21, డిసెంబర్ 2023, గురువారం

Panchang


 

Jokes






 

ఘంట మూడు సార్లే

 🙏దేవాలయానికి వెళ్ళినపుడు ఘంట మూడు సార్లే  ఎందుకు కొట్టాలి. తెలుసా ?🙏


శ్లోకము :


 ఏకతాడే మరణం చైవ

ద్వితాడే వ్యాధి పీడనం!

త్రితాడే సుఖమా ప్నోతి  తత్ఘంటా నాద లక్షణం.


భావం : దేవుని ముందర ఘంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతం .


రెండుసార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింప బడతాము. 


🙏మూడుసార్లు ఘంటానాదం చేయడం చేత శరీరమునకు , మనస్సుకు సుఖము కలుగుతుంది.🙏


ఈ పద్దతిని 💐దేవాలయ ఘంటా నాద లక్షణము💐 గా శాస్త్రం చెప్పబడింది .


( దేవాలయంలో ఘంటానాదం ద్వారా జనించే ఓంకార ధ్వని తరంగాలను మన చెవుల ద్వారా శరీరంలోకి శబ్ద తరంగాలకు అనుసంధానం చేయండి తద్వారా మానసిక ప్రశాంతతను పొందండి.)

⚜ శ్రీ అంబికాదేవి మందిర్

 🕉 మన గుడి : నెం 274


⚜ హర్యానా : అంబాలా


⚜ శ్రీ అంబికాదేవి మందిర్ 


💠 అంబికా దేవి మందిరం పురాతన పుణ్యక్షేత్రం మాత్రమే కాకుండా ఈ ప్రదేశానికి మూలం కూడా.  

అంబ, అంబిక మరియు అంబాలికా దేవతలకు అంకితం చేయబడిన పురాతన హిందూ దేవాలయం బ్రిటిష్ రాజ్ కంటే ముందు నిర్మించబడింది. 



💠 అంబాలా నగరానికి భవాని అంబికా అనే పేరు వచ్చింది, ఇది  దుర్గాదేవి యొక్క స్వరూపం. 

నిజానికి, ఇది నగరంలోని పురాతన దేవాలయాలలో ఒకటి.


💠 తెలిసిన వాస్తవాల ప్రకారం, అంబికా దేవి ఆలయం మహాభారత యుద్ధంలో పాండవులచే నిర్మించబడింది. 

ప్రారంభంలో, ఈ ఆలయం సరస్వతి నదిలో ఒక చిన్న గుట్టపై ఏర్పాటు చేయబడింది.

నది నీరు క్రమంగా దిగువకు వస్తున్నప్పటికీ, ఆలయం ఇప్పటికీ క్షేమంగా ఉంది.



⚜ ఆలయ చరిత్ర ⚜


💠 అంబాలా అనే పేరు ఈ దేవి అంబా ఆలయం నుండి వచ్చిందని నమ్ముతారు. పురాతన కాలంలో ఈ ఆలయాన్ని ఒక ముఖ్యమైన యాత్రా స్థలంగా భావించేవారు. హర్యానాలోని దేవాలయాలు చాలావరకు పురాతన కాలం నాటివి. 


💠 ఈ ప్రాచీన దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు. వీటిలో ఎక్కువ భాగం నిర్మాణ కళాఖండాలు మరియు పాండిత్యం మరియు జాతికి సంబంధించిన ఖజానాలు.


💠 హర్యానా రాష్ట్రంలో చాలా ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. 

అంబా భవానీ దేవాలయం, అంబాలాలోని కాళీ మాత మందిరం, గుర్గావ్‌లోని శివాలయం, బిష్ణోయ్ మందిరం మరియు శీతలా దేవి ఆలయం వంటి కొన్ని ఆలయాలు మాత్రమే ఉన్నాయి. 


💠 హర్యానా రాష్ట్రంలోని అనేక పురాణ ఆలయాలలో, భవానీ అంబా ఆలయం ప్రముఖమైనది. 

ఆలయంలో అంబా, అంబిక అలాగే అంబాలిక - మహాభారతంలోని ప్రసిద్ధ మహిళా కథానాయకుల విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలో నవరాత్రులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. 

భారీ జాతర నిర్వహించబడుతుంది మరియు భక్తులు ప్రతిరోజూ ప్రార్థనలు చేస్తారు.



💠 ఇక్కడి దేవతను అంబాదేవి లేదా భవానీ దేవి అని పిలుస్తారు.


💠 అందంగా చెక్కబడిన స్తంభాలు మరియు ఆలయ గోడలపై ఉన్న అంతర్గత చెక్కడాలు గత యుగంలో ప్రబలంగా ఉన్న గొప్ప కళాత్మకత గురించి తెలియజేస్తాయి

 

💠 అంబా భవానీ ఆలయ సమయాలు:-

భవానీ అంబా ఆలయంలో దర్శనం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రారంభమవుతుంది మరియు తరువాత మధ్యాహ్నం 1 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. 


💠 ఆలయ ట్రస్టు వారు అమ్మవారికి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు నైవేద్యం ఇస్తారు. 

ఈ సమయంలో భక్తులను ఆలయంలోకి అనుమతించరు. 


💠 వేసవిలో, ఆరతి ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రారంభమవుతుంది, అయితే శీతాకాలంలో ఇది ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు ప్రారంభమవుతుంది.


💠 అంబాభవానీ ఆలయం భక్తులకు ఆహారాన్ని అందిస్తుంది. 

అవి ఉచితం మరియు అన్ని ఖర్చులు ట్రస్టీలు భరిస్తాయి. 

రోజువారీ పూజలు ముగిసిన తర్వాత, భక్తులను ఆహారం కోసం తరలించడానికి అనుమతిస్తారు. 

ఈ ఆహారాన్ని ఆలయ గౌరవాన్ని కాపాడుతూ చాలా పరిశుభ్రమైన స్థితిలో తయారు చేస్తారు. ఆహారం  పుష్కలంగా ఇవ్వబడుతుంది. 

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


ఇటువంటి

మహాపాపం నీ రాజ్యంలో, నీ సమక్షంలో నీ కోసం జరగడమా దేశంలో జరిగే పాపాలన్నింటా

ఆరవవంతు రాజుకు సంక్రమిస్తుంది తెలుసా? అందుకనే రాజుగారు పనిబూని తన రాజ్యంలో పాపాలు

జరక్కుండా చూసుకోవాలి అనడం. పుత్ర విక్రయాన్ని నువ్వు నిషేధించవలసింది పోయి నీకోసమే

ప్రోత్సహిస్తావా ? సూర్యవంశంలో పుట్టావు. త్రిశంకుడికి తనయుడివి. ఇది నీకు తగునా ? ఆర్యుడిపై

ఆవార్యుడిగా ప్రవర్తిస్తావా ?

-

దేశమధ్యే చ యః కశ్చిత్పాపకర్మ సమాచరేత్ |

షష్టాంశస్తస్య పాపస్య రాజా భుంక్తేవ సంశయః ॥


విషేధనీయో రాజ్ఞాసా పాపం కర్తుం సముద్యతః ।

న నిషిద్ధస్త్యయా కస్మాత్ పుత్రం విక్రేతుముద్యతః

.

సూర్యవంశే సముత్పన్నః త్రిశంకుతనయః శుభః |

ఆర్యస్య్తమనార్యవత్కర్మ కర్తుమిచ్చసి పార్థివ||


మహారాజా ! నేను రావడం మంచిదే అయ్యింది. నామాట విను. ఈ విప్రనందనుణ్ణి విడిచి పెట్టించు.

నీ ఆరోగ్యం కుదుటపరిచే పూచీ నాది. నీ తండ్రి చండాలత్వం తొలగించి సశరీరంగా స్వర్గానికి పంపించాను.

గుర్తుందా ? దానికి నువ్వెంతో పొంగిపోయావు. ఆ సంతోషానికి ఫలంగానైనా నా మాట విను. చూడు, ఈ

పసిబాలుడు ఎలా విలపిస్తున్నాడో. ప్రాణభయంతో వణికిపోతున్నాడు. వెంటనే విడిచిపెట్టించు. ఇది నా

అభ్యర్థన. నా యాచన. కాదన్నావనుకో అదొక పెద్దదోషమవుతుంది. యజ్ఞ సమయంలో (వేదవేత్తలు)

ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలి. లేకపోతే మహాపాపమే. సందేహం లేదు.


ప్రార్థితం సర్వధా దేయం యజ్ఞేఽస్మిన్ నృపసత్తమ |

అన్యథా పాపమేవ స్యాత్ తవ రాజన్నసంశయః

*21-12-2023 / గురువారం / రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️

 •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*21-12-2023 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------

వృషభం


వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

---------------------------------------

మిధునం


నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు జీతాభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. గృహమున బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

కర్కాటకం


వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహనిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

---------------------------------------

సింహం


అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు చికాకు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. బంధువులతో ఆకస్మిక తగాదాలు ఉంటాయి.

---------------------------------------

కన్య


నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. కుటుంబ సమస్యలు వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.

---------------------------------------

తుల


ఉద్యోగమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

వృశ్చికం


 దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణ ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆప్తుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

---------------------------------------

ధనస్సు


చేపట్టిన పనులలో  శ్రమ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

---------------------------------------

మకరం


సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. పాత రుణాలు  తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో  శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.

---------------------------------------

కుంభం


వృత్తి, వ్యాపారాలు సాఫీగా  సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. చేపట్టిన  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

---------------------------------------

మీనం


వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 20*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 9*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*సుందరకాండ వర్ణనము - 2*


హనుమాన్స దశగ్రీవదర్శనోపాయ మాకరోత్‌ | వనం బభఞ్జ తత్పాలాన్‌ హత్వా దన్తనఖాదిభిః 16


హత్వా తు కిఙ్కరావన్‌ సర్వాన్‌ సప్త మన్త్రిసుతానపి | పుత్రమక్షం కుమారం చ శక్రజిచ్చ బబన్ద తమ్‌. 17


నాగపాశేన పిఙ్గాక్షం దర్శయామాస రావణమ్‌ | ఉవాచ రావణః కస్త్వం మారుతిః ప్రాహ రావణమ్‌. 18


అపుడు హనుమంతుడు రావణుని చూచుటకై ఒక ఉపాయమును చేసెను. దంతములు నఖములు మొదలగు వాటితో ఉద్యానపాలకులను చంపి, ఆ ఉద్యానవనమును విరచెను. కింకరులను అందరు రాక్షసులను, ఏడుగురు మంత్రి కుమారులను, రావణుని పుత్రుడైన అక్షకుమారుని కూడ చంపెను. ఇంద్రజిత్తు నాగపాశముచే అతనిని బంధించి రావణునికి చూపెను. " నీవెవ్వడవు?" అని రావణుడు ప్రశ్నింపగా మారుతి రావణునితో ఇట్లనెను.


హనుమానువాచ:


రామదూతో రాఘవాయ సీతాం దేహి మరిష్యసిర్రాయబాణౖర్హతః సార్థం లఙ్కాస్థై రాక్షసైర్ధ్రువమ్‌. 19


హనుమంతుడు పలికెను. "నేను రాముని దుతను. సీతను రామున కిచ్చి వేయుము.


ఇవ్వకున్నచో, లంకలో నున్న రాక్షసులతో గూడ, రామబాణములచే కొట్టబడి మరణింపగలవు. తప్పదు.


రావణో హన్తుముద్యుక్తో విభీషణనివారితః | దీపయామాస లాజ్గూలం దీప్తపుచ్ఛః స మారుతిః 20


దగ్ధ్వా లఙ్కాం రాక్షసాం శ్చ దృష్ట్వా సీతాం ప్రణమ్య తామ్‌ | సముద్రపారమాగత్య దృష్టా సీతేతి చాబ్రవీత్‌.


అఙ్గదాదీనఙ్గదాద్యైః పీత్వా మధువనే మధు | జిత్వా దధిముఖాదీంశ్చ దృష్ట్వా రామం చ తే7బృవన్‌. 22


దృష్టా సీతేతి రామో7పి హృష్టః పప్రచ్ఛ మారుతిమ్‌ |


రావణుడు హనుమంతుని చంపుటకు ఉద్యమించగా విభీషణుడు నివారించెను. హనుమంతుని తోకకు నిప్పు అంటింపచేసెను. ఆ హనుమంతుడు మండుచున్న తోకతో లంకను, రాక్షసులను కాల్చి సీతను చూచి నమస్కరించి, సముద్రము దాటి వచ్చి, ' సీతను చూచితిని' అని అంగదాదులుతో చెప్పెను. అంగదాదులతో కలిసి, దధిముఖాదులను ఓడించి, మధువనములోని మధువును త్రాగెను. వారందరును రాముని వద్దకు వెళ్ళి "సీతను చూచితిమి" అని పలికిరి. రాముడు సంతసించి హనుమంతునితో ఇట్లనెను.


శ్రీరామ ఉవాచ:


కథం దృష్టా త్వయా సీతా కిమువాచ చ మాం ప్రతి. 23


సీతాకధామృతేనైవ సిఞ్చ మాం కామవహ్నిగమ్‌ |


శ్రీ రాముడు పలికెను _"నీవు సీతను ఎట్లు చూచితివి? ఆమె నాతో ఏమని చెప్పమన్నది? మన్మథాగ్నిలో పడి ఉన్న నన్ను సీతా కథా మృతముచే తడుపుము."


నారద ఉవాచ:


హనుమానబ్రవీద్రాం లఙ్ఘ యిత్వాబ్ధిమాగతః


సీతాం దృష్ట్వా పురీం దగ్ధ్వా సీతామణిం గృహాణవై | హత్వాతం రావణం సీతాం ప్రాప్స్యసే రామ మా శుచః.


నారదుడు పలికెను. హనుమంతుడు రామునితో ఇట్లు పలికెను. " రామా! సముద్రము లంఘించి, సీతను చూచి, లంకను కాల్చి వచ్చినాను. సీత ఇచ్చిన మణిని తీసికొనుము. ఆ రావణుని సంహిరంచి సీతను పొందగలవు. దుఃఖింపకుము.


గృహీత్వా తం మణిం రామో రురోద విరహాతుర ః | మణిం దృష్ట్వా జానకీ మే దృష్టా సీతాం నమస్వమామ్‌.


తయా వినా న జీవామి సుగ్రీవాద్యైః ప్రబోధితః | సముద్రతీరం గతవాం స్తత్ర రామం విభీషణః. 27


గతిస్తిరస్కృతో భ్రాత్రా రావణన దురాత్మనా | రామాయ దేహి సీతాం త్వమిత్యుక్తేనాసహాయవాన్‌. 28


రాముడా మణిని గ్రహించి, సీతావిరహముచే దుఃఖితుడై ఏడ్చెను. "మణిని చూడగనే సీతను చూచినట్లున్నది. నన్ను సీతవద్దకు తీసికొని వెళ్ళుము. అమెను విడచి జీవింపజాలను" అని పలికెను. సుగ్రీవాదులు ఓదార్చిరి. పిమ్మట సముద్రతీరము చేరెను. "సీతను రామునకు ఇచ్చివేయుము" అని విభీషణుడు రావణునకు ఉపదేశింపగా ఆ దురాత్ముడు అతనిని అవమానించెను. అందుచేత విభీషణుడు అసహాయుడై రామునివద్దకు వెళ్ళెను.


రామో విభీషణం మిత్రం లజ్కైశ్వర్యే7భ్యషేచయత్‌ | సముద్రం ప్రార్థయన్‌ మార్గంయదా నాయాత్త దా శ##రైః.


భేదయామాన రామం చ ఉవాచాబ్ధిః సమాగతః|


రాముడు మిత్రుడైన విభీషణుని లంకారాజ్యమునందు అభిషిక్తుని చేసెను- మార్గమిమ్మని సముద్రుని ప్రార్థింపగా అతడు ఇవ్వలేదు. అపుడు బాణములచే భేదించెను. సముద్రుడు రాముని వద్దకు వచ్చి పలికెను.


సముద్ర ఉవాచః


నలేన సేతుం బద్ధ్వాబ్ధౌ లఙ్కాం వ్రజ గభీరకః 30


అహం త్వయా కృతః పూర్వం రామో7పినలసేతునా | కృతేన తరుశైలాద్యైర్గతః పారం మహోదధేః 31


వానరైః స సువేలస్థః సహలఙ్కాందదర్శవై.


ఇత్యాది మహాపురాణ అగ్నేయే రామాయణ సున్దరకాణ్డవర్ణనం నామ నవమో7ధ్యాయః


సముద్రుడు పలికెనుః "నాపై నలునిచే సేతువు కట్టించి లంకకు వెళ్ళుము. నన్ను లోతైన వానినిగా పూర్వము చేసినది నీవేకదా"! వృక్షములు, శైలములు మొదలైన వాటితో నలుడు కట్టిన సేతువుపై రాముడు వానరులతో సముద్రమును దాటి నువేల పర్వతముపై నిలచి, లంకను చూచెను.


అగ్ని మహాపురాణములోని సుందరకాండ వర్ణనమను నవమాధ్యాయము సమాప్తము.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 21*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 10*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*యుద్ధకాండ వర్ణనము - 1*


అథ దశమోధ్యాయః

అథ యుద్ధకాణ్డ వర్ణనమ్‌.

నారద ఉవాచః


రామో క్తశ్బాఙ్గదో గత్వాం రావణం ప్రాహ జానకీ | దీయతాం రాఘవాయాశు అన్యథా త్వం మరిష్యసి. 1


నారదుడు చెప్పెను: రాముడు పంపగా అంగదుడు వెళ్ళి రావణునితో ఇట్లు చెప్పెను. "వెంటనే సీతను రామునకు ఒప్పగించుము. కానిచో మరణింపగలవు"


రావణో హన్తుమద్యుక్తః | సఙ్గ్రామోద్ధతరాక్షసః | రామాయహ దశగ్రీవో యుద్ధమేకం తు మన్యతే. 2


యుద్ధమునకై ఉద్దతులైన రాక్షసుల గల రావణుడు అతనిని చంపుటకు ప్రయత్నించెను. అతడు తిరిగివచ్చి. "దశగ్రీవుడు యద్ధమును మాత్రమే కోరుచున్నాడు" అని రామునితో చెప్పెను.


రామో యుద్ధాయ తచ్చ్రుత్వా లఙ్కాం స కపి రాయ¸°| వానరా హనుమాన్మైన్దోద్వివిదో జామ్బవాన్నలః. 3


నీలస్తారో7ఙ్గదో ధుమ్రః సుషేణః కేశరీ గజః| పనసో వినతో రమ్భః శరభః క్రథనో బలీ. 4


గవాక్షో దధివక్త్రశ్చ గవయో-గంధమాదనః | ఏతే చాన్యే చ సుగ్రీవ ఏతైర్యుక్తో హ్యసంఖ్యకైః 5


ఆ మాట విని రాముడు వానరసమేతుడై లంక చేరెను. హనుమంతుడు మైందుడు, ద్వివిదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, తారుడు, అంగద-ధూమ్ర-సుషేణులు, కేనరి, గజ - పనస - వినత - రంభ - శరభ క్రథనులు, బల శాలియైన గవాక్షుడు; దధివక్త్ర - గవయ - గంధమాదనులు, తదితర వానరులును వెళ్ళిరి. వీరితోడను, అసంఖ్యాకులగు ఇతరవానరులతోడను కూడిన సుగ్రీవుడు కూడ వెళ్ళెను.


రక్షసాం వానరాణాం చ యుద్ధం సఙ్కులమాలభౌ | రాక్షసా వానరాఞ్జఘ్నః శరశక్తిగదాదిభిః 6


వానరా రాక్షసాఞ్జఘ్నుః నఖద న్తశిలాదిభిః | హస్త్యశ్వరథపాదాతం రాక్షసానాం బలం హతమ్‌. 7


వానరరాక్షసుల మధ్య సంకుల యుద్ధము కొనసాగెను. రాక్షసులు బాణములు, శక్తులు, గదలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. వానరులు, గోళ్ళు దంతములు, శిలలు మొదలగు వాటితో వానరులను కొట్టిరి. రాక్షసుల ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు-ఈ రూపములో నన్ను సైన్యము చంపబడెను.


హనుమాన్గిరశృఙ్గేణ ధూమ్రాక్షమవధీద్రిపుమ్‌ | అకమ్పనం ప్రహస్తం చ యుధ్యన్తం నీల ఆవధీత్‌. 8


హనుమంతుడు శత్రువైన ధూమ్రాక్షున పర్వతశిఖరముతో చెంపెను. నీలుడు యుద్ధము చేయుచున్న అకంపన- ప్రహస్తులను చెంపెను.


ఇన్ద్రజిచ్ఛరబన్దాచ్చ విముక్తౌ రామలక్ష్మణౌ | తార్‌క్షసన్దర్శనాద్బాణ్ణర్జఘ్నతూ రక్షసాం బలమ్‌. 9


గరుత్మంతుని దర్శనముచే ఇంద్రజిత్తు ప్రయోగించిన శరబంధమునుండి విములైన రామలక్ష్మణులు బాణములతో రాక్షససైన్యమును సంహరించిరి.


రామః శ##రైర్జర్జరితం రావణం చాకరోద్రణ | రావణః కుమ్భకర్ణం చ బోధయమాస దుఃఖితః 10


రణరంగమున రాముడు బాణములచే రావణున జర్జరశరీరునిగా చేసెను. రావణుడు దుఃఖితుడై కుంభకర్ణుని మేల్కొలిపెను.


కుమ్భకర్ణః ప్రబుద్ధోథ పిత్వా ఘటసహస్రకమ్‌ | మద్యస్య మహిషాదీనాం భక్షయిత్వాహ రావణమ్‌. 11


నిద్రనుండి లేచిన కుంభకర్ణుడు వేయి కడవల మద్యము త్రాగి మహిషాదిమాంసము భుజించి రావణునితో ఇట్లు పలికెను.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


🌹🌹🌹🌹🌷🌷🌷🌷💐🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 22*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 10*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*యుద్ధకాండ వర్ణనము - 2*


*కుంభకర్ణ ఉవాచ:*


సీతాయా హరణం పాపం కృతం త్వం హి గరుర్యతః | అతో గచ్ఛామి యుద్ధాయ రామం హన్మి సవానరమ్‌.


కుంభకర్ణుడు పలికెను. నీవు సీతాహరణమను పాపకార్యము చేసితివి. అయినను నీవు నాకు అన్న కానయుద్ధమునకు వెళ్ళి వాన రసహితుడైన రాముని సంహరించెదను.


నారద ఉవాచః


ఇత్యుక్త్వా వానరాన్సర్వాన్‌ కుమ్భకరణో మమర్దహ | గృహీతస్తేన సుగ్రీవః కర్ణనాసం చక ర్త సః. 13


కర్ణనాసావిహీనో7సౌ భక్షయామాస వానరాన్‌ | రమో7థ కుమ్భకర్ణస్య బాహూ చిచ్ఛేద సాయకైః. 14


తతః పాదౌ తతశ్ఛిత్త్వా శిరో భూమౌ వ్యపాతయత్‌ |


కుంభకర్ణుడీ విధముగ పలకి వానరులందరిని మర్దించెను. అతడు సుగ్రీవుని పట్టుకొనగా, సుగ్రీవుడు వాని చెవులను, ముక్కును, కొరికివేసెను. చెవులు ముక్కులేని అతడు వానరులను భక్షించెను. పిమ్మట రాముడు బాణములతో కుంభకర్ణుని బాహువులను, పాదములను చేధించి అతని సిరస్సు నేలపై పడవేసెను.


అథ కుమ్భో నికుంభశ్చ మకరాక్షశ్చ రాక్షసః 15


మహోదరో మహాపార్శ్వో మత్త ఉన్మత్త రాక్షసః | ప్రఘసో భాసకర్ణశ్చ విరూపాక్షశ్చ సంయుగే. 16


దేవాన్తకో నరాన్తశ్చ త్రిశిరాశ్చాతికాయకః | రామేణ లక్ష్మణనైతే వానరైః సవిభీషణౖః. 17


యుధ్యమానాస్తథా హ్యన్యే రాక్షసా భువి పాతితాః |


పిమ్మట రామలక్ష్మణులును, వానరులును, విభీషణుడును కుంభ-నికుంభ-మకరాక్ష - మహోదర-మహాపార్శ్వ-మత్త-ఉన్మత్త-ప్రఘన-భాసకర్ణ-విరూపాక్ష-దేవాంతక-నరాంతక, త్రిశిరస్క-అతికాయులను రాక్షసులను, యుద్దము చేయుచున్న ఇతర రాక్షసులను సంహరించిరి.


ఇన్ద్రజిన్మాయయా యుద్ధ్యన్రామాదీన్స మ్బబన్ద హ. 18


వరదత్తైర్నా గబాణౖరోషధ్యా తౌ విశల్యకౌ | విశల్యయావ్రణౌ కృత్వా మారుత్యానీతపర్వతే. 19


హనూమాన్ధారయామాస తత్రాగం యత్ర సంస్థితః|


మాయతో యుద్ధము చేయుచు ఇంద్రజిత్తు రామాదులను వరలబ్ధములైన నాగబాణములైన నాగబాణములచే బంధించెను. హనుమంతుడు తాను తీసికొవచ్చిన పర్వతముపై ఉన్న విశల్యయను ఓషధిచేత రామలక్ష్మణులను శల్యరహితులను చేసి ఆ పర్వతమును దాని చోట ఉంచెను.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

కపాలమోక్షం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*కపాలమోక్షం..*


*(అరవై నాలుగవ రోజు).*


శ్రీ స్వామివారు దేహ త్యాగం చేశారు కనుక..ఇక జరగవలసిన ఏర్పాట్ల గురించి శ్రీధరరావు గారు, శ్రీ స్వామివారి సోదరులు చర్చించుకుంటున్నారు..శ్రీ స్వామివారి ఆఖరి సోదరుడు పద్మయ్యనాయుడుకు శ్రీ స్వామివారు చెప్పిన విధంగా చేద్దామని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు..


సమయం రాత్రి 11 గంటలు కావొచ్చింది..ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది..


శ్రీ స్వామివారి శరీరం లోంచి..ఒక పెద్ద శబ్దం వినబడసాగింది..దూరం నుంచి ఒక మోటార్ సైకిల్ వస్తున్న శబ్దాన్ని పోలివుంది..ముందుగా ఎవ్వరూ ఆ శబ్దం శ్రీ స్వామివారి శరీరం నుంచి వస్తున్న సంగతిని పసిగట్టలేదు..ఎవరో మోటార్ సైకిల్ మీద వేస్తున్నారేమో అనే భ్రమ లో వున్నారు..కానీ రెండు నిమిషాల కాలం గడిచేసరికి..ఆ శబ్ద నాదం ఉధృతంగా మారింది..అప్పటికి అందరూ తేరుకొని..శ్రీ స్వామివారి దేహం వైపు చూసారు..నాభి ప్రాంతం నుంచి మొదలైన ఆ శబ్దం..క్రమంగా ఊర్ధ్వంగా శిరస్సు పై భాగానికి  ప్రాకిపోయింది..ఇలా దాదాపు 5నిమిషాల పాటు జరిగింది..అందరూ ఆశ్చర్యంగా స్థాణువుల్లా నిలబడిపోయారు..


ఎంత ఉధృతంగా శబ్దం వచ్చిందో..ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోయింది..ఆ మరునిమిషంలోనే.. శ్రీ స్వామివారి శిరస్సు పై మధ్యభాగం నుంచి..రక్తం ధారగా కారసాగింది..అదే సమయానికి ఆశ్రమం బైట ఉన్న వ్యక్తులకు..ఆశ్రమం పై భాగం నుంచి ఒక నీలి రంగు జ్యోతి..పై కెగసి..ఆకాశం లో కలిసిపోవడం కనిపించింది..ఆ నీలి రంగు జ్యోతి మొగలిచెర్ల గ్రామం లో ఉన్న వ్యక్తులూ చూడగలిగారు.. ఆశ్రమం లోపల ఉన్న శ్రీధరరావు దంపతులకు..శ్రీ స్వామివారు కపాలమోక్షం పొందారు అని అర్ధం చేసుకున్నారు..అప్పటి దాకా శ్రీ స్వామివారు తన శరీరం లో తన ప్రాణాన్ని నిలిపివుంచారని వాళ్లకు అవగతం అయింది..


శ్రీధరరావు ప్రభావతి గార్లు అందరితో చర్చించి..శ్రీ స్వామివారి పార్థివ దేహాన్ని..శ్రీ స్వామివారు కోరుకున్న విధంగా..వారు ముందుగానే నిర్మించుకొని..తపస్సు ఆచరిస్తున్న నేలమాళిగ లోనే ఉంచి సమాధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు..శ్రీ పద్మయ్యనాయుడు తో శ్రీ స్వామివారు ముందుగానే ఆ విధి విధానాలు తెలియచేసి వున్నారు కనుక..ఎవ్వరికీ ఆ విషయం లో ఎటువంటి సందేహమూ కలుగలేదు..తెల్లవారేవరకూ వేచి చూసి..సమాధి చేద్దామని నిర్ణయం తీసుకున్నారు..ఉదయానికి శ్రీ స్వామివారి దేహాన్ని..ఆ నేలమాళిగ లో..ఉత్తరాభిముఖంగా పద్మాసనం వేసుకున్న స్థితి లోనే ఉంచి..పై భాగాన్ని సిమెంట్ తో మూసివేశారు..


అతి చిన్న వయసు లోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని..కఠోర సాధన చేసి..అవధూత అంటే...ఇలా ఉండాలి..ఇలా ఆచరించాలి..అని మార్గదర్శనం చేసి..కేవలం ముప్పై రెండు సంవత్సరాల ప్రాయం లోనే..ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్రీ స్వామివారు..శ్రీ దత్తాత్రేయుడిని ఆరాధించి..తనను కూడా దత్తాత్రేయుడి గానే పిలువమని ఆదేశించి..దత్త తత్వానికి ఓ సంపూర్ణత తీసుకొచ్చారు..మాలకొండ పుణ్యక్షేత్రం లో తపస్సు ఆచరించినందునా...ఆ లక్ష్మీనృసింహుడి మీద ఉన్న అపార భక్తి ప్రపత్తుల కారణంగా..ఒక్క శనివారం నాడు మాత్రం..తన సమాధి దర్శనం వద్దనీ..మిగిలిన రోజుల్లో తనను దర్శించవచ్చనీ..తెలియచేసారు..ఈనాటికీ ఆ నియమం పాటించబడుతున్నది..


తమకు శ్రీ స్వామివారు పరిచయం అయిన నాటి నుంచీ..తమ జీవితాలను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించి..తమకు అపారమైన జ్ఞాన బోధ చేసిన ఆ మహనీయుడిని దగ్గరుండి సమాధి చేయడం..శ్రీధరరావు ప్రభావతి గార్ల జీవితంలో మరచిపోలేని ఒక ముఖ్య ఘట్టం..ఇలా చేయవలసి వస్తుందని ఆ దంపతులు ఊహించని పరిణామం..


శ్రీ స్వామివారి ఆశ్రమం..దత్తక్షేత్రంగా రూపాంతరం చెందడం..రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx



సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

శ్రీ రామ రక్షా స్తోత్రము

 🙏 *శ్రీ రామ రక్షా స్తోత్రము ఉపదేశించినవారు శ్రీ బుధ కౌశిక ఋషి. ఈ స్తోత్రానికి శక్తి సీతాదేవి . కీలకమైన వ్యక్తి శ్రీ ఆంజనేయుడు శ్రీ రామచంద్రుని ప్రీతి కొరకు ఈ స్తోత్రం వినియోగించాలి*. ఈరోజు నుంచి ఈ స్తోత్రంలో రోజు ఒక శ్లోకం భావం సుభాషితం రూపంలో పఠించి ధన్యులమౌదాం.


🕉️🪷  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🪷🕉️

🪔 ॐ卐  *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐 🪔


 // *శ్లోకం* //


*చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరమ్* |

*ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనం* ||


  _ / *శ్రీ రామ రక్షా స్తోత్రం-1 మరియు భావం* / _


శతకోటి ప్రవిస్తరమ్ అయిన శ్రీ రాముని చరిత లోని ప్రతి అక్షరం కూడా మానవుని యొక్క మహా పాతకాలను హరిస్తోంది. శ్రీ రఘునాధుని దివ్య చరితము *నూరుకోట్ల శ్లోకములతో అతి విస్తారమైనది. అందులోని ఒక్కొక అక్షరం మానవుని మహా పాపాలను సైతం నశింపజేస్తుంది*.

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 20.12.2023   Wednesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతు మార్గశిర మాస శుక్ల పక్ష:  అష్టమి తిధి సౌమ్య వాసర: ఉత్తరాభాద్ర నక్షత్రం వ్యతీపాత యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


అష్టమి పగలు 11:15 వరకు . 

ఉత్తరాభాద్ర రాత్రి 10:58 వరకు.

సూర్యోదయం : 06:45

సూర్యాస్తమయం : 05:42

వర్జ్యం : పగలు 09:13 నుండి 10:45 వరకు.

దుర్ముహూర్తం : పగలు 11:52  నుండి మధ్యాహ్నం 12:35 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం : పగలు 07:30 నుండి 09:00 వరకు.


శుభోదయ:, నమస్కార:

హార్ట్ ఫుల్ నెస్ కథ

 ✈️ హార్ట్ ఫుల్ నెస్  కథ 


భావం - నా చుట్టూ  ప్రేమతో నిండిన ప్రతీ సంబంధానికి నేను కృతజ్ఞతతో  ఉంటాను  


 గొర్రెల మంద 


ఒకసారి ఒక రాజు  తన మంత్రిని  “ మంత్రిగారు , కుక్కలు , గొర్రెల మధ్య గమనిస్తే, గొర్రెలకన్నా కుక్కలకి ఎక్కువ పిల్లలు పుట్టినప్పటికీ గొర్రెలు గుంపులు గుంపులుగా ప్రతిచోటా కనిపిస్తాయి. కానీ కుక్కలు మాత్రం దూరం దూరంగా కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి, దీనికి కారణమేమిటి ?", అని అడిగాడు. 

దానికి మంత్రి, “మహారాజా, నాకు ఒక్క  రోజు సమయం ఇవ్వండి, రేపు ఉదయం మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను” అని అన్నాడు. 

ఆరోజు సాయంకాలం రాజుగారికి ఎదురుగా రెండు గదులను మంత్రి సిద్ధం చేయించాడు. ఒక గదిలో ఇరవై కుక్కలను వుంచి వాటి మధ్య ఒక బుట్టలో రొట్టెలు ఉంచాడు. రెండవ గదిలో  ఇరవై గొర్రెలను వుంచి వాటి మధ్య ఒక తొట్టెలో మేత ఉంచాడు. ఆ గదులను బయట నుండి తాళం వేసి వెళ్ళి పోయాడు. 


మరుసటి రోజు మంత్రి రాజుగారి తో కలిసి అక్కడికి వెళ్ళాడు. మొదటి గది  తాళం తెరిచాడు. అక్కడ కుక్కలన్నీ మరణించాయి, వాటి మధ్య రొట్టెలు అలాగే  వున్నాయి.  కుక్కలు ఒక్క చిన్న రొట్టె ముక్కను కూడా తినలేదు. 

ఆ తరువాత మంత్రి రెండో గదికి రాజుగారిని తీసుకొని వెళ్ళాడు. తాళం తీసి  గదిలోకి వెళ్లి చూడగా, అక్కడ ఒక గొర్రె మీద ఇంకొక గొర్రె తల పెట్టుకొని సుఖంగా నిద్రపోతూ కనిపించాయి. దాణా వుంచిన బుట్ట ఖాళీగా వుంది. 


గదులు రెండూ చూపించిన తర్వాత రాజుగారితో మంత్రి ఇలా అన్నాడు, “కుక్కలు ఒక్క రొట్టె ముక్క కూడా తినకుండా పరస్పరం  దెబ్బలాడుకుని మరణించాయి. అలా కాకుండా  గొర్రెలు వాటి మేతను ఒకదానితో మరొకటి పంచుకొని, సుఖంగా ఒకదాని మీద ఒకటి పడుకోగలిగాయి.  

ఈ కారణం వల్లనే గొర్రెలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి, కానీ కుక్కలు వాటి ప్రక్కన ఇంకొక కుక్క ఉండటం సహించలేక దెబ్బలాడుకుంటూ ఉండటం వలన అవి ఎక్కువగా కనిపించవు.” 

 మంత్రి మాటలకు రాజు ఎంతో తృప్తిచెంది అతనికి ఎన్నో బహుమతులను, కానుకలను ఇచ్చారు. పరస్పర ప్రేమ, సోదరభావం కలిగి వుంటేనే వంశాభివృద్ది చెందుతుందని రాజుగారికి  నమ్మకము కలిగింది. 


ఈ సందర్భంలో మంత్రి రాజుకు ఒక కధను చెప్పాడు.

ఒకసారి దేవతలను, రాక్షసులను బ్రహ్మదేవుడు ఒక సమావేశానికి ఆహ్వానించాడు.  బ్రహ్మదేవుని కొలువుకు దేవతలు, రాక్షసులు అందరూ వచ్చారు. ఆ రెండు వర్గాలకు బ్రహ్మ దేవుడు మంచి ఆతిధ్యాన్ని అందించినా  ఆయనకు దేవతలంటే కొంచెం ఎక్కువ గౌరవం, భక్తిభావం వుంది. 

బ్రహ్మదేవునికి దేవతల మీద పక్షపాతం వుందని, బయటకు మాత్రం అందరినీ ఒకే విధంగా చూస్తున్నట్లు నటిస్తున్నాడని  రాక్షసులు గ్రహించారు. 

" బ్రహ్మదేవా! మీరు దేవతలకు ఎక్కువ ప్రాముఖ్యత  ఇస్తున్నారు, మీ హృదయంలో వాళ్లమీద ఎక్కువ గౌరవం వుంది అటువంటి పరిస్థితిలో మమ్మల్ని ఇక్కడకు ఎందుకు  ఆహ్వానించారు?", అని రాక్షసులు బ్రహ్మని అడిగారు. 


బ్రహ్మ అది నిజం కాదని రాక్షసులను ఒప్పించడానికి ఎంత ప్రయత్నం చేసినా వారి కోపాన్ని తగ్గించలేక పోయాడు. అందుకని దేవతలతో రాక్షసులు ఎట్టి పరిస్థితులలోనూ సమానం కాలేరని నిరూపించాలని బ్రహ్మ నిర్ధారించుకున్నాడు. 

అప్పుడు బ్రహ్మ దేవుడు  రాక్షసరాజుతో ," మీరు దేవతల కంటే వెనకపడిపోకుండా వాళ్ళతో సమానంగా ఉంటే, నాకు ఎంతో సంతోషం”, అని అన్నాడు. 

దానికి రాక్షస రాజు,“మేము ఇప్పటికే వాళ్ళ కన్నా ఎంతో  ముందు ఉన్నాం”, అని చాలా ధృడంగా చెప్పాడు. దానికి బ్రహ్మ,“మీకు అభ్యంతరం లేకపోతే నేను పరీక్షించవచ్చా?” అని అడిగాడు.

 “ ఓ !తప్పకుండా పరీక్షించండి”, అని రాక్షస రాజు అన్నాడు. 

బ్రహ్మదేవుడు రాత్రి భోజనసమయంలో దేవతలకు, రాక్షసులకు వాళ్ళ చేతివేళ్ళ వరకు కర్రలను బిగించాడు, దేనివలన ఎవ్వరూ కూడా వారి చేతులను వంచలేరు. బ్రహ్మ పెద్ద పళ్ళాలలో లడ్డూలను రాక్షసుల ముందు వుంచి, “ఎవరు ఎక్కువ లడ్డూలను తింటారో వాళ్ళే  ఉత్తములని నిరూపించుకుంటారు “,అని చెప్పాడు.  

చేతులకు కర్రలు ఉండటం వలన  రాక్షసులు లడ్డూలను చేతులోకి తీసుకోగలిగినా, నోటికి అందించలేకపోయారు. లడ్డూలను ఎగురవేసి నోటితో అందుకోవడానికి ప్రయత్నం చేశారు. అది కూడా పెద్ద సమస్య గా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ రాక్షసుడు కూడా లడ్డూలు తినడంలో విజయం సాధించలేకపోయాడు. కాసేపటికి అందరూ ప్రయత్నంచేయడం కూడా మానేశారు . 


ఆ తర్వాత దేవతల వంతు వచ్చింది, వాళ్ళ చేతులకు కూడా అదే విధంగా కర్రలు  బిగించారు. వరసగా కూర్చున్న దేవతల ముందు కూడా లడ్డూలు వడ్డించారు. దేవతలు రెండు వరసల్లో కూర్చొని ఒకరికి ఒకరు లడ్డూలను  తినిపించారు. రాక్షసులు అందరూ ఈ వింతను చూస్తూ ఉండిపోయారు. 

చివరిగా దేవతలు రాక్షసుల కన్నా ఉత్తములు అన్న  వాస్తవాన్ని అంగీకరించారు. 

రాజుగారికి ఆ కధ బాగా నచ్చింది. సమైక్యంగా, ప్రేమతో ఏ పనైనా సాధించగలం  అన్న వాస్తవాన్ని అంగీకరించారు.

 

మిత్రులారా మన జీవితంలో అన్నీ సమస్యలను ఒకరితో ఒకరు పోటీపడి సాధించడానికి ప్రయత్నిస్తాం కానీ  దానికి బదులుగా ప్రేమతో ఒకరినొకరు జయించడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు?


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం  -‌ అష్టమి -  రేవతి  -‌ గురు వాసరే* *(21-12-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/degcCxtvYEQ?si=A5R-Gg8Ru---rT8C


🙏🙏

రాశి ఫలితాలు

 రాశి ఫలితాలు

21-12-2023

గురువారం (బృహష్పతి వాసరః )

XXXXX


మేషం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

--------------------------------------

వృషభం

వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

---------------------------------------

మిధునం

నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు జీతాభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. గృహమున బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------

కర్కాటకం

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహనిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

---------------------------------------

సింహం

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు చికాకు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. బంధువులతో ఆకస్మిక తగాదాలు ఉంటాయి.

--------------------------------------

కన్య

నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. కుటుంబ సమస్యలు వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు.

---------------------------------------

తుల

ఉద్యోగమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

--------------------------------------

వృశ్చికం

 దైవ సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణ ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆప్తుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

--------------------------------------

ధనస్సు

చేపట్టిన పనులలో  శ్రమ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

---------------------------------------

మకరం

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. పాత రుణాలు  తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో  శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు.

---------------------------------------

కుంభం

వృత్తి, వ్యాపారాలు సాఫీగా  సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. చేపట్టిన  పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

---------------------------------------

మీనం

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

---------------------------------------

పంచాంగం

 **********

*శుభోదయం*

***********

సంధ్యా వందన 

మరియు ఇతర

 పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.21.12.2023 

బృహస్పతివాసరే( గురువారము)

*********


గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

హేమంతృతౌ

మార్గశీర్ష మాసే శుక్ల పక్షే నవమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.


ఇతర పూజలకు 

శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

హేమంతృతౌ మార్గశీర్ష మాసే  శుక్ల పక్షే నవమ్యౌపరి దశమ్యాం

బృహస్పతివాసరే.   అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.6.29

సూ.అ.5.26

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

మార్గశిర మాసం 

శుక్ల పక్షం నవమి ప. 11.28 వరకు. 

బృహస్పతివాసరే.

నక్షత్రం రేవతి రా.12.13 వరకు.

అమృతం రా.9.57 ల 11.27 వరకు. 

దుర్ముహూర్తం ప.10.08 ల 10.52 వరకు. 

దుర్ముహూర్తం మ. 2.31 ల 3.15 వరకు. 

వర్జ్యం మ.12.55 ల 2.25 వరకు. 

యోగం వరీయాన్ సా.4.12 వరకు.

కరణం కౌలవ ప. 11.28 వరకు.  

సూర్యోదయము  ఉ.6.00 గంటలకు అయితే.

రాహు కాలం మ.1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ. 9.00 ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ.6.00 ల 7.30 వరకు. 

***********

పుణ్యతిధి మార్గశిర శుద్ధ దశమి. 

********

పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,C

Vanasthalipuram, Hyderabad

500 070.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏