ఉండాలి అని చెప్పే శరీరం ! రెండు వైపులా ఉన్న చెవుల్ని అందుకోడానికి ప్రయత్నిస్తున్నట్టున్న సోగకళ్ళు...

*"మళ్ళీ చూడు !"* తార చిరుకోపంతో అంది. *“నన్ను చూడమంటే నా కళ్లలోకి చూస్తావేం , చంద్రా ? చెప్పినట్టు చెయ్ ! నన్ను... చూడు !"* చంద్రుడు గుడ్లప్పగించి మంత్రముగ్ధుళ్ళ చూస్తూ ఉండిపోయాడు. కళ్ళల్లోకి

*"ఎలా ఉన్నాను ?"* తార ప్రశ్న అతన్ని హెచ్చరించింది.

*"ఎలా ఉన్నావంటే... చక్కటి - తీగలా ఉన్నావు ! ఆ తీగ అల్లుకుపోవడానికి వీలుగా స్తంభంలా నీ పక్కన నిలబడా లనిపిస్తోంది !"* చంద్రుడి కంఠంలో ఆరాధనా భావం శబ్దించింది.

*“ఇంత సౌందర్యం , ఇంత సౌకుమార్యం దర్భాసనాలకీ , కృష్ణాజినాలకీ బలైపోతే...”* తార మధ్యలో ఆపింది.

*"ఈ చంద్రుడు అలా కానివ్వడు ! అందుకే ఇక్కడకి తీసుకువచ్చేశాడు.”* 

తార వినిపించుకోనట్టు చూసింది. *“ఈ అందం , ఈ యౌవనం - ఎక్కడుండాలి ?"* చంద్రుడు హంసతూలికా తల్పాన్ని చేత్తో చూపించాడు. *“అక్కడ !”*

తార చిరునవ్వుతో వయ్యారంగా అడుగులు వేస్తూ చంద్రుడి ముందుకు నడిచింది. *"కాదు... అక్కడ కాదు , ఇక్కడ !"* అంటూ అతని హృదయం మీద చెంపని ఆన్చి , మెడ చుట్టూ చేతుల్ని దండలా ఆన్చింది.

చంద్రుడు తలవాల్చి చూశాడు. తార కొద్దిగా తల పైకెత్తి , చంద్రుడి కళ్ళల్లోకి చూసింది. ఆమె విశాల నేత్రాల్లో ప్రేమ జ్యోతుల్లా వెలుగుతోంది. చంద్రుడి చేతులు ఆమెను పొదివి , పట్టుకున్నాయి.

*"చంద్రా... నా కోరిక చెప్పనా ?”*

*"ఊ..."*

*"నీ అందం నా కొడుకుగా పుట్టాలి!"*

 *"తారా !"* చంద్రుడు పులకించిపోతూ అన్నాడు.

రామాయణమ్ 314

 రామాయణమ్ 314

....

రాక్షసేశ్వరా! నీవు చేసిన పని అధర్మము ,అక్రమము నీ వంటిబుద్ధిమంతులైన వారు ఇటువంటిపనులలో తలదూర్చరు .

.

రామబాణానికి అడ్డులేదు లక్ష్మణశరానికి ఎదురు లేదు.

.

రామకోపాగ్నిలో పడి శలభంలాగా మాడి మసి అయిపోకు! 

.

రామునికి కోపము తెప్పించినతరువాత కూడా సుఖముగా గుండెమీద చేయి వేసుకునినిద్రించగలవాడు

ముల్లోకాలలో 

ఇంతవరకు ఎవడూ పుట్టలేదు ,

ఇక ముందు ఎవడూ పుట్టడు.

.

నీకు హితము చేకూర్చేదీ ,మరియు ధర్మబద్ధమైన మాట నేనొకటి చెపుతాను విను.

.

నేను ఇక్కడికి వచ్చి సీతమ్మను చూసినాను.ఆ మహాసాధ్విని ఆవిడ భర్తకు అప్పగించు.

.

అసంభవమూ,అతిదుర్లభమూ అయిన కార్యాన్ని నేను సాధించాను ! ఇక మిగతావిషయాలు రామచంద్రుడు చూసుకుంటాడు.

.

సీతమ్మ అంటే ఏవిటో అనుకుంటున్నావు ! బంధించి తీసుకు వచ్చాను కదా అని సంబరపడుతున్నావు ,

కానీ అయిదు తలల ఆడత్రాచుపాము అన్నసంగతి గ్రహించలేకున్నావు.

.

నీ తపస్సును ,నీ ధర్మాన్నీ వ్యర్ధము చేసుకుంటున్నావు.

.

తపస్సు చేసి చావులేకుండా వరంపొందానని సంతోషిస్తున్నావేమో ! 

.

సుగ్రీవుడు ...అసురుడు కాడు,అమరుడు కాడు ,దేవ,దానవ,యక్ష ,గంధర్వ,కిన్నర,కింపురుషు,పన్నగ,

ఉరగులలో ఎవడూ కాడు! ఆయన వానరుడు!అతడినుండి నీవు ప్రాణాలు ఎలా కాపాడుకుంటావు ?

.

అధర్మాన్ని నాశనం చేయడానికి ధర్మమే తగిన మార్గాలను వెతుక్కుంటుంది.

.

నీవు ఆచరించిన ధర్మాలకు మాత్రమే ఇప్పటివరకూ ప్రతిఫలం పొందావు ....ఇక ముందు నీ అధర్మానికి ప్రతిఫలం పొందుతావు !.....

.

అని అంటూ ఇంకా కొనసాగిస్తున్నాడు పవనసుతుడు..

.

వూటుకూరు జానకిరామారావు

సాంఖ్య యోగః 🌸* *2-అధ్యాయం, 17 వ శ్లోకం*

 🕉️🪷 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః*🪷🕉️

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

🌸 *అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 

 *2-అధ్యాయం, 17 వ శ్లోకం* 

 *అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |* 

 *వినాశ మవ్యయ స్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి || 17*

 *ప్రతిపదార్థం* 

అవినాశి = నాశరహిత యెమైన ; తత్, విద్ధి = దానిని తెలిసి కొనుము; యేన, తు = దేని చేనైతే; ఇదమ్, సర్వమ్= ఈ జగత్తంతయు (దృశ్యవర్గము ); తతమ్ = వ్యాప్తమై యున్నదో; అన్య ఆవ్యయస్య =దానియొక్క ఆత్మ యొక్క ); వినాశమ్ = వినాశమును; కర్తుమ్ = చేయటకు; కశ్చిత్ =ఎవ్వడును; న, అర్హతి = సమర్థుడు కాడు .

 *తాత్పర్యము* 

నాశరహితమైన ఆ సత్యము ( పరమాత్మ తత్వము ) జగత్తు నందు అంతటను వ్యాపించి యున్నదని యెరుoగుము. శాశ్వతమైన దానినెవ్వరును నశింపజేయజాలరు.

 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

ముహూర్తం

 *ముహూర్తం అంటే ఏమిటి? దానికి బలం అనేది ఉంటుందా? ఎలా నమ్మాలి? దేనికి నమ్మాలి?*

*విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం విద్యారణ్య స్వామి హరిహర బుక్కరాయల తో మంచి స్థలం కోసం గాలిస్తున్నారు. వారు ఒక ప్రాంతం చేరగానే వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. కొన్ని కుందేళ్లు వేటకుక్కలను తరుముతున్న దృశ్యం చూడగానే మ్రాన్పడిపోయారు. ఆ బలం కుందేళ్ళది కాదు అని, అది ఆ నేలలో ఉన్న మహత్తర శక్తి అని విద్యారణ్య స్వామి గ్రహించారు. అక్కడ రాజధానిని నిర్మిస్తే, శక్తివంతమైన సైనికులు, ఆర్ధిక పరిపుష్టి కలిగిన వ్యాపారులు, మేధావులైన అధికారగణం, నిజాయితీపరులైన ప్రజలతో రాజ్యం విలసిల్లుతుంది అని భావించారు.*

*రాజ్య నిర్మాణానికి ఒక దివ్యమైన ముహూర్తాన్ని నిశ్చయించారు. తెల్లవారుజామున ఒక ఘడియ లో చంద్రుడు ఏవో నక్షత్రాలకు సమీపిస్తాడు ట. అది అత్యద్భుతమైన ముహూర్తం అని భావించారు. హరిహర. బుక్క రాయల తో "నేను ఆ సమీపం లోని కొండపైకి ఎక్కి చంద్రగ్రహ కదలికలను గమనిస్తూ, సరైన ముహూర్త సమయం రాగానే శంఖాన్ని పూరిస్తాను. ఆ శబ్దం వినపడింది మరుక్షణమే మీరు ఇక్కడ పునాది ని తవ్వాలి. ఆ సమయంలో పడిన పునాది విజయనగర సామ్రాజ్యాన్ని వెయ్యి సంవత్సరాలు ఆ ముహూర్తబలం కాపాడుతుంది" అని చెప్పి స్వామి కొండపైనున్న శిఖరాగ్రానికి వెళ్లారు.*

*రాయల సోదరులు ఇరువురూ గునపాలు చేబూని సిద్ధంగా ఉన్నారు. తెల్లవారు జామున పూర్ణచంద్రుడు తేజోమయంగా నభో మండలం లో నిశ్చలంగా పరిభ్రమిస్తున్నాడు. నక్షత్రాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. సరిగ్గా అదే సమయం లో ఒక జంగం దేవర నదీస్నానం చెయ్యడానికి వెళ్తూ పెద్దగా శంఖాన్ని పూరించాడు. అది స్వాములవారు పూరించినదే అని భ్రమించి రాయలసోదరులు భూమిలోకి గునపాలు దించారు. ఒక్క అడుగు తవ్వగానే శంఖం మరోసారి మోగింది. ఇది స్వామి పూరించింది. ఆ శబ్దం వినగానే సోదరులు ఇద్దరూ దిగ్భ్రాంతి చెంది అచేతనంగా నిలబడి పోయారు.*

*ఇంతలో స్వామి కొండదిగి వచ్చారు. ఆయన రాగానే "గురుదేవా.. ఎందుకు శంఖాన్ని రెండుసార్లు పూరించారు?" అని ప్రశ్నించారు సోదరులు. స్వామి ఆశ్చర్యంగా అదేమిటి? నేను ఇప్పుడే శంఖనాదం చేసాను. పునాది తీసారా? అని ఆత్రంగా ప్రశ్నించారు. "లేదు గురుదేవా.. కొన్ని ఘడియల క్రితం శంఖనాదం వినిపించింది. అది మీరే పూరించారు అని అప్పుడే పునాది తీసాము" చెప్పారు సోదరులు.*

*అప్పుడే మళ్ళీ శంఖం ఊదుకుంటూ జంగందేవర వెళ్ళిపోతున్నాడు. అతడిని చూడగానే స్వామి ఖిన్నుడు అయ్యారు. "అయ్యో... తొలిసారి పూరించింది నేను కాదు. ఆ జంగం దేవర...ఎంత పొరపాటు అయింది... మీరు పునాది తీసిన ఘడియ అంత బలమైనది కాదు. ఆ ముహూర్తం లో తీసిన పునాది ఎక్కువకాలం నిలబడదు. రెండు వందల సంవత్సరాలలో ఈ సామ్రాజ్యం కూలిపోతుంది. విదేశీయులకు మనవాళ్ళు బానిసలు అవుతారు. కుట్రలు, కుతంత్రాలతో రాజకుటుంబం పతనమై పోతుంది.. అంతా విధి రాత" అన్నారు బాధగా...*

*ఆయన చెప్పినట్లే విఆయనగర సామ్రాజ్యం రెండువందల ఏళ్లకే పతనమై పోయి చివరకు ఆంగ్లేయుల స్వాధీనం లోకి వెళ్ళిపోయింది.*

*ముహూర్త నిర్ణయం లో అంత శక్తి ఉన్నది.*

*శాస్త్రం ఏ విషయాన్నైనా నిష్కర్షగా కర్కశంగా చెప్తుంది.*

🙏🌞🌞🌞🌞🌞🙏

నవగ్రహా పురాణం🪐* . *16వ అధ్యాయం*

 .        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *16వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*పురాణ పఠనం ప్రారంభం*

*సూర్యగ్రహ జననం - 7*

కశ్యప ప్రజాపతి అధ్యాపనంలో సూర్యుడి విద్యార్జన ప్రారంభమైంది. వేదాలూ , వేదాంగాలూ , తర్క , వ్యాకరణ , ధర్మ , మీమాంస , జ్యోతిష , వైద్య శాస్త్రాలూ అచిరకాలంలో సూర్యుడి మేధస్సులో కాపురం చేయసాగాయి. విద్యా బలంతో , సహజ కాంతివంతమైన సూర్యుడి ముఖ మండలంలో నూతన వర్చస్సు తాండవం చేయసాగింది.

సకల చరాచర ప్రాణుల పట్లా చిన్నతనం నుంచే సూర్యుడు ప్రకటించే 'సమత' అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. విద్యనూ , వినయాన్నీ పుణికి పుచ్చుకున్న సూర్యుడు బాల్యావస్థను దాటి యవ్వనంలోకి అడుగుపెట్టాడు. చూపుల్ని సూదంటు రాయిలా లాగిపట్టే శరీరకాంతి , సౌష్టవంతో నిండిన నిలువెత్తు విగ్రహం , అందమైన ముఖంలో చెరగని చిరునవ్వు , ప్రత్యూష సౌందర్య పరాకాష్ఠలా ఉన్నాడు సూర్యుడు.

అదితి ఆశ్రమం ముందు అరుగు మీద కూర్చుంది. సమిధలూ , పువ్వులూ సేకరించుకుని కశ్యపుడు వచ్చాడు. పువ్వుల్ని అదితి ముందున్న దర్భతో అల్లిన చాప మీద రాశిగా పోశాడు. అందమైన తామర మొగ్గలు ప్రత్యేకంగా కనువిందు చేస్తున్నాయి.

తల్లిదండ్రుల వైపు చిరునవ్వులు చిందిస్తూ సూర్యుడు వెలుపలి నుంచి ఆశ్రమం వైపుకు వస్తున్నాడు. అదితి కొడుకుని రెప్పవేయకుండా చూస్తోంది.

*"స్వామీ ! నా కొడుకుని చూశారా ! యవ్వనం సూర్యుడి అందాన్ని వెయ్యింతలు చేసింది కదూ ?"* అదితి కంఠంలో మాతృ సహజమైన గర్వం లీలగా ధ్వనించింది. *"నీ పుత్రుడి సౌందర్యం దైవిక సౌందర్యం అదితీ !"*

*"నా బిడ్డడి ఆ దివ్య సౌందర్యం ఏ అదృష్టవంతురాలికి మహాభాగ్యం అవుతుందో !"* అదితి పారవశ్యంతో అంది.

*"సౌందర్యంలో సరితూగే యువతిని అన్వేషించాలి మన సూర్యుడి కోసం ,"* కశ్యపుడు సూర్యుణ్ణి చూస్తూ అన్నాడు.

సూర్యుడు ఆశ్రమం ద్వారం ముందుకు వచ్చాడు. సూర్యుడు దగ్గరకు రాగానే ప్రాణం వచ్చినట్లు తామర మొగ్గలు వికసించాయి.

*"సమిధలు ఇలా ఇవ్వండి నాన్నగారూ !"* అంటూ కశ్యపుడు మోస్తున్న సమిధలను తీసుకుని సూర్యుడు ఆశ్రమంలోనికి వెళ్లాడు. కశ్యపుడు కూర్చున్నాడు. అదితి , కశ్యపులు తలలు తిప్పి , కొడుకు వైపే చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆశ్రమం ముందు వైపు నుంచి శ్రావ్యంగా నారాయణ నామగానం వినిపించింది. ఇద్దరూ తలలు తిప్పి చూశారు. వీణను మీటుతూ , నామగానం చేస్తూ వస్తున్నాడు నారదమహర్షి.

అదితి , కశ్యపుడూ అరుగు మీంచి లేచి , మర్యాద పూర్వకంగా నారదుడికి ఎదురేగారు. చిరునవ్వుతో స్వాగతం చెప్తూ , *"దయచేయండి !"* కశ్యపుడు చేతులు జోడిస్తూ అన్నాడు. *"ఈరోజు మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి !"* అదితి నారదుడితో అంది.

*"అలాగేమ్మా. దానికేం భాగ్యం !"* నారదుడు నవ్వుతూ అన్నాడు. *"ఆకాశమార్గాన వెళ్తుంటే... మీ సుపుత్రుడు సూర్యుడు ఏదో కాంతిస్తంభంలా కనిపించాడు. వయసు పెరిగింది ; అందమూ పెరిగింది.”*

*"ఇందాకా మేమిద్దరమూ అదే అనుకున్నాం. సూర్యుడు చూడచక్కని యువకుడయ్యాడు!"* కశ్యపుడు నవ్వుతూ అన్నాడు.. *"ఔనౌను. వివాహం సంకల్పించారా ? నారదుడు అడిగాడు.ఆ

*"మాదేముంది ? ఆ దైవం సంకల్పించాలి.”* అదితి వినయంగా అంది.

*"దైవ సంకల్పం జరిగిపోయింది. ఆ... కశ్యపా ! చూడచక్కని సుందరాకారుడైన సూర్యుడికి చూడచక్కని సుందరి కావాలి కదా. చూడచక్కని సుందరాంగిని ఇటీవల చూశాను...”* నారదుడు అన్నాడు. అరుగు మీద ఆసీనుడవుతూ...

*"ఎక్కడ మహర్షీ ?"* అదితి ఆతృతగా అడిగింది. *"ఎవరా చిన్నది ?”.* 

*"దేవశిల్పి విశ్వకర్మ ఉన్నాడు కదా ! ఆయన ఎవరనుకున్నారు ?"* నారదుడు అడిగాడు.

*"ప్రభాసవసు పుత్రుడు కదా?"* కశ్యపుడు అన్నాడు.

*"ఔను ! అష్టవసువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుడికీ , ఆయన పత్ని 'వరస్త్రీ'కి జన్మించినవాడు మన విశ్వకర్మ. ఆయన సేవలు అందుకొనని దేవతలు లేరు. ఆ దంపతుల జ్యేష్ఠ పుత్రిక సంజ్ఞ... సౌందర్యరాశి. మన సూర్యుడి కోసమే జన్మించిందని అనిపించింది నాకు ఆ కన్యను చూడగానే ,"* నారదుడు వివరించాడు.

*"అలాగా ! అయితే విశ్వకర్మ దంపతులను సంప్రదించి , వాళ్ళ అభిప్రాయం...."* అదితి కశ్యపుడి వైపు చూస్తూ చెప్పుకుపోతోంది. 

*"తెలుసుకునే వచ్చాను!"* ఆమె మాటకు తన మాటతో అడ్డువేశాడు నారదుడు. *"మన సూర్యుడి గురించి విశ్వకర్మ ఆనోటా , ఈనోటా మాత్రమే కాకుండా చతుర్ముఖుల నాలుగు నోళ్ళ ద్వారా విని ఉన్నాడు. ఆ దంపతులకు లేశమంత అభ్యంతరమూ లేదు..."*

*"అయితే ఆ కన్యామణి అభిప్రాయం ?"* కళ్యపుడు అన్నాడు.

*"సంజ్ఞాకుమారి అభిప్రాయం కూడా పసిగట్టే వచ్చాను. ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనూ , విడిగానూ సూర్యుడి అందచందాలనూ , ప్రభావాన్ని కళ్ళకు కట్టినట్టు చక్కగా వర్ణించాను. సంజ్ఞ తన ఇష్టాన్ని పెదవులతో చెప్పలేదు గానీ , కళ్ళతో స్పష్టం చేసింది"* నారదుడు నవ్వుతూ అన్నాడు.

*"అలాగా ! అన్నీ ఆకళింపు చేసుకునే వచ్చారన్నమాట!"* అదితి నవ్వుతూ అంది.

*"నారదుల వారి తీరే అంత అదితీ , మన కళ్యాణం విషయంలోనూ ఇలాగే చొరవగా ప్రవర్తించారు కదా !"* కశ్యపుడు గతాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు. 

*"ఇంతెందుకు కశ్యప ప్రజాపతీ ! నాతో చెప్పకపోయినప్పటికీ సంజ్ఞ అభిప్రాయం. వినే వచ్చాను. ఆ చిన్నది ఉద్యానవనంలో తన తల్లితో సూర్యుడి గురించి ఉత్సాహంగా చెప్తుంటే ఆ మాటను చాటుగా విన్నాను."* నారదుడు నవ్వుతూ అన్నాడు.

*"అయితే , ఇంకేం ? ఆ కన్యామణి అందచందాల గురించీ , గుణగణాల గురించీ సూర్యుడికి మీరే వివరించి చెప్పండి. తదనంతరం విశ్వకర్మ దంపతులతో సంప్రదించి , కళ్యాణం జరిపించుదాం !"* కశ్యపుడు అన్నాడు.

*"సంజ్ఞ గురించి మన సూర్యుడికి ఎరుక పరచడానికే ప్రత్యేకంగా వచ్చాననుకోండి ! ఆ కార్యం సానుకూలం చేసి , విశ్వకర్మతో మాట్లాడుతాను. ఆయనే మీ దర్శనానికి వస్తాడు."* అన్నాడు నారదుడు.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-35🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-35🌹*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*విష్ణుమూర్తి విగ్రహంగా నిరూపణ:*

వేంకటేశ్వరస్వామి విగ్రహం విష్ణువా, కుమారస్వామియా, శివుడా, శక్తియా, కాలభైరవుడా, బ్రహ్మా అన్న విషయంపై జరిగిన నిర్ణయచర్చలో రామానుజులు ఇతర దైవాలన్న వాదనలు ఖండిస్తూ, విష్ణువేనన్న విషయాన్ని సమర్థిస్తూ చేసిన వాదనలోని అంశాలివి. అనంతాచార్యులు రచించిన వేంకటాచల ఇతిహాసమాలలో క్రీ.శ.పదకొండవ శతాబ్దినాడు జరిగిన ఈ వాదన విస్తారంగా వివరించారు.

వామనపురాణంలోని 33వ అధ్యాయంలో అగస్త్యుడు, ఇతర మునులు, వసువుతో స్వామి పుష్కరిణికి, వేంకటాచలానికి వెళ్తూ-అది నారాయణునికి ప్రీతిపాత్రమైన విష్ణుమూర్తి క్షేత్రమని ప్రస్తావిస్తారు. వరాహపురాణంలో సూతుని వాక్యాలు, భూ వరాహస్వాముల సంవాదం, పద్మపురాణంలోని శుకుని వాక్యాలు, గరుడపురాణంలో వశిష్ఠుడు అరుంధతికి చేసే బోధ, బ్రహ్మాండపురాణంలో భృగుమహర్షికి నారదుని బోధ వంటివి వైష్ణవ క్షేత్రంగా వేంకటాచలాన్ని అభివర్ణించారు.

హరివంశ పురాణంలో భీష్ముడు తాను ఎలా వేంకటాచలానికి వచ్చాడో ధర్మరాజుకు చెప్తూ 'స్వామి పుష్కరిణీ తీరములో సూర్యమండలమువంటి విమానంలో శ్రీనివాసుడు వేంచేసి వున్నారని వర్ణించారు. వరాహపురాణంలో భూదేవి, వరాహమూర్తిల సంభాషణలో వేంకటాచలంపై పుష్కరిణీతీరంపై ఆనందము అనే పేరుగల పుణ్యవిమానంలో నివసిస్తాడని స్పష్టంగా చెప్తారు. పుష్కరిణికి పశ్చిమంగా, వరాహస్వామికి దక్షిణంగా శ్రీనివాసుడు నివసించడాన్ని గురించి పద్మపురాణం, మార్కండేయ, స్కంద, భవిష్యోత్తర పురాణాల్లో విపులవర్ణనలు ఉన్నాయి

స్కందుడు ఈ ప్రాంతానికి వచ్చి తపమాచరించినందున ధృవబేరం ఆయన మూర్తేనన్న వాదన ఖండిస్తూ ఈ పర్వతానికి ఎవరు వచ్చినా శ్రీనివాసుని దర్శించుకుని, ఆయన గురించి తపస్సు చేయడానికో, పాపప్రక్షాళనల కొరకో వచ్చినవారేనని పురాణాలే చెప్తున్నాయని వివరించారు.

వామన పురాణంలో తారకాసురుని వధ వల్ల వచ్చిన పాపప్రక్షాళన ఎలా చేసుకోవాలని ప్రశ్నించిన స్కందునితో వేంకటాచల మహాత్మ్యం అక్కడ కొలువైన విష్ణుమూర్తి మహిమలు వివరించి పరమశివుడే వేంకటాచలం పంపినట్టు నారదుడు వాల్మీకితో చెప్పారు. వైష్ణవ మంత్రాల్లోకెల్లా ఉత్తమమైన వైష్ణవమంత్రం ఉపదేశించమని శంభుణ్ణి కోరి ఉపదేశం పొందిన స్కందుడు వేంకటాచలానికి వెళ్ళాడని పురాణం చెప్తోంది.

పురాణాల పరంగా ఆదిశేషుడు, వాయుదేవుడూ ఈ పర్వతంపై తపమాచరించారని అంతమాత్రాన ఇది వాయుక్షేత్రమో, శేషుని క్షేత్రమో అవుతుందా అని ప్రశ్నించారు. స్వామి పుష్కరిణికి ఆ పేరు రావడం వెనుక అది తీర్థాలన్నిటికీ సార్వభౌమమని భగవంతుడు వరం ఇవ్వడమే కారణమని స్పష్టం చేశారు. తపస్సు ఆచరించడానికి వచ్చిన కుమారస్వామి కనుక ఆయుధాలు లేవని శైవుల సమర్థనను వామన పురాణంలో వేంకటాచలం వెళ్ళినపుడు కుమారస్వామి ధనుస్సు, శక్తి ధరించే వెళ్ళినట్టు ఉండడాన్ని గుర్తుచేసి ఖండించారు. 

ధృవబేరానికి రెండు చేతులు కటిహస్తం, వరదహస్తం కాగా మరో రెండు చేతులూ పైకి ఎత్తి ఆయుధాలు పట్టుకోవడానికి ఎత్తినట్టు ఉంటాయి. శరవణుడే ఐతే ధనుస్సు ఆయుధంగా కల ఆయన అది వదిలారనుకున్నా అలా చెయ్యి ఎత్తిపట్టుకోరు కదా. 3

శంఖ చక్రాలు ధరించకపోవడాన్ని సమర్థిస్తూ పురాణాల్లో చోళరాజుకు ఐదు ఆయుధాలు ఇవ్వడం, రాక్షస సంహారం కోసం తొండమాను చక్రవర్తికి తన శంఖచక్రాలు ఇచ్చినట్టున్న సందర్భాలు వివరించారు.

శ్రీనివాసుడు తొండమానుడికి ఆయుధాలు ఇచ్చినప్పుడు వరం కోరుకొమ్మంటే తనకు సహాయంగా శ్రీహరి శంఖచక్రాలు ఇచ్చినట్టు తరతరాలుగా తెలిసేట్టు ఆ ఆయుధాలు ధరించని స్థితిలో ఉండమని కోరాడు. దాన్ని మన్నించి ఆ ఆయుధాలను అవ్యక్తంగా ఉంచేశారనే ఘటన వివరించి సమర్థించారు.

తొండమానుడితో సంభాషణలోనే భవిష్యత్ కాలంలో తాను తిరిగి శంఖచక్రాలు ధరిస్తానని తెలిపారట.

వీటన్నిటి నేపథ్యంలో వాదనల అనంతరం స్వామి ముందు విష్ణు ఆయుధాలైన శంఖచక్రాలు, సుబ్రహ్మణ్య ఆయుధాలైన శక్తి, శివపార్వతుల త్రిశూలం బంగారంతో చేయించి ముందుంచారు. నీవు ఏ దైవానివైతే ఆ ఆయుధాలు స్వీకరించమని ప్రార్థించి తెల్లవార్లూ ఆలయం చుట్టూ కాపలా ఉండి ఉదయం తెరచి చూశారు. ఖాళీ చేతుల స్థానంలో శంఖ చక్రాలు చేరాయని అదే స్థితిలో నేటికీ ధృవబేరం ఉందని వేంకటాచల ఇతిహాసమాల తెలిపింది.

వక్షఃస్థలంపై లక్ష్మీశ్రీవత్సం ఉండడం కూడా వేంకటేశుడే శ్రీనివాసుడని సూచిస్తున్నట్టుగా తెలిపారు.

మహేంద్ర వినుత గోవిందా, మహాను భావా గోవిందా, మహలక్ష్మి నాధ గోవిందా, శ్రీ వెంకటేశ గోవిందా; |

గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||35||

*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🌹సౌందర్యలహరి🌹* *శ్లోకం - 13*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

          *🌹సౌందర్యలహరి🌹*

*శ్లోకం - 13*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

*నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం*

*తవాపాంగాలోకే పతిత మనుధావన్తి శతశః |*

*గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్త సిచయాః*

*హఠత్తృట్యత్ కాంచో విగళిత దుకూలా యువతయః ||*

అమ్మా నీ కరుణా కటాక్ష వీక్షణాలు పడితే ఎంత పనికిమాలినవాడైనా సమర్ధుడుగా మారతాడని ఈ శ్లోకం అర్థం. ఇక్కడ శంకరులు స్థిరః, స్థాణుః అని నామాలున్న జడుడైన(ఆత్మారాముడైన) శివుని పై ఆరోపించి చమత్కారంగా చెప్పారు ఈ అద్భుతమైన శ్లోకం.

నరం వర్షీయాంసం = వయస్సుచేత వృద్ధుడు (అనాదియైనవాడు)

నయనవిరసం = కంటి చూపుకు కూడా బాగాలేనివాడు (విరూపాక్షుడు కదా!)

నర్మసు జడం = సరసానికి, రసజ్ఞతకు జడుడు.ఇలాంటి వాడిని అమ్మవారు,

మనుధావంతి శతశః = తన కరుణాపూరితమైన చూపులు ప్రసరింపచేయగానే,ఆయన ఎంత ఆకర్షణీయంగా అవుతాడంటే,దేవతా స్త్రీలు ఆయనను చూసి,

గలద్వేణీబంధాః = జుట్టు ముడులు విడిపోతూ ఉండగా

యోగపరంగా రుద్రగ్రంథి విభేదిని, భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రము నుండి సహస్రారపద్మమునకు చేర్చునది.కేశపాశములు ఉండే స్థానము.

కుచకలశ విస్రస్త సిచయాః = వక్షములపై కల వస్త్రములు ముడులు తొలగిపోయి

విష్ణుగ్రంధి విభేదిని, హృదయస్థానములో కల అనాహతము నుండి విశుద్ధిచక్రమునకు చేర్చునది.

హఠాత్తృట్యత్ కాంచో = నడుముకు చుట్టిన  వస్త్రము ముడి ఊడిపోయి

బ్రహ్మగ్రంధి విభేదిని, మూలాధారము నుండి నాభి వెనక కల మణిపూరమునకు చేర్చునది.ఈ గ్రంధులు విడిపోగానే సాధకుడు జీవన్ముక్తుడవుతాడు.

విగళిత దుకూలా = వస్త్రములు ఊడిపోయి 

కృష్ణుని వేణుగానం విన్న గోపికలవలె తనువులు మరచి ఆకర్షితులవుతున్నారు అని భావం.

అమ్మవారి చూపు పడగానే ప్రపంచంలోని శక్తులన్నీ ఆమెకి దాసానుదాసులవుతారని గ్రహించాలి.

            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 29*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 29*

ఎవరో చెప్పారు కనుక, ఏదో ఫలానా గ్రంథంలో వ్రాశారు కాబట్టి దేనినీ యథాతథంగా స్వీకరించే వ్యక్తి కాదు నరేంద్రుడు. సత్యాన్ని ప్రత్యక్షంగా ఆవిష్కరించుకొన్న వ్యక్తిని దర్శించాలని  పలువురిని కలుసుకొని విచారణ చేశాడు. కాని ఎవరి నుండి 'అవును' అనే స్పష్టమయిన జవాబు లభించలేదు. ఈ తరుణంలో ఒక రోజు అతడి బంధువూ, శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో ఒకరూ అయిన రామచంద్ర దత్తా అతడితో, 

"ఇలా చూడు నరేంద్రా! నిజమైన మహాత్మునికై నువ్వు ఇక్కడా అక్కడా గాలిస్తున్నావు. దక్షిణేశ్వరంలో ఒక పరమహంస నివసిస్తున్నారు. ఒక రోజు నాతోబాటు వచ్చి ఆయనను చూడు" అని చెప్పాడు. అందుకు నరేంద్రుడు "నాకు తెలుసు. ఆయనను గురించి వాకబు చేశాను. కాని ఆయన విద్యాగంధం లేని వారు! స్పెన్సర్, హేమిల్టన్, లాక్కే లాంటి పలువురిని అధ్యయనం చేసిన నాకు, విద్యాహీనులైన ఆయన ఎలా మార్గదర్శికాగలరు?" అని ఎదురు ప్రశ్న వేశాడు. రామచంద్రదత్తా మౌనం వహించాడు.దేనికైనా సమయమూ, సందర్భమూ రావాలి కదా! అలాంటి తరుణం సత్వరమే ఆసన్నమయింది.🙏

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పో త న కవి తా వై భ వం!!

పో త న కవి తా వై భ వం!!

*రచన:-శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు:--*

ఎండిన మ్రోడులే కిసలయించెనొ! యేకశిలాపురమ్ములో

బండలు పుల్కరించెనొ ! అపార ముదమ్మున తెల్గుతల్లికిన్‌

గుండెలు పొంగిపోయి కనుగొల్కులు నిండెనొ ! 

పచ్చి పైరులే

పండెనొ ! 

జాలువారిన భవత్‌ కవితామృత భక్తిచారలన్‌ !

 భీష్మునిపైకి కుప్పించి లంఘించు గోపాల కృష్ణుని కుండలాల కాంతి

కరిరాజు మొరవెట్ట పరువెత్తు కరివేల్పు

ముడివీడి మూపు పై పడిన జుట్టు

సమరమ్ము గావించు సత్య కన్నుల నుండి

వెడలు ప్రేమ క్రోధ వీక్షణములు

కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ సందు మాగాయ పచ్చడి పసందు

ఎటుల కనుగొంటివయ్య ! నీ కెవరు చెప్పి

 రయ్య ! యే రాత్రి కలగంటివయ్య ! రంగు

కుంచెతో దిద్ది తీర్చి  చిత్రించినావు !!

సహజ పాండితి కిది నిదర్శనమటయ్య !!

ముద్దులుగార- భాగవతమున్‌ రచియించుచు, పంచదారలో

నద్దితివేమొ గంటము 

మహా కవి శేఖర ! మధ్య మధ్య నట్లద్దక వట్టి గంటమున నట్టిట్టు గీచిన, తాటియాకులో

పద్దెములందు - ఈ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా!

*సేకరణ: శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి వాట్సాప్ పోస్ట్.* 

🙏🙏🙏🌷🌷👏👏👏👏

నవగ్రహా పురాణం🪐* . *16వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *16వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*పురాణ పఠనం ప్రారంభం*

*సూర్యగ్రహ జననం - 7*

కశ్యప ప్రజాపతి అధ్యాపనంలో సూర్యుడి విద్యార్జన ప్రారంభమైంది. వేదాలూ , వేదాంగాలూ , తర్క , వ్యాకరణ , ధర్మ , మీమాంస , జ్యోతిష , వైద్య శాస్త్రాలూ అచిరకాలంలో సూర్యుడి మేధస్సులో కాపురం చేయసాగాయి. విద్యా బలంతో , సహజ కాంతివంతమైన సూర్యుడి ముఖ మండలంలో నూతన వర్చస్సు తాండవం చేయసాగింది.

సకల చరాచర ప్రాణుల పట్లా చిన్నతనం నుంచే సూర్యుడు ప్రకటించే 'సమత' అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. విద్యనూ , వినయాన్నీ పుణికి పుచ్చుకున్న సూర్యుడు బాల్యావస్థను దాటి యవ్వనంలోకి అడుగుపెట్టాడు. చూపుల్ని సూదంటు రాయిలా లాగిపట్టే శరీరకాంతి , సౌష్టవంతో నిండిన నిలువెత్తు విగ్రహం , అందమైన ముఖంలో చెరగని చిరునవ్వు , ప్రత్యూష సౌందర్య పరాకాష్ఠలా ఉన్నాడు సూర్యుడు.

అదితి ఆశ్రమం ముందు అరుగు మీద కూర్చుంది. సమిధలూ , పువ్వులూ సేకరించుకుని కశ్యపుడు వచ్చాడు. పువ్వుల్ని అదితి ముందున్న దర్భతో అల్లిన చాప మీద రాశిగా పోశాడు. అందమైన తామర మొగ్గలు ప్రత్యేకంగా కనువిందు చేస్తున్నాయి.

తల్లిదండ్రుల వైపు చిరునవ్వులు చిందిస్తూ సూర్యుడు వెలుపలి నుంచి ఆశ్రమం వైపుకు వస్తున్నాడు. అదితి కొడుకుని రెప్పవేయకుండా చూస్తోంది.

*"స్వామీ ! నా కొడుకుని చూశారా ! యవ్వనం సూర్యుడి అందాన్ని వెయ్యింతలు చేసింది కదూ ?"* అదితి కంఠంలో మాతృ సహజమైన గర్వం లీలగా ధ్వనించింది. *"నీ పుత్రుడి సౌందర్యం దైవిక సౌందర్యం అదితీ !"*

*"నా బిడ్డడి ఆ దివ్య సౌందర్యం ఏ అదృష్టవంతురాలికి మహాభాగ్యం అవుతుందో !"* అదితి పారవశ్యంతో అంది.

*"సౌందర్యంలో సరితూగే యువతిని అన్వేషించాలి మన సూర్యుడి కోసం ,"* కశ్యపుడు సూర్యుణ్ణి చూస్తూ అన్నాడు.

సూర్యుడు ఆశ్రమం ద్వారం ముందుకు వచ్చాడు. సూర్యుడు దగ్గరకు రాగానే ప్రాణం వచ్చినట్లు తామర మొగ్గలు వికసించాయి.

*"సమిధలు ఇలా ఇవ్వండి నాన్నగారూ !"* అంటూ కశ్యపుడు మోస్తున్న సమిధలను తీసుకుని సూర్యుడు ఆశ్రమంలోనికి వెళ్లాడు. కశ్యపుడు కూర్చున్నాడు. అదితి , కశ్యపులు తలలు తిప్పి , కొడుకు వైపే చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆశ్రమం ముందు వైపు నుంచి శ్రావ్యంగా నారాయణ నామగానం వినిపించింది. ఇద్దరూ తలలు తిప్పి చూశారు. వీణను మీటుతూ , నామగానం చేస్తూ వస్తున్నాడు నారదమహర్షి.

అదితి , కశ్యపుడూ అరుగు మీంచి లేచి , మర్యాద పూర్వకంగా నారదుడికి ఎదురేగారు. చిరునవ్వుతో స్వాగతం చెప్తూ , *"దయచేయండి !"* కశ్యపుడు చేతులు జోడిస్తూ అన్నాడు. *"ఈరోజు మీరు మా ఆతిథ్యం స్వీకరించాలి !"* అదితి నారదుడితో అంది.

*"అలాగేమ్మా. దానికేం భాగ్యం !"* నారదుడు నవ్వుతూ అన్నాడు. *"ఆకాశమార్గాన వెళ్తుంటే... మీ సుపుత్రుడు సూర్యుడు ఏదో కాంతిస్తంభంలా కనిపించాడు. వయసు పెరిగింది ; అందమూ పెరిగింది.”*

*"ఇందాకా మేమిద్దరమూ అదే అనుకున్నాం. సూర్యుడు చూడచక్కని యువకుడయ్యాడు!"* కశ్యపుడు నవ్వుతూ అన్నాడు.. *"ఔనౌను. వివాహం సంకల్పించారా ? నారదుడు అడిగాడు.ఆ

*"మాదేముంది ? ఆ దైవం సంకల్పించాలి.”* అదితి వినయంగా అంది.

*"దైవ సంకల్పం జరిగిపోయింది. ఆ... కశ్యపా ! చూడచక్కని సుందరాకారుడైన సూర్యుడికి చూడచక్కని సుందరి కావాలి కదా. చూడచక్కని సుందరాంగిని ఇటీవల చూశాను...”* నారదుడు అన్నాడు. అరుగు మీద ఆసీనుడవుతూ...

*"ఎక్కడ మహర్షీ ?"* అదితి ఆతృతగా అడిగింది. *"ఎవరా చిన్నది ?”.* 

*"దేవశిల్పి విశ్వకర్మ ఉన్నాడు కదా ! ఆయన ఎవరనుకున్నారు ?"* నారదుడు అడిగాడు.

*"ప్రభాసవసు పుత్రుడు కదా?"* కశ్యపుడు అన్నాడు.

*"ఔను ! అష్టవసువులలో ఎనిమిదవ వాడైన ప్రభాసుడికీ , ఆయన పత్ని 'వరస్త్రీ'కి జన్మించినవాడు మన విశ్వకర్మ. ఆయన సేవలు అందుకొనని దేవతలు లేరు. ఆ దంపతుల జ్యేష్ఠ పుత్రిక సంజ్ఞ... సౌందర్యరాశి. మన సూర్యుడి కోసమే జన్మించిందని అనిపించింది నాకు ఆ కన్యను చూడగానే ,"* నారదుడు వివరించాడు.

*"అలాగా ! అయితే విశ్వకర్మ దంపతులను సంప్రదించి , వాళ్ళ అభిప్రాయం...."* అదితి కశ్యపుడి వైపు చూస్తూ చెప్పుకుపోతోంది. 

*"తెలుసుకునే వచ్చాను!"* ఆమె మాటకు తన మాటతో అడ్డువేశాడు నారదుడు. *"మన సూర్యుడి గురించి విశ్వకర్మ ఆనోటా , ఈనోటా మాత్రమే కాకుండా చతుర్ముఖుల నాలుగు నోళ్ళ ద్వారా విని ఉన్నాడు. ఆ దంపతులకు లేశమంత అభ్యంతరమూ లేదు..."*

*"అయితే ఆ కన్యామణి అభిప్రాయం ?"* కళ్యపుడు అన్నాడు.

*"సంజ్ఞాకుమారి అభిప్రాయం కూడా పసిగట్టే వచ్చాను. ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనూ , విడిగానూ సూర్యుడి అందచందాలనూ , ప్రభావాన్ని కళ్ళకు కట్టినట్టు చక్కగా వర్ణించాను. సంజ్ఞ తన ఇష్టాన్ని పెదవులతో చెప్పలేదు గానీ , కళ్ళతో స్పష్టం చేసింది"* నారదుడు నవ్వుతూ అన్నాడు.

*"అలాగా ! అన్నీ ఆకళింపు చేసుకునే వచ్చారన్నమాట!"* అదితి నవ్వుతూ అంది.

*"నారదుల వారి తీరే అంత అదితీ , మన కళ్యాణం విషయంలోనూ ఇలాగే చొరవగా ప్రవర్తించారు కదా !"* కశ్యపుడు గతాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు. 

*"ఇంతెందుకు కశ్యప ప్రజాపతీ ! నాతో చెప్పకపోయినప్పటికీ సంజ్ఞ అభిప్రాయం. వినే వచ్చాను. ఆ చిన్నది ఉద్యానవనంలో తన తల్లితో సూర్యుడి గురించి ఉత్సాహంగా చెప్తుంటే ఆ మాటను చాటుగా విన్నాను."* నారదుడు నవ్వుతూ అన్నాడు.

*"అయితే , ఇంకేం ? ఆ కన్యామణి అందచందాల గురించీ , గుణగణాల గురించీ సూర్యుడికి మీరే వివరించి చెప్పండి. తదనంతరం విశ్వకర్మ దంపతులతో సంప్రదించి , కళ్యాణం జరిపించుదాం !"* కశ్యపుడు అన్నాడు.

*"సంజ్ఞ గురించి మన సూర్యుడికి ఎరుక పరచడానికే ప్రత్యేకంగా వచ్చాననుకోండి ! ఆ కార్యం సానుకూలం చేసి , విశ్వకర్మతో మాట్లాడుతాను. ఆయనే మీ దర్శనానికి వస్తాడు."* అన్నాడు నారదుడు.

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 29*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*

.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

*భాగం 29*

ఎవరో చెప్పారు కనుక, ఏదో ఫలానా గ్రంథంలో వ్రాశారు కాబట్టి దేనినీ యథాతథంగా స్వీకరించే వ్యక్తి కాదు నరేంద్రుడు. సత్యాన్ని ప్రత్యక్షంగా ఆవిష్కరించుకొన్న వ్యక్తిని దర్శించాలని  పలువురిని కలుసుకొని విచారణ చేశాడు. కాని ఎవరి నుండి 'అవును' అనే స్పష్టమయిన జవాబు లభించలేదు. ఈ తరుణంలో ఒక రోజు అతడి బంధువూ, శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో ఒకరూ అయిన రామచంద్ర దత్తా అతడితో, 

"ఇలా చూడు నరేంద్రా! నిజమైన మహాత్మునికై నువ్వు ఇక్కడా అక్కడా గాలిస్తున్నావు. దక్షిణేశ్వరంలో ఒక పరమహంస నివసిస్తున్నారు. ఒక రోజు నాతోబాటు వచ్చి ఆయనను చూడు" అని చెప్పాడు. అందుకు నరేంద్రుడు "నాకు తెలుసు. ఆయనను గురించి వాకబు చేశాను. కాని ఆయన విద్యాగంధం లేని వారు! స్పెన్సర్, హేమిల్టన్, లాక్కే లాంటి పలువురిని అధ్యయనం చేసిన నాకు, విద్యాహీనులైన ఆయన ఎలా మార్గదర్శికాగలరు?" అని ఎదురు ప్రశ్న వేశాడు. రామచంద్రదత్తా మౌనం వహించాడు.దేనికైనా సమయమూ, సందర్భమూ రావాలి కదా! అలాంటి తరుణం సత్వరమే ఆసన్నమయింది.🙏

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సద్గుణాల వల్ల

 శ్లోకం:☝️

*గుణైరుత్తమతాం యాన్తి*

  *నోచ్చైరాసనసంస్థితైః ।*

*ప్రసాదశిఖరస్థోఽపి*

  *కిం కాకో గరుడాయతే ॥*

భావం: మనిషి కేవలం సద్గుణాల వల్ల గొప్పవాడవుతాడు తప్ప ఉన్నత స్థానంలో కూర్చోవడం వల్ల కాదు. రాజభవనం శిఖరం పైన కూర్చున్నా కాకి గ్రద్దగా మారదు కదా!

పంచాంగం 04.09.2023 Monday,

 ఈ రోజు పంచాంగం 04.09.2023 Monday,

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు నిజ శ్రావణ మాస కృష్ణ పక్ష: పంచమి తిధి ఇందు వాసర: అశ్విని నక్షత్రం ధ్రువ యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం. 

పంచమి సాయంత్రం 04:48 వరకు.

అశ్విని పగలు 09:29 వరకు.

సూర్యోదయం : 06:06

సూర్యాస్తమయం : 06:24

వర్జ్యం : ఉదయం 05:41 నుండి 07:12 వరకు తిరిగి సాయంత్రం 06:54 నుండి రాత్రి 08:28 వరకు.

దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:40 నుండి 01:29 వరకు తిరిగి మధ్యాహ్నం 03:07 నుండి 03:56 వరకు.

రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00  వరకు.

యమగండం : పగలు 10:30 నుండి 12:00 వరకు.  

శుభోదయ:, నమస్కార: