24, ఆగస్టు 2020, సోమవారం

మంచి విచారం 🌹_*

*_ఈ మయ ప్రపంచంలో సుఖదుఃఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూవుంటాయి. అవి సముద్రపు అలల వంటివి. ఈ సత్యాన్ని నివ్వు ఎందుకు గ్రహించవు....?_*

*_కేవలం సుఖం మాత్రమే కావాలను కుంటున్నావా.. ? సుఖదుఃఖాల మధ్యన మన జీవిత సాఫల్యానికి గల అర్థాన్ని గ్రహించాలి._*

*_చిక్కుల్లోనే మానవుడు ఎదుగుతాడు. మనిషి అయినా, జాతి అయినా అంతే. ఇది చరిత్ర చెప్పిన సత్యం._*

*_చెట్టు ఋతువును బట్టి మారుతుంది. శిశిరంలో ఆకురాలుస్తుంది. చెట్టు ఎండినట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి చెట్టు ఎండిపోదు. మళ్లీ వసంతం వస్తుంది. చెట్టు చిగురిస్తుంది. పచ్చని మాను ఔతుంది. జీవితం కూడా అంతే మిత్రమా..... వాడినా..... చిగురిస్తుంది._*

*_బతుకు సఫలం, సార్థకం కావాలంటే మనిషి నిరంతరం సవాళ్లకు సిద్దమై ఉండాలి. భద్రమైన జీవితాన్ని కోరుకునేవారు భవ్యమైన చరిత్రను మిగల్చలేరు..._*

*_అనుకోని వ్యాధులు విజృంభిస్తున్నయని, ఆశల అంచనాలు తారుమారు అవుతున్నాయని, మనలను వంచనకు, మోసానికి గురిచేశారని నేడు మనం కకావికలమవుతున్నాం. కానీ... కాస్తా ఆలోచించు... మానవ దేహాన్ని ధరించిన భగవంతుడికి, మహాత్ములకు, మహాపురుషులకు కూడా తప్పలేదు.వారందరు దుఃఖమనే, కష్టమనే సాగరంలో రమిస్తూ.. నడుచుకుంటూ సుధీరతీరాలకు చేరుకున్నారు..కాస్తా యోచించు...._*

*_ప్రపంచంలో మనిషులు  ఏదోఒక అసంపూర్తితో వ్యధతో బతుకు వెళ్లదీస్తున్నారు గ్రహించు . నీ కన్నీళ్లు గ్లాసేడే...కానీ,.. ఎదుటి వాడి కన్నీళ్లు బిందెడు.గా ఉంది .ఇతరులను చూసి నీ జీవితాన్ని అన్వయించుకోకు మోసపోతావు..._*

*_మిత్రమా... ప్రతివారిలో అనంతమైన శక్తి దాగిఉంది. దాన్ని మేలుకొలుపు. అది ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొనే స్థైర్యాన్ని ఇస్తుంది. నీవు నీ  పట్ల విశ్వాసం కోల్పోతే ఈ విశ్వమే నీకు ఓ పెద్ద ప్రతిబంధకమవుతుంది ._*

*_నిర్మల హృదయమే భగవన్నిలయం మనసు నిర్మలంగా ఉంటేనే భగవద్రూపం స్పష్టంగా గోచరిస్తుంది. అద్దం మాలినమైతే ప్రతిభింబం కనబడదు కదా ! అందువల్ల మన హృదయం నిర్మలంగా ఉండేందుకు స్తంభమనే భగవంతుణ్ణి పట్టుకొని, కష్టాల కడలిని దాటుకొంటూ సాగిపో......._*

*_🔥 మిత్రులందరికీ  శుభోదయం🙏_*

*_✡సర్వేజనాః_* *_సుఖినోభవంతు._*🙏
********************************

రాహుకేతువులు సంపూర్ణ వివరణ

  రాహుకాలము తమిళ సంప్రదాయం అని పేరు, కానీ ఫలితములు మాత్రం అందరికీ ఒకటే, ఖగోళంలో జరిగే మార్పులు అన్నీ, భూగోళం మీద ఉన్న సమస్త జీవరాశికి వర్తించును, ఇది తమిళ సాంప్రదాయమని, మనం తోసి వేసినంత మాత్రాన ఫలితములు, మారవు, అనుభవించక తప్పదు, రాహుకేతువులు తమిళ సంప్రదాయం అని మనము భావించినప్పటికీ, జాతకంలో వాటి ప్రభావము మనము అనుభవిస్తూనే ఉన్నాము, కనుక రావు కాలము తమిళ సంప్రదాయం అని మనము, భావించినంత మాత్రమున గాని ఫలితములు ఎక్కడికీ పోవు, అనుభవించి తీరవలసిందే, 
 కనుక రాహుకాలము వర్ణించుట మేలు, రావు కాలము నందు ప్రయాణముల కానీ శుభకార్యములకు కానీ చేయకుండుట ఉత్తమము, మరి రాహుకాలము ఏ రోజు ఏ సమయమునకు, ముందుగా అది తెలుసుకోవాలి, 

 ఆదివారము, సాయంత్రం 4:30 నుండి, 6 గంటల వరకు, 
 సోమవారం ఉదయము, 7:30 నుండి 9 గంటల వరకు, 
 మంగళవారము, మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల 30 నిమిషాల వరకు, 
 బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు
 గురువారం మధ్యాహ్నం 1:30 నుండి మూడు గంటల వరకు, 
 శుక్రవారము, ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, 
 శనివారము ఉదయం 9 గంటలనుండి 10:30 వరకు, ఇది సహజంగా రాహుకాలం గా వర్ణించారు మన పూర్వీకులు, 
 ఇక్కడ నిర్ణయించిన రాహుకాలము, సూర్యోదయము ఉదయం 6 గంటలకు అని భావించి నిర్ణయించడం జరిగినది, ఈ రాహుకాలము న మనము గమనించే టప్పుడు, వేసవి కాలంలో సూర్యోదయము 6:20 ఆ ప్రాంతంలో కూడా జరుగును, అటువంటప్పుడు ఆ ఇరవై నిమిషాల్లో కలుపుకొని చూడాలి, శీతాకాలంలో 5 20 నిమిషాలు ఆ ప్రాంతంలో సూర్యోదయం జరుగును, అప్పుడు ఆ సమయమును తగ్గించి చూడాలి, సూర్యోదయ కాలము పంచాంగం లో రాసి ఉంటుంది, దానిని అనుసరించి సమయం కలుపుట గాని లేదా తగ్గించడానికి చేయవచ్చు, 
 రావు కాలము మంచిది కాదు, ముఖ్యమైన ప్రయాణములు చేయనప్పుడు, సకుటుంబ సమేతంగా శుభకార్యములకు వెళ్ళినప్పుడు, రాహువు ఏ దిక్కులో ఉన్నాడో గమనించి ప్రయాణం చేయటం మంచిది, గృహము నందు రాహు దశ నడుస్తున్నవారు పరిణమించి ఉంటే, రాహు కాలంలో ప్రయాణం చేయకుండుట మంచిది, ఒకరినిమించి కేతు దశ నడుస్తున్నవారు ఉన్నచో, దుర్ముహూర్తం కాలంలో ప్రయాణం చేయకుండుట మంచిది, యమగండకాలం ఉన్న కూడా పరిశీలించుట అత్యవసరము, 
 తూర్పు, ఆదివారము మరియు గురువారం, రాహువు తూర్పు దిక్కున ఉండను, 
 సోమవారం మరియు శుక్రవారము దక్షిణ దిక్కున ఉండును
 మంగళవారం పశ్చిమ దిక్కున ఉండును
 బుధవారము శనివారము, ఉత్తర దిక్కున ఉండును, 
 మీరు ప్రయాణం చేయ దిక్కునకు, రాహువు ఎదురుగా గాని కుడివైపున గాని ఉండరాదు
( రాహువు యొక్క స్థితిని గమనమును మనం మార్చలేము కావున ప్రయాణము మానుకొనుట మంచిది ఏ దిక్కు రాహు ఉన్నాడు, మనం ప్రయాణం చేసే దిక్కు కుడివైపున ఉన్నాడు, గమనించుకొని ప్రయాణం మానుట ఉత్తమము, ) లేని ఎడల కార్యహాని ధననష్టం, నిరుత్సాహం కలుగుట సంభవించును, 
 మీరు ప్రయాణం చేసే దిక్కుకు రాహువు వెనుక భాగమున కానీ, ఎడమ వైపున కానీ ఉన్నచో, కార్యవిజయం సంతోషము శుభవార్తా శ్రవణం. శత్రువుల తాత్కాలికంగా బలహీనం అవుతారు, 
 ముఖ్య గమనిక, నిత్యము ప్రయాణములు చేయువారు, సంపూర్ణ రాహుగ్రహ నియంత్రణలో ఉండరు, కనుక నిత్యము ప్రయాణం చేసే వారికి ఇది వర్తించదు అని గమనించగలరు, 
 రాహు దశ నడుస్తున్నవారు,  పైన తెలియజేసిన టువంటి, రాహుకాల సమయము నందు, రాహుకాల దీపం వెలిగించడం మంచిది, దేవాలయంలో చేయదలచిన వారు నిమ్మ దొ ప్పల లో చేయుట ఉత్తమము. గృహము నందు మాత్రము, నిమ్మ దొప్ప లలో వెలిగించకూడదు, రెండో ప్రమిదలలో, నాలుగు ఎర్ర వత్తులు వేసి, కనకదుర్గ అమ్మవారి ముందు, ఆవునెయ్యితో దీపం వెలిగించడం మంచిది, దుర్గా మంత్రమును పఠించాలి.
 కేతు దశ నడుస్తున్నవారు మాత్రము, దుర్ముహూర్తం సమయమున చూసుకుని, దుర్ముహూర్తం సమయములో. గణపతి స్వామివారి ముందు, కొబ్బరినూనెతో దీపారాధన చేసి, గణపతి మంత్రం పఠించడం మంచిది, దీనివలన రాహుకేతువుల దుర్యోధనుల నుండి, కొంతవరకు నివారణ పొందవచ్చు, ఇతర గ్రహ స్థితిని అనుసరించి, పూర్తి నివారణ కూడా పొందవచ్చు, ఆచరించి ఫలితం పొందుతారని ఆశిస్తూ, 
 మీకోసం మీ
*******************

**సౌందర్య లహరి**

🌷సౌందర్యలహరిలో
 ఏముంది ?🌷

శంకరాచార్యుల వారు రచించిన దేవీస్తోత్రంగా "సౌందర్యలహరి" చాలా ప్రసిద్ధి. త్రిపుర సుందరి అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. ఈ స్తోత్రం "శిఖరిణీవృత్తం" అనే ఛందస్సులో ఉంది. సౌందర్య లహరిలో నాలుగు ప్రధానమైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం.ఇది ఒక దివ్య మహిమాన్విత స్తోత్రం
ఉపాసకులు దేవిని ఆరాధించడానికి ఉపయోగకరమైన అనేక మంత్రాలు నిక్షిప్తమైన మంత్రమాల. ఈ మంత్రాలకు ఫలసిద్ధులను వ్యాఖ్యాతలు తెలియబరచారు.
ఆగమ తంత్రాలను విశదీకరించే, శ్రీవిద్యను వివరించే తంత్ర గ్రంథం. ఇందులో మొదటి 41 శ్లోకాలు శ్రీవిద్యను వివరిస్తాయి.

సౌందర్యలహరి అనేక శ్లోకాలలోఅనేక శ్రీవిద్యా రస్యాలున్నాయి అని చెబుతారు. ఉదాహరణకు "శివః శక్త్యా యుక్తో యది భవతి" అని ప్రాంభమయ్యే మొదటి శ్లోకంలోనే శ్రీవిద్యాసారమంతా నిక్షిప్తమయ్యి ఉన్నాయి , శ్రీవిద్యలోని 14 అంశాల పరంగా గమనిస్తే అవి (1) వేదాంతము (2) సాంఖ్యము (3) శ్రీవిద్య యొక్క ముఖ్య దేవత (4) సార్థకములైన శబ్దములు (5) వాని అర్ధము (6) శబ్దముల సృష్టి (7) యంత్రము (8) ప్రణవము (9) మాతృక (సంస్కృతాక్షరమాల) (10) కాది విద్య (11) హాదివిద్య (12) పంచాక్షరి (13) దీక్షనిచ్చు గురువు (14) చంద్రకళ [1]. ఒక్కొక్క శ్లోకంలోను ఒక్కొక్క మంత్రం లేదా బీజాక్షరాలు నిక్షిప్తమై ఉన్నాయి

ఇంకా సౌందర్య లహరిలో అనేక మంత్రాలు నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయి. శాక్తేయులలో రెండు శాఖలవారున్నారు - కౌలాచారులు, సమయాచారులు. కౌలులు శ్రీచక్రం, ఇతర సంకేతాలలో శ్రీమాతను పూజిస్తారు, బాహ్యపూజకు ప్రాధాన్యత ఇస్తారు. సమయాచారులు అంతఃపూజ ద్వారా మూలాధార చక్రంనుండి సహస్రదళకమలం వరకు కుండలినీశక్తిని జాగృతం చేయడాని దీక్ష సాగిస్తారు.

అన్ని మంత్ర స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని కూడా జపించడానికి ముందుగా గురువును స్మరించాలి. తరువాత ఋష్యాదులను (స్తోత్రము, ఋషి, ఛందస్సు, దేవత, బీజము, శక్తి, కీలకము, అర్ధము, వినియోగము) స్మరించాలి. పిదప అంగన్యాసము, కరన్యాసము, ధ్యానము, పంచోపచారాదులు చేయాలి. తరువాత శ్రద్ధతో, భక్తితో, నిర్మల నిశ్చల హృదయంతో స్తోత్రాన్ని పఠించాలి (జపించాలి). ఈ "సౌందర్య లహరి" స్తోత్రానికి

🌷న్యాసము:-🌷

ఋషి - గోవిందః
ఛందస్సు - అనుష్టుప్
దేవత - శ్రీ మహాత్రిపుర సుందరి
బీజం - "శివః శక్త్యా యుక్తః"
శక్తి - "సుధా సింధోర్మధ్యే"
కీలకం - "జపో జల్పః శిల్పం"
అర్ధము - భగవత్యారాధన
వినియోగము - శ్రీ లలితా మహా త్రిపురసుందరీ ప్రసాద సిద్ధి కోసము

🌷సౌందర్య లహరిలోని స్తోత్రాల సారాంశం 🌷

భగవతీ! ఈశ్వరుడు కూడా శక్తితో కూడినప్పుడే జగములను సృష్టించగలడు. శివ కేశవ చతుర్ముఖాదులచేత కూడా పరిచర్యలు పొదే నిన్ను నావంటి పుణ్యహీనుడు స్తుతించడం ఎలా సాధ్యమౌతుంది?దేవి పాదరేణువు మహిమ గురించి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవి పాదపరాగాన్ని గ్రహించి శక్తిమంతులౌతున్నారు దేవి అజ్ఞానులకు జ్ఞానాన్ని, చైతన్య రహితులకు చైతన్యాన్ని, దరిద్రులకు సకలైశ్వర్యాలను, సంసారమగ్నులకు ఉద్ధరణను ప్రసాదించునది.తక్కిన దేవతలు వరదాభయముద్రలతో దర్శనమిస్తున్నారు. లోకరక్షకురాలైన శ్రీమాత పాదములే సకలాభీష్ట ప్రదాయములు, భయాపహములు, లోకరక్షకములు.
త్రైలోక్యమోహినియు, శ్రీచక్ర రూపిణియు అయిన శ్రీ త్రిపురసుందరీదేవిని పూజించి విష్ణువు మోహినీ రూపమును ధరించగలిగెను. మన్మధుడు లోకములను మోహింపజేయగలుగుచున్నాడు.
పార్వతి కటాక్షవీక్షణం వలన మన్మధుడు ఒంటరివాడైనను, శరీరహీనుడైనను, అల్పాయుధధారియైనను లోకములను వశీకరించుకొంటున్నాడు.

శ్రీదేవీ స్వరూప ధ్యానం:
క్వణత్కాంచీధామా - మ్రోయుచున్న చిరుగంటల మొలనూలు కలది;
 కుంభస్తననతా - స్తన భారముచే కొంచెము వంగినది; పరీక్షీణామధ్య - కృశించిన నడుము కలది;
 పరిణత శరచ్చంద్రవదన - నిండు చందమామ వంటి మోము;
 ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః - ధనుస్సును, పుష్పబాణములను, పాశమును, అంకుశమును చేతులలో ధరించినది; త్రిపురాంతకుని అహంకారరూపియైన దేవి.

"సుధా సింధోర్మధ్యే" - దేవియొక్క ఆవాసం వర్ణన - అమృత సముద్రమున, కల్పవృక్షముల తోటలలో మణిద్వీపం గురించి.
వేదాంతయోగసారము - శరీరంలోని షట్చక్రాల గురించి వర్ణన - కుండలినీ యోగ విధానము (ఆరోహణ) - సహస్రార చక్రంలో సదాశివునితో కలిసి దేవి విహరించుచున్నది.
కుండలినీ యోగం (అవరోహణ) గురించి తెలిపే రెండ శ్లోకం - శరీరంలో నాడీ ప్రపంచం గురించి, అమృత ధారా స్రావ మార్గం గురించి.
శ్రీచక్రం వర్ణన - నవ చక్రాకృతమై, 44 అంచులు కలిగి శివశక్త్యుభయరూపముగా వెలయుచున్నది.
శ్రీలలితామహాభట్టారికామాత అనంత సౌందర్య స్తుతి, శివ సాయుజ్య ప్రసక్తి
దేవి కటాక్షమహిమా వైభవం వలన ఎంతటి వికారరూపుడైన ముదుసలి కూడా సుందరాంగులను మోహింపజేయగలడు.

షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.
సాత్విక ధ్యాన విధానం - శరత్కాలపు వెన్నెలను బోలు దేవికి నమస్కరించిన సజ్జనులకు అమృత రస తరంగిణులైన వాక్ప్రభావము లభించును.
రాజస ధ్యాన విధానం - అరుణాదేవిని ధ్యానించువారు సరస్వతీ సమానులగుదురు

.
జ్ఞాన శక్తి రూపముననున్న, వశిన్యాది శక్తులతో కూడా దేవిని ధ్యానించువాడు మహాకావ్యములను వ్రాయగలడు.
ఇచ్ఛాశక్తి రూపమున కామరాజకూటమును అధిష్టించిన దేవిని ధ్యానించినయెడల వానికి అప్సరసలు కూడా వశులగుదురు.
అతి గోప్యము, గురువు ద్వారా గ్రహింపనగునది అయిన కామకలారూపము. ఇచ్ఛాజ్ఞానక్రియా శక్తి ధ్యానము.
విష హరము, జ్వర హరము అగు ధ్యానము - దేవిని హృదయమున నిలుపుకొనువాడు అమృతతుల్యమగు తన చూపుచే, సర్పములను గరుత్మంతుడు శమింపజేసినట్లుగా, ఎట్టి జ్వరపీడితుల సంతాపమునైన పోగొట్టగలడు.
యోగ ధ్యాన విశేషము - సహస్రారంలోని చంద్రకళను ధ్యానించిన వారికి పరమానందము లభించును.
భక్తి మహిమ - తనను భక్తితో కోర్కెలు కోరెడి దాసుల వాక్యము పూర్తి కాకుండానే దేవి వారికి దుర్లభ సాయుజ్యమును ప్రసాదించును.
శివశక్తుల సంపూర్ణైక్యత
బ్రహ్మాండము యొక్క సృష్టిలయములు దేవి కనుసన్నల ఆజ్ఞల ప్రకారమే జరుగుచున్నవి.
సత్వరజస్తమోగుణముల వలన ఉద్భవించిన త్రిమూర్తులకు శివాణి పాదపూజయే నిజమైన పూజ.
మహాప్రళయంలో సర్వమూ లయమైనాగాని సతీదేవి మాంగల్య మహిమవలన శివుడు మాత్రము విహరించుచున్నాడు.
జ్ఞానయోగాభ్యాసనా సారము - ఆత్మార్పణమే దేవికి సముచితమైన అర్చన- ఏది చేసినా అంతా భగవతి పూజయే అని కవి విన్నవించుకొంటున్నాడు - "నా మాటలే మంత్రాలు, చేసే పనులన్నీ ఆవాహనాది ఉపచారాలు. నా నడకే ప్రదక్షిణం. నేను తినడమే నైవేద్యము. నిద్రించుటయే ప్రణామము. నా సమస్త కార్యములు నీకు పూజగా అవుగాక."
దేవియొక్క తాటంకములు (కర్ణ భూషణములు) అత్యంత మహిమాన్వితమైనవి. వాని సన్నిధిలో కాల ప్రభావము కూడా నిరోధింప బడును.
శివుడు ఇంటికి వచ్చు సమయములో ధేవి ఎదురేగబోగా ఆమె కాలికి మ్రొక్కుచున్న బ్రహ్మ, విష్ణు, మహేంద్రాదుల కిరీటములు అడ్డముగానున్నవని చెలులు హెచ్చరించుచున్నారు.
దేవిని నిరంతరము ధ్యానించు భక్తునకు ఎట్టి సంపదలు అవుసరము లేదు. వానికి ప్రళయాగ్నియే ఆరతివలె అగును.
దేవి నిర్బంధము కారణముగా 64 తంత్రములను శివుడు భూతలమునకు తెచ్చెను.
దేవీ మంత్రరాజము అయిన పంచదశాక్షరి సకలపురషార్ధ సాధకము.
 ఈ వర్ణన అధికారము, ఐశ్వర్యము, మోక్షము అవంటి ప్రయోజనములను కలిగించును.
శివశక్తుల ఐక్యత గురించి. నవ వ్యూహాత్మకమైన భైరవస్వరూపము ఇందు వర్ణితము. శివుడు ఆనంద భైరవుడు. పరాశక్తియే మహాభైరవి. వారు వేరు వేరు కాదు.
షట్చక్రములందున్న పృధివ్యాధి తత్వములు దేవియే. అన్ని రూపములు ఆమెయే.
ఆజ్ఞా చక్రమునందున్న పరమ శివునికి నమస్కారము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - పరశంభునాధుడు, పరచిదంబ.
విశుద్ధి చక్రము లోని దేవీ తత్వము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - వ్యోమేశ్వరుడు, వ్యోమేశ్వరి.
అనాహత చక్రము లోని హంస ద్వంద్వమునకు వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - హంసేశ్వరుడు, హంసేశ్వరి
స్వాధిష్ఠాన చక్రము లోని సంవర్తాగ్నికి (అగ్ని తత్వము గలది) స్తుతి. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - సంవర్తేశ్వరుడు, సమయాంబ
మణిపూరక చక్రము నందుండి ముల్లోకములను తడుపు నీలమేఘమునకు ధ్యానము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - మేఘేశ్వరుడు, సౌదామిని
మూలాధార చక్రములో నటన చేయు ఆనందభైరవునికి వందనము. ఈ శ్లోకములో సూచింపబడిన శివశివాణి రూపములు - ఆదినటుడు, లాస్యేశ్వరి (ఆనంద భైరవుడు, సమయ)
మొదటి 41 శ్లోకములు "ఆనంద లహరి"యనబడును.
42వ శ్లోకమునుండి "సౌందర్య లహరి"గా భావింపబడుచున్నది.

ద్వాదశాదిత్యులనే మణులతో కూర్చబడిన దేవి కిరీటం వర్ణన.
దేవి కురులు అజ్ఞానమును నశింపజేయునని వర్ణన.
దేవి పాపట నడుమనున్న సిందూరము ఉదయించుచున్న సూర్యునివలెనున్నది.
ముంగురులచే కమ్ముకొనిన దేవి ముఖము పద్మమును పరిహసించుచున్నది. ఆమె చిరునగవు శివుని మోహింపజేయుచున్నది.
లావణ్యకాంతితో నిర్మలమైన దేవి ఫాలము రెండవ చంద్రఖండమువలెనున్నది. మొదటి చంద్రఖండమును దేవి తలయందు ధరించింది.
దేవి కనుబొమలు ధనుస్సువలెనున్నవి. ఆమె సకల భువనముల భయమును పోగొట్టెడు ఉమాదేవి.
దేవి కుడికన్ను సూర్యునివలె పగటిని, ఎడమకన్ను చంద్రునివలె రాత్రిని చేయుచున్నవి. మూడవ నేత్రము సంధ్యాకాలమును కలిగించుచున్నది.
దేవి చూపు విపులమై, మంగళకరమై, దుర్జయమై, దయారసపూరితమై, అవ్యక్త మధురమై, పరిపూర్ణ భోగవతియై, భక్తులను రక్షించునదై అనేక నగరముల బహుముఖవిజయము కలదై యున్నది.
దేవి నేత్రద్వయము ఆకర్ణాంతము విస్తరించి నల్లని తుమ్మెదలవలె నున్నవి. కావ్యరస మాధుర్యభరితమైన చెవులనెడు పుష్పములనుండి మకరందమునాస్వాదించుచున్నవి. వాటిని చూచి అసూయచే మూడవ కన్ను కొంచెము ఎరుపెక్కినది.
శ్రీ అమ్మవారి చూపు శివునియందు శృంగారము గలది. అన్యులయందు బీభత్సము గలది. గంగ (సవతి) యందు కోపము గలది. శివుని చరిత్రయందు అద్భుతము గలది. శివుడు ధరించిన సర్పములవలన భయమొందినది. పద్మమును మించిన సౌందర్యము గలది. చెలులయందు చిఱునగవులు గలది. నాయందు (ఆది శంకరాచార్యుని యందు లేదా భక్తునియందు) దయ గలది.
దేవి కన్నులు ఆమె చెవులవరకు లాగబడిన, రెప్పల వెండ్రుకలనెడు ఈకలు కలిగిన మన్మధ బాణములవలెనున్నవి. ఈశ్వరుని చిత్తమును కలచివేయుటయే ఆ బాణముల లక్ష్యము.
దేవి మూడు కన్నులందు

ను కాటుక ధరించియన్నందున ఎరుపు, తెలుపు, నలుపు వర్ణములు మిళితములైయున్నవి. మహాప్రళయమునందు పరమాత్మలో లీనమైన బ్రహ్మ, విష్ణు, రుద్రులను భవానిదేవి శివునితోగూడి మరల సృజించుటకై ధరించిన సత్వ రజస్ తమో గుణములవలె ప్రకాశించుచున్నవి.
దేవి కన్నులలోని ఎరుపు, తెలుపు, నలుపు రంగులు ఎఱ్ఱని శోణానది, తెల్లని గంగానది, నల్లని యమునానది అనెడు తీర్ధముల పాపహరమైన సంగమము వలె యున్నవి.
జగన్మాత కనులు మూయుటవలన లోక సంహారము, తెరచుట వలన సృష్టి జరుగునందురు. సకల జగములను రక్షించుటకొరకై ఆమె రెప్పలు మూయకుండ ఉండునని కవి తలపు.
అపర్ణాదేవి కన్నులు మీనములవలెనున్నవని వర్ణన.
శివాణీ! నీ చల్లని చూపును నాపై ప్రసరింపజేయుమని ప్రార్థన.
పర్వతరాజపుత్రి కనుల అంచులు ధనుస్సులవలెనున్నవి. ఆ దేవి కడగంటి చూపులు బాణములను ఎక్కుపెట్టుచున్నవా అన్నట్లు ఆ కనుల అంచులను దాటి చెవులవరకు పోవుచున్నట్లు భ్రమను కలుగజేయుచున్నవి. (ఆ విశాలాక్షి కన్నులు చెవులవరకు వ్యాపించియున్నవని భావము)
దేవి చెక్కిళ్ళలో ప్రతిబింబించుచున్న ఆమె తాటంకముల కారణముగ ఆమె ముఖము నాలుగు చక్రములు కలిగిన మన్మధుని రథమువలె నున్నది. అట్టి సుందర ముఖము నాశ్రయించి మన్మధుడు శివునితో తలపడుటకు సంసిద్ధుడయ్యెను.
సరస్వతీదేవి అమృత సూక్తులను వినుచు శర్వాణి తలయూపుచున్నది. ఆమె కుండలముల ఝణంఝణ నాదములు సరస్వతి పలుకులను ప్రశంసించుచున్నవనిపించునట్లున్నవి.
హిమధ్వంస కీర్తిపతాకయైన దేవి నాసిక నుండి వెలువడు చల్లని నిశ్వాసము మాకు అభీష్టఫలములను ప్రసాదించును గాక.
దేవి ఎఱ్ఱని పెదవికి పోలిక చెప్పవలెనంటే పండిన పగడపు తీగనే సామ్యముగా చెప్పవలెను. దొండపండుతో పోల్చడం సరి కాదు.
చకోర పక్షులు దేవి చిఱునగవులనే వెన్నెలను గ్రోలుచున్నవి. అవి అతి మధురములైనందున అందుకు విరుగుడుగా అమృతమును పుల్లని కడుగునీళ్ళగా భావించి త్రాగుచున్నవి.
జగజ్జనని నాలుక ఎల్లపుడు శివుని గుణగణముల వర్ణనలు చేయుచు వెలయుచుండును. ఆమె నోటి ఎరుపు ప్రతిఫలించిన కారణముగా తెల్లని చాయ గలిగిన సరస్వతి మేను కూడా ఎరుపుగా అగుపించుచున్నది.
యుద్ధమునందు దైత్యులను జయించి తిరిగి వచ్చుచున్న కుమార స్వామి (విశాఖుడు), ఇంద్రుడు, విష్ణువులు చండాంశము (చండుడు అను శివభక్తుని భాగము) అయిన శివనిర్మాల్యమును తీసికొననిచ్చగించలేదు. వారు దేవి పాదములచెంత చేరి, తమ శిరస్త్రాణములను తొలగించి, మ్రొక్కుచు ఆమె యొసగిన కర్పూర సహిత తాంబూల శకలములను ఆతురతతో స్వీకరించుచున్నారు.
సరస్వతీ దేవి శివుని గాథలను ఆలపించుచుండగా వినుచు జగన్మాత ఆనందముతో తలయూపుచున్నది. దేవి ప్రశంసావాక్యములలోని వాఙ్మాధుర్యమునకు సరస్వతి వీణాతంత్రుల సవ్వడి సరికాకున్నది.
గిరిసుత చుబుకము తండ్రిచే ప్రేమగా పుణకబడింది. శివునికి దేవి ముఖము అద్దము కాగా ఆ అద్దమునకు పిడివంటిది ఆమె చుబుకము. దానిని పోల్చుటకు మరేదియును సాటిరాదు.
శివుని కౌగిలిచే రోమాంచకమైన దేవి గళము ఆమె ముఖమనెడు పద్మమునకు కాడవలెనున్నది. ఆ క్రింద అగురు బురద అలముకొనియున్న ముత్యాల కంఠహారము బురదలో కూరుకొనిపోయిన తామరతూడువలెనున్నది.
సంగీత రసజ్ఞురాలవగు ఓ తల్లీ! వివాహ సమయమున మంగళసూత్రము కట్టిన పిదప కట్టెడు మూడుదారములయొక్క గుర్తులా యనబడునట్లుగా నీ కంఠము లోని మూడు రేఖలు నానావిధమనోహరములైన మూడురాగములకు హద్దులవలె భాసించుచున్నవి.
దేవి నాలుగు చేతుల స్తుతి - (పూర్వము బ్రహ్మకు ఐదు తలలుండెడివని, అందొక తలను రుద్రుడు తన గోటితో చిదిమివేసెనని ఇతిహాసము). శివుని గోళ్ళకు భయపడిన బ్రహ్మ తన నాలుగు తలలను రక్షించుకొనుటకై నాలుగు ముఖాలతోను ఒకేమారు శ్రీమాత యొక్క సుకుమారమైన, తామరతూండ్లవంటి బాహువులను స్తుతించుచున్నాడు.
దేవి చేతి గోళ్ళ ప్రశంస - ఉమాదేవియొక్క చేతిగోళ్ళ సహజమైన అరుణవర్ణము పద్మముల రంగును పరిహసించుచున్నది. వాటి అందమును దేనితో పోల్చవచ్చును? లక్ష్మీదేవి విహరించునపుడు ఆమె పాదతలములందలి లాక్షారసము అంటి ఎఱ్ఱనైన కమలదళాలతో కొంతవరకు సామ్యము చెప్పవచ్చును.
దేవి స్తనయుగము వర్ణన - కుమారస్వామి చేతను, గజముఖునిచేతను ఒక్కసారే పాలు త్రాగబడి పాలు గారుచున్న దేవి స్తనయుగము మా కష్టములను పోగొట్టును గాక. ఆ స్తనద్వయమును చూచి గజాననుడు తన కుంభస్థలమును తల్లి అపహరించెనేమోయని కలతచెందుచున్నాడు.
పార్వతీదేవి వక్షోజములు కెంపులచే చేయబడిన అమృత కలశములు. కనుకనే ఆమె స్తన్యము గ్రోలిన గజాననుడు, కుమారస్వామి బాలురవలెనే యున్నారు. (వృద్ధులు అగుట లేదు)
అంబ కుచ ప్రదేశమునందున్న హారము గజాసురుని కుంభములందలి ముత్యములచే కూర్చబడింది. అట్టి తెల్లని స్వచ్ఛమైన హారము దేవి అధరకాంతులచే లోపల కొంచెము ఎర్రనై, ఈశ్వరుని కీర్తి, ప్రతాపము మిళితమైనట్లుగా భాసించుచున్నది.
దేవి స్తన్యము యొక్క మహిమ - పర్వతపుత్రి స్తన్యము ఆమె హృదయము లోని పాలకడలినుండి పుట్టిన వాఙ్మయము. కనుకనే దయతో దేవి యొసగిన స్తన్యమును గ్రోలిన ద్రవిడశిశువు ప్రౌఢకవుల మధ్య కమనీయకనియయ్యెను.
దేవి నాభి వర్ణన - హరుని కోపాగ్నిచే దహింపబడుచున్న మన్మధుడు ప్రాణరక్షణకొరకు పార్వతి నాభి అను సరస్సులో దూకెను. వాని శరీరమునుండి వెడలి తీగవలె సాగిన పొగనే పామర జనము ఆమె నూగారని అనుచ

ున్నారు.
దేవి నూగారు వర్ణన - శివాణి సన్నని నడుమునందు యమునానది సూక్ష్మతరంగములవలె (అతి చిన్నవైన) రోమావళి యున్నది. ఆమె కుచకుంభముల ఒరిపిడివలన వాని మధ్యనున్న ఆకాశము (స్థలము) నకు చోటు చాలలేదు. కనుక ఆ యాకాశము క్రిందికి జారి ఆమె నాభి రంధ్రమున చోటుచేసుకొనెనా యన్నట్లుగా అవియనిపించుచున్నవి.
గిరిపుత్రీ! నీ నాభి నిశ్చలమైన గంగ సుడి. స్తనములు అను పూమొగ్గలకు ఆధారమైన రోమరాజి యనెడు తీగకు పాదు. మన్మధుని పరాక్రమాగ్నికి హోమగుండము. రతీ దేవికి విహార గృహము. ఈశ్వరుని కనుల సిద్ధికి గుహాముఖము. అయి విరాజిల్లుచున్నది.

శైల తనయ నడుము వర్ణన : సహజముగానే కృశించింది. స్తన భారముచే వంగినది. నాభియు, వళులు (మడతలు) ను ఉన్న చోట విఱిగిపోవునో యన్నట్లున్నది. ఒడ్డు విఱిగిన నదీ తీరమున ఉన్న చెట్టువలె ఊగుచున్నది.

దేవి వళుల వర్ణన : మన్మధ నిర్మితములై కనక కలశములవంటి దేవి స్తనములు ఈశ్వర స్మరణచేత సారెకు ప్రక్కలయందు చెమర్చుచు రవికను పిగుల్చుచున్నవి. చంకలను ఒరయుచున్నవి. ఆ కుచ భారమునకు నడుము విరిగిపోకుండా కాపాడుటకై దేవి వళులు (నడుముపైని మూడు ముడుతలు) లవలీలతచే కట్టబడిన మూడు కట్లవలెనున్నవి.

దేవి నితంబము వర్ణన: పార్వతీ! నీ తండ్రి యగు క్షితిధరపతి భూమినుండి విస్తారమును తీసి నీకు అరణముగా నిచ్చెను. అందున నీ నితంబము (పిఱుదులు) విస్తారమై వసుమతి (భూమి) ని కప్పివైచుచు తేలిక చేయుచున్నవి.
భవతి తొడలు, మోకాళ్ళ వర్ణన : పార్వతీదేవి తొడలు గజరాజు తుండములను, బంగారపు అరటి కంబములను జయించునవి. భర్తకు సదా మ్రొక్కుచుండుటచే ఆమె మోకాళ్ళు గట్టిపడినవి.
83 నుండి 91వ శ్లోకము వరకు దేవి పాదములు, గోళ్ళ వర్ణన యున్నది.

గిరిసుతా! ఈశ్వరుని గెలుచుట కొఱకు మన్మధుడు నీ పిక్కలను పదేసి బాణములున్న అమ్ముల పొదులుగా చేసికొనెను. (ఎందుకంటే మన్మధుని దగ్గర ఉన్న ఐదే బాణాలు చాలవని). వాని చివరల నీ గోటికొనలనెడు బాణాగ్రములు (ములుకులు) కనుపించుచున్నవి. ఆ బాణాగ్రములు (అమ్మవారి పాదములకు మ్రొక్కుచున్న) దేవతల కిరీటములచే పదునుపెట్టబడియున్నవి.
మాతా! నీ పాదములు వేదములకు శిరోభూషణములు. నీ పాద్య జలమే శివుని జటాజూటముననున్న గంగ. విష్ణువు తలపైనున్న చూడామణి కాంతియే నీ శ్రీ పాదముల లత్తుక శోభ. తల్లీ నీ పాదములను దయతో నా శిరసుపైనుంచుమమ్మా.
దేవీ! తడి లత్తుకతో కాంతులీనెడు నీ పాదద్వయమునకు మ్రొక్కెదను. నీ పాదముల తాకిడిని పొందుచున్న ప్రమదావనము లోని అశోకవృక్షమును చూచి శివుడు అసూయ చెందుచున్నాడు.
ప్రణయ కలహ సమయమున దేవి తన కాలితో శివుని లలాటమున తన్నినది. అప్పుడు ఆమె అందెల మోత యెట్లున్నది? తన శత్రువైన శివునికి పరాభవము కలిగినందుకు మన్మధుడు కిలకిల నవ్వినట్లున్నది.
జననీ! శ్రీకరములు, సదా శోభాయమానములు అయిన నీపాదములను పద్మములతో ఎట్లు పోల్చనగును? పద్మములు రాత్రులు ముకుళించుకొనిపోవును. మంచు తగిలిన వడలి పోవును. అవి కొంచెము మాత్రమే లక్ష్మి అనుగ్రహమునకు పాత్రములు.
దేవీ! నీ పాదములు యశస్సును కలిగించునవి, విపత్తులను హరించునవి. పురారియైన శివుడు దయామయుడై వివాహ సమయమున నీ సుకుమార పాదములను తన చేతబట్టి మృదువుగా సన్నెకల్లును త్రొక్కించెను. అట్టి పాదాగ్రములను పూజ్యులైన పూర్వకవులు కఠినమైన తాబేటి పెంకుతో ఎట్లు పోల్చిరో తెలియరాదు.
చండీమాత పాదములు బీదలకు భద్రమైన సకలైశ్వర్యములను ప్రసాదించును. చండీమాత పాదములకు దేవతలు చేతులు జోడించి అంజలి ఘటించుచున్నారు. మాత కాలిగోళ్ళనెడు చంద్రుల కాంతికి ఆదేవతాస్త్రీల కర పద్మముల ముకుళించుచున్నట్లుగా అనిపించుచున్నది. ఆ చంద్రులు స్వర్గములో (దేవతలకు సంపదలనిచ్చెడు) కల్పవృక్షములను పరిహసించుచున్నట్లున్నది.
తల్లీ! నీ పాదములు ఎల్లప్పుడు కోరిన సంపదలనిచ్చునవి. సౌందర్యమనెడు మకరందమును వెదజల్లెడు కల్పవృక్షపు పుష్పగుచ్ఛములు. ఆఱు ఇంద్రియములతో (మనసు + జ్ఞానేంద్రియములు) గూడిన నా జీవము ఆఱు కాళ్ళ తుమ్మెదవలె నీపాదములను ఆశ్రయించును గాక.
మాతా! సుందర గమనా! నీ భవనములోని పెంపుడు హంసలు నీ నడకల తీరును నేర్చుకొన గోరి, నీ వెంటనే తిరుగుచున్నవి. నీ పాదముల మణిమంజీరములు (అందెలు) ఆ హంసలకు పదన్యాసమునందు శిక్షణ నిచ్చుచున్నట్లుగా ఉంది.
42వ శ్లోకము నుండి 91వ శ్లోకము వరకు శంకరాచార్యులు శ్రీమాత కిరీటము నుండి పాదములవరకు స్తుతించాడు. ఇప్పుడు దేవి సంపూర్ణ స్వరూపము వర్ణింపబడుచున్నది.

దేవీ! బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, రుద్రులు నీకు సమీప సేవను పొందుటకై నీ మంచమునకు కోళ్ళుగా ఉన్నారు. శివుడు తెల్లని కాంతి అను మిషతో నీకు పైని కప్పుకొనుటకు దుప్పటియైనాడు. అట్టి సదాశివుడు నీ యెఱ్ఱని దేహకాంతులు ప్రతిఫలించిన కారణమున తానును ఎఱ్ఱబారి మూర్తీభవించిన శృంగార రసము వలెనుండి నీ కనులకు వినోదము గొలుపుచున్నాడు. (శివుని శరీర వర్ణం తెలుపు. దేవి శరీర వర్ణం ఎఱుపు.)

కామేశ్వరి సంపూర్ణ సౌందర్య స్తుతి - శివాణి కేశములు వక్రమైనవి. సహజ మందహాసము సరళమైనది. దేహము శిరీష పుష్పము వలె మృదువైనది. కుచ ప్రాంతము కఠినమైనది. నడుము లతవలె సన్ననైనది. నితంబములు విశాలమైనవి. సదాశివుని కరుణా శక్తి మూర్తీభవించిన రూపమే ఆ సౌందర్యమూర్తి. అట్టి అరుణాదేవి

లోకములను రక్షించుటకు జయమొందుగాక.
సూర్యుడు దేవి పాదములవద్ద సేవ చేస్తున్నాడు. తన కిరణ తీవ్రతను ఉపశమించి, అద్దమువలె ధగదగలాడుచున్నాడు. ఆ అద్దములో దేవి ముఖపద్మము కనుపించుచున్నది. (సూర్యుని హృదయ ఫలకములో దేవి ముఖము ప్రతిబింబించుచున్నది). ఆ పద్మము సదా వికసించియున్నందున చంద్రుని బాధ లేదు (రాత్రి కాదు కనుక సూర్యుని సేవకు అంతరాయము లేదు).
చంద్రబింబమును దేవి అలంకరణ సామగ్రి పెట్టెగా చెప్పుట - దేవీ! చంద్రబింబము జలమయమైన మరకత మణితో చేయబడిన పెట్టె. అది కళలు అనే కర్పూరముతో నిండియున్నది. నీవు వాడుకొనే కస్తూరియే అందులో కనుపించే మచ్చ. ప్రతిదినము దీనిలోని వస్తువులను (కస్తూరిని, కర్పూర శకలాలను) నీవు వాడుకొనుచుండుట చేత ఆ పెట్టె తగ్గిపోతున్నది. (దానిలోని రంధ్రము పెద్దగా అగుచున్నది.) దానిని బ్రహ్మ మరల పూరిస్తూ ఉన్నాడు. (చంద్రునిలోని హెచ్చుతగ్గులు - కృష్ణ పక్షము, శుక్ల పక్షము).
దేవీ! నీవు త్రిపురారి అంతఃపురాధిదేవతవు. (శివుని పట్టపురాణివి). నీ పాదసేవ దుర్లభము. కనుక ఇంద్రాది దేవతలు నీ ద్వారముచెంత కావలిగానున్న అణిమాది సిద్ధుల ప్రసాదములతో అతులమైన ఇష్టసిద్ధులను పొంది తృప్తులగుచున్నారు.
సతీదేవీ! గొప్పకవులను సరస్వతీవల్లభులంటారు. గొప్ప సంపన్నులను లక్ష్మీపతులంటారు. కాని నీ కౌగిలింత మాత్రము ఈశ్వరునకు మాత్రమే లభించును. గోరింట చెట్టుకు కూడా లభించదు.
గిరిజా దేవీ! వేదవిదులు నిన్ను సరస్వతి యనియు, లక్ష్మి యనియు, పార్వతి యనియు చెబుతారు. కాని నీవు ఈ మువ్వురికంటె వేరైన మహామాయవు. పరబ్రహ్మయగు సదాశివుని దేవియగు చంద్ర కళగా ఆరాధింపబడు శ్రీవిద్యవు. దేశకాల పరిమితులకు అతీతమైన మహిమ గల దానవు. మహామాయవై విశ్వమును భ్రమింపజేయుచున్నావు.
ఉమా దేవీ! సముద్భూత స్థూల స్తనభరమైన వక్షోభాగము, మనోహరమైన దరహాసము, కడగంటి చూపులందు మన్మధులు, కదంబమువంటి ప్రభ కలిగిన తనువు - ఈ గుణములన్నియు శివుని మనస్సునందు నీవేయను భ్రాంతి కలిగించును. నిర్మలమైన మనస్సుతో దేవిని ధ్యానించు భక్తులకు ఈ గుణములు కలుగుటయే వారి భక్తికి పరమావధి.
తల్లీ! నేను జ్ఞానార్ధిని. నీ పాదములు కడిగినపుడు లత్తుక రసముతో ఎఱ్ఱనైన నీ పాదోదకమును త్రాగే భాగ్యము నాకెప్పుడు లభిస్తుందో? అది మూగవారిని కూడా కవులుగా చేయునది. ఆ జలమునకు సరస్వతీ దేవి ముఖ తాంబూల రస గుణము కలిగనది.

(ఈ శ్లోకములో షట్‌-కమల భేదనము, సహస్రార కమలమును చేరుకొనుట సూచింపబడినవి) దేవీ! సాదాఖ్య చంద్రకళ యగు నిన్ను భజించువాడు విద్యను, ఐశ్వర్యమును పొంది (సరస్వతిని, లక్ష్మిని వశము చేసుకొని) బ్రహ్మకును, విష్ణువునకును విరోధిగా వెలుగుచున్నాడు. రమ్యమైన రూపము పొంది రతీదేవి పాతివ్రత్యమును శిథిలము చేయగలడు. చిరంజీవియై జీవుని అవిద్యను జయించి బ్రహ్మానంద రసమును ఆస్వాదించును. (సాదాఖ్య కళను ఉపాసించు వానికి ఐహికాముష్మిక ఫలములు రెండును సిద్ధించును)
సర్వ జ్ఞానములకు, సకలైశ్వర్యములకు నిధియైన శ్రీదేవీ! నిత్య మందహాస వదనా! నిరవధిక గుణ నిధానమా! నీతి నిపుణా! నిరాటంక జ్ఞానా! నియమ వశమైన చిత్తములందు నివసించుదానా! నియమ విధులకు కట్టుబడని దానా! నిఖిల నిగమాంత స్తుత పదా! ఆపదలు, ఆటంకములు సమీపించని దానా! నిత్యా! నా స్తుతిని కూడా స్వీకరించు తల్లీ! (చండిక స్తోత్రము చేతను, భాస్కరుడు నమస్కారము చేతను, విష్ణువు అలంకారము చేతను, శంకరులు అభిషేకము చేతను సంతుష్టులగుదురు.)
సర్వ వాక్కులకు జననీ! ఈ విశ్వములోని వాక్కులన్నయును నీవే! కనుక నా స్తోత్రములోని వాక్కులు కూడా నీవే! అట్టి నీ వాక్కులచేతనే నిన్ను స్తుతించుచుంటిని. దీప కాంతులతో సూర్యునికి నీరాజనమిచ్చినట్లుగాను, చంద్రకాంత శిలా జలముచే చంద్రునికి అర్ఘ్యమిచ్చినట్లుగాను, జలములతో సముద్రుని తృప్తి పరచినట్లుగాను నేను నీ వాక్కులచేత నిన్ను స్తుతించి నీకు ప్రీతి కలిగింపనెంచితిని.శిశువు పలుకులు నిరర్ధకమైనవైనను తల్లికి ఆనందమే కలిగించును కదా! అట్లే ఈ భక్తుని స్తుతి సకల లోకమాతవగు నీకు ఆనందము కలిగించును గాక.

🌷శ్రీ మాత్రే నమః🌷

ఎంత హాయిగా ఉంది చదువుతుంటే ఈ సారాంశము తల్లి దగ్గర కూర్చుని చదివి హారతి ఇచ్చిన చాలు ఆ తల్లి కరుణ అమృత వర్షం లా కురిపిస్తుంది.

🙏🙏🙏
సేకరణ

*ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
*******************

*లోకులు కాకులు.....*



ఒక వూరులో ఒక పెంకుటింటి అరుగు పై కూర్చుని తీపి బూందీ తింటున్నాడో పిల్లవాడు. పొట్లంలో ఉన్నవి తినేసి ఖాలీ పొట్లం ఉండ చుట్టి విసిరేశాడు. దానిని చూసిన ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కున కరుచుకుని వెళ్లి ఒక గోడపై వాలింది. కాళ్లతో పొట్లాన్ని నొక్కిపట్టి ముక్కుతో విప్పింది. ఆశగా చూసింది. రెండు మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి.

ఆనందం తో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి. అయితే.. అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఒకటి చక్కగా గీసి ఉంది. అప్పుడు ఆ కాకి ఆశగా బొమ్మ కాకి నోట్లో వున్న బూరెను లాగింది. అది రాలేదు. మరోసారి ప్రయత్నించింది అమాయకంగా. దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను దగ్గర చిరిగింది. అప్పుడు ఇది నిజమైన బూరె కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది.

ఇదంతా ఆ గోడ పక్కన చెట్టు మీదున్న ఇంకో కాకి చూసింది. ఎగిరిపోయిన కాకి తెలివి తక్కువతానానికి నవ్వుకుంది. ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా..

మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది రెండో కాకి. ఉత్తుత్తి బూరె కోసం కాకి పాట్లు తలుచుకుని మళ్ళీ నవ్వింది. మూడో కాకి ఈ విషయం ఇంకో కాకికి చెప్పింది. 'అయినా కాకి నోట్లో బూరెను లాక్కోవడం తప్పు కదా' అంటూ ముగించింది. తన వర్ణనలో 'ఇది నిజం కాకి కాదు కాగితంలో కాకి చిత్రం' అనే విషయం చేర్చలేదు.

ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది. 'తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడానూ' అంటూ మరో మాట చేర్చింది. ఈ కాకులు అన్ని ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనబడిన కాకులతో ఈ విషయమే చెప్పుకున్నాయి.

వాటిలో ఓ కాకి అయితే 'కాకి కన్ను పొడిస్తే.. పాపం.. రక్తం కారిందట కూడానూ' అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది. మరో కాకి ఇంకా కొంచెం ముందుకెళ్లి 'ఆ గోడపై రక్తపు చారికలు చూసాను' అంటూ వాపోయింది. మరో కాకి 'నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది' అంటూ చెప్పుకుని సానుభూతి పొందింది.

అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడి కాకిగా ముద్రవేశాయి. దానికి దూరంగా ఉండాలని తీర్మానించాయి. ఇవేమీ ఎరుగని మొదట కాకి సాయంత్రం తన గూటికి చేరుకుని తోటి కాకులును స్నేహంగా చూసింది. అప్పటిదాకా గుసగుసలాడుకున్న కాకులు చప్పున మాటలు ఆపి మూగ భావంగా తలలు తిప్పుకున్నాయి.

కాకికి ఏమి అర్థంకాలేదు. రెండు రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా దూరంగా మసులు తున్నాయి. తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది.

"ఒక్కోసారి అంతే.. మన ప్రమేయం ఏమి లేకుండానే మనని సమాజం చెడ్డ వాళ్ళని చేసేస్తుంది. నీలాప నిందలు, పుకార్లమయం ఈ లోకం. మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధ పడక్కర్లేదు. సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకోండి చాలు. అలాంటి వందల మంది నీకేలా.." అంటూ ఓదార్చింది కొమ్మమీద ఒక కోయిలమ్మ..

సూక్తి... ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, అతనితో స్నేహం చేయకుండా, అతనిని పూర్తిగా పరిశీలించకుండా పుకార్లు నమ్మటం, పూర్తిగా పరిచయం లేని ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం వలన, ఒక మంచి స్నేహితుణ్ణి కోల్పోవటమే కాదు, అదే సమాజంలో నీ విలువ కూడా పోగొట్టుకుంటున్నావనే విషయాన్ని  గ్రహించాలి...

అందుకే.. లోకులు కాకులు అన్న సూక్తి ఊరుకునే రాలేదు సుమీ.
************************

త్యాగమె నిజరూపము

కుదువంబెట్టినపట్టుచీరె చదువన్గూర్పంగశ్రద్ధన్ గురుల్
సదయుండాహనుమంతుడే బహువిధాసక్తుల్ మదిందీర్ప తా
నెదిరిం లెక్కయొనర్పనట్టి దృఢతే నిన్విశ్వమేమెచ్చగా
కొదమంసింగముజేసె సైమనును ఢీకొట్టం బ్రకాశాహ్వయా!

త్యాగమె నిజరూపముగా
యోగమ్మేన్యాయవాదనోద్యోగము, గాం
ధీ గమనమె నీబాటగ
సాగిన ధీరా ప్రకాశ సార్థకనామా!

రాయప్రోలు సీతారామశర్మ భీమవరం

ఆనందం అంటే

ఆనందం అంటే మన జీవితం భగవంతుని విశ్వవీణపు శృతిలయలో మమేకం కావడమే.

సర్వదా సంతోషాన్ని పంచే వ్యక్తిని కలుసుకొన్నప్పుడు మనలోనూ నూతన శక్తి వస్తుంది.

మనల్ని మనం ఉద్ధరించుకోవడానికీ, ఇతరులను ఉద్ధరించడానికీ అయితే మనకు ఆనందం అవసరం.

మన హృదయాల్లో సంతోషం లేకుండా ప్రపంచానికి ఎలా సంతోషాన్ని అందివ్వగలం? మనలో ఒక సజీవ చైతన్యం ఉంది.

ప్రపంచాన్ని నడిపే చైతన్యంతో మనం సంబంధం ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అది సజీవమైనదని తెలుసుకుంటాం.

శాశ్వతమైన దాన్ని స్పృశించినప్పుడే మనలోని సర్వదుఃఖాలు నశిస్తాయి.

అందుకై మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.


ఉన్నత ప్రేరణ ద్వారా నా ఆలోచనలను వికసింపజేయి. హృదయానందాన్ని నాకు అనుగ్రహించు.
విశ్వజీవనంతో నా జీవితం లయబద్ధంగా సాగనీ, విశ్వమనస్సుతో నా మనస్సు సామరస్యంగా ఆలోచించనీ, అవిచ్ఛిన్నమైన,
అవినాశమైన శాంతిని నాకు అనుగ్రహించు.
*****************

working from Home,

o All who are working from Home,
I want to share one bad experience of my friend's friend who was working from home (non-infy)
He started working from home in march like all of us, due to team member's network issues, unavailability of laptops There was heavy workload on him, he used to work for 12-13 hrs, multiple calls, meetings, Lunch/breakfast along with work. After one month his right leg got slight swelling, he went to general physician.after few more days he started facing little difficulty while breathing. Considering this is normal, he ignored n continued to work as usual 12-13 hrs. 
One day he suddenly collapsed and fainted, became unconscious for almost five minutes. His wife along with society members gave him first aid to gain consciousness. He immediately admitted hospital n moved to ICU for three days. Obviously covid test done for him, fortunately it was negative. Few more blood tests were done. Blood clots found in his legs. Doctor said prolonged sitting led to formation of blood clots in legs, once clots forms they can travel to lungs, one od the reason for his breathing issue.
He took leave for one month. He called me shared this experience and told me that this incident changed him completely about his views towards life, work and how important health is.
Your health should be of the utmost importance and at the top of your priority list. When your health is not in good condition, every other aspect of your life suffers. 
So many of us working like this ingoring body singnal.  I just want to request you all to avoid sitting for long hours continuously, take 5-10 min break after every 2 hrs, take small walk. Avoid work from bed, sofa, maintain proper posture, aim for at least 30 minutes of moderate physical activity every day.
Just wanted to share this with you all, as most of people currently working from home. Please please avoid sitting for long hours without taking breaks.🙏
******************

పరిపూర్ణ సంతోషం

కాళీమాత ఆలయం లో ఓ రోజు ప్రసాదం గా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు.
అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు లడ్డూ కి చీమలు పట్టడం మొదలైంది. లడ్డూ తయారు చేస్తున్న వారి కి ఏం చేయాలో తెలీలేదు.

"చీమలను చంపకుండా ఎలా?"
అని ఆలోచనలో పడ్డారు.
వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంస ను సలహా అడిగారు.

అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి.వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి.
ఇక ఇటు రావు అని సూచించారు.

పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారి లో చక్కెర పొడి చల్లారు. ఆ పొడి ని చూడటం తోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాస్సేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి.

సమస్య కొలిక్కి వచ్చింది.

ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు.

 "మనుషులూ ఈ చీమల్లాంటి వారే. తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే తమకు తెలియకుండానే దానిని మధ్య లోనే విడిచి పెట్టి మరొకటేదైనా దారి లో కనిపిస్తే దాని తో సరిపెట్టుకుంటారు, తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు...." అని చెప్పారు.

తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేనని ఒక్క చీమా ముందుకు రాలేదు.

మనం కూడా అలానే భగవంతుడు సర్వస్వం అనుకొనే సాధన మొదలు పెడతాము.
మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి మన సాధన అంత వృధా చేసుకొంటాము.

తీయగా ఉందన్న చక్కెర తో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు. రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి.

లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు.

ధర్మో రక్షతి రక్షితః 🙏🏻🙏🏻🙏🏻       
సర్వే జనా సుఖినోభవంతు🙏🏻🙏🏻🙏🏻

Be Good...
Do Good....
****************

రామాయణమ్ 40


....
ఆ రాత్రి రామచంద్రుడు సీతతో కలసి హోమముచేసి మిగిలిని హవిస్సు భక్షించి నారాయణుని ధ్యానిస్తూ అత్యంత మనోహరంగా అలంకరించిన మహావిష్ణువు ఆలయప్రాంగణంలో పరచిన దర్భలమీద సీతతో కూడ శయనించాడు!
.
నాల్గవ ఝాముననే మేల్కొని మరల యదావిధిగా చేయవలసిన కార్యక్రమములన్నీ చేసి  ప్రశాంతచిత్తుడైవున్నాడు.
.
నగరం అంతా పౌరులు అలంకరించి శ్రీరామభిషేక ఘడియలకోసం ఎదురు చూస్తున్నారు. వీధులలో జనఘోష సముద్రఘోషను తలపిస్తున్నది..
.
పుట్టినప్పటినుండీ కైక తో కలిసిపెరిగిన దాసి ఒకతి ! ఆవిడ పేరు మంథర ఆ రోజు రాజప్రసాదము పైకి ఎక్కింది! మంథరకు కోలాహలంగా ఉండి చక్కగా అలంకరింపబడిన రాజవీధులు కనపడ్డాయి! జనులందరూ తలస్నానం చేసి కొత్తబట్టలు ధరించి ఉన్నారు .ఎటు చూసిన మంగళ వాయిద్యాల హోరు ,వేదఘోష, మంత్రపఠనం ,అశ్వములజోరు,గజములహుషారు ఎవరి ముఖంలో చూసినా సంతోషం ! కనపడ్డాయి !
.
అటుకళ్లు తిప్పిచూసింది కౌసల్యమందిరం ముందు జనులు బారులు తీరి ఉన్నారు అక్కడ సమృద్ధిగా దానధర్మాలు జరుగుతున్నాయి! .
.
తన ప్రక్కనే వున్న మరొక దాదిని అడిగింది ఏమిటి నగరంలో ఈ రోజు పండుగవాతావరణం ఉన్నదేమిటి? అని .
.
అప్పుడు ఆ దాది ఇలా చెప్పింది ," నేడు రామునికి పట్టాభిషేకం" .
.
ఆమాటలు ఒక్కసారి మంథరచెవిన పడగానే భృకుటి ముడివడింది కళ్ళలో ఎర్రజీరలువచ్చి రుసరుసలాడుతూ విసవిసా మెట్లుదిగి ,అప్పటికింకా నిద్రలేవని కైకను తట్టి లేపింది!
.
పైపైకి ఆపదలు వచ్చి పడుతున్నా ఇంత తెలివితక్కువగా ఇంకా నిద్రపోతున్నావా ! మూఢురాలా లే ! నిద్దురలే !
.
ఉత్తిష్ఠ మూఢే కిం శేషే భయం త్వామభివర్తతే!..
.
భర్తప్రేమకు నేనే ఎక్కువపాత్రురాలినని మురిసిపోతుంటావుగా ఇప్పుడేం జరిగిందో చూడు!
.
నీ సౌభాగ్యం మండి నట్లే ఉంది ! అది ఎండాకాలంలో ఎండిపోయిన నది!.
.
ఏమయ్యిందే నీకు ఇవ్వాళ? ఇట్లా గావుకేకలు పెడుతున్నావు?
అని అడిగింది కైక..
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
*****************

బ్రహ్మచారులకు సద్యశ్శౌచం

బ్రహ్మచారులకు సద్యశ్శౌచం :-* బ్రహ్మచారి అంటే ఎవరు? ఈ ధర్మశాస్త్రమందు బ్రహ్మచారిని గూర్చి *ఆదిష్టి* పదం వాడబడింది. అదిష్టి అంటే బ్రహ్మచారిగా వ్రతనియమాలను పాటిస్తూ ఆచార్యులు ఉపనయన మందుఉపదేశించిన *బ్రహ్మచార్యసి, ఆపోశాన, కర్మకురు, మాదివాస్వాప్సీః, భిక్షాచర్యంచర*
ఇట్లాంటి నియమాలనాచరిస్తూ, గురుకులవాసం చేసేవాడు బ్రహ్మచారి. ఇట్లాంటి వానికి ఆశౌచమందు సద్యశ్శౌచం అంటే స్నానంతో శుద్ధి. ఇట్టివాడు
ఆచార్యం స్వముపాధ్యాయం పితరం మాతరం గురుం!
నిర్భృత్యతువ్రతీప్రేతం సమ్రతేన నయుజ్యతే!
మాతామహ మాతులం తత్పత్నా చానపత్యకే!
ప్రతీ సంస్కురుతేయస్తు ప్రతలోపో జాతస్యహి”!!

ఆచార్యులకు, తనకు విద్యాదాతయైన ఉపాధ్యాయునకు, తల్లిదండ్రి గురువు వీరికి ప్రేతకార్యం చేస్తే వ్రతభంగం లేదు. తల్లి యొక్క తండ్రికి, మేనమామకు ఆయన భార్యకు సంతానం లేనిచో వారికిన్ని దహనం సంస్కారం చేస్తే వ్రత లోపం రాదు. పైన తెల్పిన వారందరికీ దహన సంస్కారాలు చేసిన తన యింట భోజనం చేయకూడదు. ఎందుకంటే మరణం వల్ల వ్యక్తులకే కాదు ఆ యింటికిన్ని ఆశౌచముంటుంది కనుక భోజనం కూడదు. *పతతియత్తస్మాత్ ప్రేతాన్నం నాత్ర భక్షయేత్* ప్రేతాన్నం తింటే తాను పతితుడౌతాడు. *అన్యత్రభోజనం కుర్యాత్ న చతైస్సహ సంవిశేత్* వేరే ఇంట్లో భుజించవచ్చు. కాని ఆశౌచం కలవారితో కలిసి నిద్రించకూడదు. కలిసి కూడా తిరుగొద్దు

*ఏకాహమశుచిర్ భూత్వా ద్వితీయేహాని శుద్ధ్యతి* ఆ ఒక్కరోజు అశుచిగ ఉండి రెండవరోజు శుద్ధి పొందుతాడు. ఇదంతా మను, భృగు, యాజ్ఞవల్క్యుడు తెల్పిన విషయాలు. ఇక తన తండ్రికి- *బ్రహ్మచారీ యదాకుర్యాత్ పిండ నిర్వాపణం పితుః | తావత్కాలంతదాశౌచం తతస్సాత్వావిశుద్ధ్యతి* తల్లికిగాని తండ్రికిగాని ఉదకదాన పిండప్రదానాదులు చేసినపుడే ఆశౌచము. తర్వాత స్నానం చేస్తే శుద్ధుడౌతాడు

*పాలివారు మరణిస్తే ఆశౌచవిధానమెట్టిది* అనగా తన బ్రహ్మచర్య వ్రతం నియమంలో ఉంటే బ్రహ్మచర్య వ్రతం పూర్తయిన తర్వాత సమావర్తనం అనగా స్నాతకం చేసుకున్న తర్వాత సపిండులకు ఉదకదానాదులిచ్చి త్రిరాత్రాశౌచం పట్టాలి.
*శతకం టీక*:- కృచ్చ, చాంద్రాయణ, వేదపారాయణ, బ్రహ్మచర్య, వివాహ, యజ్ఞాది సమాప్తి పర్యదా ఆశౌచకాలమధ్యేస్యాత్ తదాశేషమాశౌచ మనుష్టేయం | యస్యాశౌచకాలాదూర్ధ్వ పరిసమాప్తి స్యాత్ తదా మరణవిషయే అతిక్రాంతమాశౌచమనుష్ఠేయం,!!

మను:-“అతి క్రాంతే దశా హేచత్రిరాత్ర మశుచిర్భవేత్ | అతోప్రతినాంజ్ఞాతి
మరణే సతి సంవత్సరాదూర్ంవ్రత సమాప్తిశ్చేత్ సద్యశాచమేతి"

మనుః!!

కృచ్ఛ చాంద్రాయణ వ్రతం నున్నవారు, వేదపారాయణ, బ్రహ్మచర్య వ్రతంలో నున్నవారు, వివాహవిధిలో నున్నవారు, యజ్ఞయాగాది క్రతువుల్లో నున్నవారు ఆశౌచమధ్యలో ఉన్నట్లైతే ఇది పూర్తియైన తర్వాత మిగిలిన రోజులాశౌచము పట్టవలెను. ఒకవేళ ఆశౌచము పూర్తి (10 రోజులు దాటినచో) అయ్యేవరకు దీక్ష ముగియనిచో అతిక్రాంతాశౌచము పట్టవలెను. అనగా మూడురోజుల ఆశౌచము. పైన నాల్గవరోజు శుద్ధియగుదురు. దీక్ష పరిసమాప్తి
అయ్యేవరకు పాలివాడు మరణించి సంవత్సరము దాటినచో అప్పుడు దీక్ష పూర్తి అయినట్లైతే సద్యశ్శౌచమే! స్నానంతో శుద్ధి.
*సంకలనం:-గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్యులు*
**********************

శివ కుమార స్వామి చరిత్ర..

సమాజానికి తెలియ కుండా దాచి పెట్టిన చరిత్ర ఒక
నిస్వార్థ సేవా భావం గల శివ కుమార స్వామి చరిత్ర..

సేవా కార్యక్రమాల పేరుతో అనాధ పిల్లలని దత్తత
పేరుతో మతం మార్చేసిన నీచ చరిత్ర థెరిస్సా ది..

15 వ శాతాబ్దంలో కర్నాటక - తుమ్కుర్ లో స్థాపించబడిన సిద్ధగంగా మఠానికి చెందిన శ్రీ శివకుమార్ స్వామి జి
అసలు ఏమీ ఆశించకుండా 132 విద్యా సంస్థలను స్థాపించి ఏటా 50,000 మంది గ్రాడ్యుయేట్లను, సంవత్సరానికి 10,000 మంది గురుకుల విద్యార్థులకు విద్యను అందిస్తూ సాంప్రదాయ విద్యా విషయక అభ్యాసాన్ని పరిరక్షిస్తు, అలాగే అందులో ఉన్న అంత మంది విద్యార్థులు అందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తూ, ఏటా 5 లక్షల మంది రైతులకు మద్దతు ఇచ్చే వ్యవసాయ కార్యక్రమాలను చేస్తూ, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆ శివకుమార స్వామి గారి గురించి భారతదేశంలో పుట్టిన మనకు ఇంత వరకు తెలియక పోవడం ఒక విధంగా సిగ్గుచేటు.. అది మన దౌర్భాగ్యం.. ఇంత చేసిన ఆ స్వామిని మీడియా అతని ప్రయత్నాలను, విజయాలను హైలైట్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు.. కారణం ఆ స్వామి ఎప్పుడూ కాషాయ వస్త్రం కట్టుకొని సింధూర బొట్టు పెట్టడమే...
**********************

శివ కేశవులు

అనగనగా ఒక రామ భక్తుడు, రాముడంటే వల్లమాలిన ప్రేమ. పోనీలే అని విష్ణువన్నా నమస్కరిస్తాడు కాని శివుడి పేరు ఎత్తడు.
ఒక సారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇమ్మన్నాడు.

ఆ పెద్దాయనకీ తెలుసు ఇతడికి శివుడు అంటే పడదని సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు. విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు చదువుకో అంటూ.

"గవీశపాత్రో నగజార్తిహారీ కుమారతాతః శశిఖండమౌళిః
లంకేశ సంపూజితపాదపద్మః పాయాదనాదిః  పరమేశ్వరో నః "

ఆశ్చర్య పోయాడు చదవగానే అందులో ఏమని చెప్పబడింది? "పరమేశ్వరః నః పాయాత్" అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం. తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి  విశేషణాలు.. అర్ధం చూడండి :

గవీశపాత్రః = గవాం ఈశః  గవీశః  ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనంగా కలవాడు గవీశపాత్రః అంటే సదాశివుడు .

నగజార్తి హారీ = నగజ అంటే పార్వతీ దేవి ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ అంటే సాంబశివుడే. 

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం కుమారస్వామి యొక్క తండ్రి అయిన వాడూ, శివుడే నిస్సందేహంగా.

శశి ఖండ మౌళి: అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: లంకాధిపతి అయిన రావణుని చే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ. 

అనాదిః = ఆది లేని వాడూ అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ అటువంటి  పరమేశ్వరః నః పాయాత్

వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం .

అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది అది పట్టుకుని తెగ తిరిగాడు.  చివరికి ఒకాయన అది విష్ణువుని కీర్తించేదే  ఏమీ అనుమానం లేదు అని అతడిని ఓదార్చాడు.

ఇది మరో ఆశ్చర్యం .

అనాది అనే మాటలో ఉంది అంతా.., కిటుకు చూడండి పరమేశ్వరుడు ఎలాటివాడూ  అంటే "అనాదిః" అట. అంటే ఆది లేని వాడు. అంటే..
"పరమేశ్వర" లో ఆది అక్షరం లేనివాడు.
ఇప్పుడు ఏమయ్యింది? "రమేశ్వరః" అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!

గవీశపాత్రః... లో గ తీసెయ్యండి.., వీశపాత్రః అవుతుంది.
విః  అంటే పక్షి అని అర్ధం. వీనామ్  ఈశః  వీశః.. పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు .

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి..
గజార్తి హారీ.. గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.
కుమారతాతః.. ఆది అక్షరం తీసేస్తే.. మారతాతః.. మన్మధుని తండ్రి అయిన విష్ణువు.

శశి ఖండ మౌళి:.. మొదటి అక్షరం లేక పోతే శిఖండమౌళిః.. నెమలిపింఛము ధరించిన విష్ణువు .
 
లంకేశ సంపూజిత పాద పద్మ:.. మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి,
కేశ సంపూజిత పాద పద్మ:... క అంటే బ్రహ్మ , ఈశః  అంటే రుద్రుడు.. అంటే బ్రహ్మ రుద్రేన్ద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.
అతడు మనలను కాపాడు గాక ....

గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు.. విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

ఇప్పటికి అతడు శాంతించాడు.

సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి, సర్వదేవతలలో   విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు . సర్వ దేవతలలో శివుని దర్శించగలిగితే వాడు భగవంతుడి భక్తుడు.

     🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏
*****************

*సుభాషితమ్* 🌸



శ్లో|| ఆద్భిర్గాత్రాణి శుధ్యన్తి మనస్సత్యేన శుధ్యతిl
విద్యాతపోభ్యాం భూతాత్మా బుద్ధిః జ్ఞానేన శుధ్యతిll

తా|| "జలములచేత శరీరము శుద్ధియగును. సత్యముచేత మనస్సు శుద్ధియగును. జ్ఞానముచే బుద్ధి శుచియగును. తపస్సుచే ఆత్మ పరిశుద్ధమగును".
***************

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము*

*పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*16.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*నివేదితం తద్భక్తాయ దద్యాద్భుంజీత వా స్వయమ్|*

*దత్త్వాఽఽచమనమర్చిత్వా తాంబూలం చ నివేదయేత్॥6936॥*

ఆ నైవేద్య ప్రసాదమును భగవద్భక్తులకు పంచవలెను. లేదా, స్వయముగా భుజింపవలెను. పిమ్మట శ్రీహరికి ఆచమనమిచ్చి పూజించి తాంబూలమును సమర్పింపవలెను.

*16.42 (నలుబది రెండవ శ్లోకము)*

*థజపేదష్టోత్తరశతం స్తువీత స్తుతిభిః ప్రభుమ్|*

*కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమేద్దండవన్ముదా॥6937॥*

అనంతరము ద్వాదశాక్షరీ మంత్రమును నూట ఎనిమిదిసార్లు జపింపవలెను. పిదప స్తోత్రముల ద్వారా భగవంతుని స్తుతింపవలెను. ప్రదక్షిణపూర్వకముగా భక్తితో సాష్టాంగ నమస్కారములను చేయవలెను.

*16.43 (నలుబది మూడవ శ్లోకము)*

*కృత్వా శిరసి తచ్ఛేషాం దేవముద్వాసయేత్తతః|*

*ద్వ్యవరాన్ భోజయేద్విప్రాన్ పాయసేన యథోచితమ్॥6938॥*

నిర్మాల్యమును శిరస్సున ధరించిన పిమ్మట, ఆ స్వామికి ఉద్వాసన చెప్పవలెను. కనీసము ఇద్దరు బ్రాహ్మణులకు  యథోచితముగా పాయసముతో భోజనము చేయింపవలెను.

*16.44 (నలుబదినాలుగవ శ్లోకము)*

*భుంజీత తైరనుజ్ఞాతః శేషం సేష్టః సభాజితైః|*

*బ్రహ్మచార్యథ తద్రాత్ర్యాం శ్వోభూతే ప్రథమేఽహని॥6939॥*

*16.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*స్నాతః శుచిర్యథోక్తేన విధినా సుసమాహితః|*

*పయసా స్నాపయిత్వార్చేద్యావద్వ్రతసమాపనమ్॥6940॥*

ఆ బ్రాహ్మణుని దక్షిణ మొదలగు వాటితో సత్కరింపవలెను. పిదప, వారి యాజ్ఞతో తన బంధుమిత్రులతో గూడి మిగిలిన ప్రసాదమును గ్రహింపవలెను. ఆ రాత్రి బ్రహ్మచర్యమును పాటించి, మరుసటి దినమున ప్రాతఃకాలముననే స్నానాదులను ఆచరించి, శుచియై పూర్వోక్త విధానముతో ఏకాగ్ర చిత్తముతో భగవంతుని ఆరాధింపవలెను. ఈ విధముగా వ్రతము ముగియువరకు పాలతో భగవంతుని అభిషేకించుచు పూజింపవలెను.

*16.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*పయోభక్షో వ్రతమిదం చరేద్విష్ణ్వర్చనాదృతః|*

*పూర్వవజ్జుహుయాదగ్నిం బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్॥6941॥*

సాధకుడు ఈ విధముగా భగవంతుని ఆదరముగా సేవించి, కేవలము పాలను మాత్రమే ఆరగించుచు ఈ పయోవ్రతమును ఆచరింపవలెను. ప్రతిదినము హోమమును, బ్రాహ్మణ భోజనమును జరుపవలెను.

*16.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*ఏవం త్వహరహః కుర్యాద్ద్వాదశాహం పయోవ్రతః|*

*హరేరారాధనం హోమమర్హణం ద్విజతర్పణమ్॥6942॥*

ఇట్లు పన్నెండు దినములు పయోవ్రతమును ఆచరించుచు ప్రతిదినము భగవదారాధన, హోమము, పూజ చేయవలెను. అట్లే బ్రాహ్మలను భుజింప జేయవలెను.

*16.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*ప్రతిపద్దినమారభ్య యావచ్ఛుక్లత్రయోదశీ|*

*బ్రహ్మచర్యమధఃస్వప్నం స్నానం త్రిషవణం చరేత్॥6943॥*

ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలుకొని త్రయోదశివరకు బ్రహ్మచర్యవ్రతమును పాటింపవలెను. నేలపై పరుండవలెను. ప్రతిదినము మూడుసార్లు స్నానము చేయుచుండవలెను.

*16.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*వర్జయేదసదాలాపం భోగానుచ్చావచాంస్తథా|*

*అహింస్రః సర్వభూతానాం వాసుదేవపరాయణః॥6944॥*

అసత్యము పలుకరాదు. పాపపు పలుకులు మాట్లాడరాదు. పాపులతో మాట్లాడరాదు. అన్ని విధములైన భోగములను వర్జింపవలెను. ఏ ప్రాణికిని ఎట్టి అపకారమును చేయరాదు. భగవదారాధనయందే నిరతుడై యుండవలెను.

*16.50 (ఏబదియవ శ్లోకము)*

*త్రయోదశ్యామథో విష్ణోః స్నపనం పంచకైర్విభోః|*

*కారయేచ్ఛాస్త్రదృష్టేన విధినా విధికోవిదైః॥6945॥*

త్రయోదశినాడు శాస్త్రవిధులను తెలిసిన వారి ద్వారా శ్రీమహావిష్ణువునకు శాస్త్రోక్తముగా పంచామృతములతో (పాలు, పెరుగు, నేయి, శర్కర, తేనె) అభిషేకము చేయింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునారవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
*******************

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము*

*పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*16.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*నివేదితం తద్భక్తాయ దద్యాద్భుంజీత వా స్వయమ్|*

*దత్త్వాఽఽచమనమర్చిత్వా తాంబూలం చ నివేదయేత్॥6936॥*

ఆ నైవేద్య ప్రసాదమును భగవద్భక్తులకు పంచవలెను. లేదా, స్వయముగా భుజింపవలెను. పిమ్మట శ్రీహరికి ఆచమనమిచ్చి పూజించి తాంబూలమును సమర్పింపవలెను.

*16.42 (నలుబది రెండవ శ్లోకము)*

*థజపేదష్టోత్తరశతం స్తువీత స్తుతిభిః ప్రభుమ్|*

*కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమేద్దండవన్ముదా॥6937॥*

అనంతరము ద్వాదశాక్షరీ మంత్రమును నూట ఎనిమిదిసార్లు జపింపవలెను. పిదప స్తోత్రముల ద్వారా భగవంతుని స్తుతింపవలెను. ప్రదక్షిణపూర్వకముగా భక్తితో సాష్టాంగ నమస్కారములను చేయవలెను.

*16.43 (నలుబది మూడవ శ్లోకము)*

*కృత్వా శిరసి తచ్ఛేషాం దేవముద్వాసయేత్తతః|*

*ద్వ్యవరాన్ భోజయేద్విప్రాన్ పాయసేన యథోచితమ్॥6938॥*

నిర్మాల్యమును శిరస్సున ధరించిన పిమ్మట, ఆ స్వామికి ఉద్వాసన చెప్పవలెను. కనీసము ఇద్దరు బ్రాహ్మణులకు  యథోచితముగా పాయసముతో భోజనము చేయింపవలెను.

*16.44 (నలుబదినాలుగవ శ్లోకము)*

*భుంజీత తైరనుజ్ఞాతః శేషం సేష్టః సభాజితైః|*

*బ్రహ్మచార్యథ తద్రాత్ర్యాం శ్వోభూతే ప్రథమేఽహని॥6939॥*

*16.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*స్నాతః శుచిర్యథోక్తేన విధినా సుసమాహితః|*

*పయసా స్నాపయిత్వార్చేద్యావద్వ్రతసమాపనమ్॥6940॥*

ఆ బ్రాహ్మణుని దక్షిణ మొదలగు వాటితో సత్కరింపవలెను. పిదప, వారి యాజ్ఞతో తన బంధుమిత్రులతో గూడి మిగిలిన ప్రసాదమును గ్రహింపవలెను. ఆ రాత్రి బ్రహ్మచర్యమును పాటించి, మరుసటి దినమున ప్రాతఃకాలముననే స్నానాదులను ఆచరించి, శుచియై పూర్వోక్త విధానముతో ఏకాగ్ర చిత్తముతో భగవంతుని ఆరాధింపవలెను. ఈ విధముగా వ్రతము ముగియువరకు పాలతో భగవంతుని అభిషేకించుచు పూజింపవలెను.

*16.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*పయోభక్షో వ్రతమిదం చరేద్విష్ణ్వర్చనాదృతః|*

*పూర్వవజ్జుహుయాదగ్నిం బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్॥6941॥*

సాధకుడు ఈ విధముగా భగవంతుని ఆదరముగా సేవించి, కేవలము పాలను మాత్రమే ఆరగించుచు ఈ పయోవ్రతమును ఆచరింపవలెను. ప్రతిదినము హోమమును, బ్రాహ్మణ భోజనమును జరుపవలెను.

*16.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*ఏవం త్వహరహః కుర్యాద్ద్వాదశాహం పయోవ్రతః|*

*హరేరారాధనం హోమమర్హణం ద్విజతర్పణమ్॥6942॥*

ఇట్లు పన్నెండు దినములు పయోవ్రతమును ఆచరించుచు ప్రతిదినము భగవదారాధన, హోమము, పూజ చేయవలెను. అట్లే బ్రాహ్మలను భుజింప జేయవలెను.

*16.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*ప్రతిపద్దినమారభ్య యావచ్ఛుక్లత్రయోదశీ|*

*బ్రహ్మచర్యమధఃస్వప్నం స్నానం త్రిషవణం చరేత్॥6943॥*

ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలుకొని త్రయోదశివరకు బ్రహ్మచర్యవ్రతమును పాటింపవలెను. నేలపై పరుండవలెను. ప్రతిదినము మూడుసార్లు స్నానము చేయుచుండవలెను.

*16.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*వర్జయేదసదాలాపం భోగానుచ్చావచాంస్తథా|*

*అహింస్రః సర్వభూతానాం వాసుదేవపరాయణః॥6944॥*

అసత్యము పలుకరాదు. పాపపు పలుకులు మాట్లాడరాదు. పాపులతో మాట్లాడరాదు. అన్ని విధములైన భోగములను వర్జింపవలెను. ఏ ప్రాణికిని ఎట్టి అపకారమును చేయరాదు. భగవదారాధనయందే నిరతుడై యుండవలెను.

*16.50 (ఏబదియవ శ్లోకము)*

*త్రయోదశ్యామథో విష్ణోః స్నపనం పంచకైర్విభోః|*

*కారయేచ్ఛాస్త్రదృష్టేన విధినా విధికోవిదైః॥6945॥*

త్రయోదశినాడు శాస్త్రవిధులను తెలిసిన వారి ద్వారా శ్రీమహావిష్ణువునకు శాస్త్రోక్తముగా పంచామృతములతో (పాలు, పెరుగు, నేయి, శర్కర, తేనె) అభిషేకము చేయింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునారవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
******************

ఉన్నది పోదు - లేనిది రాదు

 - సృష్టి యందలి ప్రతివస్తువూ స్థూలముగ గాని, సూక్ష్మముగగాని శాశ్వతముగ ఉండి యుండును. 🌹*

సృష్టిలో లేనిది భావమునకే రాదు. ఉన్నది భావమునకు రాకపోదు. అందుకే చమత్కారముగా ''సృష్టిలో లేనిదంటూ లేదు'' అని అంటారు. లేనిది భావనకే రాదు. భావనలోకి వచ్చినది ఉండకుండ పోదు. 

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః |
ఉభయోరపి దృష్టో-ంత స్త్వనయో స్తత్త్వదర్శిభిః || 16
అవినాశి తు తద్విద్ధి యేన సర్వ మిదం తతమ్‌ |
వినాశ మవ్యయ స్యాస్య న కశ్చి త్కర్తు మర›తి || 17

అందుకే దైవము లేనుట తెలివి తక్కువ. లేనిచో భావమునం దెట్లేర్పడును? లేనిది భావమునకు రాదు కదా ! ఉన్నది మనకి కనప నప్పుడు లేదందుము. మనకు కనపడనిది లేదనుట పసితనము.

దయ్యములు ఉన్నవా? అను ప్రశ్న వచ్చినపుడు కూడ సమాధాన మిదియే. లేనిది భావించము కదా! మనకు తెలిసిన విషయము లన్నియు ఉన్నవియే. కానిచో కొందరికి ఉండవచ్చు.

 కొందరికి ఉండకపోవచ్చు. ఉండుట, లేకుండుట, గ్రహించువాని స్థితిని బట్టి ఉండును. కొందరికి సూక్ష్మ లోకములున్నవి. వాని అనుభూతి కూడ ఉన్నది. కొందరికి లేదు.

అనుభూతి లేనివారు లేవందురు. అనుభూతి కలుగనంత వరకు
లేదన్నది వారికి సత్యము కాని, శాశ్వత సత్యము కాదు.
అటులనే ఏదియైునను ఒకప్పుడుండుట, మరియొకప్పుడు
ఉండ కుండుట ఉండదు. మన తాత ముత్తాతలు, మన ముందు
తరముల వారు, ముందు యుగముల వారు ఉన్నారా అను ప్రశ్నకు సమాధానము ఉన్నారనియే!

ఉండుట కేవలము భౌతికము కాదని తెలియవలెను. సృష్టి యందలి ప్రతివస్తువూ స్థూలముగ గాని, సూక్ష్మముగగాని శాశ్వతముగ ఉండి యుండును. స్థూలమున అగుపించినపుడు ఉన్నదను కొనుట, అగుపించనపుడు లేదను
కొనుట అవివేకము.

 దశరథుని అంత్యక్రియల అనంతరము
ఇపుడు దశరథుండు లేు కదా! కావున రాజ్యము చేపట్టుము అని
పలికిన మంత్రి జాబాలికి రాముడు ఇచ్చిన సమాధానము ఈ
సూత్రము ననుసరించియే యుండును.

నిజమునకు సృష్టియందు పుట్టునది, పోవునది ఏమియు లేదు. స్థూలముగ అగుపించినపుడు సృష్టినదందుము, సూక్ష్మస్థితి చెందినపుడు పోయినదందుము. ఇది పరిమితమైన అవగాహనము. ప్రళయమున కూడ లోకములు, లోకేశులు, లోకస్థులు బీజప్రాయముగ నుండి సృష్టి ఆరంభమున దివ్య సంకల్పము నుండి మరల పూర్వ పద్ధతినే దిగివచ్చుచుందురు. కావున ఉన్నది లేకపోలేదు.

లేనిది ఎప్పికినీ లేదు. జీవుల ప్రళయమున దైవము నందుండు
టయే ఉండునుగాని, కరగిపోవుట, కలయుట లేదు. అట్లగుపించును.

అందువలన తెలిసినవారు ఈ సమస్తమును ఎప్పుడునూ ఉన్నదిగను, శాశ్వతముగను భావింతురు. కాలచక్రమున సూక్ష్మము నుండి స్థూలమునకు, స్థూలము నుండి సూక్ష్మమునకు వచ్చిపోవుచుండును గాని, అసలు లేకుండుట ఉండదని వారి జ్ఞానము.

గ్రహమునకు గ్రహమునకూ మధ్య గల చోటు యందు ఏమియు లేదని ఇటీవలి వరకు శాస్త్రజ్ఞులు అనుచుండిరి. అది అంతయు
దైవముతో నిండియున్నదని ఆత్మజ్ఞానులు తెలుపుదురు.

ఈ శతాబ్దమున చోటంతయూ శాన్యము కాదని, పూర్ణమని శాస్త్రజ్ఞులు తెలుసుకొనుచున్నారు. అటులనే సూక్ష్మ లోకముల వికాసము లేనివారు, దివ్య శరీరధారులైన మహర్షులు, పరమ గురువులు, దేవతలు లేరనుచుందురు. క్రమ వికాసమున వీరందరు ఉన్నారని ఒప్పుకొనక తప్పదు.

పదార్థమయ ప్రపంచము కూడ లేకపోవుట లేదని గమనించవలెను. వేదాంతులు పదార్థమును, పరమార్థమును రెండు విషయములుగ తెలుపుచు ఒకటి నిరాకరించి, రెండవ దానిని ఆదరింతురు. నిజమునకు అవి రెండును ఒకిటియే!

పరమార్థము స్థూలస్థితి చెందినపుడు పదార్థమగును. పదార్థము సూక్ష్మత చెందినపుడు పరమార్థ మగును. ఒకియే స్థితి భేదముచే రెండుగా అగుపించును గాని రెండు లేవు. మంచుగడ్డ అగుచున్నది మరల నీరగు చున్నది అని తెలియవలెను.

గీతోపనిషత్తునందు స్థాపింపబడిన అత్యంత ప్రధానమైన మూల సూత్రములలో ఈ సూత్ర మొకటి. ఈ సూత్రమును గూర్చి బాగుగ ధ్యానము చేయవలసిన అవసరము విద్యార్థులకు కలదు.
******************

*ఏమి కావాలి నీకు*


ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది.  అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే ! దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం?
సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు. ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది.
దాని క్రింద ఇలా వ్రాసి ఉంది, ఒక్క రూపాయి మాత్రమె అని.షాపు వాడి దగ్గరకి వెళ్లి అడిగాడు. ఎందుకు ఇంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని.
ఆ షాప్ వాడు " బాబూ ! ఇది ఒక అద్భుత దీపం. ఇందులో భూతం ఉంది. అది నువ్వు కోరుకున్న కోరికలు అనీ తీరుస్తుంది. అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది. అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. అదీ దిని కధ. "
పేదవాడు దానిని ఒక్క రూపాయకు కొనుక్కున్నాడు.
ఇంటికి తీసుకు వెళ్ళాడు . దానిని బాగా రుద్దాడు. *భూతం ప్రత్యక్షం అయ్యింది."* ఏమి కావాలి నీకు? అని అడిగింది.
తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు చెయ్యమన్నాడు. క్షణాలలో పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షం అయ్యింది.
భోజనం కాగానే, ఏమి కావాలి నీకు అని " అడిగింది . పడుకోవడానికి మంచం అడిగాడు. వెంటనే హంసతూలికా తల్పం వచ్చేసింది.నిద్రపోతూండగా ఏమి కావాలి నీకు అని అడిగింది.
ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు.
వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది.
ఏమి కావాలి నీకు అని అడిగింది.
పేదవాడు ఇపుడు ధన వంతుడు అయ్యాడు.  కోరికలు అడుగుతూనే ఉన్నాడు. అవి తీరుతూనే ఉన్నాయి. అతడికి విసుగు వచ్చేస్తోంది.
ఎన్నని అడగగలడు ? అడగక పోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది. భూతం తో పాటు సంపదలూ పోతాయి. ఎలా ?
పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు.
తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి కావాలి నీకు అని అడిగింది.
భూమిలో ఒక పెద్ద గొయ్యి తియ్యమన్నాడు. వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీసింది భూతం. అందులో ఒక పెద్ద స్థంభం పాత మన్నాడు. పాతేసి ఏమి కావాలి నీకు అని అడిగింది.
ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు. నేను మళ్ళీ నీకు చెప్పే వరకూ నువ్వు చెయ్యవలసిన పని ఇదే అని చెప్పాడు పేద వాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది.
పేదవాడు తన ఇంటికి వెళ్లి తాను చెయ్యవలసిన పనులను చెయ్యడం మొదలు పెట్టాడు. తన పొరుగు వారికి తాను ఏమి చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యడం మొదలు పెట్టాడు. తన సౌఖ్యం, తన ఇరుగు పొరుగు వారి సౌఖ్యమూ చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు.
కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తోంది చూడడానికి స్థంభం దగ్గరకి వెళ్ళాడు. భూతం అలసిపోయి స్థంభం ప్రక్కన నిద్రపోతోంది.
తన విజయ గాధను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు.
*ఇక్కడితో కధ పూర్తి కాలేదు, అసలు కధ ఇప్పుడే మొదలవుతుంది.*
*ఈ కధ మనది. ఈ కధనుండి మనం ఏమి నేర్చుకుందాం ?*
*మన మనసు ఆ భూతం. అది ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది. ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దానిపని.*
*ఆ వృద్ధ సన్యాసి (మన అనుభవం) చెప్పిన... ప్రకారం భూతం నాటిన స్థంభం  "మంత్రం" (దైవ నామ స్మరణ) .ఎక్కడం దిగడం మంత్రం జపం. జప సాధన! (మనసు ను స్వాధీన పరచుకుని సాధన) అనునిత్యం మంత్ర జప సాధన చెయ్యడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది.*
*అపుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం అత్మ మేలుకొంటుంది.*
*అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి, మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము. ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం! ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం.*
*మన మనసు అద్వితీయమైన శక్తులుకలిగి దైవ మాయచే నిర్మించిబడిన మహ గొప్ప మాయ యంత్రం. అంతే కాక  దైవ శక్తి నిక్షిప్తమై ఉన్నా మహోజ్వల జ్యోతి రూపం.మనం అడిగినవి అని సమకూర్చే శక్తి స్వరూపం.*
*ఆలోచనలను అదుపు చేయగలిగితే ఆ దివ్య జ్యోతి వెలుగు కనిపించడం మొదలవుతుంది. ఆ దివ్యమైన వెలుగు లో దైవ దర్శనం సాధ్యమౌవుతుంది.*
(సేకరణ)
*********************

సంతాన సప్తమి*_

సంతాన సప్తమి  పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం 2020 ఆగస్టు 25 న భాద్రపద నెల శుక్ల పక్ష ఏడవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఉపవాసం ప్రత్యేకంగా పిల్లల సాధన , పిల్లల రక్షణ మరియు పిల్లల పురోగతి కోసం జరుగుతుంది. శివుడిని , పార్వతి దేవిని ఈ రోజు పూజిస్తారు.

హిందూ మతంలో , పిల్లల సప్తమి యొక్క ఉపవాసం గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ ఉపవాసం ప్రతి సంవత్సరం భాద్రపద నెల శుక్ల పక్షం యొక్క ఏడవ రోజున పాటిస్తారు. ఈ ఉపవాసం ముఖ్యంగా పిల్లల సాధన , పిల్లల రక్షణ మరియు పిల్లల ఆనందం కోసం పాటిస్తారు. ఈ ఉపవాసం చేసే తల్లి స్నానం చేసి , సాధారణ కార్యకలాపాల తర్వాత ఉదయం శుభ్రమైన బట్టలు ధరించాలి.  విష్ణువు మరియు శివుడిని ఉదయం ప్రార్థించాలి. తరువాత  మధ్యాహ్నం , చందన , గంధపు చెక్క , అక్షింతలు , ధూపం , దీపం , నైవేద్యం , బెట్టు గింజ మరియు కొబ్బరి మొదలైన వాటితో శివ మరియు పార్వతిని మళ్ళీ పూజించండి మరియు మధ్యాహ్నం పిల్లవాడిని రక్షించమని ప్రార్ధించాలి. ఆర్తి కుటుంబ సభ్యులతో చేస్తారు. భగవంతుని ముందు తల పెట్టడం మీ హృదయ కోరిక అని అంటారు. తరువాత కుటుంబ సభ్యులకు మరియు పొరుగువారికి ప్రసాదం ఇవ్వవలెను  భాద్రపద యొక్క శుక్ల పక్షం యొక్క సప్తమి ఉపవాసం హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
సంతాన సప్తమి వెనుక కథ*

నహుషా  రాజు , అతని భార్య పేరు చంద్ర ముఖి. చంద్ర ముఖికి ఒక స్నేహితురాలు ఉన్నది , పేరు రూపమతి , ఆమె నగరంలో ఒక బ్రాహ్మణుడి భార్య. ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది ఒక రోజు , ఇద్దరూ సర్యూ ఒడ్డున స్నానం చేయడానికి వెళ్ళారు , చాలా మంది మహిళలు సప్తమిపై ఉపవాసం ఉన్నారు. ఇది విన్న ఈ మిత్రులు ఇద్దరూ కూడా ఈ ఉపవాసం పాటించాలని నిర్ణయించుకున్నారు కాని ఇంటికి వచ్చిన తరువాత వారు ఉపవాసం గురించి మరచిపోయారు. కొంతకాలం తర్వాత ఇద్దరూ చనిపోయారు మరియు ఇద్దరూ జంతువుల రూపంలో జన్మించారు.


అనేక జన్మల తరువాత , ఇద్దరూ మానవ రూపంలో జన్మించారు , ఈ జన్మలో , చంద్రవతి పేరు ఈశ్వరి మరియు రూపమతి పేరు భూషణ ఈశ్వరి రాజు భార్య మరియు భూషణ బ్రాహ్మణ భార్య , ఈ జన్మలో కూడా వారిద్దరికీ మంచి స్నేహం ఉంది. ఈ జన్మలో , భూషణ తన మునుపటి జన్మ కథను జ్ఞాపకం చేసుకుంది.  ఉపవాసమును పాటించినందువల్ల  ఆమెకు ఎనిమిది మంది కుమారులు  కలిగినవారు .    కాని ఈశ్వరి ఈ ఉపవాసం పాటించలేదు , కాబట్టి ఆమె గర్భం ధరించలేకపోయింది. ఈ కారణంగా భూషణ పై అసూయపడినది. ఆమె అనేక విధాలుగా భూషణ కుమారులను చంపడానికి ప్రయత్నించింది , కాని ఆమె ఉపవాస  ప్రభావం వల్ల ఆమె కుమారులకు ఎటువంటి నష్టం జరగలేదు. అలసిపోయిన ఈశ్వరి తన అసూయ మరియు ఆమె చర్య గురించి భూషణతో చెప్పి చివరకు క్షమాపణలు చెప్పింది. అప్పుడు భూషణ ఆమెకు మునుపటి పుట్టుకను గుర్తు చేసి , పిల్లల సప్తమి రోజు ఉపవాసం పాటించాలని సలహా ఇచ్చింది. ఈశ్వరి పూర్తి ఉపవాసం ఉండి అందమైన అబ్బాయికి జన్మనిచ్చినది. అప్పటి నుండి , ఈ ఉపవాసం పిల్లల రక్షణ కోసం మరియు పిల్లల ఆశీర్వాదం కోసం పాటిస్తారు. ఈ పవిత్రమైన రోజున శివుడు మరియు పార్వతి దేవిని పూజిస్తారు.
********************

హిందూ వివాహ వ్యవస్య - వైశిస్ట్యత


మాంగల్య సూత్రధారణలో మూడు ముళ్ళు వేయడానికి కారణం వారి శరీరం, మనస్సు, ఆత్మలు లయం కావడం ద్వారా, ఆ మూడు ముళ్ళ బంధం ఏడేడు జన్మ ల బంధంగా మారుతుందని, ఆదర్శ దాంపత్యముగా నిలుస్తుందని, నూరేండ్ల పంటగా స్థిరపడుతుందని అర్థం.
           వివాహ వేడుకలోని సప్తపది లో నూతన దంపతులు వేసే ఏడడుగులకు ఏడు అర్ధాలు ఉన్నాయి.
మొదటి అడుగు - శరీర బలం కోసం
రెండవ అడుగు - మానసిక బలం కోసం
మూడవ అడుగు - కష్టమైనా, సుఖమైనా కలిసి బ్రతకడం కోసం
నాలుగో అడుగు - ఆరోగ్యం కోసం
అయిదవ అడుగు - పశుసంపదల వినియోగం కోసం
ఆరవ అడుగు - ఋతు సంపదలు అనుగ్రహించడం కోసం
ఏడవ అడుగు - హోమాన్ని చేసే అవధూత ఆశీర్వాదం కోసం
"ధర్మమార్గంలోనూ, అర్థ సంపాదనలోనూ, దాని వినియోగం లోనూ, దైహిక, మానసిక కోర్కెలు ను సాధించడంలోనూ, నా సహ ధర్మచారిణిని అతిక్రమించను, వేరొకరితో కలిసి నన్ను అంకితం చేసుకోను" అని వివాహ ప్రతిఙ్ఞ చేయిస్తారు.
        కన్య ఇల్లాలుగా, ఇల్లాలు తల్లి గా, బ్రహ్మచారి గృహస్తుడుగా, గృహస్తుడు తండ్రి గా మారి సంతానాన్ని మంచి పౌరులు గా తీర్చి దిద్దడమే భారతీయ సంస్కృతి. 'ఓం కారం లో అర్ధం కూడా అదే,' అ'కారం,' ఉ'కారం,' మ'కారం అనే ప్రణవాలు ఉన్నవి.' అ'కారం పురుషుడైతే' ఉ'కారం స్త్రీ అయితే' మ'కారం సంతానం అవుతుంది.
          సంతాన విషయం లో ప్రేగు అమ్మ దైతే, పేరు నాన్నది. అమ్మ ఒడి గుడి అయితే, నాన్న భుజం లోకాన్ని చూపే బడి. అమ్మ జోలపాట ఎలాగో, నాన్న నీతి పాఠం అలాగ. గుండెల్లో దాచుకున్న అమ్మ ప్రేమ గొప్పదా? గుండెల మీద తన్నినా  కిమ్మనక నవ్వే నాన్న ప్రేమ గొప్పదా? వెరసి ఇద్దరూ పెద్ద బాలశిక్ష లోని పదాలూ, అర్ధాలూ, అందుకే "మాత్రుదేవో భవ, పితృ దేవో భవ" అనితైత్తిరీయోపనిషత్తు తెలుపుతుంది.
         సంతానం కలిగిన తర్వాత వారికి సేవలు చేస్తూ "ఇది గాక సౌభాగ్య, మిదిగాక తపము, ఇదిగాక వైభవం ఇలనొకటి కలదా" అని పరవశించని తల్లులు ఉంటారా? అమ్మ చూపేది ప్రేమే. భార్య అందించేది ప్రేమే. అమ్మ ప్రేమ లో వాత్సల్యముంటే, భార్య ప్రేమలో అనురాగం కనిపిస్తుంది. ఆ ఇద్దరి ప్రేమ బంధంలో ముడిపడి ఉండేది పురుషుని జీవితం. జీవితాన్ని ఇచ్చేది తల్లయితే, ఆ జీవితానికో అర్థాన్ని ఇచ్చేది సతి. వారిద్దరి సేవలను జీవితోత్సవంగా చేసుకోవాలి పురుషుడు....
***********************

వివిధ ఆగమ శాస్త్రాల్లోని గణపతులు


ముద్గల పురాణాన్ని అనుసరించి 32 మంది గణపతులు ఉన్నారు.

1. బాల గణపతి 2.తరుణ గణపతి 3.భక్త గణపతి 4.వీర గణపతి

5. శక్తి గణపతి 6.ద్విజ గణపతి 7.సిద్ధ గణపతి 8.ఉచ్చిష్ట గణపతి

9.విఘ్న గణపతి 10.క్షిప్ర గణపతి 11.హేరంబ గణపతి 12.లక్ష్మీ గణపతి

13.మహా గణపతి 14. విజయ గణపతి 15.వృత్త గణపతి

16. ఊర్ద్వ గణపతి 17.ఏకాక్షర గణపతి 18.వర గణపతి 19.త్ర్యక్షర గణపతి 20.క్షిప్ర ప్రసాద గణపతి

21.హరిద్రా గణపతి 22.ఏకదంత గణపతి 23.సృష్టి గణపతి 24.ఉద్ధండ గణపతి

25.ఋణ మోచన గణపతి 26.దుండి గణపతి 27.ద్విముఖ గణపతి 28.త్రిముఖ గణపతి

29.సింహ గణపతి 30.యోగ గణపతి 31.దుర్గా గణపతి 32 .సంకష్ట గణపతి

ఈ గణపతి రూపాల్లో మొదటి 16 గణపతులు చాలా మహిమాన్వితమైనవి. వీటిని "షోడశ'' గణపతులు అంటారు.

నంజనగూడు దేవాలయంలో ఉన్న 32 గణపతి విగ్రహాల పేర్లలో 15 పేర్లు మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న పేర్లతో సరిపోలుతున్నాయి. తక్కినవి వేరుగా ఉన్నాయి. ఈ అంశాన్ని మైసూరు ప్రాచ్య పరిశోధనా సంస్థ వెల్లడించిన నివేదిక కూడా పేర్కొంది.

విద్యార్ణవ తంత్రంలో గణపతి రూపాల్లో 15 విభేదాలు కనిపిస్తాయి.

1. ఏకాక్షర గణపతి 2.మహా గణపతి 3. క్షిప్ర గణపతి

4. వక్రతుండ గణపతి 5. లక్ష్మీ గణపతి 6. హేరంబ గణపతి

7. వీర గణపతి 8.లక్ష్మీ గణపతి 9. శక్తి గణపతి

10. సుబ్రహ్మణ్య గణపతి 11. మహా గణపతి 12. త్రైలోక్య గణపతి

13. హరిద్రా గణపతి 14. వక్రతుండ గణపతి 15. ఉచ్చిష్ట గణపతి

ఇందులో రెండు మహా గణపతులు ఉన్నాయి. కాగా మూడు లక్షణాలు ఉన్న గణపతులు కనిపిస్తున్నాయి. లక్ష్మీ గణపతులు రెండు, వక్రతుండ గణపతులు రెండు, శక్తి గణపతి లక్షణాలు అయిదు, త్రైలోక్య మోహన గణపతి లక్షణాలు రెండు, వీర గణపతి లక్షణాలు రెండు, ఉచ్చిష్ట గణపతి లక్షణాలు రెండు స్పష్టమౌతున్నాయి.

శిల్ప ఆగమ శాస్త్రాలను అనుసరించి 21 గణపతుల రూపాలు ఉన్నాయి. అవి వరుసగా...

1.వినాయకుడు 2.బీజ గణపతి 3.హేరంబ గణపతి 4.వక్రతుండ గణపతి

5.బాల గణపతి 6.తరుణ గణపతి 7.భక్తి విఘ్నేశ 8.వీర విఘ్నేశ 9.శక్తి గణేశ

10.ధ్వజ గణపతి 11.పింగళ గణపతి 12. ఉచ్చిష్ట గణపతి 13. విఘ్నరాజ గణపతి

14.లక్ష్మీ గణేశ 15.మహా గణేశ 16. భువనేశ గణపతి 17.నృత్త గణపతి

18.ఊర్ద్వ గణపతి 19.ప్రసన్న గణపతి 20.ఉన్మత్త వినాయక 21.హరిద్రా గణేశ

విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 33 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత.

1. బాల గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.

కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.

2. తరుణ గణపతి:

ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. ఈయనను...

పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః అనే మంత్రంతో పూజించాలి.

3. భక్త గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్

అనే మంత్రతో స్తుతించాలి...ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.

4. వీరగణపతి

ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను....

బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ
ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం
వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి
అనే మంత్రంతో కీర్తించాలి. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు.

5. శక్తి గణపతి

ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం
పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం
భయాపహం శక్తి గణేశ మీదే
అనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి. నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం,
విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.

6. ద్విజ గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః
విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం
త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః అనే మంత్రంతో పూజించాలి. ఈ గణపతి తెలివి తేటలు ప్రసాదిస్తాడు.

7. సిద్ధి (పింగల) గణపతి

ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

పక్వచుత ఫల పుష్పమంజరీ
ఇక్షుదండ తిలమోదకై స్సహ
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల
అనే మంత్రంతో స్తుతించాలి.

8. ఉచ్ఛిష్ట గణపతి

కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః
అనే మంత్రంతో ప్రార్థించాలి.

9. విఘ్న గణపతి

గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశ
చక్ర స్వదంత సృణి మంజరికా శరౌఘై
పాణిశ్రిఅఅఅ పరిసమీహిత భూషణా శ్రీ
విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః అనే మంత్రంతో ప్రార్థించాలి.

10. క్షిప్త గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు. ఈయనను....

దంత కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జ్వలమ్
బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపమ్
అనే మంత్రంతో స్తుతించాలి.

11. హేరంబ గణపతి

అభయ వరదహస్త పాశదంతాక్షమాల
సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ
ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం
గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా

అనే మంత్రంతో స్తుతించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు. ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.

12. లక్ష్మీ గణపతి

బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్
పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరః
శ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికే

గౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్ అనే స్తోత్రంతో పూజించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. ఈ సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.

13. మహాగణపతి

ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతుంది.

హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టం శిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్

బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల
వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే
అనే మంత్రంతో ప్రార్థించాలి.

14. విజయ గణపతి

సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని....
పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనః
విఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః అనే మంత్రంతో పూజించాలి.

15. నృత్య గణపతి

సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు.

పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులీకుమ్
పీతప్రభం కల్పతరో రథః స్థం భజామి తం నృత్త పదం గణేశమ్
అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

16. ఊర్ధ్వ గణపతి

కారాగార బాధ నుండీ తప్పించే ఈ గణపతి కుడి చేతులలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం, ఎడమ వైపు చేతులతో వరివెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తారు.

కల్హార శాలి కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల లాలితాంగ ఆలింగ్య గణోద్యతకరో హరితాంగ యష్ట్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.
***************************

*అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?*🌸



🌻మానవుడు తాను చేసిన పాపుణ్యాల ఆధారంగా నరక స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి. స్వర్గం చేరటానికి అనేక ద్వారాలు దాటు కుంటూ వెళ్లాలి.

🌻కొన్ని మన పుణ్య కార్యాల వలన మన పాపాలను కడుక్కుంటూ స్వర్గం వైపు వెళుతుంటాం. మన మరణం తరువాత ఆత్మ పూర్తిగా స్వర్గాన్ని చేరలేదు. వారి పాపాలు కడగటానికి వారి సంతానం శ్రాద్ధ కర్మాదులు నిర్వహించి వారిని పాప విముక్తులను చేయాలి.

🌻దీనికి సంబంధించి మత్స్య పురాణం లో ఓ కధ ఉన్నది. అసలు అమావాస్య కి శ్రాద్ధ కర్మలకు గల సంబంధం వివరించబడింది.

🌻ప్రతిమాసంలోను వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు.

🌻పితృదేవతలు ఏడుగణాలుగా విభజించపడ్డాయి. వీరిలో మూడు గణాలవారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. అలాగే సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది.

🌻ఈ ఏడుగణాలవారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావల్సిన శ్రాద్ధవిధులను నిర్వర్తించాలని అంటారు. మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు.

🌻అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ అమృతాలైన పితృగణాలవారు శాశ్వతాలైన లోకాలను పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం కోల్పోతారు.

🌻ఈ కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఈమె హిమవంతుడిని పెళ్లాడింది. హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు.

🌻మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. ఆ క్రౌంచుడి పేరుమీదనే క్రౌంచద్వీపం ఏర్పడింది. మేనా హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు.

🌻ఉమ, ఏకపర్ణ, అపర్ణ అని ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. హిమవంతుడు ముగ్గురిలో పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు.

🌻ఇలా వైరాజ పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. సోమపథాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి.

🌻ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక ఉంది. ఈమె పేరుమీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవనకథనంలో నేటివారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడివుంది.

🌻అగ్నిష్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు.

🌻ఓరోజున వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురును అడిగారు. అయితే దివ్యపుష్పమాలికలు, దివ్యగంధాలు, మంచి అలంకారాలు చేసుకుని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూసి అచ్చోద కామపరవశురాలైంది.

🌻ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన మావసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది.

🌻అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది. పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమానపాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో… అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో వెనుకాడలేదు.

🌻మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. అచ్చోద మావస్య కాలేదు. అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావాస్య అయింది.

🌻అమావాస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్ధం. అలా తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది.

🌻ఈమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావస్య (అమావాస్య తిథి) అయిన రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వచ్చారు.
*****************

అక్ష విద్య

చెట్టును చూసి దాని కొమ్మ‌ల‌కు ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్కించ‌వ‌చ్చ‌ట‌.. ఆ విద్య ఏంటో తెలుసా?

అక్ష విద్య నేర్చుకున్నవారు సంఖ్యా విదుదౌతాడు, పాపదోషాల నుంచి విముక్తి పొందుతాడు అని రుతుపర్ణుడు బాహకుడికి చెప్తాడు. తర్వాత దమయంతి స్వయం వరానికి హాజరైన తర్వాత బాహకుడే నలుడని రుతుపర్ణుడు తెలుసుకుంటాడు.
పూర్వ కాలం అనేక రకాల విద్యలు ఉండేవి. వాటిలో విలువిద్య, అస్త్రశస్త్ర విద్యలతోపాటు మల్లయుద్ధం, రథసారథ్యం వంటి అనేకం ఉండేవి. అటువంటి వాటిలో అత్యంత ప్రతిభావంతమైన మరో విద్యే ఎదురుగా ఉన్న చెట్టును చూసి దాని కొమ్మలకు ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్కించేవారు. ఈ విద్యను అక్ష హృదయం అని అంటారు.

పూర్వం ద్వాపర యుగంలో అయోధ్యను పరిపాలించిన రాజు రుతుపర్ణుడు. ఆయన దగ్గర నలుడు గుర్రాల సంరక్షకుడిగా చేరుతాడు. ఆ సమయంలో ఆయన పేరు బాహుకుడు. కొంతకాలానికి దమయంతి పునః స్వయం వరాన్ని ప్రకటించి రుతుపర్ణుడిని ఆహ్వానించగా కేవలం ఒక్కరోజులో ఆయోధ్య నుంచి దమయంతి ఉన్నదగ్గరికి పోవాల్సి వస్తుంది. ఆ సమయంలో రుతుపర్ణుడు తన అశ్వ సంరక్షకుడి ప్రతిభను గుర్తించి నల్లని వికార రూపంలో ఉన్న బాహుకుడు (నలుడు) తన రథసారథిగా తీసుకుని పోతాడు. ఆయన కేవలం గంటల వ్యవధిలో గమ్యాన్ని చేరుస్తాడు. ఆ సమయంలో రుతుపర్ణుడు తనకు వచ్చిన అక్ష హృదయం విద్యను ప్రదర్శిస్తాడు. మార్గమధ్యంలో ఒక చెట్టు దగ్గర రథాన్ని ఆపి ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో తన విద్య ద్వారా క్షణాల్లో చెప్తాడు. దాంతో బాహుకుడు ఆశ్చర్యపోతాడు. తర్వాత రుతుపర్ణుడు నలునికి ఆ విద్యను బోధించి దానిలోని మర్మాలను చెప్తాడు.

అక్ష విద్య నేర్చుకున్నవారు సంఖ్యా విదుదౌతాడు, పాపదోషాల నుంచి విముక్తి పొందుతాడు అని రుతుపర్ణుడు బాహకుడికి చెప్తాడు. తర్వాత దమయంతి స్వయం వరానికి హాజరైన తర్వాత బాహకుడే నలుడని రుతుపర్ణుడు తెలుసుకుంటాడు. మహారాజైన నలునికి తన అక్ష హృదయ విద్యను చెప్పి దానికి బదులుగా నలుని దగ్గర అశ్వహృదయ విద్యను నేర్చుకుంటాడు. ఉపదేశం పొందుతాడు. దీంతో ఏ గుర్రాన్ని ఎలా చూడాలి, ఎలా క్షణాల్లో గమ్యాన్ని చేరాలి ఉత్తమ గుర్రాల ఎంపిక, తదితర సూక్ష్మ మర్మాలను రుతుపర్ణుడు నలుని వద్ద నేర్చుకుంటాడు. ఇప్పుడు తెలిసిందా.. అక్ష హృదయం, అశ్వ హృదయ విద్యల గురించి.

– కేశవ

శ్రీగణేశభుజఙ్గమ్ సమ్పూర్ణ

ణత్-క్షుద్రఘణ్టానినాదాభిరామం
చలత్తాణ్డవోద్దణ్డవత్పద్మతాలమ్ ।
లసత్తున్దిలాఙ్గోపరివ్యాలహారం
గణాధీశమీశానసూనుం తమీడే ॥1॥
మ్రోగుచున్న చిరుగజ్జల సవ్వడిచే మనోహరుడు , తాళముననుసరించి ప్రచండ తాండవము చేయుచున్న పాదపద్మములు కలవాడు , బొజ్జపై కదులుచున్న సర్పహారములున్నవాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.
ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రం
స్ఫురచ్ఛుణ్డదణ్డోల్లసద్బీజపూరమ్ ।
గలద్దర్పసౌగన్ధ్యలోలాలిమాలం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 2 ॥
ధ్వని ఆగుటచే వీణానాదమందలి లయచే తెరచిన నోరు కలవాడు , ప్రకాశించు తొండముపై విలసిల్లు బీజపూరమున్నవాడు , మదజలం కారుచున్న బుగ్గలపై అంటుకొన్న తుమ్మెదలు కలవాడు . ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.
ప్రకాశజ్జపారక్తరన్తప్రసూన-
ప్రవాలప్రభాతారుణజ్యోతిరేకమ్ ।
ప్రలమ్బోదరం వక్రతుణ్డైకదన్తం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 3 ॥
జపాపుష్పము , ఎర్రని రత్నము , పువ్వు , చిగురుటాకు , ప్రాతఃకాల సూర్యుడు వీటన్నిటివలే ప్రకాశించుచున్న తేజోమూర్తి , వ్రేలాడు బొజ్జ కలవాడు , వంకరయైన తొండము , ఒకే దంతము కలవాడు , ఈశ్వర పుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.
విచిత్రస్ఫురద్రత్నమాలాకిరీటం
కిరీటోల్లసచ్చన్ద్రరేఖావిభూషమ్ ।
విభూషైకభూశం భవధ్వంసహేతుం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 4 ॥
విచిత్రముగా ప్రకాశించు రత్నమాలా కిరీటము కలవాడు , కిరీటముపై తళతళలాడుచున్న చంద్రరేఖాభరణమును ధరించినవాడు, ఆభరణములకే ఆభరణమైనవాడు , సంసార దుఃఖమును నశింపచేయువాడు , ఈశ్వర పుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.
ఉదఞ్చద్భుజావల్లరీదృశ్యమూలో-
చ్చలద్భ్రూలతావిభ్రమభ్రాజదక్షమ్ ।
మరుత్సున్దరీచామరైః సేవ్యమానం
గణాధీశమీశానసూనుం తమీడే ॥ 5 ॥
పైకెత్తిన చేతుల మొదలులు చూడ దగినట్లున్నవాడు , కదులుచున్న కనుబొమ్మల విలాసముతో ప్రకాశించు నేత్రములు కలవాడు , దేవతాస్త్రీలచే చామరములతో సేవించబడుచున్నవాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.
స్ఫురన్నిష్ఠురాలోలపిఙ్గాక్షితారం
కృపాకోమలోదారలీలావతారమ్ ।
కలాబిన్దుగం గీయతే యోగివర్యై-
ర్గణాధీశమీశానసూనుం తమీడే ॥ 6 ॥
ప్రకాశించుచున్నవి , కఠినమైనవి , కదులుచున్నవి , పింగళవర్ణము కలవి అగు కంటిపాపలు కలవాడు , కృపచే కోమలుడై ఉదారలీలా స్వరూపుడు , కలాబిందువు నందు ఉన్నవాడుగా యోగి వరులచే స్తుతింపబడువాడు , ఈశ్వరపుత్రుడు అగు గణాధీశుని స్తుతించుచున్నాను.
యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం
గుణాతీతమానన్దమాకారశూన్యమ్ ।
పరం పరమోఙ్కారమాన్మాయగర్భం ।
వదన్తి ప్రగల్భం పురాణం తమీడే ॥ 7 ॥
ఏ గణాధీశుని ఏకాక్షరము , నిర్మలము , నిర్వికల్పము , గుణాతీతము , ఆనందస్వరూపము , నిరాకారము , సంసారసముద్రమున కవతలి తీరమునందున్నది , వేదములు తనయందు కలది అగు ఓంకారముగా పండితులు చెప్పుచున్నారో, ప్రగల్భుడు , పురాణపురుషుడు అగు ఆ వినాయకుని స్తుతించుచున్నాను.
చిదానన్దసాన్ద్రాయ శాన్తాయ తుభ్యం
నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యమ్ ।
నమోఽనన్తలీలాయ కైవల్యభాసే
నమో విశ్వబీజ ప్రసీదేశసూనో ॥ 8 ॥
జ్ఞానానందముతో నిండినవాడవు , ప్రశాంతుడవు అగు నీకు నమస్కారము. విశ్వమును సృష్టించువాడవు , సంహరించువాడవు అగు నీకు నమస్కారము. అనంతమైన లీలలు కలిగి ఒకడిగానే ప్రకాశించు నీకు నమస్కారము . ప్రపంచమునకు బీజమైనవాడా! ఈశ్వరపుత్రుడా! ప్రసన్నుడవగుము.
ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా
పఠేద్యస్తు మర్త్యో లభేత్సర్వకామాన్ ।
గణేశప్రసాదేన సిధ్యన్తి వాచో
గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే ॥ 9 ॥
ఉదయముననే నిద్రలేచి భక్తితో ఈ మంచి స్తోత్రమును ఏ మానవుడు పఠించునో అతడు అన్ని కోరికలను పొందును. గణేశుని అనుగ్రహముచే వాక్కులు సిద్ధించును. అంతటా వ్యాపించిన గణేశుడు ప్రసన్నుడైనచో పొందలేనిది ఏముండును?
॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం శ్రీగణేశభుజఙ్గమ్ సమ్పూర్ణ

శ్లోకం

అనగనగా ఒక రామ భక్తుడు, రాముడంటే వల్లమాలిన ప్రేమ. పోనీలే అని విష్ణువన్నా నమస్కరిస్తాడు కాని శివుడి పేరు ఎత్తడు.
ఒక సారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇమ్మన్నాడు.

ఆ పెద్దాయనకీ తెలుసు ఇతడికి శివుడు అంటే పడదని సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు. విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు చదువుకో అంటూ.

"గవీశపాత్రో నగజార్తిహారీ కుమారతాతః శశిఖండమౌళిః
లంకేశ సంపూజితపాదపద్మః పాయాదనాదిః  పరమేశ్వరో నః "

ఆశ్చర్య పోయాడు చదవగానే అందులో ఏమని చెప్పబడింది? "పరమేశ్వరః నః పాయాత్" అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం. తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి  విశేషణాలు.. అర్ధం చూడండి :

గవీశపాత్రః = గవాం ఈశః  గవీశః  ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనంగా కలవాడు గవీశపాత్రః అంటే సదాశివుడు .

నగజార్తి హారీ = నగజ అంటే పార్వతీ దేవి ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ అంటే సాంబశివుడే. 

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం కుమారస్వామి యొక్క తండ్రి అయిన వాడూ, శివుడే నిస్సందేహంగా.

శశి ఖండ మౌళి: అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: లంకాధిపతి అయిన రావణుని చే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ. 

అనాదిః = ఆది లేని వాడూ అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ అటువంటి  పరమేశ్వరః నః పాయాత్

వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం .

అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది అది పట్టుకుని తెగ తిరిగాడు.  చివరికి ఒకాయన అది విష్ణువుని కీర్తించేదే  ఏమీ అనుమానం లేదు అని అతడిని ఓదార్చాడు.

ఇది మరో ఆశ్చర్యం .

అనాది అనే మాటలో ఉంది అంతా.., కిటుకు చూడండి పరమేశ్వరుడు ఎలాటివాడూ  అంటే "అనాదిః" అట. అంటే ఆది లేని వాడు. అంటే..
"పరమేశ్వర" లో ఆది అక్షరం లేనివాడు.
ఇప్పుడు ఏమయ్యింది? "రమేశ్వరః" అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!

గవీశపాత్రః... లో గ తీసెయ్యండి.., వీశపాత్రః అవుతుంది.
విః  అంటే పక్షి అని అర్ధం. వీనామ్  ఈశః  వీశః.. పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు .

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి..
గజార్తి హారీ.. గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.
కుమారతాతః.. ఆది అక్షరం తీసేస్తే.. మారతాతః.. మన్మధుని తండ్రి అయిన విష్ణువు.

శశి ఖండ మౌళి:.. మొదటి అక్షరం లేక పోతే శిఖండమౌళిః.. నెమలిపింఛము ధరించిన విష్ణువు .
 
లంకేశ సంపూజిత పాద పద్మ:.. మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి,
కేశ సంపూజిత పాద పద్మ:... క అంటే బ్రహ్మ , ఈశః  అంటే రుద్రుడు.. అంటే బ్రహ్మ రుద్రేన్ద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.
అతడు మనలను కాపాడు గాక ....

గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు.. విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

ఇప్పటికి అతడు శాంతించాడు.

సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి, సర్వదేవతలలో   విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు . సర్వ దేవతలలో శివుని దర్శించగలిగితే వాడు భగవంతుడి భక్తుడు.

     🙏 సర్వేజనా సుఖినో భవంతు